దేశంలోని ప్రముఖ ఈ–స్పోర్ట్స్ ఆటగాళ్లు, ఆన్‌లైన్ గేమింగ్ ఔత్సాహికులంతా నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా సందడి చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సిరీస్ 2024’ (బీజీఐఎస్) ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా శుక్రవారం ప్రారంభమైంది. క్రాఫ్టన్ ఇండియా ఆధ్వర్యంలో భారతదేశపు అతిపెద్ద బ్యాటిల్ రాయల్ ఈ–స్పోర్ట్స్ ఈవెంట్‌లో ప్రావీణ్యులైన 16 ఈ–స్పోర్ట్స్ బృందాలు హోరాహోరీగా తలపడ్డాయి. 2 కోట్ల ప్రైజ్ మనీతో ప్రారంభించిన ఈ బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సిరీస్ 3 రోజుల పాటు కొనసాగనుంది.
మొదటి రోజు ఎలక్ట్రిఫైయింగ్ ఫేస్–ఆఫ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌లు, అనుభవజు్ఞలైన ఆటగాళ్లు గ్రాండ్ ప్రైజ్ కోసం పోటీ పడ్డారు. పోటీలను వీక్షించడానికి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను తలపించేలా దాదాపు 2,500 మంది హాజరయ్యారు. మరో 4 వేల మంది వీక్షించడానికి పాస్‌లు కొనుగోలు చేశారని నిర్వాహకులు, క్రాఫ్టన్ ఇండియా ప్రతినిథి కరణ్ పథాక్ తెలిపారు. నగరంలో ఆన్‌లైన్ గేమర్ల సంఖ్య భారీగా పెరిగిందని, క్రాఫ్టన్ ఇండియా ఈస్పోర్ట్స్ యూట్యూబ్ ఛానెల్‌లో ఇంగ్లిష్ హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, మిజో, మలయాళం తదితర భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేశామని, రెండున్నర లక్షల మంది వీక్షించారని పేర్కొన్నారు. పాస్‌ల ద్వారా వచి్చన ఆదాయాన్ని సాంప్రదాయ క్రీడలకు మద్దతుగా ‘అభినవ్ బింద్రా ఫౌండేషన్’కు అందించనుండటం విశేషం. అభిమానులకు ఎంతో ఇష్టమైన ఈస్పోర్ట్స్ వ్యాఖ్యాతలు ‘స్పెరో, అంకీ, మేజీ, జానీ తదితరుల థ్రిల్లింగ్ లైవ్ కామెంటరీకి అద్భుత స్పందన లభించింది.
ఆర్ట్ గ్యాలరీలో ఫొటో ఎగ్జిబిషన్..
మాదాపూర్: స్థానిక చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఫొటోగ్రఫీ చిత్రప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మొమెంట్ అకాడమీ నిర్వహించిన ఈ ప్రదర్శనలో 50 మంది ఫొటోగ్రాఫర్‌లు తీసిన 56 చిత్రాలను అందుబాటులో ఉంచారు. మూడు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు. భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, అనురాధారెడ్డి, చంద్రశేఖర్‌సింగ్, కందుకూరి రమేశ్‌బాబు ప్రదర్శనను తిలకించి ఫొటోగ్రాఫర్‌లను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment