వీడియో: న్యూయార్క్‌లో కార్చిర్చు మంటలు.. ఎమర్జెన్సీ విధింపు | Thick wildfire smoke Covering In New York | Sakshi
Sakshi News home page

వీడియో: న్యూయార్క్‌లో కార్చిర్చు మంటలు.. ఎమర్జెన్సీ విధింపు

Mar 9 2025 1:24 PM | Updated on Mar 9 2025 2:46 PM

Thick wildfire smoke Covering In New York

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో కార్చిర్చు అంటుకుంది. ఎత్తుపడుతున్న మంటల కారణంగా నగరంపై దట్టమైన పొగ అలుముకుంది. తీవ్రమైన గాలుల కారణంగా దట్టమైన పొగ ఆకాశమంతటా వ్యాపిస్తోంది. ఫలితంగా ప్రధాన రహదారులపై వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

న్యూయార్క్ నగరాన్ని కార్చిచ్చు పొగ కమ్మేస్తోంది. శనివారం లాంగ్ ఐలాండ్‌లోని హోంప్టన్స్‌లో ఈ మంటలు చెలరేగాయి. హోంప్టన్స్‌లో నాలుగు చోట్ల ఈ మంటలు పుట్టుకొచ్చాయి. మోరిచెస్, ఈస్ట్‌పోర్టు, వెస్ట్‌ హోంప్టన్స్‌తో సహా పలు ప్రాంతాలకు ఇవి వ్యాపించాయి. దీంతో,  ఆ ప్రదేశాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది దీనిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు చోట్ల మంటలు అదుపులోకి తీసుకురాగా.. హోంప్టన్స్‌లో 50 శాతం అగ్నికీలలను అదుపులోకి తెచ్చారు.

కార్చిర్చు కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు.. పెద్ద ఎత్తున గాలులు వీయడంతో దట్టమైన పొగ నగరమంతా వ్యాపించింది. అయితే, ఈ కార్చిచ్చు కారణంగా రెండు వాణిజ్య భవనాలు కాలిపోయాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ గవర్నర్ హోచుల్ అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. స్థానికులను ఆ ప్రాంతం నుంచి తరలిస్తున్నట్లు తెలిపారు. మంటలను అదుపుచేసేందుకు హెలికాప్టర్లతో నీటిని చల్లుతున్నట్లు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement