Sudha Reddy
-
Sudha Reddy: ఫ్యాషన్ ఐకాన్.. సుధారెడ్డి
సుధారెడ్డి.. ఆమె ఒక ఫ్యాషన్ ఐకాన్. దేశంలోనే కాదు, అంతర్జాతీయ స్థాయితో ప్రముఖ ఫ్యాషన్ వేదికలపై తన సౌందర్యంతో పాటు భారతీయ సాంస్కృతిక వైభవాన్ని మరింత ఉన్నతంగా ప్రదర్శించిన మహిళ. భారత్ తరపున గ్లోబల్ ఈవెంట్ మెట్‌గాలా మొదలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నడిచిన అతి కొద్ది మందిలో తానొకరు. అంతేకాకుండా సుధారెడ్డి ఫౌండేషన్ ప్రారంభించి నిరుపేదల ఆకలి నుంచి మహమ్మారి క్యాన్సర్ వ్యాధి బాధితుల వరకూ సహకారం అందించడానికి కృషి చేస్తున్నారు. యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద మంది ఛైర్లలో ఆమె కూడా ఒకరు. యూఎన్ జనరల్ అసెంబ్లీ నుంచి ఫ్యాషన్ 4 డెవలప్మెంట్ ఫిలాంత్రోఫిక్ అవార్డు పొందిన మొదటి భారతీయురాలు. ఆమె ప్రయాణం మహిళా సాధికారతకు స్ఫూర్తిదాయకం. ఈ నేపథ్యంలో ఆమె జీవిత ప్రయాణం గురించి సాక్షితో ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. హైదరాబాద్ టూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఫ్యాషన్, సేవ, వ్యాపారం, ఎన్జీఓ ఇలా అనేక రంగాల్లో ఆమె తన ప్రతిభను చాటుకుంటున్నారు. ‘ఇన్ని రంగాలను ఎలా మేనేజ్ చేస్తున్నావని చాలా మంది అడుగుతుంటారు. కానీ, నేను చేసే పనిని ఆస్వాదిస్తాను. అది బిజినెస్ ఐనా, సేవ ఐనా ఇంకేదైనా. చేసే పనిని ఇష్టపడేవారికి బిజీ అనే పదం తెలియదు. మెట్ గాలా, పారిస్ హాట్ కోచర్ వీక్, పారిస్ ఫ్యాషన్ వీక్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి వేదికలపై నడవడం నేనేమీ ప్రత్యేకంగా ఫీల్ అవ్వను. అదే మన దేశ విశిష్టత. విదేశాల్లో భారత్‌ను ఎంత గౌరవంగా చూస్తారో చాలామందికి తెలియదు. అలాంటి వేదికలపై దేశ గత వైభవాన్ని కొనసాగించేలా నావంతు ప్రయత్నం చేస్తాను. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతూ లుల్లా ఆధ్వర్యంలో నా దుస్తులు, అలంకరణలను రూపొందించుకుంటాను. మనకు నచి్చనట్టుగా ఉండటమే సౌందర్యం అని భావిస్తాను. ఒక విద్యారి్థగా, భార్యగా, తల్లిగా, ఫ్యాషన్ ఔత్సాహికురాలిగా, సేవకురాలిగా ప్రతి ప్రయాణాన్నీ అమితంగా ఆస్వాదించాను. అన్నార్థులకే మొదటి ప్రాధాన్యత.. నా కుటుంబంతో గడిపే సమయం నేనెంతగానో ఆస్వాదిస్తాను. నా చుట్టూ ఉన్న మనుషులు నా ఎక్ట్సెండెండ్ ఫ్యామిలీగానే భావిస్తాను. సమాజానికి ఏదైనా చేయాలనే సుధారెడ్డి ఫౌండేషన్ స్థాపించాను. నా భర్త కృష్ణారెడ్డి ఎమ్ఈఐఎల్ ఫౌండేషన్‌తో పాటు నా సంస్థ తరపున సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. మేము ఏనాడూ ఫండ్ రైజింగ్ చేయలేదు. ప్రకృతి అందించే సహజ వనరుల్లో ఆహారం ఒకటి. అందుకే పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టాను. నగరంలోని మా ఇంటి మందు ప్రతి రోజూ మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకూ ఆహారం అందిస్తున్నాం. ఇంట్లో తినే ఆహారమే ఇక్కడ వడ్డిస్తాం. నేను