kailash satyarthi
-
‘పోర్న్ వీక్షణం వల్లే లైంగిక వేధింపులు’
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న సాంకేతికత, సమాచార విప్లవంతో ఇంటర్నెట్లో పోర్న్ వీడియోలు, బూతు సాహిత్యం విపరీతంగా అందుబాటులో ఉంటోందని, పిల్లలపై లైంగిక వేధింపులు అధికం కావడా నికి ఇదే ప్రధాన కారణమని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత బాలలను పోలీసులు వారి పిల్లలుగా భావించి పకడ్బందీగా దర్యాప్తు చేసినప్పుడే దోషులకు శిక్షపడుతుందన్నారు. శనివారం హైదరాబాద్ పర్యటనకు వచి్చన కైలాష్ సత్యారి్థ... డీజీ పీ కార్యాలయంలో పోలీస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. పిల్లల అక్రమ రవాణా వ్యవస్థీకృతమైన, అత్యంత బలమైన మూలాలున్న నేరంగా ఉందని కైలాష్ సత్యార్థి పేర్కొన్నారు. ఈ నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్న విధానాలతో గణనీయమైన ఫలితాలు లభిస్తున్నాయని ప్రశంసించారు. మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టడంలో తెలంగాణ పోలీసుల పాత్ర దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలుస్తోందని కితాబిచ్చారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో పిల్లలు, మహిళల భద్రతకు రాష్ట్రం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిచ్చిం దని, ఇందులో భాగంగా అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. అదనపు డీజీ మహేష్ భగవత్ మాట్లాడుతూ కైలాష్ సత్యార్థి కృషి వల్లే తప్పిపోయిన పిల్లల అంశంపై ఎఫ్ఐఆర్ల నమోదు ప్రారంభమైందని, ఆ తర్వాత అనేక సంస్కరణలు వచ్చాయని చెప్పారు. అనంతరం పోలీసు అధికారులు కైలాష్ సత్యార్థిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీలు షికా గోయల్, సౌమ్యా మిశ్రా, సంజయ్ కుమార్ జైన్, ఐజీలు విక్రమ్‌జిత్‌సింగ్ మాన్, షానవాజ్ ఖాసీంతోపాటు రాష్ట్రంలోని పోలీసు కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి భయాన్ని వీడాలి రాయదుర్గం: ప్రతి విద్యార్థి తమకున్న ప్రతిబంధకాలు, చింతలు, భయాలన్నింటినీ వీడి ఆత్మవిశ్వాసంతో పోటీ ప్రపంచంలోకి అడుగు పెట్టాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి పిలుపునిచ్చారు. గచ్చిబౌలి శాంతిసరోవర్‌లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో ట్రిపుల్ఐటీ హైదరాబాద్ 22వ స్నాతకోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ట్రిపుల్ఐటీ హైదరాబాద్ గవరి్నంగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ రాజ్‌రెడ్డి, డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణన్‌తో కలిసి విద్యార్థులకు పట్టాలను, పంపిణీ చేశారు. కైలాష్ మాట్లాడుతూ కేవలం జీతాలు, ప్యాకేజీల కోసం వెంటపడకుండా నైతిక విలువలు, సేవా భావంతో జీవితంలో ముందుకు వెళ్లాలని సూచించారు. నారాయణన్ మాట్లాడుతూ పెరుగుతున్న పోటీ ప్రపంచంలో ట్రిపుల్ఐటీ విద్యార్థులు స్వంత మార్గాలను రూపొందించే నైపుణ్యాలను కలిగి ఉన్నారని తె లిపారు. డ్యూయల్ డిగ్రీతోపాటు ఉత్తమ ఆల్‌రౌండర్ అవార్డును పొందిన కందాల సవితా విశ్వనాథ్‌ను పలువురు అభినందించారు. -
విద్యలో వివక్ష ఉండొద్దు
విద్యారణ్యపురి(హనుమకొండ): ‘విద్య ప్రాథమిక హక్కు. బాలబాలికలందరికీ సమానంగా విద్యావకాశాలు ఉండాలి. విద్యనందించడంలో వివక్ష ఉండొద్దు. బాలలు విద్యార్థి దశ నుంచే మానవీయ విలువలను పెంపొందించుకోవాలి’అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి అన్నారు. సోమవారం ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వేలాదిమంది విద్యార్థులతో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ప్రపంచంలో వాస్తవ హీరోలు బాలబాలికలేనని పేర్కొన్నారు. సమాజంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లంటూ మత విభేదాలు లేకుండా కలిసికట్టుగా చదువుకోవడానికి విద్యార్థులు ముందుకురావాలన్నారు. విద్యార్థి దశ నుంచే తాము భవిష్యత్‌లో ఏమి కావాలో నిర్దేశించుకోవాలని, అందుకు కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ‘మీలో ఎవరైనా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కావాలని అనుకుంటున్నారా’అని విద్యార్థులను ప్రశ్నించారు. తాను ఒకప్పుడు జర్మనీలో ఓ నోబెల్ బహుమతి గ్రహీతను కలిసినప్పుడు అప్పట్లో తనకు మొబైల్ ఫోన్ లేదని, అతనితో ఫొటో తీసుకోలేకపోయానన్నారు. కానీ అప్పుడే నోబెల్ బహుమతి గ్రహీతను కావాలనే సంకల్పం పెట్టుకున్నానని, చివరికి దానిని సాధించగలిగానని పేర్కొన్నారు. ఆఫ్రికా లాంటి దేశాల్లో చాక్లెట్లు తయారీ చేసే పరిశ్రమల్లో బాలకార్మికులు పనిచేస్తున్నారని, అలాంటి చాక్లెట్‌ను తినొద్దని, అలా చేస్తేనే బాలకార్మిక వ్యవస్థకు విముక్తి కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్, కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, గోపి, బల్దియా కమిషనర్ ప్రావీణ్య, సీపీ ఏవీ రంగనా«థ్, వడుప్సా అధ్యక్షుడు రమేశ్‌రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాలల హక్కులు రక్షించినప్పుడే శాంతి బాలల హక్కులు రక్షించినప్పుడే ప్రపంచశాంతి, సుస్థిరత నెలకొంటుందని కైలాస్ సత్యార్థి అభిప్రాయపడ్డారు. సభ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పెద్దల కంటే బాలబాలికలపైనే తీవ్రప్రభావం చూí³ందని, పిల్లలు ఎంతోమంది మరణించారన్నారు. బాల్యవివాహాల నిరోధక చట్టం ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవటంలేదని, గ్రామాల్లో ప్రతి నలుగురు బాలికల్లో ఒకరికి బాల్య వివాహం జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. -
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల న్యాయవాదిగా నోబెల్ గ్రహిత కైలాశ్ సత్యార్థి: యూఎన్
న్యూయార్క్: యూఎన్ జనరల్ అసెంబ్లీ 76వ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) న్యాయవాదిగా నోబెల్ గ్రహిత కైలాశ్ సత్యార్థిని నియమిస్తున్నట్లుగా శుక్రవారం ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు. ఈ మేరకు కైలాశ్ సత్యార్థి తోపాటు స్టెమ్ కార్యకర్త వాలెంటినా మునోజ్ రబనాల్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాండ్‌స్మిత్, కే పాప్ సూపర్‌స్టార్స్ బ్లాక్ పింక్‌లను ఎస్డీజీ కొత్త న్యాయవాదులుగా నియమిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ఒక ప్రతిక ప్రకటనలో తెలిపింది. (చదవండి: ఫస్ట్ టైం.. బెజోస్-మస్క్ మధ్య ఓ మంచి మాట) ఈ సందర్భంగా యూఎన్ చీఫ్ గుటెర్రెస్ మాట్లాడుతూ... కొత్తగా నియమితులైన ఈ ఎస్డీజీ న్యాయవాదులు తమ సరికొత్త విధానాలతో సంక్షోభంలో ఉన్న ప్రపంచాన్ని సుస్థిరాభివృద్ధి దిశగా నడిపించటమే కాక తమ ఆశయాలను నెరవేర్చుకోగలరంటూ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశ పురోగాభివృద్ధికై 17 అంశాలతో కూడిన సుస్థిరభివృద్ధి లక్ష్యాల కోసం ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు కలిసి పనిచేస్తామని అంగీకరించిన సంగతిని గుర్తు చేశారు. ఈ క్రమంలో 2030 కల్లా ఐక్యరాజ్యసమితి వర్కింగ్ గ్రూప్ సుస్థిరాభివృద్ధి కోసం ప్రతిపాదించిన లక్ష్యాల గురించి కూడా ప్రస్తావించారు. బాలకార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణ, బానిసత్వం వంటి వాటిపై నోబెల్ గగ్రహిత కైలాశ్ సత్యార్థి దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: ఎర్త్ - 2.0,‘అయ్యా! ఇంతకీ ఆ భూమి ఏ నగరంలో ఉంది?’) -
బాలల సంక్షేమానికి ఏపీ కృషి భేష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి ప్రశంసించారు. ‘నేషనల్ కన్సల్టేషన్ కమిటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్’ సంస్థ శుక్రవారం వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 34,037 మంది బాల కార్మికులను ఏపీ పోలీసులు విముక్తుల్ని చేయడం హర్షణీయమన్నారు. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేయడం గొప్ప విషయమన్నారు. కోవిడ్ మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రూ.180 కోట్లతో పిల్లల కోసం 3 ఆసుపత్రులను నిరి్మంచాలన్న నిర్ణయాన్నీ ఆయన అభినందించారు. చదవండి: ఉద్యాన హబ్‌గా ఏపీ కౌలు రైతులకూ ‘భరోసా’ -
