organisation
-
అణ్వాయుధ వ్యతిరేక పోరాటానికి నోబెల్ శాంతి బహుమతి
ఒస్లో: అణ్వాయుధాలకు తావులేని శాంతియుత ప్రపంచమే లక్ష్యంగా అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తున్న జపాన్ సంస్థ ‘నిహాన్ హిడాన్క్యో’కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది. నార్వే నోబెల్ కమిటీ చైర్మన్ వాట్నే ఫ్రైడ్నెస్ శుక్రవారం ఈ విషయం ప్రకటించారు. అణ్వాయుధాల ప్రయోగాన్ని నిషేధించాలన్న నినాదం ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని చెప్పారు. మానవాళి సంక్షేమం కోసం అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం గళం విప్పాలని సూచించారు. 1945లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా చేపట్టిన అణుబాంబు దాడిలో ప్రాణాలతో బయటపడిన పౌరులు ‘నిహాన్ హిడాన్క్యో’ను స్థాపించారు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అమెరికా దాడిలో క్షతగాత్రులు మారిపోయి, బాధాకరమైన జ్ఞాపకాలతో జీవిస్తున్నప్పటికీ శాంతి కోసం కృషి చేస్తున్నారని నిహాన్ హిడాన్క్యో సభ్యులను వాట్నే ఫ్రైడ్నెస్ ప్రశంసించారు. తమ సంస్థకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడం పట్ల నిహాన్ హిడాన్క్యో హిరోíÙమా శాఖ చైర్పర్సన్ తొమొయుకి మిమాకీ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ‘‘ఇది నిజమేనా? నమ్మలేకపోతున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఏమిటీ నిహాన్ హిడాన్క్యో? రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సైన్యం 1945 ఆగస్టు 9న జపాన్‌లోని నాగసాకి పట్టణంపై అణుబాంబు ప్రయోగించింది. ఈ దాడిలో ఏకంగా 70 వేల మంది మరణించారు. మూడు రోజుల తర్వాత హిరోషిమా పట్టణంపై మరో బాంబును అమెరికా ప్రయోగించింది. ఈ ఘటనలో 1.40 లక్షల మంది ప్రజలు బలయ్యారు. దాంతో 1945 ఆగస్టు 15న పశి్చమ దేశాల సైన్యం ఎదుట జపాన్ లొంగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. నాగసాకి, హిరోíÙమాపై జరిగిన అణుబాంబు దాడుల్లో వేలాది మంది క్షతగాత్రులయ్యారు. అవయవాలు కోల్పోయి దివ్యాంగులుగా మారారు. బాధితులంతా(హిబకుషా) తమకు ఎదురైన అనుభవాలతో అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, తమ భవిష్యత్తు తరాలను కూడా ఆదుకోవాలని, అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ 1956లో నిహాన్ హిడాన్క్యో సంస్థను స్థాపించారు. పసిఫిక్ ప్రాంతంలో అణ్వాయుధ ప్రయోగాలతో బాధితులుగా మారినవారు సైతం ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ ఉద్యమం క్రమంగా ప్రపంచమంతటా వ్యాప్తిచెందింది. BREAKING NEWSThe Norwegian Nobel Committee has decided to award the 2024 #NobelPeacePrize to the Japanese organisation Nihon Hidankyo. This grassroots movement of atomic bomb survivors from Hiroshima and Nagasaki, also known as Hibakusha, is receiving the peace prize for its… pic.twitter.com/YVXwnwVBQO— The Nobel Prize (@NobelPrize) October 11, 2024 -
3న శిల్పకళా వేదికలో చింగ్ హార్ట్స్..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయిని మంగ్లీ స్వరాలతో నగరంలోని శిల్పకళా వేదికగా ‘చింగ్ హార్ట్స్’ పేరుతో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ను నిర్వహించనున్నారు. ఆగస్టు 3న జరగనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను రామానాయుడు స్టూడియోస్ వేదికగా సింగర్ మంగ్లీ, జబర్దస్త్ ఫేం బుల్లెట్ భాస్కర్, సంస్థ సభ్యులు అరుణ ప్రదీప్, విజయలక్షి్మ, సాయి గౌరీ, శ్రీ వల్లి ఆవిష్కరించారు. 35వ వార్షికోత్సవం నేపథ్యంలో..నిరాదరణకు గురైన బాలికలు, అనాథ చిన్నారులకు అన్నీ తామై చూసుకుంటోంది నగరంలోని సాయి సేవా సంఘ్ సామాజిక సేవా సంస్థ. 35వ వార్షికోత్సవం సందర్భంగా చిన్నారుల సహాయార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 2 వేల మంది బాలికలకు ఉచిత విద్య, వసతితో పాటు వారికి అవసరమైన సంపూర్ణ ఆరోగ్య సంరక్షణను అందింస్తుంది. నృత్యం, సంగీతం వంటి విభిన్న కళల్లో శిక్షణ అందిస్తుంది. ఆ సంస్థ వల్లే..ఈ స్థాయికి...ఏ ఆధారం లేని బాలికల ఆలనా పాలనా చూసుకోవడం అనిర్వచనీయమని మంగ్లీ అన్నారు. తనని కూడా ఆర్టీడీ అనే సంస్థ చేరదీయడం వల్లే ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేసుకున్నారు. ఇంతటి సేవను అందిస్తున్న సాయి సేవా సంఘ్ సంస్థ కోసం తాను కన్సర్ట్‌లో పాడుతున్నానని, బుక్ మై షో టిక్కెట్ల ద్వారా వచ్చే డబ్బునే కాకుండా వ్యక్తిగతంగా లక్ష రూపాయలను విరాళంగా అందిస్తానని ప్రకటించారు. ఇందులో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్కతో పాటు జబర్ధస్త్ ఫేం ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, నాటీ నరేష్ వంటి ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. -
‘సిమి’ అంటే ఏమిటి? విద్యార్థి సంఘం ఎందుకిలా మారింది?
