nobel peace prize
-
ఆస్పత్రిలో చేరిన నోబెల్ గ్రహీత నర్గీస్ మొహమ్మదీ
దుబాయ్: జైలు శిక్ష అనుభవిస్తున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మహమ్మదీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు ఇరాన్ అధికారులు అనుమతించారు. మొహమ్మదీ తొమ్మిది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక సంస్థ ఈ సమాచారాన్ని మీడియాకు అందించింది. మొహమ్మదీకి చికిత్స కోసం మెడికల్ లీవ్ మంజూరు చేయాలని ఫ్రీ నార్వే కూటమి ఒక ప్రకటనలో కోరింది. ఇరాన్‌లోని ఎవిన్ జైలులో మొహమ్మదీ ఇప్పటికే 30 నెలలుగా శిక్ష అనుభవిస్తున్నారు. గత జనవరిలో ఆమె శిక్ష కాలాన్ని మరో 15 నెలలు పొడిగించారు. ఆగస్టు 6న ఎవిన్ జైలులోని మహిళా వార్డులో మరో రాజకీయ ఖైదీకి ఉరిశిక్ష విధించడాన్ని నిరసించినందుకు ఇరాన్ అధికారులు ఆమెకు అదనంగా ఆరు నెలలపాటు శిక్షను విధించారు.నర్గీస్ మొహమ్మది గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఇరాన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్గీస్ మహమ్మదీని 2021లో అరెస్టు చేశారు. మహిళలపై ఇరాన్ ప్రభుత్వం విధించిన అనేక ఆంక్షల గురించి మొహమ్మదీ గళం విప్పారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆమె ఉద్యమించారు. నర్గీస్ మొహమ్మదీకి 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈ అవార్డును అందుకున్న 19వ మహిళగా ఆమె పేరొందారు. 2003లో మానవ హక్కుల కార్యకర్త షిరిన్ ఎబాడి తర్వాత ఈ అవార్డును అందుకున్న రెండవ ఇరాన్ మహిళగా గుర్తింపు పొందారు. ఇది కూడా చదవండి: స్పెయిన్ ప్రధానితో పీఎం మోదీ మెగా రోడ్ షో -
అణ్వాయుధ వ్యతిరేక పోరాటానికి నోబెల్ శాంతి బహుమతి
ఒస్లో: అణ్వాయుధాలకు తావులేని శాంతియుత ప్రపంచమే లక్ష్యంగా అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తున్న జపాన్ సంస్థ ‘నిహాన్ హిడాన్క్యో’కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది. నార్వే నోబెల్ కమిటీ చైర్మన్ వాట్నే ఫ్రైడ్నెస్ శుక్రవారం ఈ విషయం ప్రకటించారు. అణ్వాయుధాల ప్రయోగాన్ని నిషేధించాలన్న నినాదం ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని చెప్పారు. మానవాళి సంక్షేమం కోసం అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం గళం విప్పాలని సూచించారు. 1945లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా చేపట్టిన అణుబాంబు దాడిలో ప్రాణాలతో బయటపడిన పౌరులు ‘నిహాన్ హిడాన్క్యో’ను స్థాపించారు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అమెరికా దాడిలో క్షతగాత్రులు మారిపోయి, బాధాకరమైన జ్ఞాపకాలతో జీవిస్తున్నప్పటికీ శాంతి కోసం కృషి చేస్తున్నారని నిహాన్ హిడాన్క్యో సభ్యులను వాట్నే ఫ్రైడ్నెస్ ప్రశంసించారు. తమ సంస్థకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడం పట్ల నిహాన్ హిడాన్క్యో హిరోíÙమా శాఖ చైర్పర్సన్ తొమొయుకి మిమాకీ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ‘‘ఇది నిజమేనా? నమ్మలేకపోతున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఏమిటీ నిహాన్ హిడాన్క్యో? రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సైన్యం 1945 ఆగస్టు 9న జపాన్‌లోని నాగసాకి పట్టణంపై అణుబాంబు ప్రయోగించింది. ఈ దాడిలో ఏకంగా 70 వేల మంది మరణించారు. మూడు రోజుల తర్వాత హిరోషిమా పట్టణంపై మరో బాంబును అమెరికా ప్రయోగించింది. ఈ ఘటనలో 1.40 లక్షల మంది ప్రజలు బలయ్యారు. దాంతో 1945 ఆగస్టు 15న పశి్చమ దేశాల సైన్యం ఎదుట జపాన్ లొంగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. నాగసాకి, హిరోíÙమాపై జరిగిన అణుబాంబు దాడుల్లో వేలాది మంది క్షతగాత్రులయ్యారు. అవయవాలు కోల్పోయి దివ్యాంగులుగా మారారు. బాధితులంతా(హిబకుషా) తమకు ఎదురైన అనుభవాలతో అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, తమ భవిష్యత్తు తరాలను కూడా ఆదుకోవాలని, అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ 1956లో నిహాన్ హిడాన్క్యో సంస్థను స్థాపించారు. పసిఫిక్ ప్రాంతంలో అణ్వాయుధ ప్రయోగాలతో బాధితులుగా మారినవారు సైతం ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ ఉద్యమం క్రమంగా ప్రపంచమంతటా వ్యాప్తిచెందింది. BREAKING NEWSThe Norwegian Nobel Committee has decided to award the 2024 #NobelPeacePrize to the Japanese organisation Nihon Hidankyo. This grassroots movement of atomic bomb survivors from Hiroshima and Nagasaki, also known as Hibakusha, is receiving the peace prize for its… pic.twitter.com/YVXwnwVBQO— The Nobel Prize (@NobelPrize) October 11, 2024 -
తల్లి తరఫున నోబెల్ శాంతి బహుమతి స్వీకరణ
హెల్సింకీ: ఇరాన్ మానవ హక్కుల మహిళా కార్యకర్త నర్గీస్ మొహమ్మదీకి నోబెల్ కమిటీ ప్రకటించిన శాంతి బహుమతిని ఆమె తరఫున ఆమె కుమారుడు, కుమార్తె అందుకున్నారు. ఇరాన్లో మహిళల అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాడుతున్న 51 ఏళ్ల నర్గీస్‌ను ఇరాన్ ప్రభుత్వం అక్రమ కేసులు మోపి టెహ్రాన్ జైలులో పడేసిన విషయం విదితమే. శనివారం నార్వేలోని ఓస్లోలో నర్గీస్ కవల పిల్లలు అలీ, కియానా రహా్మనీ పురస్కారాన్ని స్వీకరించారు. ‘‘ఇరాన్ సమాజానికి అంతర్జాతీయ మద్దతు అవసరం. ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన మానవహక్కుల కార్యకర్తలు, నిరసనకారులు, పాత్రికేయుల గొంతుకను సభావేదికగా గట్టిగా వినిపించండి’’ అంటూ నర్గీస్ ఇచి్చన సందేశాన్ని వేదికపై వారు చదివారు. -
మలాలా యూసఫ్‌జాయ్ రూ.2.5 కోట్ల విరాళం
లండన్: గాజా ఆసుపత్రిలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఏకంగా 500 మందికిపైగా జనం మృతిచెందడం పట్ల ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తుతోంది. ఈ మారణకాండను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో చిన్నారులు బలి కావడం పట్ల పాకిస్తాన్ సాహస బాలిక, నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్‌జాయ్ చలించిపోయారు. ఈ మేరకు బుధవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. గాజాలోని అల్–అహ్లీ ఆసుపత్రిలో బాంబు పేలుడు ఘటనను మీడియాలో చూసి భయాందోళనకు గురయ్యానని చెప్పారు. ఈ ఘాతుకాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. వెంటనే కాల్పుల విరమణ పాటించాలని, గాజాకు నిత్యావసరాలు, ఆహారం, నీరు సరఫరా చేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని మలాలా కోరారు. ఈ విపత్కర సమయంలో గాజాలో పాలస్తీనియన్ల సంక్షేమం కోసం కృషి మూడు స్వచ్ఛంద సంస్థలకు 3 లక్షల డాలర్ల (రూ.2.5 కోట్లు) విరాళం ఇవ్వబోతున్నానని మలాలా ప్రకటించారు. ఇజ్రాయెల్, పాలస్తీనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం పోరాడుతున్నవారితో తాను కూడా గొంతు కలుపుతున్నానని వ్యాఖ్యానించారు. గాజా జనాభాలో సగం మంది 18 ఏళ్లలోపు వారేనని అన్నారు. -
ఇరాన్ హక్కుల యోధురాలికి నోబెల్ శాంతి
స్టాక్‌హోమ్: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గిస్ మొహమ్మదికి లభించింది. ఇరాన్లో మహిళల అణచివేత, మానవ హక్కులపై అవగాహన, అందరికీ స్వేచ్ఛ, మరణ శిక్ష రద్దు కోసం అలుపెరగకుండా ఆమె చేస్తున్న పోరాటానికి అత్యున్నత పురస్కారం దక్కింది. మహిళల కోసం జీవితాన్ని ధారపోసినందుకు నర్గిస్ను శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టుగా నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె టెహ్రాన్‌లోని ఎవిన్ జైల్లో ఉన్నారు. ‘‘నర్గిస్ చేసిన పోరాటం అత్యంత సాహసోపేతమైనది. మహిళా హక్కుల కోసం ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టారు. ఇరాన్లో ఏడాదిగా సాగుతున్న మహిళా హక్కుల పోరాటానికి నోబెల్ శాంతి తొలి గుర్తింపు. జైలు నుంచే ఈ ఉద్యమానికి ఊపిరిలా మారిన వివాదరహితురాలైన నర్గిస్ మొహమ్మదికి నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తున్నాం’’అని కమిటీ చైర్ పర్సన్ బెరిట్ రెసి అండర్సన్ వెల్లడించారు. నోబెల్ శాంతి పురస్కారం కింద ఆమెకు 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్లు (దాదాపుగా 10 లక్షల డాలర్లు) నగదు బహుమానం, 18 కేరట్ గోల్డ్ మెడల్, డిప్లొమా లభిస్తుంది,. డిసెంబర్లో జరిగే అవార్డు ప్రదానోత్సవం సమయానికి నర్గిస్ జైలు నుంచి విడుదల కావాలని, స్వయంగా పురస్కారాన్ని అందుకోవాలని నోబెల్ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇరాన్లో మహిళా హక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ గుర్తింపు రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని నర్గిస్ జైలు నుంచే న్యూయార్క్ టైమ్స్‌కి ఒక ప్రకటన పంపారు. ‘‘నోబెల్ శాంతి పుర స్కారం నాలో మరింత స్ఫూర్తిని నింపింది. మహిళల సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశ పెరిగింది. ఇరాన్లో మార్పు కోసం పోరాడుతున్న వారి లో మరింత బలం పెరుగుతుంది. ఇక విజయం సమీపంలో ఉంది’’అని ఆ ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. 