విదేశాల్లో ఉన్నాసరే.. ఆహారం పంపిణీ అయ్యాకే నేను లంచ్ చేస్తాను. ఎవరినైనా లంచ్‌కు పిలిచినా 2 గంటల తర్వాతే ఆహా్వనిస్తాను. అంతర్జాతీయ సేవా సంస్థ యూనిసెఫ్ వరల్డ్ ఫోరంలో భారత్ తరపున బ్రాండ్ అంబాసిడర్‌గా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. భారత్‌లో 14 నుంచి 19 ఏళ్ల వయసు చిన్నారులు బాలకారి్మకులుగా, బాల నేరస్తులుగా మారుతున్నారు. యూనిసెఫ్ అడాలసిస్ ఎంపవర్మెంట్ ప్రాజెక్టులో భాగంగా వారికి డెవలప్మెంట్ స్కిల్స్‌లో శిక్షణ అందించి మేమే ఉద్యోగాలను అందిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్‌ను గుజరాత్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నాం. సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29న బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కలి్పంచడానికి అతిపెద్ద రన్ నిర్వహిస్తున్నాం. -
మెట్ గాలాలో మరోసారి సందడి చేయనున్న సుధారెడ్డి! ఎవరీమె..?
మెట్ గాలా( MET Gala ).. అనేది సెలబ్రిటీలు డిజైనర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించే మెగా ఈవెంట్. ఈ కార్యక్రమం ప్రతి మే నెలలో మొదటి సోమవారం నిర్వహిస్తారు. ఈ మెట్ గాలా ఈవెంట్‌ని మ్యాజియం కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ కోసం డబ్బు సేకరించేందుకు వినియోగిస్తారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ సెలబ్రెటీలు, ప్రహుఖులు, లెజెండ్లు, అథ్లెట్లు, రాజకీయనాయకుల ఒక రాత్రి అంతా స్టే చేసి మరీ ఈ ఫ్యాషన్ వేడుకను జరుపుకుంటారు.ఈ ఈవెంట్ 1948 నుంచి నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్లో తెలుగు మహిళ సందడి చేయనుంది. సినిమాలకు సంబంధం లేని ఓ మహిళ ఇందులో పాల్గొనే అవకాశం రావడం విశేషం. ఈ మహిళ మన హైదరాబాదీనే. ఆమె పేరు సుధారెడ్డి. ఆమె ఈ గాలా ఈవెంట్లో మరోసారి తళుక్కుమంటోంది. ఇంతకుమునుపు 2021లో ఇదే గాలా ఈవెంట్లో సందడి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఎవరీమె అంటే..సుధారెడ్డి మన నగరానికి చెందిన బడా వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి. ఈమె మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ కూడా. సుధారెడ్డి ఫస్ట్ టైమ్ 2021లో ‘మెట్ గాలా రెడ్ కార్పెట్’పై తళుక్కుమని మెరిశారు. మళ్లీ ఈ ఏడాది మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై మరోసారి మయమరిపించనున్నారు. అంతేగాదు తన ష్యాషన్ డిజైనర్ దుస్తులతో మద్రు వేసేందుకు సుధారెడ్డి సిద్ధంగా ఉన్నారు. అందుకోసం ఇద్దరు ప్రముఖ డిజైనర్లను సెలక్ట్ చేసుక్నున్నారు. ఈ మేడాది మే 6న ఈ మెగా ఈవెంట్‌ని నిర్వహించనున్నారు. అందులో మన తెలుగు మహిళ సుధారెడ్డి అలెగ్జాండర్ మెక్ క్వీన్, తరుణ్ తహిలియానిని డిజైన్ చేసిన దుస్తులను ధరించనున్నారు. బిగ్గెస్ట్ నైట్‌గా ప్రసిద్ధి చెందిన ఈ మెగా గాలా ఈవెంట్‌కి మరోసారి రావడం అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఈ ష్యాషన్ వేడుకలో తన దుస్తులు మరింత ప్రత్యేకంగా ఉండాలని భావిస్తోంది సుధారెడ్డి.ఈసారి ఆమె ఈ ఫ్యాషన్ వేడుకలో భారతీయ సంస్కృతిని టచ్ చేసేలా విభిన్నమైన వస్త్రాలంకరణతో మెరవనుంది. నిజానికి ఈ మెట్ థీమ్ "స్లీపింగ్ బ్యూటీస్: రీవాకనింగ్ ఫ్యాషన్" అంటే..చారిత్రక వస్త్రాలంకరణపై దృష్టి పెట్టేలా చేయడమే ఈ వేడుక ముఖ్యోద్దేశం. ఇక ఈ ఏడాది మెట్ గాలా థీమ్ వచ్చేటప్పటికీ గార్డెన్ ఆఫ్ టైమ్. అందుకు తగ్గట్టుగానే సెలబ్రిటీలు, డిజైనర్లు తమ సొంత ప్రతిభను వెలికితీసి మరీ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ వేడుకలో ఎన్నో రకాల ఫ్యాషన్ డిజైన్‌వేర్‌లు సందడి చేయనున్నాయి. (చదవండి: పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!) -
గ్రాండ్ ఈవెంట్ దీప్‌మేల 2023 వచ్చేసింది.. ఎప్పుడు? ఎక్కడంటే
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దీప్‌మేల ఈవెంట్ వచ్చేసింది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ 3లో ఈ నెల 11-13 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. దీనికి దాదాపు 15వేల మంది సందర్శకులు రావచ్చని అంచనాల వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎలైట్ జ్యువెలరీ, డిజైనర్ వేర్, హస్తకళలు, కళాఖండాలు, పోషకాహార గృహోపకరణాలు, చర్మ సంరక్షణ మొదలైన ఉత్పతులను ఈ ఈవెంట్లో ప్రదర్శించనున్నారు. దీప్ మేల వెనక దీప్ శిఖా దీప్‌మేల 2023ని దీప్ శిఖా మహిళా క్లబ్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ 1965లో ప్రారంభమైంది. దీనికి రాధిక మలానీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు, మధు జైన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మానవ సేవే మాధవ సేవ' అనే నినాదంతో.. దీప్ శిఖా మహిళా క్లబ్ కార్యక్రమాలను చేపడుతోంది. కన్య గురుకుల హైస్కూల్, దీప్శిఖ వొకేషనల్ జూనియర్ కళాశాలను ఈ క్లబ్ నిర్వహిస్తోంది. దీని ద్వారా 1500 మంది పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. దీప్ మేళాలో ఎన్నో ప్రత్యేకతలు ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా దీప్మేళాను నిర్వహిస్తున్నారు. భారత్‌తో పాటు పొరుగుదేశాల నుంచి కూడా సుమారు 250 స్టాల్స్ ఇందులో భాగం కానున్నాయి. దీప్మేలాలో టేస్టీ చాట్, బిర్యానీ, పిజ్జా, ఐస్ క్రీం, మాక్టెయిల్లు అందించే ఫుడ్ కోర్ట్ లు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆకర్షణలు, మరెన్నో ప్రత్యేకతలు. దీప్ మేలాలో కుటుంబమందరికీ ఏదో ఒక ఆకర్షణ, ప్రత్యేకత కలిగి ఉండటంతో... ఇది వేలాది మంది సందర్శకులను మరియు వారి కుటుంబాలను ఆకర్షిస్తోంది. ఈ ఈవెంట్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని దీప్ మేలా మహిళా క్లబ్ సభ్యులు నిర్వహించే దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారని క్లబ్ అధ్యక్షురాలు రాధిక