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ప్రస్తుతం తీవ్రవాద సంస్థగా పేరుగాంచింది. ‘సిమి’ తొలుత యూపీలోని అలీగఢ్‌లో విద్యార్థి సంఘంగా ఏర్పడింది. అయితే ఈ సంఘం అనేక సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందనే ఆరోపణలు రావడంతో 2001లో తొలిసారి దీనిని నిషేధించారు. ఈ నిషేధం నేటికీ కొనసాగుతోంది. ఐదేళ్ల క్రితం యూఏపీఏ కింద చర్యలు తీసుకుంటూ ఐదేళ్ల పాటు నిషేధం విధించగా, దీనిని మరోసారి పొడిగించారు. ఇస్లామిక్ ల్యాండ్‌గా మార్చాలని.. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఏప్రిల్ 1977లో స్థాపితమయ్యింది. భారతదేశాన్ని ఇస్లామిక్ ల్యాండ్‌గా మార్చడం ద్వారా ‘భారతదేశానికి విముక్తి’ కల్పించాలనేది సిమి మిషన్ అనే ఆరోపణలున్నాయి. భారత్‌లో ఇస్లామిక్ పాలనను నెలకొల్పడమే ‘సిమి’ లక్ష్యమని, దాని మనుగడ కొనసాగేందుకు అనుమతించబోమని కేంద్రం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. నిషేధిత సంస్థ కార్యకర్తలు ఇప్పటికీ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతకు హాని కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మహ్మద్ అహ్మదుల్లా సిద్ధిఖీ సారధ్యంలో.. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జమాతే ఇస్లామీ హింద్ (జేఈఐహెచ్)ను విశ్వసించే యువత, విద్యార్థుల సంస్థగా ‘సిమి’ 1977 ఏప్రిల్ 25, 1977న ఉనికిలోకి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. 1993లో అది స్వతంత్ర సంస్థగా ప్రకటించుకుంది. సిమి వ్యవస్థాపక అధ్యక్షుడు మహ్మద్ అహ్మదుల్లా సిద్ధిఖీ. ఆయన ప్రస్తుతం మాకోంబ్లోని వెస్ట్రన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో ఇంగ్లీష్, జర్నలిజం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. యాసర్ అరాఫత్ తీరుపై నిరసన 1981లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ) నేత యాసర్ అరాఫత్ భారత పర్యటనకు వచ్చినప్పుడు ‘సిమి’ కార్యకర్తలు నిరసనకు దిగడంతో ఈ సంస్థ తొలిసారి ముఖ్యాంశాలలో కనిపించింది. న్యూఢిల్లీలో సిమి కార్యకర్తలు యాసర్ అరాఫత్‌కు నల్లజెండాలతో స్వాగతం పలికారు. అరాఫత్ పశ్చిమ దేశాల కీలుబొమ్మ అని నాడు సిమి కార్యకర్తలు ఆరోపించారు. జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) సీనియర్ నేతలు అరాఫత్‌ను పాలస్తీనా వాదానికి ఛాంపియన్‌గా అభివర్ణించారు. దీని తర్వాత ‘సిమి’, జేఐహెచ్ విడిపోయాయి. ‘సిమి’పై నిషేధం 2001లో తొలిసారిగా ‘సిమి’పై నిషేధం విధించారు. అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ఆ నిషేధం కొనసాగుతూనే ఉంది. అయితే 2008 ఆగస్టులో ప్రత్యేక ట్రిబ్యునల్ ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే నాటి సీజేఐ కేజీ బాలకృష్ణన్ దానిని పునరుద్ధరించారు. జాతీయ భద్రత దృష్ట్యా 2008 ఆగస్టు 6న అప్పటి సీజేఐ దీనిని నిషేధించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 2019 అంటే యూఏపీఏ ప్రకారం భారత ప్రభుత్వం 2019లో ‘సిమి’ని నిషేధించింది. ఈ నిషేధాన్ని ఐదు సంవత్సరాల పాటు విధించారు. 2019లో విధించినఈ నిషేధం 2024 ఫిబ్రవరితో ముగుస్తుంది. అయితే దీనికిముందే హోం మంత్రిత్వ శాఖ దీనిపై కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నిషేధ కాలాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించింది. వివిధ సంస్థలు పేర్లతో.. ‘సిమి’ వివిధ సంస్థలు పేర్లతో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. సిమిపై నిషేధం విధించిన తర్వాత ఆ సంస్థ ఖైర్-ఎ-ఉమ్మత్ ట్రస్ట్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, తెహ్రీక్-ఏ-అహయా-ఏ-ఉమ్మత్, తెహ్రీక్-తలాబా-ఏ-అరేబియా, తెహ్రీక్ తహఫుజ్-ఇ, షాయర్-ఎ-ఇస్లాం, వహ్దత్-ఇ-ఇస్లామీ పేర్లతో తన కార్యకలాపాలను యధేచ్ఛగా నిర్వహిస్తున్నదనే ఆరోపణలున్నాయి. -