13 సార్లు అరెస్ట్..31 ఏళ్ల జైలు శిక్ష హక్కుల పోరాటంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా నర్గిస్ వెనుకంజ వేయలేదు. ఇరాన్ ప్రభుత్వం ఆమెను ఇప్పటికి 13 సార్లు అరెస్ట్ చేసింది. అయిదు సార్లు దోషిగా నిర్ధారించింది. 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 154 సార్లు కొరడా దెబ్బల శిక్ష విధించింది. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. 1998లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించి తొలిసారి అరెస్టయి ఏడాది జైల్లో ఉన్నారు. హ్యూమన్ రైట్స్ సంస్థలో చేరి మళ్లీ అరెస్టయ్యారు. 2011లో జాతి విద్రోహ కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ మరోసారి అరెస్ట్ చేశారు. ఇరాన్లో మరణశిక్షలకు వ్యతిరేకంగా గళమెత్తినందుకు 2015లో జైలుకు పంపారు. ఇలా తన జీవితంలో సగభాగం ఆమె జైల్లోనే గడుపుతున్నారు. అన్నీ కోల్పోయినా.... సంప్రదాయం పేరుతో మహిళలపై ఆంక్షలు విధిస్తూ హిజాబ్ కాస్త పక్కకి జరిగినా జైలు పాల్జేయడమో, కొట్టి చంపేయడమో చేసే దేశంలో పుట్టి మహిళా హక్కుల కోసం జీవితాన్ని ధారపోస్తున్న నర్గిస్ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన సమయంలో నాలుగ్గోడల మధ్య బందీగా ఉన్నారు. వ్యక్తి గత జీవితాన్ని, ఆరోగ్యాన్ని, స్వేచ్ఛని పణంగా పెట్టి 51 ఏళ్ల వయసున్న నర్గిస్ ఇంకా మార్పు కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ‘‘ప్రభుత్వం నన్ను ఎంత అణగదొక్కాలని చూస్తే, ఎంతగా శిక్షిస్తే నాలో పోరాట స్ఫూర్తి అంతకంతకూ పెరుగుతుంది. దేశంలో మహిళలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే వరకు ఈ పోరాటం ఆగదు’’అని నర్గిస్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇరాన్‌లోని జంజన్ పట్టణంలో 1972, ఏప్రిల్ 21న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఒక రైతు. తల్లి ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. 1979లో ఇరాన్ విప్లవం సమయంలో రాచరికం రద్దయిందో అప్పుడే నర్గిస్ తల్లి సోదరుడు, మరో ఇద్దరు కుటుంబసభ్యులు జైలు పాలయ్యారు. వారిని ప్రతీ వారం కలుసుకోవడానికి తల్లితో పాటు జైలుకు వెళ్లే చిన్నారి నర్గిస్‌కు తమ బతుకులు ఎందుకంత అణచివేతకు గురవుతున్నాయో అర్థం కాక తీవ్ర సంఘర్షణకు లోనయ్యేది. అది చూసి ఆమె తల్లి తనకున్న అనుభవంతో రాజకీయాలు, వ్యవస్థల జోలికి వెళ్లొద్దని హితవు చెప్పింది. అయినప్పటికీ నర్గిస్లో చిన్నప్పట్నుంచి ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి ఆమెను హక్కుల పోరాటంలో ముందుకు నడిపించాయి. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన తర్వాత ఆమె కొన్నాళ్లు వార్తాపత్రికలకు కాలమిస్ట్‌గా చేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఎబది స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్లో 2003లో చేరిన ఆమె ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. కాలేజీలో సహచర విద్యారి్థగా పరిచయమైన ప్రఖ్యాత సామాజిక కార్యకర్త తాఘి రెహమనీను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం రెహమనీ తన పిల్లలతో కలిసి పారిస్‌కు ప్రవాసం వెళ్లిపోయారు. తన భర్త, పిల్లలతో మాట్లాడి, ప్రేమతో వారిని అక్కున చేర్చుకొని ఆమెకు ఏళ్లు గడిచిపోయాయి. జైలు నుంచే పోరాటం జైలు నుంచి ఆమె ఎందరిలోనో ఉద్యమ స్ఫూర్తి రగిలిస్తున్నారు. రాజకీయ ఖైదీలు, మహిళా ఖైదీలపై జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా జైల్లోనే ఆమె ఉద్యమం ప్రారంభించారు. జైల్లో కూడా ఆమెకు మద్దతుదారులు పెరగడంతో అధికారులు ఆమెపై పలు ఆంక్షలు విధించారు. అయినా ఆమె బెదరలేదు. జైలు నుంచే పలు వ్యాసాలు న్యూయార్క్ టైమ్స్, బీబీసీ వంటి వాటికి పంపించారు. 2022 సెపె్టంబర్లో హిజాబ్ ధరించనందుకు మాసా అమిని అనే యువతిని ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేయగా కస్టడీలో తీవ్ర గాయాలపాలై ఆమె మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్లో భారీగా యువతీ యువకులు ఆందోళనలు చేపట్టి రోడ్లపైకి వచి్చనప్పుడు జైలు నుంచే ఆమె తన గళాన్ని వినిపించారు. పోరాడే వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తోటి మహిళా ఖైదీల అనుభవాలతో వైట్ టార్చర్ అనే పుస్తకాన్ని రాశారు. ప్రపంచంలో అత్యధికంగా ఉరిశిక్షలు విధించే ఇరాన్లో అత్యంత క్రూరమైన ఆ శిక్షను రద్దు చేసే వరకు తన పోరాటం ఆగదని నర్గిస్ ఎలుగెత్తి చాటుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నర్గేస్ మొహమ్మదికి నోబెల్ శాంతి అవార్డు.. ఆమె ఏ దేశమంటే?
స్టాక్‌హోమ్: ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. 2023 సంవత్సరానికి గానూ నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్‌కు చెందిన మహిళా సామాజిక కార్యకర్త నర్గేస్ మొహమ్మదిని వరించింది. వివరాల ప్రకారం.. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్‌కు చెందిన మహిళ నర్గేస్ మొహమ్మది గెలుచుకున్నారు. కాగా, నర్గేస్ మొహమ్మది.. ఇరాన్లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మహిళల హక్కులు, స్వేచ్చపై పోరాటం చేసినందుకు గాను ఆమెకు శాంతి బహుమతి లభించింది. BREAKING NEWS The Norwegian Nobel Committee has decided to award the 2023 #NobelPeacePrize to Narges Mohammadi for her fight against the oppression of women in Iran and her fight to promote human rights and freedom for all.#NobelPrize pic.twitter.com/2fyzoYkHyf — The Nobel Prize (@NobelPrize) October 6, 2023 ఇక, ఇరాన్ మహిళల కోసం నర్గేస్ మొహమ్మది వీరోచిత పోరాటం చేశారు. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వం ఆమెను 13 సార్లు అరెస్టు చేసింది. ఐదుసార్లు ఆమెను దోషిగా నిర్ధారించింది. అంతేకాకుండా ఆమెకు మొత్తం 31 సంవత్సరాల జైలు శిక్ష మరియు 154 కొరడా దెబ్బలు విధించింది. మహ్మదీ ఇంకా జైలులోనే ఉన్నారు. 2023 #NobelPeacePrize laureate Narges Mohammadi’s brave struggle has come with tremendous personal costs. The Iranian regime has arrested her 13 times, convicted her five times, and sentenced her to a total of 31 years in prison and 154 lashes. Mohammadi is still in prison. pic.twitter.com/ooDEZAVX01 — The Nobel Prize (@NobelPrize) October 6, 2023 ఇది కూడా చదవండి: జాన్ ఫోసేకు సాహిత్య నోబెల్ -
మానవ హక్కుల పోరాటాలకు నోబెల్ శాంతి బహుమతి
ఓస్లో: మానవ హక్కుల పరిరక్షణ కోసం కొనసాగుతున్న ఉద్యమాలకు నోబెల్ కమిటీ అత్యున్నత గౌరవాన్ని కల్పించింది. బెలారస్ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్ బియాల్‌యాస్కీ(60), రష్యా మానవ హక్కుల సంస్థ ‘మెమోరియల్’, ఉక్రెయిన్ సంస్థ ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’కు సంయుక్తంగా 2022 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రెండు దేశాల్లోని సంస్థలు ప్రపంచ ప్రతిష్టాత్మక బహుమానానికి ఎంపిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్‌పై దండెత్తుతున్న రష్యా అధినేత పుతిన్ ఏకపక్ష వైఖరిపై ఇదొక నిరసన అని నిపుణులు అంచనా వేస్తున్నారు. బెలారస్, రష్యా, ఉక్రెయిన్‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, శాంతియుత సహజీవనం వంటి అంశాల్లో గొప్ప చాంపియన్లు అయిన ముగ్గురిని (ఒక వ్యక్తి, రెండు సంస్థలు) శాంతి బహుమతితో గౌరవిస్తుండడం ఆనందంగా ఉందని నార్వే నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్ రీస్–ఆండర్సన్ చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడారు. వారంతా సైనిక చర్యలను వ్యతిరేకిస్తూ మానవీయ విలువలు, న్యాయ సూత్రాల రక్షణ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశాల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం వర్థిల్లాలని ఆల్ఫెడ్ నోబెల్ ఆకాంక్షించారని గుర్తుచేశారు. బియాల్‌యాస్కీని విడుదల చేయండి జైలులో ఉన్న అలెస్ బియాల్‌యాస్కీని విడుదల చేయాలని బెలారస్ పాలకులకు బెరిట్ రీస్–ఆండర్సన్ విజ్ఞప్తి చేశారు. బహుమతి బియాల్యాస్కీలో నైతిక స్థైర్యాన్ని పెంచుతుందని, ఆయనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించబోదని భావిస్తున్నట్లు తెలిపారు. రష్యా మానవ హక్కుల సంస్థకు శాంతి బహుమతి ప్రకటించడం ద్వారా.. శుక్రవారం 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న