జపాన్ సంస్థ ‘నిహాన్ హిడాన్‌క్యో’కు
ప్రతిష్టాత్మక గుర్తింపు
ఒస్లో: అణ్వాయుధాలకు తావులేని శాంతియుత ప్రపంచమే లక్ష్యంగా అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తున్న జపాన్ సంస్థ ‘నిహాన్ హిడాన్‌క్యో’కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది. నార్వే నోబెల్ కమిటీ చైర్మన్ వాట్నే ఫ్రైడ్నెస్ శుక్రవారం ఈ విషయం ప్రకటించారు. అణ్వాయుధాల ప్రయోగాన్ని నిషేధించాలన్న నినాదం ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని చెప్పారు.
మానవాళి సంక్షేమం కోసం అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం గళం విప్పాలని సూచించారు. 1945లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా చేపట్టిన అణుబాంబు దాడిలో ప్రాణాలతో బయటపడిన పౌరులు ‘నిహాన్ హిడాన్‌క్యో’ను స్థాపించారు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
అమెరికా దాడిలో క్షతగాత్రులు మారిపోయి, బాధాకరమైన జ్ఞాపకాలతో జీవిస్తున్నప్పటికీ శాంతి కోసం కృషి చేస్తున్నారని నిహాన్ హిడాన్‌క్యో సభ్యులను వాట్నే ఫ్రైడ్నెస్ ప్రశంసించారు. తమ సంస్థకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడం పట్ల నిహాన్ హిడాన్‌క్యో హిరోíÙమా శాఖ చైర్‌పర్సన్ తొమొయుకి మిమాకీ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ‘‘ఇది నిజమేనా? నమ్మలేకపోతున్నాం’ అని వ్యాఖ్యానించారు.
ఏమిటీ నిహాన్ హిడాన్‌క్యో?
రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సైన్యం 1945 ఆగస్టు 9న జపాన్‌లోని నాగసాకి పట్టణంపై అణుబాంబు ప్రయోగించింది. ఈ దాడిలో ఏకంగా 70 వేల మంది మరణించారు. మూడు రోజుల తర్వాత హిరోషిమా పట్టణంపై మరో బాంబును అమెరికా ప్రయోగించింది. ఈ ఘటనలో 1.40 లక్షల మంది ప్రజలు బలయ్యారు. దాంతో 1945 ఆగస్టు 15న పశి్చమ దేశాల సైన్యం ఎదుట జపాన్ లొంగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. నాగసాకి, హిరోíÙమాపై జరిగిన అణుబాంబు దాడుల్లో వేలాది మంది క్షతగాత్రులయ్యారు.
అవయవాలు కోల్పోయి దివ్యాంగులుగా మారారు. బాధితులంతా(హిబకుషా) తమకు ఎదురైన అనుభవాలతో అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, తమ భవిష్యత్తు తరాలను కూడా ఆదుకోవాలని, అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ 1956లో నిహాన్ హిడాన్‌క్యో సంస్థను స్థాపించారు. పసిఫిక్ ప్రాంతంలో అణ్వాయుధ ప్రయోగాలతో బాధితులుగా మారినవారు సైతం ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ ఉద్యమం క్రమంగా ప్రపంచమంతటా వ్యాప్తిచెందింది.
BREAKING NEWS
The Norwegian Nobel Committee has decided to award the 2024 #NobelPeacePrize to the Japanese organisation Nihon Hidankyo. This grassroots movement of atomic bomb survivors from Hiroshima and Nagasaki, also known as Hibakusha, is receiving the peace prize for its… pic.twitter.com/YVXwnwVBQO— The Nobel Prize (@NobelPrize) October 11, 2024
Comments
Please login to add a commentAdd a comment