కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడిచాను
యూనిసెఫ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాను
ఫౌండేషన్‌తో దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
29న బ్రెస్ట్ క్యాన్సర్‌పై అతిపెద్ద రన్
వ్యాపారవేత్త, ఫ్యాషన్ సెలబ్రిటీ సుధారెడ్డితో చిట్‌చాట్
సుధారెడ్డి.. ఆమె ఒక ఫ్యాషన్ ఐకాన్. దేశంలోనే కాదు, అంతర్జాతీయ స్థాయితో ప్రముఖ ఫ్యాషన్ వేదికలపై తన సౌందర్యంతో పాటు భారతీయ సాంస్కృతిక వైభవాన్ని మరింత ఉన్నతంగా ప్రదర్శించిన మహిళ. భారత్ తరపున గ్లోబల్ ఈవెంట్ మెట్‌గాలా మొదలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నడిచిన అతి కొద్ది మందిలో తానొకరు. అంతేకాకుండా సుధారెడ్డి ఫౌండేషన్ ప్రారంభించి నిరుపేదల ఆకలి నుంచి మహమ్మారి క్యాన్సర్ వ్యాధి బాధితుల వరకూ సహకారం అందించడానికి కృషి చేస్తున్నారు. యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద మంది ఛైర్‌లలో ఆమె కూడా ఒకరు. యూఎన్ జనరల్ అసెంబ్లీ నుంచి ఫ్యాషన్ 4 డెవలప్‌మెంట్ ఫిలాంత్రోఫిక్ అవార్డు పొందిన మొదటి భారతీయురాలు. ఆమె ప్రయాణం మహిళా సాధికారతకు స్ఫూర్తిదాయకం. ఈ నేపథ్యంలో ఆమె జీవిత ప్రయాణం గురించి సాక్షితో ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
హైదరాబాద్ టూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఫ్యాషన్, సేవ, వ్యాపారం, ఎన్‌జీఓ ఇలా అనేక రంగాల్లో ఆమె తన ప్రతిభను చాటుకుంటున్నారు. ‘ఇన్ని రంగాలను ఎలా మేనేజ్ చేస్తున్నావని చాలా మంది అడుగుతుంటారు. కానీ, నేను చేసే పనిని ఆస్వాదిస్తాను. అది బిజినెస్ ఐనా, సేవ ఐనా ఇంకేదైనా. చేసే పనిని ఇష్టపడేవారికి బిజీ అనే పదం తెలియదు. మెట్ గాలా, పారిస్ హాట్ కోచర్ వీక్, పారిస్ ఫ్యాషన్ వీక్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి వేదికలపై నడవడం నేనేమీ ప్రత్యేకంగా ఫీల్ అవ్వను.
అదే మన దేశ విశిష్టత. విదేశాల్లో భారత్‌ను ఎంత గౌరవంగా చూస్తారో చాలామందికి తెలియదు. అలాంటి వేదికలపై దేశ గత వైభవాన్ని కొనసాగించేలా నావంతు ప్రయత్నం చేస్తాను. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతూ లుల్లా ఆధ్వర్యంలో నా దుస్తులు, అలంకరణలను రూపొందించుకుంటాను. మనకు నచి్చనట్టుగా ఉండటమే సౌందర్యం అని భావిస్తాను. ఒక విద్యారి్థగా, భార్యగా, తల్లిగా, ఫ్యాషన్ ఔత్సాహికురాలిగా, సేవకురాలిగా ప్రతి ప్రయాణాన్నీ అమితంగా ఆస్వాదించాను.
అన్నార్థులకే మొదటి ప్రాధాన్యత..
నా కుటుంబంతో గడిపే సమయం నేనెంతగానో ఆస్వాదిస్తాను. నా చుట్టూ ఉన్న మనుషులు నా ఎక్ట్సెండెండ్ ఫ్యామిలీగానే భావిస్తాను. సమాజానికి ఏదైనా చేయాలనే సుధారెడ్డి ఫౌండేషన్ స్థాపించాను. నా భర్త కృష్ణారెడ్డి ఎమ్‌ఈఐఎల్ ఫౌండేషన్‌తో పాటు నా సంస్థ తరపున సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. మేము ఏనాడూ ఫండ్ రైజింగ్ చేయలేదు. ప్రకృతి అందించే సహజ వనరుల్లో ఆహారం ఒకటి. అందుకే పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టాను. నగరంలోని మా ఇంటి మందు ప్రతి రోజూ మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకూ ఆహారం అందిస్తున్నాం. ఇంట్లో తినే ఆహారమే ఇక్కడ వడ్డిస్తాం. నేను విదేశాల్లో ఉన్నాసరే.. ఆహారం పంపిణీ అయ్యాకే నేను లంచ్ చేస్తాను.
ఎవరినైనా లంచ్‌కు పిలిచినా 2 గంటల తర్వాతే ఆహా్వనిస్తాను. అంతర్జాతీయ సేవా సంస్థ యూనిసెఫ్ వరల్డ్ ఫోరంలో భారత్ తరపున బ్రాండ్ అంబాసిడర్‌గా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. భారత్‌లో 14 నుంచి 19 ఏళ్ల వయసు చిన్నారులు బాలకారి్మకులుగా, బాల నేరస్తులుగా మారుతున్నారు. యూనిసెఫ్ అడాలసిస్ ఎంపవర్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా వారికి డెవలప్మెంట్ స్కిల్స్‌లో శిక్షణ అందించి మేమే ఉద్యోగాలను అందిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్‌ను గుజరాత్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నాం. సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29న బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కలి్పంచడానికి అతిపెద్ద రన్ నిర్వహిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment