Battleground
-
హైటెక్స్‌లో బ్యాటిల్ గ్రౌండ్స్..
దేశంలోని ప్రముఖ ఈ–స్పోర్ట్స్ ఆటగాళ్లు, ఆన్లైన్ గేమింగ్ ఔత్సాహికులంతా నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా సందడి చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సిరీస్ 2024’ (బీజీఐఎస్) ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా శుక్రవారం ప్రారంభమైంది. క్రాఫ్టన్ ఇండియా ఆధ్వర్యంలో భారతదేశపు అతిపెద్ద బ్యాటిల్ రాయల్ ఈ–స్పోర్ట్స్ ఈవెంట్లో ప్రావీణ్యులైన 16 ఈ–స్పోర్ట్స్ బృందాలు హోరాహోరీగా తలపడ్డాయి. 2 కోట్ల ప్రైజ్ మనీతో ప్రారంభించిన ఈ బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సిరీస్ 3 రోజుల పాటు కొనసాగనుంది. మొదటి రోజు ఎలక్ట్రిఫైయింగ్ ఫేస్–ఆఫ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్లు, అనుభవజు్ఞలైన ఆటగాళ్లు గ్రాండ్ ప్రైజ్ కోసం పోటీ పడ్డారు. పోటీలను వీక్షించడానికి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను తలపించేలా దాదాపు 2,500 మంది హాజరయ్యారు. మరో 4 వేల మంది వీక్షించడానికి పాస్‌లు కొనుగోలు చేశారని నిర్వాహకులు, క్రాఫ్టన్ ఇండియా ప్రతినిథి కరణ్ పథాక్ తెలిపారు. నగరంలో ఆన్లైన్ గేమర్ల సంఖ్య భారీగా పెరిగిందని, క్రాఫ్టన్ ఇండియా ఈస్పోర్ట్స్ యూట్యూబ్ ఛానెల్లో ఇంగ్లిష్ హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, మిజో, మలయాళం తదితర భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేశామని, రెండున్నర లక్షల మంది వీక్షించారని పేర్కొన్నారు. పాస్‌ల ద్వారా వచి్చన ఆదాయాన్ని సాంప్రదాయ క్రీడలకు మద్దతుగా ‘అభినవ్ బింద్రా ఫౌండేషన్’కు అందించనుండటం విశేషం. అభిమానులకు ఎంతో ఇష్టమైన ఈస్పోర్ట్స్ వ్యాఖ్యాతలు ‘స్పెరో, అంకీ, మేజీ, జానీ తదితరుల థ్రిల్లింగ్ లైవ్ కామెంటరీకి అద్భుత స్పందన లభించింది.ఆర్ట్ గ్యాలరీలో ఫొటో ఎగ్జిబిషన్.. మాదాపూర్: స్థానిక చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఫొటోగ్రఫీ చిత్రప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మొమెంట్ అకాడమీ నిర్వహించిన ఈ ప్రదర్శనలో 50 మంది ఫొటోగ్రాఫర్లు తీసిన 56 చిత్రాలను అందుబాటులో ఉంచారు. మూడు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు. భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, అనురాధారెడ్డి, చంద్రశేఖర్సింగ్, కందుకూరి రమేశ్‌బాబు ప్రదర్శనను తిలకించి ఫొటోగ్రాఫర్లను అభినందించారు. -
BGMI ఆడాలంటే ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే, లేదంటే బ్లాక్ చేస్తారు