గ్రాండ్ ఈవెంట్ దీప్‌మేల 2023 వచ్చేసింది.. ఎప్పుడు? ఎక్కడంటే
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దీప్‌మేల ఈవెంట్ వచ్చేసింది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ 3లో ఈ నెల 11-13 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. దీనికి దాదాపు 15వేల మంది సందర్శకులు రావచ్చని అంచనాల వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎలైట్ జ్యువెలరీ, డిజైనర్ వేర్, హస్తకళలు, కళాఖండాలు, పోషకాహార గృహోపకరణాలు, చర్మ సంరక్షణ మొదలైన ఉత్పతులను ఈ ఈవెంట్లో ప్రదర్శించనున్నారు. దీప్ మేల వెనక దీప్ శిఖా దీప్‌మేల 2023ని దీప్ శిఖా మహిళా క్లబ్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ 1965లో ప్రారంభమైంది. దీనికి రాధిక మలానీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు, మధు జైన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మానవ సేవే మాధవ సేవ' అనే నినాదంతో.. దీప్ శిఖా మహిళా క్లబ్ కార్యక్రమాలను చేపడుతోంది. కన్య గురుకుల హైస్కూల్, దీప్శిఖ వొకేషనల్ జూనియర్ కళాశాలను ఈ క్లబ్ నిర్వహిస్తోంది. దీని ద్వారా 1500 మంది పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. దీప్ మేళాలో ఎన్నో ప్రత్యేకతలు ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా దీప్మేళాను నిర్వహిస్తున్నారు. భారత్‌తో పాటు పొరుగుదేశాల నుంచి కూడా సుమారు 250 స్టాల్స్ ఇందులో భాగం కానున్నాయి. దీప్మేలాలో టేస్టీ చాట్, బిర్యానీ, పిజ్జా, ఐస్ క్రీం, మాక్టెయిల్లు అందించే ఫుడ్ కోర్ట్ లు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆకర్షణలు, మరెన్నో ప్రత్యేకతలు. దీప్ మేలాలో కుటుంబమందరికీ ఏదో ఒక ఆకర్షణ, ప్రత్యేకత కలిగి ఉండటంతో... ఇది వేలాది మంది సందర్శకులను మరియు వారి కుటుంబాలను ఆకర్షిస్తోంది. ఈ ఈవెంట్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని దీప్ మేలా మహిళా క్లబ్ సభ్యులు నిర్వహించే దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారని క్లబ్ అధ్యక్షురాలు రాధిక మలాని తెలిపారు. గత ఏడాది జరిగిన దీప్ మేళా వివరాలు, ఫోటోలు కింద ట్వీట్ లో చూడవచ్చు. Deepmela 2022 Exhibition at Hitex by Deepshikha Mahila ClubMore HD Photos - https://t.co/r8BZTEHu1X#Deepmela #DeepmelaExhibition #Deepmela2022 #Exhibition #Hyderabad #Hitex #HyderabadExhibition pic.twitter.com/TwVnvB9VDc— Ragalahari (@Ragalahariteam) July 15, 2022 దీప్ శిఖా కార్యవర్గం వీరే ఈ క్లబ్ కు ప్రస్తుతం అధ్యక్షురాలిగా రాధిక మలాని, వైస్ ప్రెసిడెంట్ గా మధు జైన్, కార్యదర్శిగా ప్రియాంక బహేతి, కోశాధికారిగా సంగీతా జైన్, జాయింట్ సెక్రటరీగా భావ సంఘీ, మీనాక్షి భురారియా, సభ్యులుగా శివాని టిబ్రేవాల్, సలహాదారుగా జయ దగా ఉన్నారు. -
ఆ ఉద్యోగులకు శుభవార్త, ఈపీఎఫ్‌వో కొత్త గైడ్‌లైన్స్ విడుదల.. అవేంటో తెలుసా?