పుతిన్‌కు ఉద్దేశపూర్వకంగా ఏదైనా సంకేతం పంపదలిచారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ప్రజలకు మంచి చేసేవారికి బహుమతి ఇస్తుంటామని, అంతేతప్ప తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, వ్యక్తుల పుట్టినరోజులతో తమకు సంబంధం లేదని బెరిట్ రీస్–ఆండర్సన్ బదులిచ్చారు. ఈ ప్రైజ్ పొందడం ద్వారా ఆయా సంస్థల వెనుక ఉన్న వ్యక్తులు వారు నమ్మినదాని కోసం మరింత ఉత్సాహంతో కృషి సాగిస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు. గత ఏడాది(2021) నోబెల్ శాంతి బహుమతిని సంయుక్తంగా అందుకున్న రష్యా జర్నలిస్టు దిమిత్రీ మురతోవ్, ఫిలిప్పైన్స్ జర్నలిస్టు మారియా రెస్సా అక్కడి ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము పనిచేస్తున్న మీడియా సంస్థల్లో ఉద్యోగాలను కాపాడుకోవడానికి పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం సాగించిన పోరాటానికి వీరిద్దరికి నోబెల్ లభించింది. యుద్ధంపై ఎక్కుపెట్టిన ఆయుధం ఉక్రెయిన్‌లోని కొందరు శాంతి కాముకులు 2007లో ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ను ఏర్పాటు చేశారు. అప్పట్లో దేశంలో అశాంతి రగులుతున్న తరుణంలో మానవ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య ఉద్యమాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు. ఉక్రెయిన్ పౌర సమాజాన్ని బలోపేతం తదితరాలు సంస్థ ముఖ్య లక్ష్యాలు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఈ సంస్థ మరింత క్రియాశీలకంగా పనిచేస్తోంది. సాధారణ ప్రజలపై రష్యా యుద్ధ నేరాలను రికార్డు చేసి, ప్రపంచానికి తెలియజేస్తోంది. ఈ యుద్ధ నేరాలకు రష్యాను జవాబుదారీగా మార్చేందుకు కృషి చేస్తోంది. యుద్ధానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన అసలైన ఆయుధం మానవ హక్కుల పోరాటమేనని ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ చెబుతోంది. అంకితభావం గల ఉద్యమకారుడు అలెస్ బియాల్‌యాస్కీ నేటి రష్యాలోని వైర్టిసిల్లాలో 1962 సెప్టెంబర్ 25వ తేదీన జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం బెలారస్‌కు వలస వెళ్లింది. విద్యాభ్యాసం అనంతరం బియాల్‌యాస్కీ కొంతకాలంపాటు పాఠశాల ఉపాధ్యాయుడిగా, తర్వాత సైన్యంలో డ్రైవర్‌గా పనిచేశారు. 1980వ దశకం నుంచి బెలారస్లో ఆయన మానవ హక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 1996లో ‘వియాస్నా హ్యూమన్ రైట్స్ సెంటర్’ అనే ప్రభుత్వేతర సంస్థను స్థాపించారు. అంకితభావం కలిగిన మానవ హక్కుల, పౌరస్వేచ్ఛ, ప్రజాస్వామ్య ఉద్యమకారుడిగా ప్రజల్లో గుర్తింపు పొందారు. ఎన్నో పోరాటాలను ముందుండి నడిపించారు. హవెల్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ అవార్డును 2013లో, నోబెల్‌కు ప్రత్యామ్నాయంగా భావించే రైట్ లైవ్లీçహుడ్ అవార్డును 2020లో గెలుచుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు సారథ్యం వహిస్తున్న బియాల్‌యాస్కీని పన్నులు ఎగవేశారన్న కారణంతో బెలారస్ పాలకులు 2021 జూలై 14న నిర్బంధించారు. ఆయన ప్రస్తుతం ఎలాంటి విచారణ లేకుండా జైలులో మగ్గుతున్నారు. ఆయనను విడుదల చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నా పాలకులు లెక్కచేయడం లేదు. ఎన్నో అవరోధాలు, బెదిరింపులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నమ్మిన సిద్ధాంతానికి బియాల్‌యాస్కీ కట్టుబడి ఉండడం విశేషం. సైనిక చర్యలకు వ్యతిరేకంగా పోరాటం ‘మెమోరియల్’ సంస్థ 1989 జనవరి 28న అప్పటి సోవియట్ యూనియన్ చివరిదశలో ఉన్న సమయంలో ఏర్పాటైంది. ప్రధానంగా ఇది న్యాయ సేవా సంస్థ. కమ్యూనిస్టు పాలకుల అణచివేత చర్యల వల్ల ఇబ్బందులు పడుతున్నవారికి అండగా నిలిచింది. రష్యాలో మానవ హక్కుల విధ్వంసంపై, రాజకీయ ఖైదీల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది. సైనిక చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ‘మెమోరియల్’ ప్రధాన కార్యాలయం రష్యా రాజధాని మాస్కోలో ఉంది. సంస్థ బోర్డు చైర్మన్‌గా యాన్ రచిన్‌స్కీ వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో ఈ సంస్థను ఈ ఏడాది ఏప్రిల్ 5న రష్యా ప్రభుత్వం మూసివేసింది. అయినప్పటికీ ‘మెమోరియల్’ కార్యకలాపాలు అనధికారికంగా కొనసాగుతూనే ఉండటం విశేషం. -
రష్యా, ఉక్రెయిన్ ‘హక్కుల’ గ్రూప్‌లకు నోబెల్ శాంతి బహుమతి
స్టాక్‌హోం : మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉక్రెయిన్, రష్యాలకు చెందిన రెండు మానవ హక్కుల గ్రూప్‌లతో పాటు బెలారస్ మానవ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాత్స్కీలకు సంయుక్తంగా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. రష్యన్ మానవ హక్కుల సంస్థ మెమోరియల్, ఉక్రేనియన్ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ లిబర్టీస్, బెలారస్ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాత్స్కీల పేర్లను నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. మానవ హక్కుల కోసం వారి విశేష కృషికి గానూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్లు కమిటీ పేర్కొంది. నోబెల్ శాంతి పురస్కారం లభించిన వారు తమ స్వదేశాల్లో ప్రజల కోసం పోరాటం చేసినట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. అధికార దుర్వినియోగాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ.. పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించినట్లు తెలిపింది. ‘యుద్ధ నేరాలను డాక్యుమెంట్ చేయడంలో వాళ్లు అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగాన్ని వాళ్లు వేలెత్తి చూపారు. శాంతి, ప్రజాస్వామ్యం కోసం ఎంతో కృషి చేశారు.’ అని పేర్కొంది కమిటీ. ఇప్పటికే ఈ ఏడాదికి గాను వైద్య, భౌతిక, రసాయన శాస్త్రం, సాహిత్య రంగంలో నోబెల్ పురస్కార విజేతల పేర్లను ప్రకటించింది కమిటీ. ఇదీ చదవండి: ఫ్రెంచ్ కవయిత్రికి సాహిత్యంలో నోబెల్ -
నోబెల్ శాంతి బహుమతి రేసులో భారతీయులు!?
న్యూయార్క్: నోబెల్ బహుమతుల ప్రకటనల నడుమ.. ఆసక్తికరమైన అంశం తెర మీదకు వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో శాంతి బహుమతి ఎవరికి వెళ్లబోతోందా? అనే చర్చ గత కొంతకాలంగా నడుస్తోంది. ఈ క్రమంలో.. నోబెల్ శాంతి బహుమతి పరిశీలనలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు ప్రముఖ మ్యాగజైన్ టైమ్ ఒక కథనం ప్రచురించింది. భారత్‌కు చెందిన ఫ్యాక్ట్ చెకర్స్ మొహమ్మద్ జుబేర్, ప్రతీక్ సిన్హాలు నోబెల్ శాంతి బహుమతి కమిటీ పరిశీలనలో ఫేవరెట్‌గా ఉన్నట్లు టైమ్ మ్యాగజీన్ కథనం ప్రచురించడం గమనార్హం. ఆల్ట్ న్యూస్ సైట్ తరపున ఫ్యాక్ట్ చెకర్స్గా ఈ ఇద్దరూ పని చేస్తున్నారు. ప్రజాభిప్రాయం ప్రకారం.. నార్వేజియన్ చట్టసభ సభ్యులు, బుక్మేకర్ల నుండి వచ్చిన అంచనాలు, పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓస్లో (PRIO) ద్వారా ఆధారంగా రేసులో సిన్హా, జుబేర్ ప్రముఖంగా నిలిచినట్లు తెలుస్తోంది. అంతేకాదు శాంతి బహుమతి కమిటీ ఫేవరెట్‌గానూ ఈ ఇద్దరూ ఉన్నట్లు టైమ్ కథనంలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. జూన్ నెలలో 2018కి సంబంధించిన ట్వీట్ విషయంలో అరెస్టైన జుబేర్.. నోబెల్ శాంతి బహుమతి పరిశీలనలో ఉండడం గమనార్హం. నెల తర్వాత అతను జైలు నుంచి సుప్రీం కోర్టు బెయిల్ ద్వారా విడుదల అయ్యాడు. ఇక.. జుబేర్ అరెస్ట్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది కూడా. ‘‘భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ అధ్వాన్నంగా ఉంది, జర్నలిస్ట్‌లకు ఇక్కడి ప్రభుత్వం ప్రతికూల, అసురక్షిత వాతావరణాన్ని సృష్టించింది’’ అంటూ అమెరికాలోని జర్నలిస్ట్ హక్కుల పరిరక్షణ కమిటీ ప్రకటించడం గమనార్హం. నోబెల్ శాంతి బహుమతి 2022 కోసం.. 341 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 251 మంది, 92 సంస్థలు ఉన్నాయి. సాధారణంగా నోబెల్ కమిటీ నామినీల పేర్లను మీడియాకుగానీ, అభ్యర్థులకుగానీ అసలు తెలియజేయదు. అయితే.. కొన్ని మీడియా హౌజ్‌లు మాత్రం సర్వేల ద్వారా అభ్యర్థులను, అర్హత ఉన్నవాళ్లను పేర్లు.. వివరాలతో సహా అంచనా వేస్తుంటాయి. ఇక ఈ ఇద్దరు ఫ్యాక్ట్ చెకర్స్‌తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, ఐరాస శరణార్థ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, పుతిన్ విమర్శకుడు అలెక్సీ నవెల్నీ, బెలారస్ ప్రతిపక్ష నేత స్వియాత్లానా, ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ డేవిడ్ అటన్‌బోరఫ్ తదితరులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి విజేతను అక్టోబర్ 7వ తేదీన ప్రకటిస్తారు. ఇదీ చదవండి: ఈసారి టార్గెట్ జపాన్? -
పుతిన్ లక్ష్యంగా.. నోబెల్ శాంతి బహుమతి!