న్యూఢిల్లీ : గేమింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా ఈ గేమ్ జూన్ 18న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మిలియన్ల మంది గేమింగ్ లవర్స్ గేమ్ ను ప్రిరిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అయితే ప్రిరిజిస్ట్రేషన్ తర్వాత ఈ గేమ్ ఆడాలంటే తగు సూచనల్ని పాటించాలని బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ డిజైన్ సంస్థ క్రాఫ్టన్ ప్రతినిధులు చెబుతున్నారు. 18లోపు పిల్లలు బీజీఎంఐ గేమ్ గా విడుదలవుతున్న పబ్జీగేమ్ ఆడాలంటే తప్పని సరిగా తల్లిదండ్రులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. క్రాఫ్టన్ తెలిపిన వివరాల ప్రకారం.. 18ఏళ్ల లోపు పిల్లలు ఈ గేమ్ ను మూడు గంటలకు మించి ఆడలేరు. ఎందుకంటే పిల్లల్లో ఈ గేమింగ్ వ్యసనాన్ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మూడు గంటల దాటినా..ఈ గేమ్ ఆడాలంటే తప్పని సరిగ్గా తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి. 18ఏళ్ల కంటే తక్కువగా ఉంటే తల్లిదండ్రుల కాంటాక్ట్ నెంబర్ ను యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు అనుమతితో గేమ్ కు బానిసవుతున్నాడని అనిపిస్తే.. తల్లిదండ్రులే ఆ గేమ్ ను బ్లాక్ చేసేలా గేమ్ ప్రతినిధులతో సంప్రదింపులు జరపొచ్చు. వ్యక్తిగత బద్రత దృష్ట్యా మొబైల్ గేమర్ ల డేటాను ఇండియాతో పాటు సింగ్ పూర్ కు చెందిన సర్వర్ లో భద్రపరుస్తున్నట్లు క్రాఫ్టన్ తెలిపింది. చదవండి : BGMI టీజర్ విడుదల: గేమ్‌ను 2060లో విడుదల చేస్తావా ఏంటి?! -
పబ్జీ గేమింగ్ ప్రియులకు మరో చేదువార్త
పబ్జీ ఈ గేమ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి ఈ గేమ్ ఆడే ఉంటారు. అయితే, ఈ గేమ్ ని దేశ భద్రత కారణాల రీత్యా మన దేశంలో నిషేదించిన సంగతి తెలిసిందే. పబ్జీ మొబైల్ ఇండియా కొత్త పేరుతో తిరిగి భారత్ లోకి రాబోతున్న విషయం మనకు తెలుసు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ పేరుతో ఇండియాలోకి రాబోతున్న పబ్జీని దేశంలోకి విడుదల చేయకుండా ఉండలని కోరుతూ అరుణాచల్ ప్రదేశ్ శాసన సభ సభ్యుడు నినోంగ్ ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన ఒక లేఖ రాశారు. ఈ కొత్త గేమ్ ను దేశంలోకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్న క్రాఫ్ట్టన్ భారతీయ చట్టాలను పక్కదారి పట్టించినట్లు ఆయన ఆరోపించారు. “కేవలం చిన్న చిన్న మార్పులు చేసి అదే గేమ్ ని తిరిగి తీసుకొనిరావడానికి, పిల్లలతో సహా లక్షలాది మంది దేశీయ పౌరుల డేటాను ఇతర విదేశీ కంపెనీలకు, చైనా ప్రభుత్వానికి బదిలీ చేయడానికి కంపెనీ మోసం చేస్తున్నట్లు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పాసిఘాట్ వెస్ట్ అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న” ఎరింగ్ తన లేఖలో తెలిపారు. దీనికి సంబందించిన మూడు పేజీల లేఖ కాపీని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. Requested @PMOIndia @narendramodi ji to not allow Chinese deception #BattlegroundsMobileIndia. It is a big threat to security of India & privacy of our citizens and a way to circumvent & disregard our laws.@AmitShah #IndiaBanBattlegrounds #NationFirst #AatmaNirbharBharat @ANI pic.twitter.com/H8nzUJ4aRk — Ninong Ering (@ninong_erring) May 22, 2021 దక్షిణ కొరియా కంపెనీ ఇటీవల ఇండియాలోకి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ గేమ్ ను తిరిగి తీసుకురావడం కోసం గూగుల్ ప్లే స్టోర్ లో ప్రీ రిజిస్ట్రేషన్లు తీసుకోవడం ప్రారంభించింది. ఎప్పుడు మనం దేశంలో విడుదల చేస్తారో అనే దానిపై స్పష్టత లేదు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పబ్జీ మొబైల్ ఇండియా మరో రూపమే ఈ గేమ్. ఈ నిషేదం తర్వాత భారతదేశంలో తిరిగి తీసుకొనిరావడనికి చైనా కంపెనీ టెన్సెంట్ గేమ్స్ నుంచి ప్రచురణ & పంపిణీ హక్కులను క్రాఫ్ట్టన్ తీసుకుంది. అందుకే ఈ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాని దేశంలోకి మళ్లీ తీసుకొని రాకుండా ఉండటానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఒకవేల దీనికి ఆమోదం లభిస్తే, టిక్ టాక్ వంటి ఇతర చైనీయ యాప్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాడు. చదవండి: ఫోన్లోనే శరీరంలోని ఆక్సిజన్ స్థాయి తెలుసుకోండిలా! -
కొత్త పేరుతో త్వరలో పబ్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాపులర్ గేమ్ పబ్జీ గుర్తుందిగా.. కొద్ది రోజుల్లో బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో ఈ గేమ్ దర్శనమీయనుంది. అది కూడా కేవలం భారత్‌కే పరిమితం కానుందని దక్షిణ కొరియాకు చెందిన వీడియో గేమ్ డెవలపర్ క్రాఫ్టన్ వెల్లడించింది. చైనా యాప్స్‌కు అడ్డుకట్ట వేసే ప్రక్రియలో భాగంగా ప్లేయర్ అన్నోన్స్ బాటిల్‌గ్రౌండ్స్ (పబ్జీ) మొబైల్‌ను గతేడాది సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ఇంటర్నెట్ కంపెనీ టెన్సెట్ భారత్‌లో పబ్జీని ఆఫర్ చేసింది. అయితే ఇక నుంచి ఈ గేమ్ అధికారం టెన్సెట్ ఇండియాకు లేదని పబ్జీ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఎప్పుడు ఈ గేమ్‌ను అందుబాటులోకి తెచ్చేదీ వెల్లడించనప్పటికీ కొత్త లోగోను కంపెనీ గురువారం ఆవిష్కరించింది. ఉచితంగానే గేమ్‌ను విడుదల చేయనున్నట్టు క్రాఫ్టన్ వెల్లడించింది. భారత్‌లో అనుబంధ కంపెనీ ఏర్పాటు చేసి ఇక్కడి మార్కెట్ కోసం ప్రత్యేక గేమ్‌ను ప్రవేశపెట్టనున్నట్టు గతేడాది నవంబర్‌లో పబ్జీ కార్పొరేషన్ ప్రకటించింది. వ్యాపార పునరుద్ధరణ కోసం మాతృ సంస్థ అయిన క్రాఫ్టన్‌తో కలిసి సుమారు రూ.740 కోట్లు భారత్‌లో ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. పబ్జీ డౌన్లోడ్స్ దేశంలో 17.5 కోట్లకుపైమాటే. -
పబ్జీ గేమింగ్ ప్రియులకు శుభవార్త
న్యూఢిల్లీ: గేమింగ్ ప్రియులకు పబ్జీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జై పబ్జీ అంటూ వాళ్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అయితే అంత క్రేజ్ ఉన్న పబ్జీ గేమ్ చైనాది కావడంతో గతేడాది సెప్టెంబర్ 2న కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. భారత్-చైనాల మధ్య తలెత్తిన సరిహద్దు వివాదంతో కేంద్రం పబ్జీ తో పాటూ 118 మొబైల్ యాప్‌లు దేశ భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయంటూ వాటిని కూడా బ్లాక్ చేసింది. అప్పటి నుంచి పబ్జీ ప్రియులు ఆ గేమ్ భారత్ లో