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) సంస్థ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నవంబర్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఎక్కువ శాలరీ తీసుకుంటున్న ఉద్యోగులు సైతం పీఎఫ్‌కు అర్హులేనని కొత్త మార్గ దర్శకాలను విడుదల చేసింది. సుప్రీం ఇచ్చిన ఆదేశాల్ని పారాగ్రాఫ్ 11(3) 1995 స్కీమ్ కింద సంస్థలు 8 వారాల్లో అమలు చేయాలని సూచించింది. ఈపీఎఫ్ఓ సర్క్యులర్ విడుదల ఈపీఎఫ్ఓ సర్క్యులర్‌లో 1995 స్కీమ్‌లోని పేరా 11(3) ప్రకారం సెప్టెంబర్ 1, 2014కి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఈ నిబంధనల పరిధిలోకి వస్తారు. అంటే సెప్టెంబర్ 1,2014కి ముందు రిటైరైన ఉద్యోగులు, రిటైర్మెంట్కు ముందే సదరు ఉద్యోగులు అధిక పింఛన్ కోసం ఆప్షన్ తీసుకొని ఉండంతో పాటు ఇతర కొన్ని నిబంధనలు విధించింది. ఆ నిబంధనలకు లోబడి ఉన్న ఉద్యోగులు మాత్రమే అర్హులు. పూర్తి స్థాయి సమాచారం కోసం ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సందర్శించాలని విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. పీఎఫ్ పరిమితిని సుప్రీం ఎందుకు పెంచింది? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (epfo) 2014లో ఓ సవరణ చేసింది. ఆ సవరణ ప్రకారం..ఉద్యోగులు పెన్షన్ పొందడానికి గరిష్ట వేతనం (బేసిక్ పే ప్లస్ డియర్నెస్ అలవెన్స్) నెలకు రూ.15,000 ఉండాలి. సవరణకు ముందు ఇది రూ.6,500గా ఉండేది. ఈ పథకాన్ని కేరళ, రాజస్తాన్, ఢిల్లీ హైకోర్టులు గతంలోనే కొట్టేశాయి. వీటిని సవాలు చేస్తూ ఈపీఎఫ్ఓ, కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సుధాంశూ ధూలియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నవంబర్‌లో తీర్పును వెలువరించింది. ఉద్యోగుల పెన్షన్ (సవరణ) పథకం–2014 చెల్లుబాటును సమర్థించింది. అయితే, పీఎఫ్‌లో చేరేందుకు రూ.15,000 నెలవారీ కనీస వేతనం పరిమితిని కొట్టేసింది. చదవండి👉 6 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త! -
గ్రీన్కో గ్రూప్ సంస్థ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
నవజీవన్ సంస్థ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
నవయుగ సంస్థకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ
-
No Shave November: గడ్డాలు పెంచుతూ ఆకర్షణగా నిలుస్తున్న యువత
సాక్షి, కాజీపేట(వరంగల్): క్రాఫ్‌లో వివిధ రకాల స్టైల్స్.. ఆ మాదిరిగానే గడ్డంలోనూ తమకంటూ ఓ ప్రత్యేకత కోసం తాపత్రయ పడుతోంది నేటి యువత. తమ అందాన్ని గడ్డం రూపంలోనూ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకునేందుకు మక్కువ చూపుతూ ఇదో స్టైల్ అంటూ కొత్త ట్రెండ్‌కు తెరలేపుతోంది. ‘నో షేవ్.. పెంచెయ్ గడ్డం’ అంటూ నగర యువత గడ్డం పెంచడంతో కొత్తదనం చూపుతోంది. అయితే ఏడాదిలో ప్రతి నెలకో ప్రత్యేకత ఉండగా.. కేన్సర్ మహమ్మారిని సమాజం నుంచి పారదోలేందుకు.. నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించేందుకు.. పేషెంట్లకు ఆర్థిక చేయూతనందించేందుకు నో షేవ్ నవంబర్ మాసంగా జరుపుకునేందుకు యువత ఉత్సాహం కనబరుస్తోంది. నవంబర్ నో షేవ్ మాసంగా.. గతంలో