ఆంధ్రప్రదేశ్ చైల్డ్ ఫ్రెండ్లీ స్టేట్
సాక్షి, అమరావతి: పేద మహిళలకు, వారి పిల్లలకు చేయూతనిచ్చే అమ్మ ఒడి కార్యక్రమాన్ని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ప్రశంసించారు. ఈ కార్యక్రమం అమలు ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. కైలాష్ సత్యార్థి మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అసెంబ్లీలోని సీఎం చాంబర్లో కలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రితో చాలా మంచి సమావేశం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకోసం అందిస్తున్న పలు కార్యక్రమాలు తమ భేటీలో చర్చకు వచ్చాయని తెలిపారు. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఎంతో బాగుందని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌ను చైల్డ్ ఫ్రెండ్లీ స్టేట్‌గా ఆయన అభివర్ణించారు. ఈ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల చిన్నారులకు కుల, సాంఘిక వివక్ష లేకుండా విద్య అందుతుందని తాను భావిస్తున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కచ్చితంగా పిల్లలు మంచి విద్య పొందేందుకు అవకాశాలున్న రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. యువ ముఖ్యమంత్రి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి చిన్నారి ఆనందంగా ఉంటారని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలకు తమ సంస్థ తరఫున సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. -
‘ఏపీ మోడల్ స్టేట్‌గా నిలుస్తుంది’
సాక్షి, అమరావతి : పాఠశాల విద్యలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ఏపీ మోడల్ స్టేట్‌గా నిలుస్తుందని నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యర్థి అన్నారు. మంగళవారం అసెంబ్లీ వద్ద సీఎం వైఎస్ జగన్‌ను కైలాశ్ సత్యర్థి కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయనతో చర్చించారు. అనంతరం కైలాశ్ సత్యర్థి మాట్లాడుతూ.. ‘సీఎం వైఎస్ జగన్‌తో సమావేశం చాలా బాగా జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న పలు కార్యక్రమాల గురించి చర్చకు వచ్చాయని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ బాగుందని కైలాశ్ సత్యర్థి కితాబిచ్చారు. పేద మహిళలకు చేయూతనిచ్చే అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఈ పథకాల అమలుతో ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శ రాష్ట్రంగా మిగిలిపోతుందన్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు తమ సంస్థ తరఫున అన్నిరకాల సహాయ, సహాకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చైల్డ్ ఫ్రంట్ స్టేట్ అన్న ఆయన.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల చిన్నారులకు కుల, సాంఘిక వివక్ష లేకుండా విద్య అందుతుందని భావిస్తున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కచ్చితంగా పిల్లలు మంచి విద్య పొందేందుకు అవకాశమున్న రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనలో ఆనందగా ఉంటారని భావిస్తున్నాట్టు చెప్పారు. కైలాశ్ సత్యర్థితోపాటు సీఎం వైఎస్ జగన్‌ను కలిసినవారిలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఉన్నారు. -
భారత్, పాక్ ప్రధానులకు విజ్ఞప్తి
న్యూఢిల్లీ: పరిస్థితి చేయి దాటి యుద్ధం రాక ముందే భారత్, పాకిస్తాన్‌లు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కోరుతూ 59 మంది నోబెల్ పురస్కార గ్రహీతలు ఇరు దేశాల ప్రధాన మంత్రులను కోరారు. నోబెల్ శాంతి బహుమతి పొందిన భారతీయుడు కైలాశ్ సత్యార్థి స్థాపించిన ‘లారెట్స్ అండ్ లీడర్స్ ఫర్ చిల్డ్రన్’ అనే సంస్థ ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో ఇరు దేశాల శాశ్వత ప్రతినిధులకు శనివారం లేఖలను అందించింది. ఆ లేఖలపై మలాలా యూసఫ్‌జాయ్, మహ్మద్ యూనస్, లీమాహ్ జిబోవీ, షిరిన్ ఎబడి, తవక్కోల్ కర్మాన్ తదితర నోబెల్ గ్రహీతలు సంతకాలు చేశారు. (మానసికంగా వేధించారు) ‘మన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలివైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాలి. యుద్ధం రాకుండా ఉండేందుకు ఈ కీలక సమయంలో సంయమనం పాటించాలి. నాగరిక ప్రపంచంలో హింస, తీవ్రవాదం, ఉగ్రవాదాలకు తావు లేదు. ఈ అంటువ్యాధులను గట్టి చర్యల ద్వారా వేళ్లతోసహా పెకలించాలి’ అని ఆ లేఖల్లో నోబెల్ గ్రహీతలు పేర్కొన్నారు. (‘బాలాకోట్’ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది) -