ఎప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంతో పబ్జీ సంస్థ తన ఆడియన్స్ కోసం అప్పుడప్పుడు చిన్నచిన్న అప్ డేట్లతో వాళ్లలో ఆశలు రేకెత్తించేలా చేసింది. తాజాగా పబ్జీ మాతృసంస్థ పబ్జీ పేరును బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గా మారుస్తు కొత్త పోస్టర్లను విడుదల చేసింది. అందుకు సంబంధించి పబ్జీ సంస్థ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టర్లను షేర్ చేసింది. దీంతో పబ్జీ గేమ్ త్వరలో ఇండియాలో విడుదల కాబోతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సంస్థ గత కొంత కాలంగా భారతదేశంలో తన గేమ్‌ను తిరిగే ప్రారంభించేందుకు ఉద్యోగుల నియామకాన్ని ప్రారంభించింది. క్రాఫ్టన్ సంస్థ ప్రముఖ జాబ్ పోర్టల్ లింక్డిన్ లో పోస్టింగ్ లను అప్ డేట్ చేస్తుంది. వారం రోజుల క్రితం గవర్నమెంట్ రిలేషన్ మేనేజర్ పోస్ట్ కు రిక్రూట్ మెంట్ నిర్వహించింది. దీంతో పాటు ప్రధాని మోడీ పీఎం కేర్స్ కు రూ.1.5కోట్లు విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా క్రాఫ్టన్ సీఈఓ చాంగ్హాస్ కిమ్ మాట్లాడుతూ.." భారత్ కరోనాపై పోరాటం చేస్తుంది. మా వంతు సాయంగా భారత్ ను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. అంతేకాదు కరోనా కేసులు నివారణకు చేస్తున్న సహాయక చర్యల్లో అండగా నిలుస్తామని" అన్నారు. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు మరో గుడ్‌న్యూస్ -
సియాచిన్‌లో కోవింద్
సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి సియాచిన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం సందర్శించారు. ఇక్కడ పర్యటించిన రెండో రాష్ట్రపతి కోవిందే కావడం విశేషం. ఇంతకు ముందు 2004లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈ ప్రాంతాన్ని సందర్శించారు. సైనికులను ఉద్దేశించి కోవింద్ ప్రసంగిస్తూ..గత 34 ఏళ్లుగా సియాచిన్‌లో సేవలందిస్తున్న జవాన్ల అసమాన ధైర్య సాహసాలే మన సరిహద్దులు సురక్షితమన్న విశ్వాసాన్ని భారతీయుల్లో నింపాయని అన్నారు. సైనికులు, వారి కుటుంబాలకు భారత ప్రభుత్వం, ప్రజలు అండగా ఉన్నారని చెప్పడానికే తానిక్కడికి వచ్చినట్లు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలందిస్తున్న జవాన్లందరికీ ఆర్మీ సుప్రీం కమాండర్, రాష్ట్రపతి హోదాలో భారత ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వీలు చిక్కినప్పుడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు రావాలని వారిని ఆహ్వానించారు. సియాచిన్ బేస్ క్యాంపునకు సమీపంలోని కుమార్ పోస్ట్‌ను కూడా కోవింద్ సందర్శించారు. రాష్ట్రపతి వెంట ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, లెఫ్టినెంట్ జనరల్ డి. అన్బు, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. జమ్మూకశ్మీర్‌లో 2 వేల అడుగుల ఎత్తులోని సియాచిన్ పోస్టుల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 52 డిగ్రీల వరకు పడిపోతాయి. -
ఆఖరి పోరాటం
-
ప్రశ్నే ప్రగతికి మెట్టు! హేతువాదంతోనే పట్టు!!