గడ్డం పెంచుకుంటే ఏంట్రా దేవదాసులా మారావు అనేవారు. కానీ.. ఇప్పుడు గడ్డం పెంచేసుకుందాం బాసూ అంటున్నారు. ప్రస్తుత యువతకు గడ్డం ఓ ట్రెండ్‌లా మారింది. తీరొక్క ఆకృతుల్లో.. ఇష్టమైన విధంగా మలచుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నవంబర్ మాసాన్ని నో షేవ్ నవంబర్ పేరిట.. గడ్డంపై కత్తెర పడనివ్వకుండా.. గడ్డానికి వెచ్చించే ఖర్చును మాసం మొత్తంలో పొదుపు చేసి కేన్సర్ పేషెంట్లకు అందజేయడంతోపాటు గడ్డం పెంచడంలో తమ స్టైల్‌ను కనబరుస్తూ.. డబ్బును ఆదా చేసి పేషెంట్లకు అందిస్తూ తమ ఉదారతను చాటుతున్నారు. ఇతరులకూ ఆదర్శంగా నిలుస్తున్నారు నగర యువకులు. ఇందుకోసం యువతను మరింతగా ప్రోత్సహించేందుకు ఆన్లైన్ నో షేవ్ నవంబర్ పేరిట స్వచ్ఛంద సంస్థ అందుబాటులో ఉండడం విశేషం. కాగా.. యువత ఫ్రెంచ్, అండర్ కట్ బియర్డ్, యాంకర్ బియర్డ్ వంటి వాటితోపాటు తమకు ఇష్టమైన హీరోల గడ్డాలను సరిపోలే విధంగా గడ్డాన్ని తీర్చిదిద్దుకునేందుకు నగరంలో ప్రత్యేకంగా మెన్స్ పార్లర్లు అందుబాటులో ఉన్నాయి. గడ్డం ప్రవీణ్ అంటారు.. నాకు గడ్డం పెంచడం అంటే చాలా ఇష్టం. నన్ను మా ఆఫీసులో అందరూ గడ్డం ప్రవీణ్ అనే పిలుస్తారు. నవంబర్ మాసంలో గడ్డంపై పెట్టే డబ్బులను కేన్సర్ పేషెంట్లకు అందజేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదో మంచి సేవా కార్యక్రమంలా నేను భావిస్తున్నా. – సుందర ప్రవీణ్‌కుమార్, రైల్వే బుకింగ్ క్లర్క్ నా బియర్డ్ నా ఇష్టం నా బియర్డ్ నా ఇష్టం అంటాను నేను. మా ఇంట్లో వారు గడ్డం ఎందుకన్నా నాకు మాత్రం పెంచడం అంటే చాలా ఇష్టం. ప్రతి ఏడాది నవంబర్ మాసంలో నో షేవ్ నవంబర్‌ను పాటించి డబ్బులను ఆదా చేసి కేన్సర్ పేషెంట్లకు అందజేయడం బాధ్యతగా భావిస్తా. – ప్రియాంషు, ఎంటెక్, నిట్ వరంగల్ నో షేవ్ నవంబర్‌ను పాటిస్తాం.. నిట్ వరంగల్ ప్రతి అంశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇందులో భాగంగా నిట్‌లో నవంబర్ నెలను నో షేవ్ నవంబర్‌గా పాటిస్తున్నాం. నాతోటి మిత్రులతో కలిసి బియర్డ్ కటింగ్‌కు అయ్యే డబ్బులను కేన్సర్ పేషెంట్ల చికిత్సకు ఉపయోగపడే విధంగా చేస్తున్నాం. – విదిష్రామ్, పీహెచ్డీ స్కాలర్, నిట్ -
మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి సంస్థకు భారీ టోకరా.. ఇద్దరు అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి భార్య ఇందిరా రెడ్డి చైర్పర్సన్, ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న గాయత్రి ప్రాజెక్టస్ లిమిటెడ్ (జీపీఎల్) సంస్థకు భారీ టోకరా వేసిన కేసులో ఇద్దరు నిందితులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన ఛాంపియన్ ఫిన్సెక్ లిమిటెడ్ (సీఎఫ్ఎల్) డైరెక్టర్లు నిందితులుగా గుర్తించి, అక్కడే అరెస్టు చేసి తీసుకువచ్చామని సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి సోమవారం వెల్లడించారు. వివిధ రకాలైన నిర్మాణాలు, హైవేల కాంట్రాక్టులు చేపట్టే జీపీఎల్ సంస్థ ప్రధాన కార్యాలయం బంజారాహిల్స్‌లో ఉంది. కొన్నాళ్ల క్రితం సీఎఫ్ఎల్ డైరెక్టర్లు చేతన్ బాలుబాయ్ పటేల్, హర్షవర్ధన్ అవినాష్ ప్రదాన్ జీపీఎల్ సంస్థను సంప్రదించారు. వీరి అవసరాలకు రూ.11.5 కోట్లు