నోబెల్ అవార్డుల సీజన్ మొదలుకాబోతోంది. నామినేషన్లను ఇప్పటికే జల్లెడ పట్టగా.. వచ్చేవారంలో ఒక్కో విభాగంలో విజేతలను ప్రకటించబోతున్నాయి కమిటీలు. అయితే ఈసారి నోబెల్ పురస్కారాలు.. చాలా ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. అందుకు కారణం ఉక్రెయిన్ యుద్ధం!. 1901 నుంచి వైద్య, భౌతిక, రసాయన, సాహిత్య, శాంతి.. 1969 నుంచి ఆర్థిక శాస్త్రంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. అయితే.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నోబెల్ ప్రకటనలు వెలువడే స్టాక్‌హోమ్(స్వీడన్), ఓస్లో(నార్వే)లకు దగ్గరగా యుద్ధవాతావరణం కనిపించింది లేదు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నడుమ అవార్డుల ప్రకటన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రత్యేకించి.. ► అక్టోబర్ 7వ తేదీన వెలువడబోయే నోబెల్ శాంతి బహుమతి ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి బహుమతిని యుద్ధ నేరాల సమాచారాన్ని సేకరించే సంస్థలకు ఇవ్వబోతున్నట్లు సంకేతాలు దక్కుతున్నాయి. ఇది రష్యాను.. ముఖ్యంగా పుతిన్‌ను దృష్టిలో పెట్టుకునే ఉండనుందని స్వీడన్ ప్రొఫెసర్ పీటర్ వాలెన్స్టీన్ అభిప్రాయపడుతున్నారు. ► రేసులో ప్రముఖంగా.. ది హేగ్‌లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు లేదంటే నెదర్లాండ్స్‌కు చెందిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజం గ్రూప్ బెల్లింగ్క్యాట్కుగానూ దక్కవచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ► సాధారణంగా జనవరి 31వ తేదీ వరకే.. శాంతి బహుమతి నామినేషన్ల డెడ్‌లైన్ ముగుస్తుంది. కానీ, ఐదుగురు సభ్యులున్న నార్వేగియన్ కమిటీ మాత్రం ఫిబ్రవరి చివరి వారంలో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా నామినేషన్లు చాలా గోప్యంగా ఉంటాయి. కానీ, ఈ ఏడాది మొత్తంగా 343 నామినేషన్లు వచ్చాయని సమాచారం అందుతోంది. పుతిన్ టార్గెట్‌గా.. నార్వేగియన్ నోబెల్ కమిటీ ఈసారి శాంతి బహుమతిని కీలకంగా భావిస్తోంది. అందుకు కారణం.. ఉక్రెయిన్ యుద్ధం, తదనంతర రష్యా వ్యతిరేక పరిణామాలు. ► ఇప్పటిదాకా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనిది యాభై ఏళ్ల కిందట మాత్రమే!. అర్హులు లేరనే కారణంతో ఆ సమయంలో అవార్డు ప్రకటించలేదు. ► ఉక్రెయిన్ దురాక్రమణ.. నరమేధం, రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షల్ని నార్వేగియన్ నోబెల్ కమిటీ పరిగణనలోకి తీసుకుందని, అందుకే ఫిబ్రవరి చివరి వారంలో (ఆక్రమణ మొదలైన తర్వాత..) ప్రత్యేకంగా భేటీ అయ్యిందనే ప్రచారం నడుస్తోంది ఇప్పుడు. ► పుతిన్‌కు మంట పుట్టేలా.. ఆయన వ్యతిరేకుల పేర్లను సైతం కమిటీ పరిశీలిస్తోంది. అందులో.. క్రెమ్లిన్ విమర్శకుడు అలెక్సీ నావల్నీ(జైల్లో ఉన్నారు). బెలారస్ ప్రతిపక్ష నేత స్వెత్లానా టిఖానోవ్స్కావా కమిటీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ► వీళ్లుగాక.. అవినీతి వ్యతిరేక గ్రూప్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, స్వీడన్‌కు చెందిన ఉద్యమకారిణి గ్రేటా తున్బర్గ్, పర్యావరణ ఉద్యమకారులు నిస్రీన్ ఎల్సాయిమ్(సుడాన్), చిబెజె ఎజెకిల్(ఘనా), బ్రిటిష్ దిగ్గజం డేవిడ్ అట్టెన్బోరఫ్ కూడా ఉండొచ్చని చెప్తున్నారు. ► అయితే ఉక్రెయిన్ యుద్ధం దరిమిలా.. ప్రపంచమంతా భద్రతా సంక్షోభంలో ఉండగా.. పర్యావరణం వైపు కమిటీ ఆలోచన ఉండకపోవచ్చనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తం అవుతోంది. ► కిందటి ఏడాది.. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సభ్యులైన దిమిత్రి మురాతోవ్(రష్యా), మరియా రెస్సా(పిలిప్పైన్స్)కు సంయుక్తంగా దక్కింది నోబెల్ శాంతి అవార్డు. మురాతోవ్ పుతిన్ వ్యతిరేక కథనాలతో విరుచుకుపడతాడనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రష్యాలో పత్రికా స్వేచ్ఛ కోసం పాటుపడినందుకే ఆయనకు అవార్డు దక్కింది. అంతేకాదు.. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆయన నోబెల్ ప్రైజ్‌ను అమ్మేసి విరాళంగా ఇవ్వడం వార్తల్లో పతాక శీర్షికన నిలిచింది కూడా. చివరగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2014 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యాడు. సిరియాపై అమెరికా క్షిపణి దాడిని నివారించడంలో కీలక పాత్ర పోషించినందుకు.. రసాయనిక ఆయుధాలను సిరియా ధ్వంసం చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నందుకు పుతిన్ నోబెల్ పీస్ ప్రైజ్‌కు నామినేటయ్యారు. -
ఉక్రెయిన్ చిన్నారుల కోసం.. నోబెల్ బహుమతిని వేలానికి పెట్టిన రష్యాన్ జర్నలిస్ట్
ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన చిన్నారుల సహాయార్థం రష్యాన్ జర్నలిస్ట్ డిమిత్రి మురాటోవ్ తనకు లభించిన నోబెల్ బహుమతిని విక్రయించారు. ఆయన 1999లో స్థాపించబడిన నోవాయా వార్తాపత్రిక సంపాదకుడు. ఈ మేరకు డిమిత్రి మురాటోవ్ తన నోబెల్ శాంతి బహుమతిని ప్రపంచ శరణార్థుల దినోత్సవం రోజున వేలం నిర్వహించారు. ఐతే ఊహించని రీతిలో మురాటోవో నోబెల్ బహుమతి మరే ఏ ఇతర నోబెల్ బహుమతులు సాధించిన విధంగా వేలంలో రికార్డు స్థాయిలో అత్యధిక ధర పలికింది. హెరిటేజ్ వేలం కంపెనీ ఈ నోబెల్ ప్రైజ్ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని నిరాశ్రయులైన పిల్లల కోసం కృషి చేస్తున్న యూనిసెఫ్ అందజేస్తామని స్పష్టం చేసింది. ఐతే మురాటోవ్ 2021లో ఫిలిఫ్పీన్స్‌కు చెందిన మరియా రెస్సాతో కలసి ఈ నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. రష్యా అధ్యక్షుడి పుతిన్ 1999 నుంచి మీడియా సంస్థలపై ఉక్కుపాదం మోపి కట్టడి చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగాడో అప్పటి నుంచి రష్యాలోని మీడియా సంస్థలపై మరింత ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో మురాటోవో గెజిటా వార్తాపత్రిక ఉక్రెయిన్‌లో యుద్ధం విషయమై రష్యా దుశ్చర్యను ఎండగడుతూ రాసింది. అంతే పుతిన్ ప్రభుత్వం వరుస హెచ్చరికలను జారీ చేసి తదనంతరం పూర్తిగా ఆ పత్రిక కార్యకలాపాలను నిలిపేసింది. అంతేకాదు మురాటోవా పై ఎరుపురంగుతో దాడి చేశారు. కానీ మాస్కో మాత్రం ఈ యుద్ధాన్ని భద్రతా దృష్ట్యా సాగిస్తున్న ప్రత్యేక సైనిక చర్యగా చెప్పుకుంటూ రష్యా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది. ఐతే పాశ్చాత్య దేశాలు దీన్ని దురాక్రమణ యుద్ధంగా గొంతెత్తి చెప్పాయి. ఈ మేరకు మురాటోవో మాట్లాడుతూ...తన సిబ్బంది మద్దతుతో ఈ వేలం నిర్వహించినట్ల తెలిపారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం ఉక్రెయిన్ శరణార్థుల జీవితాలకు ప్రయోజనకరంగా ఉండాలని ఆశిస్తున్నానని చెప్పారు. (చదవండి: ఎలన్ మస్క్‌పై కోర్టుకెక్కిన కన్నకొడుకు.. సారీ ‘కూతురు’!!) -
నోబెల్ శాంతి బహుమతికి ఉక్రెయిన్ అధ్యక్షుడు!
రష్యా డిమాండ్‌కు తలొగ్గకుండా ఉన్న సైన్యం, సాధారణ పౌరులు, బయటి దేశాల నుంచి అందుతున్న అరకోర సాయంతో పోరాడుతున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ. ఆయన ఉద్దేశం ఏదైనా, విమర్శలు ఉన్నా.. త్వరగా దేశాన్ని రష్యా గప్పిట్లోకి వెళ్లనీయకుండా చేస్తున్న తీరుపై అభినందనలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఓ అరుదైన ఘనత దక్కాలని కోరుకుంటున్నారు కొందరు. యూరోపియన్ రాజకీయవేత్తలు కొందరు వ్లాదిమిర్ జెలెన్స్కీ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నారు. ఈ మేరకు నార్వేకు చెందిన నోబెల్ శాంతి కమిటీకి విజ్ఞప్తులు పంపిస్తున్నారు. అధికారంలో ఉన్న నేతలతో పాటు మాజీలు కొందరు ఈ రిక్వెస్ట్ చేసిన వాళ్లలో ఉన్నారు. శాంతి బహుమతి కమిటీకి మేం వినమ్రంగా మా విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకోమని కోరుతున్నాం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోపాటు ఉక్రెయిన్ ప్రజలనూ శాంతి బహుమతికి మేం నామినేట్ చేస్తున్నాం. ఈ కారణం వల్లనే నామినేషన్ల స్వీకరణను తిరిగి తెరవాలని, మార్చి 31వ తేదీ వరకు స్వీకరణ తేదీని పొడిగించాలని కోరుతున్నాం అని ఆ ప్రకటనలో ఉంది. మార్చి 11వ తేదీనే ఈ ప్రకటనను రిలీజ్ చేశారు ఐరోపా దేశాల నేతలు. ఇదిలా ఉండగా.. కమిటీ నుంచి ఈ ప్రకటనపై స్పందన రాలేదు. నోబెల్ శాంతి బహుమతికి సంబంధించిన ప్రకటన.. అక్టోబర్ 3-10 తేదీల మధ్య జరగనుంది. 2022 నోబెల్ శాంతి బహుమతి కోసం 92 సంస్థలు, 251 మంది వ్యక్తిగతంగా దరఖాస్తులు చేసుకున్నారు. చదవండి: జెలెన్ స్కీ ఆవేదనలో అర్థం ఉందా? -
జాతి వివక్ష పోరాట యోధుడు అస్తమయం
జొహన్నెస్‌బర్గ్/న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం సాగించిన హక్కుల నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు(90) అస్తమించారు. ఆర్చ్‌బిషప్ డెస్మండ్ టుటు ఆదివారం వేకువజామున కేప్‌టౌన్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ప్రకటించారు. గతంలో క్షయవ్యాధికి గురైన డెస్మండ్ టుటు, ప్రొస్టేట్ కేన్సర్ బారినపడి 1997లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం పలు అనారోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. బ్రిటిషర్ల హయాంలో నల్లజాతి ప్రజల హక్కుల కోసం, అన్యాయాలకు గురైన వారి తరఫున డెస్మండ్ టుటు తీవ్రంగా పోరాడారు. నల్ల జాతీయుల పాలన మొదలైన తర్వాత కూడా అన్యాయాలను, అక్రమాలను ఖండించడంలో ఆయన వెనుకాడలేదు. అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో కొనసాగుతూనే పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ సంస్థలను కొల్లగొడుతున్న తీరుపై గళమెత్తారు. ఆర్చ్‌బిషప్ టుటు మృతిపై భారత ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆర్చి బిషప్ టుటును ‘ఆఫ్రికా పీస్ బిషప్’గా నోబెల్ ఇన్స్టిట్యూట్ అభివర్ణించింది. దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజలపై బ్రిటిషర్లు దారుణాలకు పాల్పడినప్పటికీ బిషప్ టుటు మాత్రం అహింసాయుత విధానాలకే కట్టుబడి ఉన్నారని కొనియాడింది. మండేలాతో విడదీయరాని మైత్రి మొదట జొహన్నెస్‌బర్గ్ ఆర్చ్‌బిషప్‌గా ఉన్న టుటు తర్వాత కేప్‌టౌన్ బిషప్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవులు నిర్వహిస్తూనే స్థానిక నల్లజాతి వారిపై శ్వేత జాతీయుల దురాగతాలను ఖండించడంలో వెనుకాడలేదు. జొహన్నెస్‌బర్గ్ ఆర్చ్‌బిషప్‌గా కొనసాగుతున్న సమయంలోనే 1984లో ఆయన్ను నోబెల్ శాంతి బహుమతి వరించింది. బ్రిటిషర్ల హయాంలో జాతి వివక్షకు గురైన వారికి న్యాయం చేసే లక్ష్యంతో 1995లో టుటు నేతృత్వంలో ‘ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్’ను మండేలా నియమించారు. టుటు, మండేలా మధ్య అనుబంధాన్ని వివరిస్తూ మండేలా ఫౌండేషన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘1950లలో పాఠశాలలో చదువుకునే రోజుల్లో జరిగిన వక్తృత్వ పోటీల సమయంలో మండేలా, టుటు తొలిసారి కలుసుకున్నారు. ఇద్దరూ జాతి వివక్షపై ప్రజల తరఫున పోరాటం సాగించారు. ఇది నచ్చని బ్రిటిషర్లు వారిద్దరూ కలుసుకోకుండా దాదాపు 4 దశాబ్దాలపాటు పలు అవాంతరాలు కల్పించారు. చివరికి మండేలా 27 ఏళ్లపాటు జైలు జీవితం గడిపి విడుదలయ్యాకే టుటుతో నేరుగా మాట్లాడగలిగారు. చెరసాల నుంచి విడుదలైన మండేలా మొదటగా వెళ్లి ఆ రోజు గడిపింది టుటు నివాసంలోనే’అని తెలిపింది. మండేలా 2013లో తుదిశ్వాస విడిచే వరకు టుటుతో అనునిత్యం మాట్లాడుకుంటూనే ఉన్నారంటూ వారి మధ్య ఉన్న గాఢమైత్రిని గుర్తు చేసింది. -