కులము నీరుజేసె గురువును జంపించె పొసగ యేనుగంత బొంకు బొంకె పేరు ధర్మరాజు పెను వేప విత్తయా విశ్వదాభిరామ వినుర వేమ! పద్యానవనం మహాభారత కథలో పెద్దమనిషిగా చలామణి అయిన ధర్మరాజులోని ధర్మమెంతో తేటతెల్లం చేశాడు ప్రజాకవి వేమన. పేరుకే ధర్మరాజు తప్ప చెటక్కున చేదుగా ఉండే వేపవిత్తు లాంటి వాడని చెబుతాడు. సత్యవాక్పాలకుడని పేరుండీ యుదిష్ఠరుడు ఏనుగంత అబద్ధమాడాడు. ‘అశ్వత్థామ చనిపోయాడు...’ అని గట్టిగా అరిచి, వినిపించీ వినిపించనంత నెమ్మదిగా ‘...అది మనిషో! ఏనుగో!’ అని ఓ సందేహాన్ని జతజేసి వదిలాడు. మాటలు వినిపించని ఫలితంగా తన కుమారుడు చనిపోయాడని భావించి, ధర్మరాజు మాటల్ని నమ్మి... యుద్ధభూమిలో అస్త్రసన్యాసం చేసిన ద్రోణుడ్ని హతమారుస్తారు. బంగారు లేడి భూమ్మీద ఉంటుందా? ఉండదా? అన్న కనీస విచక్షణ చేయకుండానే మహిళను ఒంటరిగా వీడిపోయిన రాముడ్ని ప్రస్తావిస్తూ, ‘తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?’ అని ప్రశ్నిస్తాడు వేమన. పాలసముద్రంలోనే పవళించే విష్ణుమూర్తి కృష్ణుడిగా పొరిగిళ్లలో పాలెందుకు దొంగిలిస్తాడు? అని సందేహం లేవనెత్తి, ‘ఎదుటివారి సొత్తు ఎల్లవారికి ప్రీతి’ అని సూత్రీకరిస్తాడు. అధునికులు హేతువాద లక్ష్యాలుగా పేర్కొన్న గుడ్డినమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడటం, విగ్రహారాధనను నిరసించడం, స్వర్గ-నరకాల్ని, ఆత్మ-పరమాత్మ వాదాల్ని, మత దురాచారాల్ని ఒప్పుకోకపోవడం వేమన పద్యాల్లో కొట్టొచ్చినట్టు కనిపించే లక్షణం. ‘శిలను ప్రతిమచేసి చీకటింటను బెట్టి మ్రొక్కవలదు వెర్రి మూఢులార! యుల్లమందు బ్రహ్మయుండుట తెలియుడి...’ అంటాడు. అదే విధంగా, ‘కొండరాళ్లు తెచ్చి కోరిక గట్టిన గుళ్లలోన దిరిగి కుళ్లనేల? పాయరాని శివుడు ప్రాణియై యుండగ...’ అంటూ, దేహమే దేవాలయం-జీవుడే సనాతన దైవం అన్న భావనకు పెద్దపీట వేశాడు. వేదాల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, ప్రాచీన-ఆధునిక సాహిత్యంలో ఉన్న కొన్ని ప్రస్తావనల్ని బట్టి హేతుబద్ధమైన ఆలోచన అనాదిగా వస్తున్నదే అని స్పష్టమౌతోంది. మానవేతిహాసంలో ప్రశ్నే ప్రగతికి మెట్టుగా వస్తోంది. ఏమిటి? ఎందుకు? ఎలా? అనే ప్రశ్నలే మనిషి జిజ్ఞాసకు ప్రతీకలుగా నిలిచాయి. భవిష్యత్తులో మానవ విజ్ఞాన-వికాసాలకు అవి బాటలు పరిచాయి. కాల పరీక్షకు నిలువని కట్టు కథల్ని, కుహనావాదాల్ని, వాస్తవ విరుద్ధాల్ని ప్రశ్నించే