స్త్రీలోక సంచారం
♦ అమెరికన్ ర్యాపర్, యాక్టర్.. క్లిఫర్డ్ జోసెఫ్ హ్యారిస్ జూనియర్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియో ఆల్బమ్‌లో ఆమెరికా ప్రథమ మహిళ మెలానియాను అనుసరిస్తూ నటించిన కెనడియన్ మోడల్ మెలనీ మార్డన్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. పోలికల్లో కూడా అచ్చు మెలానియా ఉండే మార్డన్.. ఆ వీడియో సాంగ్‌లో.. గతంలో మెలానియా ధరించినట్లే ‘ఐ రియల్లీ డోన్ట్ కేర్’ అనే అక్షరాలున్న జాకెట్‌ను వేసుకుని కనిపించడంపై మెలానియా అభిమానులు విరుచుకుపడుతున్నారు. అంతకన్నా కూడా.. వీడియోలోని ఒక దృశ్యంలో అమెరికా అధ్యక్షుడి కార్యాలయం అయిన ‘ఓవల్ అఫీస్’లోని ‘రిసొల్యూట్ డెస్క్’ ముందు జోసెఫ్ హ్యారిస్ కూర్చొని ఉన్నప్పుడు అతడి ఎదురుగా మార్డన్ తన బట్టలు విప్పుతూ కనిపించడం అమెరికన్ ప్రజల తీవ్ర ఆగ్రహావేశాలకు కారణం అవుతోంది. దీనిని వీక్షించిన మెలానియా ప్రత్యేక ప్రతినిధి ‘ఇది అమర్యాదగానూ, చికాకు పుట్టించేది గానూ ఉంది’ అని వ్యాఖ్యానించగా.. తనని ట్రోల్ చేస్తున్న వారిని ఉద్దేశించి.. ‘‘నేను ఒక నటిని. థీమ్ కు అవసరమైన విధంగా నటించడమే నా వృత్తిధర్మం. దీనికి నేనేమీ పశ్చాత్తాపం చెందడం లేదు’’ అని మార్డన్ సమాధానం ఇచ్చారు. దాంతో ఆమెను అంతమొందిస్తామని వస్తున్న బెదరింపులు మరింత ఎక్కువయ్యాయి. ♦ భారతదేశంలో 65 ఏళ్ల వయసు దాటిన మహిళల్లో 80 శాతం మంది ఆస్టియోపోరోసిస్ (ఎముకలు డొల్లబారడం)తో బాధపడుతున్నట్లు ఢిల్లీ వైద్యులు నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయింది. అయితే వయసులో ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆస్టియోపోరోసిస్‌ను నివారించవచ్చునని సర్వే బృందంలో ఒకరైన ఢిల్లీలోని ‘పోర్టీ మెడికల్’ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఉదయ కుమార్ మయ్యా సూచించారు. డాక్టర్ మయ్యా చెబుతున్నదానిని బట్టి 18–50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలకు రోజుకు వెయ్యి మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం అవుతుంది. 50 ఏళ్లు దాటాక 1200 మిల్లీ గ్రాముల కాల్షియం తీసుకోవలసి ఉంటుంది. ఆహారంలో ఈ మోతాదుకు తగినట్లుగా కాల్షియం లభించకపోతున్నట్లయితే వైద్యుల సలహాపై మాత్రల రూపంలో కాల్షియంను శరీరానికి అందించాలి. ♦ ఇండియాలోని గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో.. కుటుంబానికి మంచినీటిని అందించే బాధ్యత ఏళ్ల నుంచీ స్త్రీలపైనే ఉండడంతో.. పైకి కనిపించని శ్రమతో కూడిన ఆ బాధ్యత వారికి ద్వితీయ శ్రేణి పౌరులుగా మాత్రమే పరిగణన పొందే దుస్థితిని తెచ్చిపెట్టింది. ఇంటికి నీరు ముఖ్యం అయినప్పటికీ, బయటి పనులను మాత్రమే ముఖ్యమైనవాటిగా మన సమాజం భావిస్తుండడంతో మహిళల శ్రమకు గుర్తింపు, వారి అనారోగ్యాలకు వైద్య సేవలు అందడం కూడా అప్రాముఖ్యమైన విషయాలుగానే కొనసాగుతున్నాయి. ఈ అసమానతపై తాజాగా యూనివర్శిటీ ఆఫ్ లండన్‌లోని ‘స్కూల్ ఆఫ్ లా’ రిసెర్చ్ స్కాలర్ గాయత్రీ నాయక్ ఒక సిద్ధాంత పత్రాన్ని సమర్పించారు. కుటుంబ బాధ్యతల్ని జెండర్‌ని బట్టి విభజించడం వల్ల మహిళల సామాజిక, ఆరోగ్య, విద్యా స్థితి గతులను ఆ విభజన నిర్ణయిస్తోందని దీని వల్ల స్త్రీ, పురుషుల మధ్య అసమానతలు పెరిగిపోతున్నాయని ఆమె తన పత్రంలో వ్యాఖ్యానించారు. ♦ లైంగిక అఘాయిత్యాల నుంచి మాతృదేశానికి యువకులే రక్షణగా ఉండాలని నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి పిలుపునిచ్చారు. ‘‘మహిళలు, యువతులు, బాలికలు భయం గుప్పెట్లో ఉన్న విపరీత పరిస్థితి ఇప్పుడు దేశమంతటా నెలకొని ఉంది. ఇంట్లో, పనిచేసే ప్రదేశంలో, బహిరంగ ప్రదేశాలలో ఎక్కడా వారికి రక్షణ లేదు. ఇది మాతృభూమికే అవమానం’’ అని నాగపూర్‌లో జరిగిన ఆర్.