2021 Nobel Peace Prize: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వీరికే..
ఓస్లో: ఏటా ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు వ్యక్తులు, సంస్ధలు చేసిన కృషికి ప్రతిఫలంగా ప్రకటించే నోబెల్ శాంతి పురస్కారానికి ఈ ఏడాది(2021) మరియా రెస్సా, దిమిత్రి మరటోవ్ కు ఎంపికయ్యారు. నార్వేజియన్ నోబెల్ కమిటీ నేడు శాంతి పురస్కారం విజేతను ప్రకటించింది. ప్రజాస్వామ్యానికి మూలమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం చేసిన కృషికి గానూ వీరిని ఈ విశిష్ట పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ పరంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం వీరు ధైర్యంగా పోరాడుతున్నారని నోబెల్ కమిటీ కమిటీ ఈ సందర్భంగా ప్రశంసించింది. (చదవండి: రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి విజేతలు వీరే..!) దిమిత్రి మరటోవ్ ఒక రష్యన్ జర్నలిస్ట్, నోవాయా గజెటా వార్తాపత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్. 24 ఏళ్ల పాటు ఆ పత్రిక ఎడిటర్‌గా చేశారు. ఈ పత్రికను ప్రారంభించిప్పటి నుంచి రష్యా దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలు ప్రచురించారు. దీంతో అతని మీద అనేక దాడులు చేయడమే బెదిరింపులు కూడా వచ్చాయి. పత్రికా స్వేచ్ఛను రక్షించడంలో చూపించిన ధైర్యసాహసాలకు మురాటోవ్ కు 2007లో సీపీజె అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డును గెలుచుకున్నాడు. BREAKING NEWS: The Norwegian Nobel Committee has decided to award the 2021 Nobel Peace Prize to Maria Ressa and Dmitry Muratov for their efforts to safeguard freedom of expression, which is a precondition for democracy and lasting peace.#NobelPrize #NobelPeacePrize pic.twitter.com/KHeGG9YOTT — The Nobel Prize (@NobelPrize) October 8, 2021 మరియా రెస్సా ఫిలిప్పినో-అమెరికన్ జర్నలిస్ట్. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోసం 2012లో ఆమె ‘రాప్లర్’ పేరుతో ఓ డిజిటల్ మీడియా కంపెనీని స్థాపించారు. ఓ జర్నలిస్టుగా, రాప్లర్ సీఈవోగా రెసా.. ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. అధికార పరంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటూనే.. భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడుతూ వస్తున్నారు. ఆగ్నేయ ఆసియాలో సీఎన్ఎన్ పరిశోధనాత్మక రిపోర్టర్ గా దాదాపు రెండు దశాబ్దాలు పనిచేశారు. -
ఆకలి తీర్చే కార్యక్రమానికి శాంతి బహుమతి!
రోమ్: ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న ప్రపంచ ఆహార కార్యక్రమానికి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఉన్నచోట సాయమందించే ఈ కార్యక్రమం రోమ్ కేంద్రంగా పనిచేస్తోంది. గత ఏడాది ప్రపంచ ఆహార కార్యక్రమం దాదాపు 88 దేశాల్లోని పది కోట్ల మందికి ఆసరా కల్పించింది. ‘ఆకలి బాధలు ఎదుర్కొంటున్న కోటానుకోట్ల మంది కష్టాలపై ప్రపంచం దృష్టి పడేందుకు ఈ అవార్డు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’ అని అవార్డు కమిటీ అధ్యక్షులు బెరిట్ రీస్ ఆండర్సన్ వ్యాఖ్యానించారు. శాంతి స్థాపనకు కీలకమైన ఆహార భద్రత కల్పించేందుకు ప్రపంచ ఆహార కార్యక్రమం కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆకలన్నది మరోసారి ప్రపంచం మొత్తమ్మీద సమస్యగా మారుతోందని, కరోనా వైరస్ పరిస్థితులు దీన్ని మరింత ఎక్కువ చేసిందని కమిటీ తెలిపింది. 2019లో సుమారు 13.5 కోట్ల మంది ఆకలితో అలమటించారని, ఇటీవలి కాలంలో సమస్య ఇంత తీవ్రరూపం దాల్చడం ఇదే మొదటిసారని వివరించింది. యెమెన్, కాంగో, నైజీరియా, సౌత్ సూడాన్ వంటి దేశాల్లో కోట్లాది మందికి ఆహారం అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. హర్షాతిరేకాలు... నోబెల్ కమిటీ శాంతి బహుమతిని ప్రకటించిన వెంటనే నైజర్‌లోని ప్రపంచ ఆహార కార్యక్రమ కార్యాలయంలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా బీస్లీ అక్కడి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ... ‘‘రెండు విషయాలు. మనకు అవార్డు వచ్చినప్పుడు నైజర్‌లో ఉన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా. రెండో విషయం. నేను గెలవలేదు. మీరు గెలుచుకున్నారు’’అని అన్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమానికి చాలాకాలంపాటు అమెరికన్లే అధ్యక్షత వహిస్తూ వచ్చారు. ఈ సంప్రదాయంలో భాగంగా 2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌత్ కారొలీనా రాష్ట్ర గవర్నర్ డేవిడ్ బీస్లీని అధ్యక్షుడిగా నియమించారు. ఆహార కార్యక్రమానికి నోబెల్ అవార్డు ప్రకటించిన విషయాన్ని తెలుసుకున్న బీస్లీ మాట్లాడుతూ ‘‘మాటల్లేని క్షణమంటూ నా జీవితంలో ఒకటి చోటు చేసుకోవడం ఇదే తొలిసారి’’అని, ఆవార్డు దక్కడం తనకు షాక్ కలిగించిందన్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమమనే తన కుటుంబం అవార్డుకు అర్హురాలని అన్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమంలో పనిచేస్తున్న యుద్ధం, ఘర్షణ, వాతావరణ వైపరీత్యాల వంటి దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తున్నారని అటువంటి వారు ఈ అవార్డుకు ఎంతైనా అర్హులని ఆయన నైజర్ నుంచి అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆహార కార్యక్రమం ఇదీ... 2030 నాటికల్లా భూమ్మీద ఆకలిబాధలను సమూలంగా తొలగించే లక్ష్యంతో పనిచేస్తున ఐక్యరాజ్య సమితి సంస్థ ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ లేదా ప్రపంచ ఆహార కార్యక్రమం. కరువు కాటకాలొచ్చినా.. దేశాల మధ్య, ప్రాంతాల మధ్య ఘర్షణలు, యుద్ధాలు చెలరేగినా నిరాశ్రయులకు, బాధితులకు ఆహారం అందివ్వడం ఈ సంస్థ ప్రథమ కర్తవ్యం. దీనికి మాత్రమే పరిమితం కాకుండా.. సుస్థిర అభివృద్ధికి వివిధ దేశాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది. సిరియా, యెమెన్ వంటి దేశాల్లో లక్షల మంది కడుపు నింపే ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థకు ఇటీవలి కాలంలో ఎదురవుతున్న మరో సవాలు వాతావరణ వైపరీత్యాలు. గత ఏడాది ఇడాయి తుపాను కారణంగా ముజాంబీక్‌లో సుమారు నాలుగు లక్షల హెక్టార్లలో పంట నీటమునిగిపోయింది. తిండిగింజల్లేని పరిస్థితుల్లో అల్లాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తక్షణం రంగలోకి దిగింది ఈ సంస్థ. ఆహారంతోపాటు నిరాశ్రయులకు మళ్లీ ఇళ్లు కట్టించడం వరకూ అనేక కార్యక్రమాలను చేపట్టింది. భూసార పరిరక్షణ, పెంపు, సాగునీటి కల్పన, విద్య, ఆరోగ్య సేవల మెరుగుదల వంటి అంశాల్లోనూ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తనవంతు సాయం అందిస్తుంది. -
ప్రపంచ ఆహార కార్యక్రమానికి నోబెల్ శాంతి బహుమతి
స్టాక్‌హోం : ఆకలిపై పోరాడుతున్న ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమానికి (డబ్ల్యూఎఫ్‌పీ)కి ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలిపై ఊపిరిసలపని పోరు సాగించేందుకు డబ్ల్యూఎఫ్‌పీ చేపట్టిన సేవలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్కిందని నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. 2020 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని డబ్ల్యూఎఫ్‌పీకి అందించాలని తమ కమిటీ నిర్ణయించిందని నోబెల్ కమిటీ పేర్కొంది. యుద్ధ వివాదాలు, ఘర్షణలు తలెత్తిన ప్రాంతాల్లో శాంతి కోసం మెరుగైన వాతావరణం ఏర్పడేందుకు డబ్ల్యూఎఫ్‌పీ కృషి సాగించిందని తెలిపింది. దీంతో పాటు ఆకలిని యుద్ధ ఆయుధంగా మలుచుకునే చర్యలను నిరోధించేందుకు చేసిన ప్రయత్నాలకు గాను డబ్ల్యూఎఫ్‌పీకి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించామని నోబెల్ కమిటీ ట్వీట్ చేసింది. డబ్ల్యూఎఫ్‌పీ ఏటా 88 దేశాల్లోని 9.7 కోట్ల మంది ప్రజలకు సాయపడుతోందని తెలిపింది. ఇక ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి తొమ్మిది మందిలో ఒకరు తినడానికి సరిపడినంత ఆహారం లేక బాధపడుతున్నారని పేర్కొంది. డిసెంబర్ 10న ఓస్లోలో జరిగే కార్యక్రమంలో 11 లక్షల డాలర్ల ప్రైజ్ మనీతో పాటు శాంతి బహుమతిని ప్రదానం చేస్తారు. కరోనా వైరస్‌తో ఆకలితో అలమటించే బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌పీ సేవలు కొనియాడదగినవని నోబెల్ కమిటీ చీఫ్ బెరిట్ రీస్-అండర్సన్ ప్రశంసించారు. చదవండి : బలహీనతను బలంగా వినిపించే కవిత్వం -
ఆ ఏడాది గాంధీకే నోబెల్ పీస్ ప్రైజ్.. కానీ