వారికి కష్టాలెదురైన సందర్భాలు అన్ని కాలాల్లోనూ ఉన్నాయి. శ్రీరామచంద్రుడిని వానప్రస్థానికి వెళ్లనవసరం లేదని చెబుతూ ‘కళ్లకు కనిపించేదే సత్యమని, కనిపించనిది లేదని బోధ చేస్తాడు’ సత్యకామ జాబాలి. నాస్తికుడని ముద్రవేసి ఆయన వాదనల్ని రాముడు తిరస్కరిస్తాడు. దేవతల అస్తిత్వాన్ని నిరాకరించిన వారిని ‘అదేవాః’ అని నిరసించారనే ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది. యుద్ధంలో జరిగిన హింసకు ధర్మరాజును చార్వాకుడొకరు ప్రశ్నించినట్టు, ఫలితంగా హత్యకు గురైనట్టు మహాభారత శాంతిపర్వంలో ఓ ఉదంతముంది. పార్వతి కేశాలు సహజగంధ విలసితాలు కావని అన్నందుకు శివుని కోపానికి గురై కుష్ఠురోగిగా నత్కీరుడు శాపగ్రస్తుడైన కథ కాళహస్తీ మహాత్మ్యం చెబుతోంది. ఆయన చేసిందల్లా ఉన్నదున్నట్టు మాట్లాడటం. 12 శతాబ్ద కాలంలో శివకవులు కొంత సంస్కరణ వాదులుగా ఉండటంతో ఆ సమయంలో వచ్చిన కవిత్వానికి హేతుబద్ధత జోడింపు జరిగింది. వీరశైవం స్థాపించిన బసవేశ్వరుడు గొప్ప అభ్యుదయవాదిగా మన్నన పొందాడు. యజ్ఞయాగాదుల్ని, కుల-మత వ్యత్యాసాల్ని, స్త్రీ పురుష అసమానతల్ని నిరసించాడు. అస్పృశ్యతని ఈసడించి సామూహిక సహపంక్తి భోజనాలు జరిపించాడు. సంకీర్తనాచార్యుడు తాళ్లపాక అన్నమాచార్యుడు ఒక రకంగా సామ్యవాద భావనల్ని అరటిపండొలిచినట్టు చెప్పాడు. ‘‘నిండారా రాజు నిద్రించు నిద్రయు నొకటె అండనే బంటు నిద్ర అదియు నొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే చండాలుండేటి సరిభూమి యొకటే, అనుగు దేవతలకు అలకామ సుఖమొకటే ఘనకీట పశువులకు కామ సుఖమొకటే...’’ అంటూ సృష్టిలోని జీవులన్నీ ఒకటే అనే విశాల దృక్పథాన్ని వెల్లడించాడు. యుగకర్త గురజాడ అప్పారావు ‘ఎల్లలోకము లొక్కయిల్లై, వర్ణభేదములెల్ల కల్లై, మేల మెరుగని ప్రేమ బంధము వేడుకలు కురియు, మతములన్నియు మాసిపోవును జ్ఙానమొక్కటె నిలిచి వెలుగును’ అని ముత్యాల సరాలు కూర్చారు. హేతువుకు నిలువని మూఢభక్తిని నిరసించిన ఎందరో మహానుభావులు ‘మానవసేవే మాధవ సేవ’ అన్నారు. ‘శిథిలాలయమ్మున శివుడు లేడోయి, ప్రాంగణమ్మున గంట పలుకలేదోయి...’ అన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి, మతిలేని మతవాదన పసలేనిదని తేల్చాడు. ప్రశ్న లేకుండా హేతువాదం లేదు. హేతువును వెదకలేని చోట ఆలోచన ఆగుతుంది. ఆలోచన ఆగడమంటే ఆయువు నిలిచిపోవడం లాంటిదే. తస్మాత్ జాగ్రత్త! - దిలీప్ రెడ్డి