మలాని తెలిపారు. గత ఏడాది జరిగిన దీప్ మేళా వివరాలు, ఫోటోలు కింద ట్వీట్ లో చూడవచ్చు. Deepmela 2022 Exhibition at Hitex by Deepshikha Mahila ClubMore HD Photos - https://t.co/r8BZTEHu1X#Deepmela #DeepmelaExhibition #Deepmela2022 #Exhibition #Hyderabad #Hitex #HyderabadExhibition pic.twitter.com/TwVnvB9VDc— Ragalahari (@Ragalahariteam) July 15, 2022 దీప్ శిఖా కార్యవర్గం వీరే ఈ క్లబ్ కు ప్రస్తుతం అధ్యక్షురాలిగా రాధిక మలాని, వైస్ ప్రెసిడెంట్ గా మధు జైన్, కార్యదర్శిగా ప్రియాంక బహేతి, కోశాధికారిగా సంగీతా జైన్, జాయింట్ సెక్రటరీగా భావ సంఘీ, మీనాక్షి భురారియా, సభ్యులుగా శివాని టిబ్రేవాల్, సలహాదారుగా జయ దగా ఉన్నారు. -
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నగరవాసి
బంజారాహిల్స్ (హైదరాబాద్): ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై నగరానికి చెందిన బిజినెస్ టైకూన్ సుధా రెడ్డి సందడి చేశారు. ప్రఖ్యాత డైరెక్టర్ మార్టిన్ స్క్రోసేస్, హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో చిత్రం ’కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’ నేషనల్ ప్రీమియర్‌లో భాగంగా ఆమె రెడ్ కార్పెట్ వాక్ చేశారు. స్టార్–స్టడెడ్ ఫెస్టివల్లో ప్రపంచ ప్రముఖులతో అలరించే రెడ్ కార్పెట్‌పై వాక్ చేసిన మొట్టమొదటి సినిమాయేతర సెలబ్రిటీ సుధారెడ్డి కావడంవిశేషం. ఈ సందర్భంగా ఆమె కస్టమ్–మేడ్ ఫల్గుణి షేన్ పీకాక్ పీచ్ పెర్ల్ డ్రెప్ చీరలో ఆకట్టుకున్నారు. అనంతరం ప్రతిష్టాత్మకమైన బీచ్ డెస్టినేషన్, ప్లేజ్ హోటల్ బారియర్ లే మెజెస్టిక్‌లో జరిగిన మేడమ్ ఫిగరో ఈవెంట్లో తళుక్కుమన్నారు. -
పారిస్ ఓట్ కుట్యూర్ వీక్‌లో సుధారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పారిస్ ఫ్యాషన్ ఓట్ కుట్యూర్ వీక్‌లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఫిలాంథ్రపిస్ట్ సుధారెడ్డి పాల్గొంటున్నారు. మంగళవారం నుంచి 7 వరకు ఈ షో జరగనుంది. ఈ ఓట్ కుట్యూర్‌లో భారత్ నుంచి ఢిల్లీకి చెందిన డిజైనర్ రాహుల్ మిశ్రాతో పాటు సుధారెడ్డి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సినిమా రంగానికి సంబంధం లేకుండా దక్షిణ భారత దేశం నుంచి పాల్గొంటున్న మొట్టమొదటి సెలబ్రిటీ డిజైనర్ సుధారెడ్డి కావడం విశేషం. యూరోపియన్ లగ్జరీ, ఇండియన్ హెరిటేజ్ మధ్య సమతుల్యతను చాటుతూ క్రిస్టియన్ డియోర్, బాల్మైన్, చానెల్, అర్మానీ తదితర వస్త్ర శైలులను సుధ అక్కడ ప్రదర్శించను న్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘ప్రపంచంలోని సృజనాత్మక శైలులకు పట్టంగట్టే వేదిక పారిస్ కుట్యూర్ వీక్. మనదేశంలో వారసత్వంగా వస్తున్న కళలను ఇక్కడ హైలైట్ చేయడం నా ప్రధాన ఎజెండా. ఇది భారత దేశపు సంప్రదాయ హస్తకళకు దక్కిన గౌరవం అనుకుంటున్నాను’’ అని చెప్పారు. వ్యాపార వేత్త మేఘా కృష్ణారెడ్డి భార్య అయిన