(వెబ్ స్పెషల్): నోబెల్ శాంతి బహుమతి.. ప్రపంచ శాంతికి కృషి చేసిన ఎందరికో ఈ బహుమతిని ప్రదానం చేశారు. మరి భారత్, ఆఫ్రికా దేశాల్లో శాంతియుత పోరాటాలు చేసిన జాతిపిత, మహాత్మగాంధీని ఈ బహుమతిని ఎందుకు వరించలేదు. ఈ ప్రశ్నే గాంధీ జయంతి(అక్టోబర్ 2న) సందర్భంగా కోట్లాది మంది భారతీయులను తొలుస్తోంది. అందుకు గల కారణాలు తెలుసుకుందాం. నోబెల్ శాంతి పురస్కారంతో గౌరవించడం రెడ్ క్రాస్ స్థాపకులు జీన్ హెన్రీ డ్యూనెంట్ నుంచి ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు 19 సార్లు ఈ పురస్కారాన్ని ప్రకటించలేదు. ఇక 27 సార్లు ఈ పురస్కారాన్ని వ్యక్తుల కంటే సంస్థలకు ఇవ్వడమే సబబని భావించారు. ఒక్కసారి నోబెల్ బహుమతిని ప్రదానం చేసిన తర్వాత తిరిగి వెనక్కు తీసుకోరు. అందుకే బహుమతికి ఎంపిక చేసే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇక జాతిపితకు ఈ పురస్కారం దక్కకపోవడం పట్ల పలు వివరణలు వినిపిస్తాయి. ముఖ్యంగా గాంధీజీకి ఈ పురస్కారం ఇచ్చి ఆంగ్లేయ పాలకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోకూడదని నోబెల్ కమిటీ భావించిందనే వాదన ఎక్కువగా ప్రచారంలో ఉంది.(చదవండి: నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ నామినేట్) నాలుగు సార్లు నామినేట్ అయిన గాంధీ నోబెల్ శాంతి పురస్కారానికి గాంధీ నాలుగు సార్లు నామినేట్ అయ్యారు. ఆయనను వరసగా 1937, 1939లో నామినేట్ చేశారు. 1947లో కూడా ఆయన నామినేట్ అయ్యారు. చివరగా 1948లో గాంధీని నామినేట్ చేశారు. కానీ తర్వాత రెండు రోజులకే ఆయన హత్యకు గురయ్యారు. మొదటిసారి ఒక నార్వే ఎంపీ గాంధీ పేరును సూచించారు. పురస్కారం ఇచ్చే సమయంలో కమిటీ ఆయనను పట్టించుకోలేదు. దీని గురించి నోబెల్ కమిటీలోని జాకబ్ వార్మూలర్ అనే సలహాదారు గాంధీకి నోబెల్ పురస్కారం ఇవ్వకపోవడం గురించి తన అభిప్రాయం రాశారు. ‘గాంధీ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తను చేస్తున్న అహింసా ఉద్యమం ఎప్పుడో ఒకప్పుడు హింసాత్మకంగా మారొచ్చని తెలిసినా దానిని వీడలేదు’ అని పేర్కొన్నారు. అంతేకాక ‘దక్షిణాఫ్రికాలో, భారత్‌లో ఆయన కేవలం తన దేశస్తుల కోసమే పోరాడారు. నల్లజాతి వారికోసం ఆయన ఏం చేయలేదు’ అని రాసుకొచ్చారు. (చదవండి: సరైన నేతకు ‘నోబెల్ శాంతి’) 1947లో మరోసారి.. 1947 లో నోబెల్ కోసం గాంధీని బీజీ ఖేర్, జీవీ మౌలాంకర్, జీపీ పంత్ నామినేట్ చేశారు. ఆ సమయంలో కమిటీ ఛైర్మన్ గున్నార్ జాన్ ఇద్దరు సభ్యులు, క్రిస్టియన్ కన్జర్వేటివ్ హర్మన్ స్మిట్ ఇంజిబ్రేట్సెన్, క్రిస్టియన్ లిబరల్ క్రిస్టియన్ ఒఫ్టెడల్ గాంధీ వైపు మొగ్గు చూపారు, కాని మిగతా ముగ్గురు - లేబర్ రాజకీయ నాయకుడు మార్టిన్ ట్రాన్మాల్, మాజీ విదేశాంగ మంత్రి బిర్గర్ బ్రాడ్ల్యాండ్లు వ్యతిరేకించారు. దేశ విభజన సమయంలో చెలరేగిన అల్లర్లు.. గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఆయనకు ఆ ఏడాది పురస్కరం లభించలేదు. దేశ విభజన వల్ల భారత్-పాక్‌ల మధ్య యుద్ధం తప్పక వస్తుందని కమిటీ భావించింది. దాంతో గాంధీకి పురస్కారం దక్కలేదు. దాంతో అది మానవ హక్కుల ఉద్యమం ‘క్వేకర్’కు లభించింది. 1948లో మరోసారి.. ఒట్టిదే నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ చివరి తేదీకి రెండు రోజుల ముందు గాంధీ హత్య జరిగింది. ఆ సమయానికే నోబెల్ కమిటీకి గాంధీ తరఫున ఆరు సిఫార్సులు అందాయి. వాటిలో 1946, 47 అవార్డు గ్రహీతలు ది క్వేకర్స్, ఎమిలీ గ్రీన్ బాల్చ్ ఉన్నారు. కానీ అదే ఏడాది గాంధీ మరణించారు. దాంతో కొత్త సమస్య తెరమీదకు వచ్చింది. అప్పటి వరకు మరణానంతరం ఎవరికీ నోబెల్ పురస్కారం ఇవ్వలేదు. దాంతో మరో సారి నోబెల్ ఆశ నిరాశ అయ్యింది. అయితే ప్రస్తుతం మరణించిన తర్వాత కూడా ఇస్తున్నారు. దీంతో పాటు మరో ప్రశ్న కూడా ఎదురయ్యింది. శాంతి పురస్కారం నగదు ఎవరికి చెల్లించాలి అని. ఎందుకంటే అప్పటికి గాంధీ పేరు మీద ట్రస్టుగానీ, సంఘం గానీ లేదు. ఆయనకంటూ ఎలాంటి ఆస్తులు కూడా లేవు. దీనికి సంబంధించి ఆయన ఎలాంటి వీలునామా కూడా రాయలేదు. దాంతో మరోసారి నోబెల్ చేజారింది. (చదవండి: గాంధీజీ కళ్లజోడు.. జీవితాన్నే మార్చేసింది!) ఇక ఆ ఏడాది ఎవరికి నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వలేదు. దీని గురించి కమిటీ ‘జీవించి ఉన్న ఏ అభ్యర్థినీ శాంతి పురస్కారానికి తగిన వారుగా భావించలేదు’ ప్రకటించింది. ఇక్కడ 'జీవించి ఉన్న' అనే మాట చాలా ముఖ్యమైనది. దానిని బట్టి, మరణానంతరం ఎవరికైనా పురస్కారం ఇచ్చే అవకాశం ఉండుంటే, అది కచ్చితంగా గాంధీకి తప్ప వేరే వారికి దక్కేది కాదనేది స్పష్టమవుతోంది. -
నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ నామినేట్
న్యూయార్క్ : 2021 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నార్వే ఎంపీ టిబ్రింగ్ జడ్డే నామినేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు వివాదాల పరిష్కారానికి ట్రంప్ చొరవ చూపారని జడ్డే ప్రశంసించారు. ఇజ్రాయల్-యూఏఈ మధ్య ట్రంప్ కుదిర్చిన శాంతి ఒప్పందం చారిత్రాత్మకమైనదని కొనియాడారు. మధ్యప్రాచ్యంలో సైనిక దళాల తగ్గింపుతో పాటు శాంతి సాధనకు ట్రంప్ విశేషంగా కృషిచేశారని అన్నారు. యూఏఈ-ఇజ్రాయల్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ట్రంప్ యంత్రాంగం కీలక పాత్ర పోషించిందని జడ్డే అన్నారు. ఇక ఆగస్ట్ 13న స్వయంగా అధ్యక్షుడు ప్రకటించిన ఈ ఒప్పందం ట్రంప్ విదేశాంగ విధానం సాధించిన కీలక విజయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా సెప్టెంబర్ 15న వైట్‌హౌస్‌లో యూఏఈ-ఇజ్రాయల్ ఒప్పందంపై ఇజ్రాయల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఎమిరేట్స విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జయేద్ అల్ నహ్యాన్ల సమక్షంలో సంతకాలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. నలుగురు అమెరికా అధ్యక్షులు ఇప్పటివరకూ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అమెరికా అధ్యక్షులు రూజ్వెల్ట్, వుడ్రూ విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామాలకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2021 విజేత ఎవరనేది వచ్చే ఏడాది అక్టోబర్ తర్వాత ప్రకటిస్తారు. చదవండి : హారిస్ ప్రెసిడెంట్ అయితే.. అమెరికాకే అవమానం -
మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం: చైనా
చైనా కాన్ఫిడెన్స్ చూస్తే శత్రువుకి కూడా ముచ్చటేస్తుంది. ట్రంప్ ఎన్నికల మూడ్‌లో లేకుంటే ఆయనా ముచ్చట పడేవారు. చైనా శుక్రవారం నాడు ఇంటి మీదకు వెళ్లి మరీ నార్వేని హెచ్చరించింది! మావాళ్లకు కనుక నోబెల్ శాంతిబహుమతి ఇచ్చి మాలో మాకు పెట్టారో మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం అని చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ ఇ నార్వేను గట్టిగా బెదిరించారు. ‘మాలో మాకు’ అంటే.. చైనాకు, హాంకాంగ్‌కి. హాంకాంగ్ ఒక ప్రత్యేక దేశంలా అనిపిస్తుంది కానీ అది చైనా పాలనాధికారాల కింద ఉన్న ప్రత్యేక ప్రాంతం మాత్రమే. ఈమధ్య చైనా ఒక కొత్త భద్రత చట్టం తెచ్చింది. దానిని హాంకాంగ్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నిరసన ప్రదర్శనలు జరుపుతూనే ఉన్నారు. ఆ నిరసనకారులకు నార్వే నోబెల్ కమిటీ ‘అండ్.. ఈ ఏడాది శాంతి బహుమతి గోస్ టు..’ అంటూ అవార్డును ప్రకటించే ప్రమాదం ఉందని చైనా స్మెల్ చేసినట్లుంది. (66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్?) అందుకే ఈ ముందు జాగ్రత్త బెదిరింపులు. ఈ మధ్య బ్రిటన్‌కి కూడా చైనా ఇలాగే వార్నింగ్ ఇచ్చింది. ‘మీ మంచితనం చేత మా మంచివాళ్లని మీ మంచి దేశంలో ఉండటానికి రప్పించుకుంటే మామూలుగా ఉండదు చూడండీ..’ అని టెస్ట్ ఫైర్ లేవో చేసింది. ఇప్పుడు నార్వేకు తాజాగా ‘శాంతి సందేశం’ ఇచ్చింది. అయినా నోబెల్ ఇచ్చేది స్వీడన్ కదా. మధ్యలోకి నార్వే ఎందుకొచ్చింది? పెద్దాయన ఆల్ఫెడ్ర్ నోబెల్ అలా వీలునామా రాసి వెళ్లారు. నోబెల్ శాంతి బహుమతిని మాత్రం నార్వేనే ఇవ్వాలని. కరోనాకు కారణం అయి, ఏమాత్రం గిల్టీ ఫీలింగ్ లేకుండా చైనానే తిరిగి అందరి పైనా కయ్యి కయ్యి మంటోందంటే.. ఆ కాన్ఫిడెన్స్‌ను చూసి నెక్స్ట్ ముచ్చట పడవలసిన వాళ్లం మనమే. ప్రస్తుతం చైనా చైనా లో లేదు. ఇండియా బోర్డర్ లో ఉంది. -
సరైన నేతకు ‘నోబెల్ శాంతి’
