
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దీప్‌మేల ఈవెంట్ వచ్చేసింది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ 3లో ఈ నెల 11-13 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. దీనికి దాదాపు 15వేల మంది సందర్శకులు రావచ్చని అంచనాల వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎలైట్ జ్యువెలరీ, డిజైనర్ వేర్, హస్తకళలు, కళాఖండాలు, పోషకాహార గృహోపకరణాలు, చర్మ సంరక్షణ మొదలైన ఉత్పతులను ఈ ఈవెంట్‌లో ప్రదర్శించనున్నారు.
దీప్ మేల వెనక దీప్ శిఖా
దీప్‌మేల 2023ని దీప్ శిఖా మహిళా క్లబ్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ 1965లో ప్రారంభమైంది. దీనికి రాధిక మలానీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు, మధు జైన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మానవ సేవే మాధవ సేవ' అనే నినాదంతో.. దీప్ శిఖా మహిళా క్లబ్ కార్యక్రమాలను చేపడుతోంది. కన్య గురుకుల హైస్కూల్, దీప్‌శిఖ వొకేషనల్ జూనియర్ కళాశాలను ఈ క్లబ్ నిర్వహిస్తోంది. దీని ద్వారా 1500 మంది పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నారు.
దీప్ మేళాలో ఎన్నో ప్రత్యేకతలు
ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా దీప్‌మేళాను నిర్వహిస్తున్నారు. భారత్‌తో పాటు పొరుగుదేశాల నుంచి కూడా సుమారు 250 స్టాల్స్ ఇందులో భాగం కానున్నాయి. దీప్‌మేలాలో టేస్టీ చాట్, బిర్యానీ, పిజ్జా, ఐస్ క్రీం, మాక్‌టెయిల్‌లు అందించే ఫుడ్ కోర్ట్ లు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆకర్షణలు, మరెన్నో ప్రత్యేకతలు. దీప్ మేలాలో కుటుంబమందరికీ ఏదో ఒక ఆకర్షణ, ప్రత్యేకత కలిగి ఉండటంతో... ఇది వేలాది మంది సందర్శకులను మరియు వారి కుటుంబాలను ఆకర్షిస్తోంది. ఈ ఈవెంట్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని దీప్ మేలా మహిళా క్లబ్ సభ్యులు నిర్వహించే దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారని క్లబ్ అధ్యక్షురాలు రాధిక మలాని తెలిపారు. గత ఏడాది జరిగిన దీప్ మేళా వివరాలు, ఫోటోలు కింద ట్వీట్ లో చూడవచ్చు.
Deepmela 2022 Exhibition at Hitex by Deepshikha Mahila Club
— Ragalahari (@Ragalahariteam) July 15, 2022
More HD Photos - https://t.co/r8BZTEHu1X#Deepmela #DeepmelaExhibition #Deepmela2022 #Exhibition #Hyderabad #Hitex #HyderabadExhibition pic.twitter.com/TwVnvB9VDc
దీప్ శిఖా కార్యవర్గం వీరే
ఈ క్లబ్ కు ప్రస్తుతం అధ్యక్షురాలిగా రాధిక మలాని, వైస్ ప్రెసిడెంట్ గా మధు జైన్, కార్యదర్శిగా ప్రియాంక బహేతి, కోశాధికారిగా సంగీతా జైన్, జాయింట్ సెక్రటరీగా భావ సంఘీ, మీనాక్షి భురారియా, సభ్యులుగా శివాని టిబ్రేవాల్, సలహాదారుగా జయ దగా ఉన్నారు.