సుధారెడ్డి, మేఘా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ సామాజిక కార్యక్రమాలకూ నాయకత్వం వహి స్తున్నారు. ఫౌండేషన్ ద్వారా పేద మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ, విద్యపై దృష్టి సారిస్తు న్నారు. ఎలిజబెత్ హర్లీతో కలిసి బ్రెస్ట్ కేన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లల గురించి అవగాహన కల్పించడానికి అమెరికన్ నటి ఎవా లాంగారి యాతో కలిసి పని చేస్తున్నారు. 2022లో తెలంగాణ ప్రభుత్వం నుంచి చాంపియన్ ఆఫ్ చేంజ్’, 2021లో ఫిక్కీ నుంచి ‘యంగ్ ఇండియన్ ఉమెన్ అచీవర్’ అవార్డులను అందుకున్నారు. -
Met Gala: ఫల్గుణి, షేన్‌లు తీర్చిదిద్దిన గౌనులో మెరిసిన సుధారెడ్డి
వధువు కలలకు వర్ణాలు అద్దే డిజైన్లు ఎన్నెన్నో పలకరించినా మరో కొత్త ‘కళ’ కోసం కనులు వెతుకుతూనే ఉంటాయి. అబ్బురపరిచే రంగుల ఎంపిక.. ఔరా.. అనిపించే ఎంబ్రాయిడరీ పనితనం సంప్రదాయాన్ని చూపినా.. ఆధునికతను మేళవించినా మన దేశ సాంస్కృతిక ఘనతయే తమ డిజైన్లకు ప్రేరణ అనేది ఫల్గుణి షేన్ డిజైనర్ల మాట. ఈ జంట సృష్టించిన బ్రైడల్ కలెక్షన్ ఇది. కోటి కలలకు కొంగొత్త వర్ణాలు గత సోమవారం న్యూయార్క్ నగరంలో జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక ‘మెట్ గాలా 2021’ జరిగింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. ఈ ఏడాది థీమ్ ‘అమెరికన్ ఇండిపెండెట్స్కు తగ్గట్లు అమెరికా జెండాలోని రంగులను తలపించేలా భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు ఫల్గుణి, షేన్‌లు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గౌనును ఆమె ధరించారు. దీంతో భార్యాభర్తలైన ఫల్గుణి, షేన్ వార్తల్లో నిలిచారు. 15 సంవత్సరాలుగా డిజైనర్ రంగంలో ఉన్న ఈ జంట ముంబయ్ వేదికగా తమ డిజైన్లతో ప్రఖ్యాత వేదికల మీద ఆకట్టుకుంటున్నారు. తమ పేరుకు పీకాక్ జత చేసి ఫల్గుణి షేన్ పికాక్ పేరుతో తీసుకువచ్చిన దుస్తులకు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్నారు. న్యూయార్క్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక ‘మెట్ గాలా 2021’లో భారతీయ డిజైనర్లు ఫల్గుణి–షేన్ పీకాక్ డిజైన్ చేసిన డ్రెస్సులో మెరిసిన సుధారెడ్డి ఫల్గుణిషేన్ పీకాక్ డిజైన్లు ముఖ్యంగా వధూవరుల కలెక్షన్లో తమ ఘనతను చాటుతుండగా, రెడీ టు వేర్లో భాగంగా క్యాజువల్, స్పోర్ట్ , ఈవెనింగ్ పార్టీ వేర్లలోనూ తమ ప్రత్యేక డిజైన్ శైలిని చూపుతున్నారు. చదవండి: Health Tips In Telugu: బీట్రూట్, క్యారట్, గ్రీన్ టీ.. వీటిని తరచుగా తీసుకుంటే.. -
పూసలు గుసగుసలాడే...