శాంతి అంటే యుద్ధం లేకపోవడం ఒక్కటే కాదు... సమాజంలో అందరూ గౌరవంగా బతికే స్థితి కల్పించడం, సమానత్వం సాధించడం. ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌ను ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేస్తూ... పొరుగు దేశమైన ఎరిట్రియాతో రెండు దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధానికి స్వస్తి పలికి, ఆ దేశంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని నోబెల్ ఎంపిక కమిటీ శుక్రవారం ప్రకటించింది. అబీ సాధించిన ఇతరేతర విజ యాలు ఆ కమిటీ పరిశీలనలోకి రాకపోయి ఉండొచ్చు. లేదా వారు నిర్దేశించుకున్న నిబంధనల చట్రంలో అవి ఒదిగి ఉండకపోవచ్చు. కానీ ఆ విజయాల్లో అనేకం అత్యుత్తమమైనవి. చాలా దేశాల్లో పాలకులు అమలు మాట అటుంచి... కనీసం ఆలోచించడానికి కూడా సాహసించనివి. ఇథియో పియాలో అబీ అహ్మద్ అధికార పగ్గాలు చేపట్టి ఏడాదైంది. ఇంత తక్కువ వ్యవధిలోనే ఆయన అనూ హ్యమైన విజయాలు సాధించారు. ఆయన అనుసరించిన విధానాలు ఇథియోపియా సమాజంలో అన్ని వర్గాలు గౌరవంగా బతికే స్థితిని కల్పించాయి. దశాబ్దాలుగా ఇథియోపియాలో తెగల మధ్య సాగుతున్న ఘర్షణలను ఆయన చాలావరకూ నియంత్రించగలిగారు. లింగ వివక్షను అంతమొం దించే దిశగా అవసరమైన చర్యలు తీసుకున్నారు. తమ పొరుగున ఉన్న సుడాన్లో సైనిక పాలకు లకూ, నిరసనోద్యమ నేతలకూ మధ్య ఎడతెగకుండా సాగుతున్న పోరును ఆపి వారి మధ్య సామర స్యాన్ని నెలకొల్పారు. దేశంలో గత పాలకులు జైళ్లల్లో కుక్కిన వేలాదిమంది రాజకీయ ఖైదీలకు విముక్తి కల్పించారు. వారిని చిత్రహింసలపాలు చేసిన గత ప్రభుత్వ తీరుకు క్షమాపణ చెప్పి వారం దరికీ సాంత్వన చేకూర్చారు. ఉగ్రవాదులుగా ముద్రపడి వేరే దేశాలకు వలసపోయిన వేలాదిమంది తిరిగొచ్చేందుకు దోహదపడ్డారు. పౌరుల ప్రాథమిక హక్కులను పునరుద్ధరించారు. గత ఏడాది నుంచి ఇంతవరకూ పాత్రికేయులను కటకటాల్లోకి నెట్టని ఏకైక దేశం ప్రపంచంలో ఇథియోపియా ఒక్కటే అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించిందంటే అబీ గొప్పతనమేమిటో తెలుసుకోవచ్చు. అంతక్రితం వరకూ మీడియాపై అమల్లో ఉన్న ఆంక్షలన్నిటినీ తొలగించారు. భావప్రకటనా స్వేచ్ఛకు వీలు కల్పించారు. దేశంలోని అమ్హారా ప్రాంతంలో మొన్న జూన్‌లో సైనిక తిరుగుబాటు తలెత్తిన ప్పుడు మాత్రం కొన్ని రోజులపాటు తాత్కాలికంగా ఇంటర్నెట్ను నిలిపివేశారు. ఆ తర్వాత క్షమా పణ చెప్పి పునరుద్ధరించారు. అధికారంలోకొచ్చి అయిదారు నెలలు గడవకముందే జనాభాలో సగ భాగంగా ఉన్న మహిళలకు అన్ని స్థాయిల్లోనూ సమానావకాశాలు దక్కేందుకు అబీ చర్యలు ప్రారం భించారు. తన కేబినెట్లో 50 శాతం స్థానాలను వారికి కేటాయించారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి ఏకాభిప్రాయం సాధించి దేశాధ్యక్ష పదవికి తొలిసారి మహిళ ఎన్నికయ్యేలా చూశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళను ఎంపిక చేశారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసి, అవినీతికి ఆస్కారం లేకుండా చేయడం అబీ సాధించిన విజయాల్లో ప్రధా నమైనది. వచ్చే ఏడాది దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వాగ్దానం చేశారు. ఆఫ్రికా అంటే ప్రపంచంలోని ఇతరచోట్ల చిన్న చూపు ఉంటుంది. మీడియాలో ఆ ప్రపంచం గురించిన వార్తలు పెద్దగా ఉండవు. ఆఫ్రికా దేశాల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడో, ఉగ్రవాద దాడుల్లో భారీ సంఖ్యలో జనం మరణించినప్పుడో ఆ దేశాల ప్రస్తావన కనబడుతుంది. ఆ సమయాల్లో మాత్రమే ఆఫ్రికా ఖండం గుర్తొస్తుంది. కనుక అక్కడి నేతల గురించి, వారు సాధిస్తున్న విజయాల గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. అబీ కూడా తన సంస్కరణ విష యంలో హంగూ ఆర్భాటం ప్రదర్శించలేదు. తాను అమలు చేస్తున్న నిర్ణయాల వల్ల కలిగే ఫలితా లేమిటన్న అంశంపైనే అధికంగా దృష్టి సారించారు. అవన్నీ ఇప్పుడు కళ్లముందు కనబడుతు న్నాయి. వీటిల్లో పాశ్చాత్య ప్రపంచాన్ని అబీ అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడం వగైరాలు ఆకర్షించి ఉండొచ్చు. ఎర్ర సముద్రానికి ఆవల ఉన్న ఇథియో పియాలో జరుగుతున్నదేమిటో... వాటివల్ల ఎలాంటి సత్ఫలితాలు వస్తున్నాయో యెమెన్, ఇతర గల్ఫ్ దేశాలు గుర్తించాయి. పొరుగునున్న ఉన్న సోమాలియా, జిబౌతి, సుడాన్, దక్షిణ సుడాన్ దేశాలు సైతం అబీని స్ఫూర్తిగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పదికోట్లమంది జనాభా ఉన్న ఇథియోపియాలో ప్రధానంగా ఉన్న నాలుగైదు తెగల మధ్య నిత్యం సాగే ఘర్షణలు, పొరుగునున్న ఎరిట్రియాతో యుద్ధం ఆ దేశాన్ని కుంగదీశాయి. ఆ యుద్ధం వల్ల 80,000మంది మరణించడం మాత్రమే కాదు...లక్షలమంది వలసలు పోయారు. ఈ నిరర్ధక యుద్ధంవల్ల అసలే పేద దేశాలుగా ఉన్న ఎరిట్రియా, ఇథియోపియా ఆర్థికంగా మరింత కుంగి పోయాయి. దీన్నంతటినీ అబీ చాలావరకూ చక్కదిద్దగలిగారు. ఈసారి ఆయనతో నోబెల్ శాంతి బహుమతికి పోటీపడినవారిలో స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి పదహారేళ్ల గ్రేటా థన్‌బర్గ్ ఉంది. సాధారణంగా నోబెల్ శాంతి బహుమతి చుట్టూ ఎప్పుడూ వివాదాలు అల్లుకుంటాయి. రేసులో చాలా ముందున్నారని భావించినవారి పేరు ఒక్కోసారి పరిశీలనకే రాదు. అలాగే శాంతి బహుమతి ప్రకటించిన వెంటనే ఎంపికైనవారి అనర్హతలపై ఎక్కువ చర్చ ఉంటుంది. కానీ ఈ ఏడాది అబీ విష యంలో దాదాపుగా అలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదంటే అందుకు ఆయన వ్యక్తిత్వం, ఆయన వరసపెట్టి తీసుకుంటున్న చర్యలు కారణం. ప్రపంచంలో నాగరిక దేశాలుగా చలామణి అవుతు న్నవి, అలా చలామణి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నవి అబీ తీసుకుంటున్న చర్యలనూ, ఇథియోపి యాను ప్రజాస్వామిక దేశంగా, శాంతికాముక దేశంగా తీర్చిదిద్దడానికి ఆయన చేస్తున్న ప్రయత్నా లనూ గమనించాల్సి ఉంది. ఇప్పుడు ప్రకటించిన నోబెల్ శాంతి అందుకు దోహదపడితే మంచిదే. -
ఇథియోపియా ప్రధానికి శాంతి నోబెల్
స్టాక్‌హోమ్: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీని వరించింది. ఆఫ్రికా దేశంలో శాంతి స్థాపన, అంతర్జాతీయ సహకారంలో ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డు దక్కింది. ప్రధానంగా ఇ«థియోపియాకు సరిహద్దుల్లో ఉన్న ఎరిట్రియా దేశంతో దశాబ్దాల తరబడి నెలకొని ఉన్న సరిహద్దు ఉద్రిక్తతల్ని నివారించడానికి శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో అబీ అహ్మద్ చూపించిన చొరవకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటిస్తున్నట్టుగా ఓస్లోలో నార్వే నోబెల్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తికి అత్యున్నత పురస్కారం రావడం ఇదే మొదటిసారి. 43 ఏళ్ల అబీ నోబెల్ పురస్కారం పొందిన 100వ విజేత. ఈ పురస్కారం కింద 90 లక్షల స్వీడిష్ క్రౌన్స్ (దాదాపు రూ.9.40 కోట్లు) అబీ అహ్మద్‌కు అందజేస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతిని పురస్కరించుకొని డిసెంబర్ 10న నార్వేలోని ఓస్లోలో శాంతి పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి, 16 ఏళ్ల వయసున్న గ్రేటా థెన్‌బర్గ్ రేసులో ముందున్నారు. ఆమెకే అవార్డు వరిస్తుందని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో అబీ అవార్డును గెల్చుకున్నారు. 20 ఏళ్ల సంక్షోభానికి తెర ఒకప్పుడు ఇథియోపియాలో భాగమైన ఎరిట్రియా సుదీర్ఘ పోరాటం చేసి 1993లో స్వతంత్ర దేశంగా అవతరించింది. అప్పట్నుంచి ఆ రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు ఉన్నాయి. అంతర్జాతీయ ఒప్పందాలను బేఖాతరు చేస్తూ ఎరిట్రియా 1998లో ఇథియోపియాపై సమరభేరి మోగించింది. 1998–2000 మధ్య భీకర పోరులో చివరికి ఎరిట్రియా వెనక్కి తగ్గింది. అప్పట్నుంచి ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. 2018లో అబీ అహ్మద్ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టాక ఎరిట్రియా అధ్యక్షుడు ఇసాయిస్ అఫ్వెర్కికు స్నేహహస్తం అందించారు. మూడు నెలల్లోనే ఉద్రిక్తతల్ని చల్లార్చడానికి శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దేశంలో ప్రభుత్వ నిబంధనలన్నింటినీ అబీ అహ్మద్ సరళీకరించారు. కేబినెట్లో అత్యధికంగా మహిళల్ని అబీ అహ్మద్ తీసుకున్నారు. పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నవారినీ అక్కున చేర్చుకున్నారు. దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు. పొరుగు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏళ్ల తరబడి అభద్రతలో ఉన్న ప్రజల్లో భవిష్యత్ పట్ల భరోసాను నింపారు. ఒక ప్రధానిగా అబీ అహ్మద్ సయోధ్య, సంఘీభావం, సామాజిక న్యాయం అనే అంశాలను బాగా ప్రచారంలోకి తీసుకువచ్చారు. అతడే ఒక సైన్యం ఒక సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించి సైబర్ ఇంటెలిజెన్స్ విభాగంలో సాహసోపేతంగా వ్యవహరించి, ప్రధానిగా శాంతి స్థాపనకు పలు సంస్కరణలు తీసుకువచ్చిన అబీ అహ్మద్ ప్రస్థానం ఎంతో ఆసక్తికరం. దక్షిణ ఇథియోపియాలో జిమా జోన్లో 1976లో అబీ జన్మించారు. ఆయన తండ్రి ముస్లిం. తల్లి క్రిస్టియన్. చదువుల్లో ఎప్పుడూ ముందుండేవారు. చదువుపై ఆసక్తితో ఎన్నో డిగ్రీలు సొంతం చేసుకున్నారు. శాంతిభద్రతల అంశంలో అడ్డీస్ అబాబా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. లండన్‌లో గ్రీన్ విచ్ యూనివర్సిటీ నుంచి నాయకత్వ మార్పిడి అనే అంశంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. టీనేజ్‌లో ఉండగానే సైన్యంలో చేరారు. లెఫ్ట్‌నెంట్ కల్నల్ పదవి వరకు ఎదిగారు ప్రమాదాలు ఎదుర్కొని వాటిని పరిష్కరించడం అయనకు ఎంతో ఇష్టమైన విషయం. 