రుణం ఇస్తామంటూ ముందుకు వచ్చారు. జీపీఎల్‌కు చెందిన 69,63,000 షేర్లు తనఖా పెట్టుకుని ఈ రుణం ఇప్పించ్చేలా, అందుకు 1 శాతం కమీషన్ సీఎఫ్‌ఎల్‌కు చెల్లించేలా వీరి మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో జీపీఎల్ సంస్థ ప్రాథమికంగా ఒక్కోటి రూ.33.05 విలువైన (అప్పటి విలువ) 3.25 లక్షల షేర్లను సీఎఫ్‌ఎల్‌కు బదిలీ చేసింది. అయితే నిర్దేశిత గడువు ముగిసినా సీఎఫ్ఎల్ మాత్రం గాయత్రి సంస్థకు ఎలాంటి రుణం మంజూరు చేయించలేదు. అంతటితో ఆగని సీఎఫ్ఎల్ సంస్థ తమ వద్ద ఉన్న జీపీఎల్ షేర్లను వారి అనుమతి లేకుండా బహిరంగ మార్కెట్లో విక్రయించింది. ఈ విషయం తెలుసుకున్న జీపీఎల్ సంస్థ ఈ ఏడాది జూలైలో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా అధికారులు సీఎఫ్ఎల్ డైరెక్టర్లు అవినాష్ ప్రధాన్, చేతన్ బాలుబాయ్ పటేల్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇరువురినీ ముంబైలో అరెస్టు చేసి సిటీకి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. -
మరింత చిక్కుల్లో పాక్.. మరోసారి ఆ జాబితాలోకి
పారిస్: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) మరోసారి పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో పెట్టింది. దీంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సహా అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సహాయాన్ని, పెట్టుబడులను పొందడానికి పాకిస్తాన్‌కు అవకాశాలు ఉండవు. ఈ జాబితా నుంచి బయటపడటం కోసం ఆ దేశం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థలకు అందుతున్న నిధులపై ఎఫ్ఏటీఎఫ్ నిఘా పెడుతుంది. ఈ సంస్థ ప్రకటించే గ్రే లిస్ట్‌లో పాకిస్థాన్ మూడేళ్ళ నుంచి ఉంది. ఎఫ్ఏటీఎఫ్ చర్యల ప్రణాళికను అమలు చేయడం, అదే సమయంలో, ఉగ్రవాదులకు రక్షణ కల్పించడం పాకిస్తాన్‌కు ఇబ్బందికరంగా మారింది. ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు పారిస్‌లో జూన్ 21 నుంచి 25 వరకు జరిగాయి. చదవండి: ‘గ్రీన్’కి అందని పాజిటివ్ సిగ్నల్స్ -
కరోనా బాధితులకు గుడ్ న్యూస్: ఫోన్ కొడితే.. ఇంటి వద్దకే..
సాక్షి, బంజారాహిల్స్: కరోనా పాజిటివ్ బాధితులకు ఎలాంటి డెలివరీ చార్జీలు లేకుండా సరుకులు సరఫరా చేసేందుకు కౌన్సిల్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా(సీటీఐ) అనుబంధ ‘ది హైదరాబాద్ ఎసెన్షియల్స్ డెలివరి కలెక్టివ్’ అనే సంస్థ ముందుకొచ్చింది. కరోనా సోకిన వారు తమకు ఫోన్ చేస్తే వారు కోరుకున్న సరుకులను ఇంటి వద్దకు చేరుస్తామని ప్రతినిధులు ప్రకటించారు. కొనుగోలు చేసిన సరుకులకు మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, తామంతా వారి ఇళ్ల వద్దకు వెళ్లి బ్యాగులు ఇంటి ముందు పెడతామని సంస్థ వ్యవస్థాపకుడు రోహిత్ వక్రాల వెల్లడించారు. తమకు ఇప్పటికే 37 మంది వలంటీర్లు నగర వ్యాప్తంగా ఉన్నారని, ప్రతిరోజూ 70 మందికి ఈ సరుకుల పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 8340903849 నంబర్‌కు ఫోన్ చేస్తే సరుకుల జాబితాను తీసుకొని అరగంటలో ఇంటి ముందు ఆ బ్యాగును ఉంచుతామని ఆయన వెల్లడించారు. -
కోవిడ్ బాధితులకు ఆహారం ఫ్రీ.. ఎక్కడంటే..
