దుబాయ్: జైలు శిక్ష అనుభవిస్తున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మహమ్మదీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు ఇరాన్ అధికారులు అనుమతించారు. మొహమ్మదీ తొమ్మిది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక సంస్థ ఈ సమాచారాన్ని మీడియాకు అందించింది.
మొహమ్మదీకి చికిత్స కోసం మెడికల్ లీవ్ మంజూరు చేయాలని ఫ్రీ నార్వే కూటమి ఒక ప్రకటనలో కోరింది. ఇరాన్‌లోని ఎవిన్ జైలులో మొహమ్మదీ ఇప్పటికే 30 నెలలుగా శిక్ష అనుభవిస్తున్నారు. గత జనవరిలో ఆమె శిక్ష కాలాన్ని మరో 15 నెలలు పొడిగించారు. ఆగస్టు 6న ఎవిన్ జైలులోని మహిళా వార్డులో మరో రాజకీయ ఖైదీకి ఉరిశిక్ష విధించడాన్ని నిరసించినందుకు ఇరాన్ అధికారులు ఆమెకు అదనంగా ఆరు నెలలపాటు శిక్షను విధించారు.
నర్గీస్ మొహమ్మది గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఇరాన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్గీస్ మహమ్మదీని 2021లో అరెస్టు చేశారు. మహిళలపై ఇరాన్ ప్రభుత్వం విధించిన అనేక ఆంక్షల గురించి మొహమ్మదీ గళం విప్పారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆమె ఉద్యమించారు. నర్గీస్ మొహమ్మదీకి 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈ అవార్డును అందుకున్న 19వ మహిళగా ఆమె పేరొందారు. 2003లో మానవ హక్కుల కార్యకర్త షిరిన్ ఎబాడి తర్వాత ఈ అవార్డును అందుకున్న రెండవ ఇరాన్ మహిళగా గుర్తింపు పొందారు.
ఇది కూడా చదవండి: స్పెయిన్ ప్రధానితో పీఎం మోదీ మెగా రోడ్ షో
Comments
Please login to add a commentAdd a comment