రాతికి ప్రాణం పోసే సుగుణం... లోహాలకు లాలిత్యం అద్దే నేర్పు అతివకు సొంతం. గాజు, ప్లాస్టిక్, ముత్యం... పూసలేవైనా.. రంగులెన్నయినా... పడతుల మెడలో చేరితే అవి చెప్పే ఊసులెన్నో..! చెప్పకుండానే ఒలికే భాషలెన్నో..! వర్ణాలన్నీ ఒద్దికగా జట్టు కట్టి... శంఖమంటి మెడలో హారమై రూపుకడితే దివిలోన తారకలను మించిన మెరుపులతో పూసలు నిత్యం తళుక్కుమంటూనే ఉంటాయి. గిరిజన స్త్రీ నుండి ఆధునిక యువతి వరకు పూసల హారాలను ధరించడం తెలిసిందే! పూసలను ఎక్కువగా గాజు, ప్లాస్టిక్, రాళ్లతో తయారుచేస్తారు. కొన్ని పూసలు ఎముక, కొమ్ము, దంతం, లోహాలు, ముత్యాలు, మట్టి, పింగాణీ, లక్క, కర్ర, విత్తనాలతోనూ తయారుచేస్తారు. పూసలను గుచ్చడానికి నైలాన్ లేదా ప్లాస్టిక్ దారాన్ని ఉపయోగించి గుచ్చుతారు. ఆభరణాలలో అయితే బంగారు లోహపు తీగతో గుచ్చి రాలిపోకుండా ముడివేస్తారు. బంగారు తీగ స్థానంలో రాగి, ఇత్తడి.. కట్టు తీగలను కూడా ఉపయోగిస్తుంటారు. దుస్తులకు తగిన ఎంపిక: డ్రెస్ కలర్, ప్రింట్, పాశ్చాత్యం, సంప్రదాయం.. ఇలా అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బీడ్స్‌ను ఎంచుకోవాలి ప్లెయిన్ రంగుల దుస్తుల మీదకు మల్టీకలర్ బీడ్స్ బాగా కనిపిస్తాయి ఎక్కువ ప్రింట్లున్న దుస్తుల మీదకు మల్టీకలర్ కాకుండా, దుస్తుల్లోని ఏదో ఒక సెంటర్ కలర్ బీడ్స్ తీసుకొని హారాలను, లోలాకులను తయారుచేసుకోవచ్చు టెంపుల్ జువెల్రీ అయితే కంచిపట్టు, ఉప్పాడ.. వంటి సంప్రదాయ తరహా దుస్తుల మీదకు బాగుంటాయి కెంపులు, ముత్యాలు సాధారణంగా అన్ని రకాల దుస్తుల మీదకు బాగా నప్పుతాయి పచ్చలు మాత్రం మ్యాచింగ్ డ్రెస్సుల మీదకు బాగుంటాయి జీన్స్ వంటి ఆధునిక వస్త్రాలంకరణకు పూసలు ఎక్కువగా ఉన్న ఆభరణాలను ఎంచుకోవద్దు. పూసలు లేకుండా ఒక పెద్ద లాకెట్ ఉన్న చైన్స్, లోలాకులు బాగుంటాయి. సాయంకాలపు వేడుకలకు ముత్యాలు సంద ర్భోచితంగా ఉంటాయి లాకెట్లో ఉన్న రంగును పోలిన పూసలను హారం తయారీకి ఉపయోగిస్తే మరింత ఆకర్షణీయంగా ఆభరణం కనిపిస్తుంది చెక్క పూసలు, రాయి, స్ఫటికం.. ఇతర పెద్ద పెద్ద పూసలు మోడ్రన్ దుస్తుల మీదకు బాగా నప్పుతాయి. పూసల నాణ్యతను బట్టి ఖరీదు ఉంటుంది. తగినవి: నచ్చిన పూసలు(బీడ్స్), బాల్స్, లోహపు తీగ /దారం/ నైలాన్ వైర్, రౌండ్నోస్ ప్లైర్, కటర్, ప్లాట్ ప్లైర్. తయారీ: పూసల బరువును బట్టి లోహపు తీగ(సన్నం/లావు) ను తగినంత కట్ చేసి, తీసుకోవాలి. తీగ చివరల్లో రౌండ్నోస్ ప్లైర్తో ఒక రౌండ్ మెలితిప్పి, పూసకు గుచ్చి, పై భాగంలోనూ ముడిలా తిప్పాలి. ఇలాగే తీగకు ఒక్కో పూసను గుచ్చుతూ, తగినంత పరిమాణంలో హారాన్ని తయారుచేసుకోవాలి. ఇలాగే జూకాలనూ తయారుచేసుకోవచ్చు. ఎప్పటికీ...: సాధారణంగా చెమట, ఉప్పునీరు ఆభరణం అందాన్ని దెబ్బతీస్తాయి. కొనుగోలు చేసినదైనా, సొంతంగా తయారుచేసుకున్నదైనా.. ఆభరణం ఎప్పటికీ ఆకర్షణను కోల్పోకుండా ఉండాలంటే... ప్లాస్టిక్, గాజు, చెక్క.. పూసలు, గవ్వలు, శంఖులు, నవరత్నాలు.. ఏ తరహా ఆభరణం అయినా ధరించిన తర్వాత దూది ఉండతో లేదా కాటన్ క్లాత్‌తో తుడిచి, గాలి చొరబడని ప్లాస్టిక్ బ్యాగ్/బాక్స్‌లలో భద్రపరుచుకోవాలి. పెర్ఫ్యూమ్స్, రసాయనాలు ఆభరణాలకు తగలకూడదు. సుధా రెడ్డి ఆభరణాల నిపుణురాలు, హైదరాబాద్ www.facebook.com/jewelpatterns మోడల్: సంధ్య; ఫొటోలు: శివ మల్లాల