ఎస్.ఎస్. కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన అన్నారు. భరతమాతను ఈ అమర్యాదకరమైన స్థితిని తప్పించేందుకు ప్రతి యువకుడూ మహిళల రక్షణకు కంకణం కట్టుకోవాలని చెప్పారు. ♦ ఇండోనేషియాలో పోలీసు ఉద్యోగంలో చేరడానికి వచ్చే యువతులకు కన్యత్వ పరీక్షలు చేయడంతో పాటు.. వారు అందంగా ఉండాలనే అనధికారిక నిబంధన ఒకటి అమలులో ఉండడంపై ప్రస్తుతం ఆ దేశంలోని మానవ హక్కుల సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇరవై ఇరవై ఐదేళ్ల మధ్య వయసు ఉన్న యువతులను పోలీస్ అధికారిగా కన్నా, వాంఛ తీర్చే సాధనంగా మాత్రమే అంగీకరించే మనస్తత్వం ఇండోనేషియా సమాజంలో నెలకొని ఉందని హక్కుల సంస్థ ప్రతినిధి ఆండ్రియాస్ హర్సోనో ఆరోపిస్తున్నారు. దీనిపై ఇండోనేషియా ప్రభుత్వంతో పాటు, అంతర్జాతీయ సమాజమూ తక్షణం స్పందించాలని ఆయన కోరుతున్నారు. -
లైంగిక దాడులకు అడ్డుకట్ట పడాలి
జయనగర : దేశంలో చోటుచేసుకుంటున్న లైంగిక దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని నోబెల్ శాంతి పురస్కారగ్రహీత ౖకైలాస్‌సత్యార్థి సూచించారు. యలహంక శేషాద్రిపుర డిగ్రీ కాలేజీలో భారతీయవిజ్ఞానసంస్థ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సిల్వర్‌జూబ్లీ టాక్‌లో కైలాస్‌సత్యార్థి పాల్గొని మాట్లాడారు. వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థినులపై జరిగే లైంగిక దాడులను బాధితులు బయటకు చెప్పుకోలేక పోతున్నారన్నారు. తల్లిదండ్రులు స్నేహభావంతో మెలిగి పిల్లల సమస్యలు తెలుసుకోవాలన్నారు. నేటికి కోట్లాదిమంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని, దుస్తులు, పాఠ్యపుస్తకాల కొనుగోలుకు డబ్బు లేక చదువులకు దూరమవుతున్నారన్నారు. ప్రపంచంలో 152 మిలియన్ల పిల్లలు బాలకార్మికులుగా ఉన్నారన్నారు. వారికి విముక్తి కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. యువత కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు బోధన రంగంలో ఉన్నత పదవులు అలంకరించాలన్నారు. అనంతరం కళాశాల యాజమాన్యం కైలాస్ సత్యార్థిని ఘనంగా సన్మానించింది. డీఆర్డీఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ వీకే.అత్రే, ఐఐఎస్సీ మాజీ డైరెక్టర్ ప్రొ.బలరామ్, సంస్థ గౌరవకార్యదరి డాక్టర్ వూడే పీ.కృష్ణ, డాక్టర్ ఎంపీ .రవీంద్ర, శేషాద్రిపురం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఎన్ఆర్.పండితారాద్య తదితరులు పాల్గొన్నారు. -
భావి ‘నవ్వు’లకు బాధ్యులు మీరే
సాక్షి, హైదరాబాద్: ‘ఏడెనిమిదేళ్ల క్రితం హరియాణాలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్న బాల కార్మికులు, వారి తల్లిదండ్రులకు నేను విముక్తి కల్పించాను. పిల్లలను నా కారులో తీసు కెళుతూ తినేందుకు అరటిపండ్లు ఇచ్చాను. బానిసత్వంలోనే పుట్టి పెరిగిన వారికి అరటిపండ్లంటే కూడా తెలియదు. అవి అరటిపండ్లని, తినాలని చెపితే.. తొక్క తీయకుండానే తినడంతో రుచించక కింద పడేశారు. అప్పుడు అరటిపండ్లు ఎలా తినాలో నేను వారికి చెప్పాను. అరటిపండు రుచి తెలుసుకున్న ఓ పాప నా భుజం మీద చేయ్యేసి ‘పెహలే క్యో నహీ ఆయే?’ (ముందే ఎందుకు రాలేదు?) అని అడిగింది. ఇది ఆ పాప అడిగిన ప్రశ్న కాదు.. బాలకార్మిక వ్యవస్థలో మగ్గుతున్న లక్షలాది మంది చిన్నారులు అడుగుతున్న ప్రశ్న. నాతోపాటు ఈ సమాజాన్ని అడిగిన ప్రశ్న. అందుకే అఖిల భారత సర్వీసు అధికారులు (ఐఏఎస్)గా చిన్నారుల కలలను నిజం చేయడానికి మీరంతా కంకణబద్ధులు కావాలి. కలెక్టర్లుగా మీ జిల్లాలను ముందుండి నడిపించే నాయకులుగా పనిచేయాలి’అని నోబెల్ పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి పిలుపునిచ్చారు. పేద చిన్నారుల దరి చేరని అభివృద్ధికి అర్థం లేదని, చిన్నారుల ముఖాల్లో విరబూయాల్సిన భావి నవ్వులకు