
'నోబెల్' విజేతలకు వైఎస్ జగన్ అభినందన
హైదరాబాద్: నోబెల్ శాంతి బహుమతి విజేతలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. వెట్టిచాకిరి నుంచి చిన్నారులకు విముక్తి కల్పించి.. విద్య, ఆశ్రయం కల్పించిన కైలాశ్ సత్యార్థి కృషి మరువలేనిదని కొనియాడారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
భారత బాలల హక్కుల కార్యకర్త కైలాశ్ సత్యార్థి, పాకిస్థాన్ లో బాలికల విద్యాహక్కు కోసం పోరాడాడిన మలాలా యూసఫ్‌జాయ్ లకు 2014 సంవత్సరాలనికి నోబెల్ శాంతి పురస్కారం దక్కింది.