1998–2000 మధ్య ఎరిట్రియాతో యుద్ధ సమయంలో నిఘా విభాగంలో పనిచేశారు. గూఢచారిగా మారి ఎరిట్రియా నుంచి రక్షణకు సంబంధించి పలు రహస్యాలను రాబట్టారు. 1995లో ర్వాండాలో ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకర్తగా సేవలు అందించారు. 2010లో రాజకీయాల్లో చేరారు. ఒరోమో పీపుల్స్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ సభ్యుడిగా చేరి పార్లమెంటుకి ఎన్నికయ్యారు. 2018 ఏప్రిల్‌లో ప్రధాని పగ్గాలు చేపట్టి దేశం దశ దిశ మార్చడానికి కృషి చేస్తున్నారు. థ్రిల్లింగ్‌గా ఉంది: అబీ అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఇథియోపియా ప్రధాని అబీని వరించడంతో ఆ దేశ ప్రజలు ఆనందోత్సాహాల్లో ఉన్నారు. ఈ పురస్కారం దేశానికే గర్వకారణమని ప్రధాని కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. తనకి ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని అబీ అన్నారు. ఈ పురస్కారం ఆఫ్రికాకే చెందుతుందని చెప్పారు. ఈ అవార్డుతో స్ఫూర్తి పొంది ఆఫ్రికా ఖండంలో ఇతర దేశాల నాయకులు శాంతి స్థాపనకు కృషి చేస్తారని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఇథియోపియా ప్రధానికి నోబెల్ శాంతి పురస్కారం
ఓస్లో(నార్వే) : ఇథియోపియా ప్రధాన మంత్రి అబీ అహ్మద్ అలీకు(43) అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది గానూ నోబెల్ శాంతి పురస్కారం ఆయనను వరించింది. ఆయనకు నోబెల్ శాంతి పురస్కారం అందజేయనున్నట్టు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ముఖ్యంగా తమ పక్క దేశమైన ఎరిట్రియాతో ఉన్న శత్రుత్వాన్ని పరిష్కరించడానికి అలీ చేసిన కృషికి గానూ ఆయనను నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టు జ్యూరీ సభ్యులు తెలిపారు. డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో అలీ శాంతి పురస్కారాన్ని అందుకోనున్నారు. 2018 ఏప్రిల్‌లో ఇథియోపియా ప్రధానిగా భాద్యతలు చేపట్టిన అహ్మద్.. సరిహద్దు దేశాలతో ఉన్న సమస్యలను పరిష్కరించడమే.. కాకుండా తన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విధానాలను అవలంభించారు. కేవలం ఆరు నెలల్లోనే చాలా ఏళ్ల పాటు ఇథియోపియాకు శత్రు దేశంగా ఉన్న ఎరిట్రియాతో శాంతి కుదిరేలా చేశారు. -
‘ఒబామాకు కాదు నాకు ఇవ్వాలి నోబెల్’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శాంతి స్థాపన కోసం తాను ఎంతో కృషి చేశానని.. కానీ నోబెల్ కమిటీ తన కృషిని గుర్తించలేదని ఆరోపించారు. 2009లో ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘అధ్యక్షుడు అయిన వెంటనే ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. అసలు ఆ అవార్డు ఎందుకు ఇచ్చారో ఒబామాకు కూడా తెలియదు’ అంటూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2009లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఒబామాకు... అంతర్జాతీయ స్థాయిలో చూపించిన దౌత్యం, వివిధ దేశాల మధ్య నెలకొల్పిన సహకారం, ప్రజలతో కలిసి పనిచేసే మనస్తత్వం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. అప్పట్లో ఒబామాకు ఈ బహుమతి ఇవ్వడం పట్ల విమర్శలు కూడా తలెత్తాయి. దాదాపు పదేళ్ల తర్వాత తాజాగా ట్రంప్ మరోసారి ఆ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఐక్యరాజ్యసమితికి వెళ్లిన ట్రంప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... తనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వకపోవడం సరికాదన్నారు. చాలా అంశాల్లో తాను చేసిన కృషికిగాను నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వివక్ష లేకుండా ఇచ్చివుంటే... తనకు ఎప్పుడో నోబెల్ వచ్చేదన్నారు. 2009లో ఒబామాకు ఇచ్చినప్పుడు... తనకెందుకు ఇవ్వరన్నది ట్రంప్ అభ్యంతరం. -
నీకు నోబెల్ వచ్చిందా? గొప్ప విషయమే!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కోసారి ఎలా ప్రవర్తిస్తారో ఆయనకే తెలియదు. పాలనా విధానాలతోనే కాదు తన వింత చేష్టలు, ప్రశ్నలతో ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నదియా మురాద్‌ను అవమానపరిచే రీతిలో ట్రంప్ మాట్లాడారు. ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రమూకల చేతుల్లో లైంగిక హింసకు గురవుతున్న ఎంతో మంది యాజాది యువతులకు నదియా విముక్తి కల్పించారు. ఒకప్పుడు లైంగిక బానిసగా ఉన్న ఆమె చేసిన ఈ కృషికి గానూ గతేడాది నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నారు. కాగా బుధవారం ఆమె శ్వేతసౌధంలో ట్రంప్‌ను కలిశారు. ఇరాక్‌లోని యాజాదీలు అనుభవిస్తున్న నరకం, వారి దీనస్థితి గురించి ఆయనకు వివరించారు. ఐసిస్, కుర్దిష్ వర్గాల చేతుల్లో బలైపోతున్న యాజాదీలకు విముక్తి కల్పించాల్సిందిగా విఙ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో నదియా మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ ఆమె మాటలకు అడ్డు తగిలారు. ‘నీకు నోబెల్ బహుమతి వచ్చిందా? గొప్ప విషయం. అవును అసలు వాళ్లు నీకెందుకు అవార్డు ఇచ్చారు’ అంటూ నదియాను ప్రశ్నించారు. ఊహించని పరిణామానికి కంగుతిన్న నదియా వెంటనే తేరుకుని...ఐసిస్ లైంగిక బానిసలకు విముక్తి కలిగించినందుకు గానూ ఆఫ్రికా గైనకాలజిస్ట్ డెనిస్ ముక్వేజ్‌తో సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి పొందినట్లు తెలిపారు. ఈ క్రమంలో బాధితురాలిగా ఉన్న తాను నాయకురాలిగా ఎదిగన తీరును ట్రంప్‌నకు వివరించారు. ‘ మా అమ్మ, సోదరులను ఉగ్రవాదులు చంపేశారు. నన్ను బానిసను చేసి చిత్రహింసలు పెట్టారు. అయినప్పటికీ నా పోరాటం ఆపలేదు. యాజాది మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఐసిస్ వాళ్ల లైంగిక దాడులకు అదుపులేకుండా పోయింది. దయచేసి మీరు కలుగుజేసుకుని అందరికీ న్యాయం చేయాలి. ఇరాక్, కుర్దిష్ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి’ అని నదియా విఙ్ఞప్తి చేశారు. చదవండి : ‘హింసించడంలోనే ఆనందమని వెకిలిగా నవ్వాడు’ ఇందుకు బదులుగా ట్రంప్ మాట్లాడుతూ... ‘ఐసిస్‌ను నామ రూపాల్లేకుండా చేశాం కదా. ఇక మీరంటున్నది కుర్దిష్ వర్గాల గురించి. వాళ్లెవరో నాకు పూర్తిగా తెలియదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో నిరాశగా ఆమె వెనుదిరగాల్సి వచ్చింది. కాగా సిరియా, ఇరాక్‌లో నరమేధం సృష్టిస్తున్న ఐసిస్ ఉగ్రమూకలను పూర్తిగా ఏరివేసిన క్రమంలో అమెరికా సైన్యాలను వెనక్కి పిలుస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సిరియాలోని కుర్దిష్ వర్గాలు ఉగ్రవాదులతో పాటు శరణార్థులను క్యాంపులకు తరలిస్తూ వారిని తిరిగి స్వదేశాలకు పంపాలని యోచిస్తున్నాయి. కానీ యూకే, అమెరికా వంటి దేశాలు ఇందుకు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇరాక్, సిరియాలో అంతర్యుద్ధానికి ఆజ్యం పోసింది అగ్రదేశమే అంటూ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
‘నోబెల్’పై స్పందించిన ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్ : నోబెల్ శాంతి బహుమతి అందుకునే సామర్ధ్యం తనకు లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.ఇమ్రాన్ ప్రతిష్టాత్మక శాంతి బహుమతి స్వీకరించేందుకు అర్హుడని పాక్ పార్లమెంట్ తీర్మానించిన నేపథ్యంలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ వివాదాన్ని కశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిష్కరించి ఉపఖండంలో శాంతి, మానవవికాసానికి బాటలుపరిచే వ్యక్తే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు అర్హుడని సోమవారం ఉదయం ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు సమసిపోయేలా ఇమ్రాన్ నిర్మాణాత్మక చర్యలు చేపట్టారని పాక్ పార్లమెంట్లో సమాచార మంత్రి ఫవాద్ చౌధురి ఇటీవల తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా తమ చెరలో ఉన్న భారత పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను జెనీవా తీర్మానాలకు అనుగుణంగా శాంతి సందేశం పంపే క్రమంలో భారత్‌కు సురక్షితంగా అప్పగించామని ఇమ్రాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. (అభినందన్ విడుదల.. ఇమ్రాన్ ఎక్కడ?) పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ గత వారం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించడం, పాక్ ప్రతిదాడులతో చెలరేగడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో దిగివచ్చిన పాక్ తమ నిర్బంధంలో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను అప్పగించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.