మీరే బాధ్యత తీసుకోవాలని కోరారు. మంగళవారం రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్)లో ‘బాలల హక్కులు– కలెక్టర్ల పాత్ర’ అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని దేశంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 45 మంది ఐఏఎస్ అధికారులను, ఎన్ఐఆర్డీపీఆర్ బృంద సభ్యులను, భారతీయ విద్యాభవన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి దేశంలో చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) లెక్కలు చెబుతున్నాయని.. వాటిని అరికట్టడమే ఐఏఎస్ అధికారుల ముందున్న పెద్ద సవాల్ అని సత్యార్థి అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన మన రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు సంక్రమించాయని, కానీ ఆ హక్కులను కల్పించడంలో వ్యవస్థ విఫల మవుతోందని చెప్పారు. జిల్లా కలెక్టర్లుగా మీరంతా రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రభు త్వ పథకాలనే కాకుండా చట్టాలనూ పకడ్బం దీగా అమలు చేయాలని ఆయన కోరారు. గ్రీన్ ట్రిబ్యునల్ తరహాలో బాలల ట్రిబ్యునల్ పలువురు సభికులు అడిగిన ప్రశ్నలకు కైలాశ్ సమాధానమిస్తూ.. బాలల హక్కుల పరిరక్షణ కోసం గ్రీన్ ట్రిబ్యునల్ తరహాలో బాలల ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తాను కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కోరామని.. శిశుగృహ, జువెనైల్ హోమ్స్‌లో ఉంటున్న వారితో పాటు దేశంలోని ప్రతి చిన్నారికి గుర్తింపు కార్డు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఆర్డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డబ్ల్యూఆర్ రెడ్డి, డాక్టర్ జ్ఞానముద్ర తదితరులు పాల్గొన్నారు. అవకాశాన్ని బాధ్యతగా మార్పుకోవాలి.. నవభారత నిర్మాణం జరుగుతున్న క్రమంలో నవభారత్ అంటే మౌలిక సదుపాయాలతో కూడిన డిజిటల్, టెక్నికల్ సమాజం కాదని, సాధికారతతో కూడిన పౌరుల పునాదులపై నవభారత సమాజ నిర్మాణం జరగాలని కైలాశ్ కోరారు. పాలనతో పాటు సామాజిక మార్పు తేవడంలో కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించి ముందుకెళ్లాల న్నారు. ‘మీరు పనిచేసిన చోట మీ అడుగుజాడలను వదిలి వెళ్లండి. మీరు ప్రభుత్వ ఉన్నతాధికారి మాత్ర మే కాదు. మీ జిల్లాను ముందుండి నడిపించే నాయ కుడనే విషయాన్ని మర్చిపోకండి’అని ఐఏఎస్ అధికా రులను కోరారు. మనదేశంలోని యువతకు అద్భుతమైన ప్రతిభాపాటవా లున్నాయని, అవకాశం వచ్చినప్పుడల్లా మన దేశ యువత తమను తాము నిరూపించుకుంటోందని కైలాశ్ అన్నారు. అలాంటి యువతలో ఒకరిగా వచ్చిన కొత్త కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులు తమ అవకాశాన్ని బాధ్యతగా మలుచుకుని ముందుకు సాగాలని సూచించారు. -
బాలల రక్షణే..భారత రక్షణ
- నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి కర్నూలు: బాలల రక్షణే భారత రక్షణ అని నోబుల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నారు. బాలికలపై అత్యాచారాలు, ఆకృత్యాలు జరగడం బాధకరమని, అలాంటి వాటిని దేశం నుంచి తరిమికొట్టేందుకే తాను ఉద్యమం చేపట్టానన్నారు. బాలల హక్కులపై చైతన్యం తీసుకురావడానికి ఆయన చేపట్టిన భారత్ యాత్ర మంగళవారం కర్నూలు చేరింది. ఈ సందర్భంగా రాజ్‌విహార్ సెంటర్ నుంచి ఏపీఎస్పీ రెండో పటాలం మైదానం వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కైలాష్ సత్యార్థితో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఏపీఎస్పీ రెండో పటాలం మైదానంలో జరిగిన బహిరంగ సభలో సత్యార్థి ప్రసంగించారు. పిల్లలపై వేధింపులు, అక్రమ రవాణాను అరికట్టేందుకు తాను 11 వేల కిలోమీటర్ల మేర 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా భారతయాత్ర చేపట్టానన్నారు. యాత్ర సందర్భంగా అనేక మంది పిల్లలను తాను కలుస్తున్నానని... సొంత కుటుంబ సభ్యులే వారిపై లైంగికదాడులకు పాల్పడుతున్న సంఘటనలు చూసి ఎంతో బాధేస్తోందన్నారు. బుద్ధుడు, మహాత్మాగాంధీలు పుట్టిన భారతదేశంలో తాను జన్మించడం గర్వంగా ఉందన్నారు. భారతదేశంలో