మెట్ గాలాలో తళుక్కుమన్న సుధారెడ్డి
వధువు కలలకు వర్ణాలు అద్దే డిజైన్లు ఎన్నెన్నో పలకరించినా మరో కొత్త ‘కళ’ కోసం కనులు వెతుకుతూనే ఉంటాయి. అబ్బురపరిచే రంగుల ఎంపిక.. ఔరా.. అనిపించే ఎంబ్రాయిడరీ పనితనం సంప్రదాయాన్ని చూపినా.. ఆధునికతను మేళవించినా మన దేశ సాంస్కృతిక ఘనతయే తమ డిజైన్లకు ప్రేరణ అనేది ఫల్గుణి షేన్ డిజైనర్ల మాట. ఈ జంట సృష్టించిన బ్రైడల్ కలెక్షన్ ఇది.
కోటి కలలకు కొంగొత్త వర్ణాలు
గత సోమవారం న్యూయార్క్ నగరంలో జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక ‘మెట్ గాలా 2021’ జరిగింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. ఈ ఏడాది థీమ్ ‘అమెరికన్ ఇండిపెండెట్స్‌కు తగ్గట్లు అమెరికా జెండాలోని రంగులను తలపించేలా భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు ఫల్గుణి, షేన్‌లు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గౌనును ఆమె ధరించారు.
దీంతో భార్యాభర్తలైన ఫల్గుణి, షేన్ వార్తల్లో నిలిచారు. 15 సంవత్సరాలుగా డిజైనర్ రంగంలో ఉన్న ఈ జంట ముంబయ్ వేదికగా తమ డిజైన్లతో ప్రఖ్యాత వేదికల మీద ఆకట్టుకుంటున్నారు. తమ పేరుకు పీకాక్ జత చేసి ఫల్గుణి షేన్ పికాక్ పేరుతో తీసుకువచ్చిన దుస్తులకు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్నారు.
న్యూయార్క్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక ‘మెట్ గాలా 2021’లో భారతీయ డిజైనర్లు ఫల్గుణి–షేన్ పీకాక్ డిజైన్ చేసిన డ్రెస్సులో మెరిసిన సుధారెడ్డి
ఫల్గుణిషేన్ పీకాక్ డిజైన్లు ముఖ్యంగా వధూవరుల కలెక్షన్‌లో తమ ఘనతను చాటుతుండగా, రెడీ టు వేర్‌లో భాగంగా క్యాజువల్, స్పోర్ట్ , ఈవెనింగ్ పార్టీ వేర్‌లలోనూ తమ ప్రత్యేక డిజైన్ శైలిని చూపుతున్నారు.
చదవండి: Health Tips In Telugu: బీట్‌రూట్, క్యారట్, గ్రీన్ టీ.. వీటిని తరచుగా తీసుకుంటే..
Comments
Please login to add a commentAdd a comment