సాక్షి, కూకట్పల్లి: కోవిడ్ బారిన పడి వంట చేసుకోలేని వారికి యోగా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అన్నదానం చేయనున్నట్లు అన్నపూర్ణేశ్వరి దేవి యోగా గురూజీ జగన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా బారిన పడిన వారికి ఇంటి వద్దకే నేరుగా భోజనం, ఆహార పానీయాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఏవరికైతే తమ సేవలు కావాలో ముందస్తుగా ఫోన్‌చేసి పేరు, చిరునామా లొకేషన్ పెడితే అన్నం ఇతర పదార్థాలు అందజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 9441887766 ఈ నెంబరుకు కాల్ చేయాలని నిర్వాహకులు ఒక ప్రకటనలో కోరారు. -
వామ్మో.. కొంపముంచిన సేవా కార్యక్రమం..
సాక్షి, లంగర్‌హౌస్: లంగర్‌హౌస్‌లో ఓ సంఘం వారు ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలు శాపంగా మారాయి. నిర్వాహకులతో పాటు అక్కడికి వచ్చిన వారు కరోనా బారినపడ్డారు. గత కొన్ని రోజుల క్రితం గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో అభ్యర్థులు వచ్చారు. కాగా లంగర్‌హౌస్‌కు చెందిన ఓ సంఘం వారు వీరికి ఉచిత భోజన వసతి ఏర్పాటు చేశారు. ఇందులో వందలాది మంది అభ్యర్థులు భోజనాలు చేశారు. కాగా వారం తరువాత సేవా కార్యక్రమాలు నిర్వహించిన పలువురి సుస్తి చేసింది. కాగా వీరిలో చాలా మంది గుట్టు చప్పుడు కాకుండా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. వీరిలో చాలా మంది వైద్యుల సలహాలతో మందులు తీసుకుని హోం క్వారంటైన్లో ఉండిపోయారు. కాగా ఈ సంఘటనలో పదుల సంఖ్యలో వైరస్ బారినపడ్డారని తెలిసింది. -
ఆవుల మెడలో రేడియం టేపులు
హరియాణ: పశువులను సంరక్షించాలనే తపనతో ఓ స్వచ్చంద సంస్థ నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితె.. సర్వ్ కాంట్రాక్టర్ సంగ్ (ఎస్సీఎస్), రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్(ఆర్వీఏ) అనే స్వచ్ఛంద సంస్థలు హరియాణాలోని పంచకులలో రోడ్డు ప్రమాదాల నివారణకు, మూగజీవాల పరిరక్షణకు సరికొత్త పంథా ఎంచుకున్నాయి. రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఆవులు, కుక్కల మెడల్లో రేడియం టేపులు కట్టారు. ఇప్పటి వరకు హైవేలోని 150 ఆవులకు రేడియం టేపులు కట్టామని నిర్వాహకులు తెలిపారు. ఎస్సీఎస్ ప్రెసిడెంట్ రవీందర్ జజారియా మాట్లాడుతూ.. జంతువులు, రాత్రి వేళ బైక్ నడిపే ప్రజలకు రక్షణ కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ‘పొగ మంచు వల్ల వాహనదారులకు జంతువులు కనిపించవు కనుక.. మంచు కురిసే చోట్ల ప్రమాదాలకు అవకాశం ఎక్కువ. అందుకనే రేడియం టేపుల ఆలోచన వచ్చింది. నాణ్యమైన రేడియం టేపులు ధరించిన జంతువులు వాహనాదారులకు దూరం నుంచి కనిపిస్తాయి. దాంతో వారు జాగ్రత్త పడొచ్చు. కోయంబత్తూరు నుంచి టేపులను కొనుగోలు చేస్తున్నామ’ని తెలిపారు. -
డిప్రెషన్ చాలా తీవ్రమైన వ్యాధి: దీపిక
ముంబై: మనోవేదన చాలా భయంకరమైన వ్యాధి అని, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ తెలిపారు. ద లివ్ లవ్ లాఫ్ పౌండేషన్ అగైనెస్ట్ డిప్రెషన్ అనే బేస్‌లైన్‌తో తన సంస్థ లోగోను ఆవిష్కరించింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇటీవల ఆ భయంకరమైన మహమ్మారి నుంచి బయటపడిన తనకు ఆ బాధేంటో తెలుసన్నారు. ఇపుడు దేశంలో చాలా మందిని మానసిక ఒత్తిడి పట్టి పీడిస్తోందని పేర్కొంది. అయితే ఈ సమస్యను గుర్తించడం చాలా కష్టమని చెప్పింది. మనిషిని మానసికంగా కృంగదీసే ఆ వ్యాధికి సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోవాలని, ఇందుకు నిపుణుల సలహాలు చాలా అవసరమని తెలిపింది. ఈ ఆలోచనతో రూపుదిద్దుకున్నదే తమ సంస్థ అని తెలిపింది. డిప్రెషన్‌తో బాధపడుతున్న వారికి తగిన సలహాలు, సూచనలు అందించే లక్ష్యంతో తమ సంస్థ కార్యకలాపాలు ఉంటాయని ఈ క్రమంలో మరికొన్ని సంస్థలు, మేధావులతో కలిసి పనిచేయనున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేవారికి సహాయం చేయడానికి వీలుగా ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించడానికి అపుడు నిర్ణయించుకున్నట్టు తెలిపింది. మానసిక రుగ్మతలు, మానసిక ఆరోగ్యం, డిప్రెషన్ తదితర విషయాలపై తమ సంస్థ పనిచేస్తుందని తెలిపింది. ఇటీవల తాను డిప్రెషన్‌కు గురైన విషయాలను తొలిసారిగా మీడియాతో పంచుకున్న సంగతి తెలిసిందే. తన కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారంతో అదృష్టవశాత్తూ డిప్రెషన్ నుంచి బయట పడ్డానని వ్యాఖ్యానించింది. The Live Love Laugh Foundation...coming soon! pic.twitter.com/a3tq9cplCE — Deepika Padukone (@deepikapadukone) August 6, 2015 -
పార్టీలు ప్రజాసంస్థలు కాదు
కేంద్రం వాదనకు పార్లమెంటరీ కమిటీ సమర్థన న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ప్రజాసంస్థలు కావని, సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకి రావని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలను పార్లమెంటరీ కమిటీ సమర్థించింది. ఆర్టీఐ చట్టం పరిధి నుంచి రాజకీయ పార్టీలను తప్పించడానికి, అలాగే పారదర్శకత నిబంధనల కిందకు వస్తాయన్న కేంద్ర సమాచార కమిషనర్ (సీఐసీ) ఆదేశాలను తిరస్కరించడానికి ఉద్దేశించిన సవరణ బిల్లుకు మద్దతు తెలిపింది. ఈ మేరకు కమిటీ నివేదికను న్యాయం, సిబ్బంది విభాగ స్థాయీసంఘం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ‘‘పార్లమెంటు చేసిన ఏదైనా చట్టం ద్వారా కానీ లేదా రాజ్యాంగం చేత లేదా రాజ్యాంగం నిబంధనల కింద కానీ ఏర్పాటుకాని రాజకీయ పార్టీలు ప్రజాసంస్థల కిందకు రావన్న ప్రభుత్వ వాదనతో కమిటీ ఏకీభవిస్తుంద’’ని కమిటీ చైర్మన్ శాంతారామ్ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 కింద రిజిస్ట్రేషన్ లేదా గుర్తింపు పొందినవని మాత్రమేనని వెల్లడించారు. అలాగే ఆదాయపన్ను చట్టం-1961 కింద రాజకీయ పార్టీలు, వాటి అభ్యర్థుల ఆర్థిక వ్యవహారాలు పారదర్శకంగా ఉండాలన్న నిబంధనపై ఆయన స్పందిస్తూ, ‘‘రాజకీయ పార్టీలను ఆర్టీఐ చట్టం కింద ప్రజాసంస్థలుగా ప్రకటిస్తే వాటి సున్నితమైన అంతర్గత పనివిధానానికి ఆటంకం కలుగుతుంది. రాజకీయ పార్టీల విధులకు భంగం కలిగించేందుకు వాటి ప్రత్యర్థులు దుర్బుద్ధితో ఆర్టీఐ చట్టంలోని నిబంధనలను దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ ఈ ఆరు రాజకీయ పార్టీలను ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన సీఐసీ... అవి ప్రజా సమాచార అధికారులను ఆరు వారాల్లోగా నియమించుకోవాలని ఈ ఏడాది జూన్ 3న ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏదైనా సంఘం లేదా వ్యక్తుల సంస్థ ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 కింద నమోదైనా లేదా గుర్తింపు పొందినా దాన్ని ప్రజాసంస్థగా పరిగణించకూడదంటూ ఆర్టీఐ చట్టంలో సెక్షన్ 2(హెచ్)లో వివరణను చేర్చుతూ ప్రభుత్వం సవరణ బిల్లును ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై నియమితులైన ఎంపీల కమిటీ... కేంద్ర ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ నివేదిక ఇచ్చింది.