లైంగిక వేధింపులు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అవమానపరచడంపై 15 వేల కేసులు రిజిష్టర్ అయ్యాయని చెప్పారు. ఇందులో 4 శాతం పరిష్కారం కాగా 90 శాతం పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పాఠశాల ఆవరణలో పిల్లలు అవమానాలకు గురవుతున్నారని, వారికి జరిగిన అన్యాయంపై త్వరితగతిన తీర్పులు వెలువడాలన్నారు. భారతదేశం యువత విద్య, ఆరోగ్యానికి 4శాతం ఖర్చు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును 2001లో తాను కలిశానని, రాజకీయం, అభివృద్ధి సంక్షేమం పథకాలు హృదయంతో చేయాలన్నారు. ఎంత ఆస్తి సంపాదించినా పిల్లల సంరక్షణ లేకపోతే వృథానేనని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల స్నేహితులుగా మెలగాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలబాలికలు విద్య, ఆరోగ్యంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, సమాచార శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు, కలెక్టర్ సత్యనారాయణ, డీఐజీ ఇక్బాల్ హుస్సేన్, ఎస్పీ గోపీనాథ్‌జట్టి, మాజీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి యాదవ్, రాజ్యసభ సభ్యులు టీ.జీ.వెంకటేష్, ఎంపీ బుట్టా రేణుక, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జెడ్పీ, కేడీసీసీ చైర్మన్లు మల్లెల రాజశేఖర్, మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ శమంతకమణి, టీడీపీ నాయకులు కేఈ ప్రభాకర్, కేఈ ప్రతాప్ పాల్గొన్నారు. హక్కులపై అవగహ కల్పిస్తా.. ఓర్వకల్లులోని కస్తూరిబా గాంధీ భవన్ విద్యాలయ విద్యార్థిని శ్యామల తాను 7వ తరగతి చదువుతున్నానని, తనకు విద్యతో పాటు అన్ని విషయాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారని, 1098 మంది బాల కార్మికులను కాపాడి కేజీబీవీలలో చేర్పించారని చెప్పింది. తాను పెరిగి పెద్దయ్యాక నలుగురికి హక్కులపై అవగాహన కల్పిస్తానని చెప్పింది. ఇంట్లో ఒక అమ్మాయి చదివితే దేశం మొత్తం బాగుపడుతుందని వెల్లడించింది. మనోధైర్యం నింపారు.. కర్నూలు పట్టణానికి చెందిన పల్లవి మాట్లాడుతూ తాను 9వ తరగతి చదువుకుంటున్న సమయంలో ఓ వ్యక్తి తనను ప్రేమించి మోసం చేశాడని దీంతో తాను ఆత్మహత్యకు పాల్పడే సమయంలో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది తనలో మనోధైర్యం నింపి విద్యాబుద్ధులు నేర్పించారని చెప్పింది. అనంతరం కైలాస్ సత్యార్థి, ఆయన సతీమణి సుమేధ సత్యార్థిలను మెమోంటో, శాలువాతో సీఎం సత్కరించారు. ఆ తర్వాత మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముద్రించిన కిశోరి వికాసం బ్రోచర్లను సీఎం, కైలాస్ సత్యార్థి ఆవిష్కరించారు. అంతకుముందు సురక్షిత భారతదేశం ఛాయచిత్రాలను వారు తిలకించారు. -
బాలికలపై ఆకృత్యాలను తరిమికొట్టేందుకు మహోద్యమం
నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి అనంతపురం: ‘చట్టాలు బాగున్నాయని అందరూ చెబుతున్నారు.. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. రాబోయే తరానికి ప్రతినిధులైన బాలికలపై అత్యాచారాలు, ఆకృత్యాలు బాధాకరం. మన దేశం నుంచి వీటిని తరిమికొట్టాలనే ఉద్దేశంతోనే మహా ఉద్యమం చేపట్టాం. ఈ బృహత్తర ఉద్యమంలో కోటి మంది భారతీయులను భాగస్వామ్యం చేస్తాం’ అని నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి స్పష్టం చేశారు. చిన్న పిల్లల భవిష్యత్తు, సంక్షేమం, హక్కుల కోసం కైలాస్ సత్యార్థి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన యాత్ర సోమవారం కర్ణాటక నుంచి అనంతపురం జిల్లా మీదుగా రాష్ట్రంలో అడుగుపెట్టింది. జిల్లా సరిహద్దు కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు, ఎంపీ నిమ్మల కిష్టప్ప, కలెక్టర్ వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ ఖాజా మొహిద్దీన్, ఎమ్మెల్యే పార్థసారధి, ఇతర అధికారులు కైలాస్ సత్యార్థి, ఆయన సతీమణి సుమేధా సత్యార్థి, బృందానికి ఘన స్వాగతం పలికారు. కిలోమీటరు పాదయాత్ర చేపట్టిన అనంతరం జాతీయ రహదారి పక్కన జాయింట్ కలెక్టర్ ఖాజామొహిద్దీన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బాలికలపై లైంగిక వేధింపులు, క్రూరత్వం ప్రదర్శించడం మంచి పద్ధతి కాదన్నారు. వీటిని నిరోధించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యాత్రకు శ్రీకారం చుట్టానన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బాలికలపై అత్యాచారాలు, బాల్య వివాహాలు తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మొత్తం 15 వేల కేసులు రిజిస్టర్ కాగా అందులో కేవలం నాలుగు శాతం మాత్రమే శిక్షలు పడ్డాయన్నారు. 90 శాతం పెండింగ్ ఉన్నాయన్నారు. ప్రపంచంలోనే మన దేశం బాలలకు సురక్షితంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు వారు చదివిన పాఠశాలలకు వెళ్లి ఒక గంట గడపాలని కోరారు. తద్వారా పిల్లలు, తల్లిదండ్రుల్లో పాఠశాల సురక్షితమనే భావన పెరుగుతుందన్నారు. ఈ విధానం ఏపీలో ఒక్కటే కాకుండా దేశమంతా జరిగితే మంచి ఫలితాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి నేరుగా అనంతపురం నగరానికి చేరుకున్న కైలాస్ సత్యార్థి రాత్రి ఆర్డీటీ అతిథి గృహంలో బస చేశారు. మంగళవారం ఉదయం కర్నూలు జిల్లా బయలుదేరి వెళ్లనున్నారు. -
లైంగిక అరాచకాలపై ‘యుద్ధం’
♦ చిన్నారులకు దన్నుగా మహోద్యమం: కైలాశ్ సత్యార్థి ♦ ‘శ్రేయస్కర బాల్యంతోనే శ్రేయస్కర భారత్ సాధ్యం ♦ సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 16 వరకు ‘భారత్ యాత్ర’ ♦ కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు 11 వేల కిలోమీటర్ల పర్యటన ♦ అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలని పిలుపు సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చిన్నారులపై పెరిగిపోతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులు, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటిస్తున్నట్లు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, బాలల హక్కుల పరిరక్షణ ఉద్యమ నేత కైలాశ్ సత్యార్థి వెల్లడించారు. దేశంలోని అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసేందుకు మహోద్యమానికి శ్రీకారం చుడుతు న్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 16 వరకు ‘భారత్ యాత్ర’ చేపడుతున్నట్లు వివరించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో చిన్నారుల బాల్యానికి రక్షణ లేకపోవడం దురదృష్టకర మన్నారు. చిన్నారులపై అకృత్యాలకు సంబంధించి గతేడాది దేశవ్యాప్తంగా 15 వేల కేసులు నమోదు కాగా, అందులో 4% కేసుల్లోనే దోషులకు శిక్ష పడిందని, 6% కేసులను కొట్టేశారని, మిగిలిన 90% కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం గత పదేళ్లలో చిన్నారులపై అకృత్యాలు 5 రెట్లు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘శ్రేయస్కర బాల్యం’ద్వారానే ‘శ్రేయస్కర భారత్’నిర్మాణం సాధ్యపడుతుందన్నారు. కనీస సదుపాయాలు కరువు.. దేశంలో అత్యాచారాలు జరిగిన చిన్నారులకు భౌతికంగా, మానసికంగా భరోసా ఇచ్చేందుకు కనీసం పూర్తి స్థాయిలో వైద్యసదు పాయాలు లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యా నించారు. భయం నుంచి స్వేచ్ఛ కోసం చేస్తున్న ఈ ప్రయత్నానికి అన్ని వర్గాలు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు. చిన్నారుల పక్షాన గొంతెత్తేందుకు సమాజం ముందుకు రావాలని, నిశబ్దపు తెరల నుంచి శబ్దం చేసేందుకు చేపట్టిన మహోద్య మాన్ని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఎన్నో కలలు, అవకాశాలకు ప్రతిబిం బమైన హైదరాబాద్ ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలని, తెలంగాణ అతిపెద్ద భాగ స్వామి కావాలని ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 21న జరిగే భారత్ యాత్రలో పాల్గొనాలని ఎంపీ బి.వినోద్ కుమార్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఇదీ యాత్ర స్వరూపం భారత్‌యాత్ర సెప్టెంబర్ 11న కన్యా కుమారిలో ప్రారంభమై అక్టోబర్ 16న ముగుస్తుంది. యాత్రకు అనుబంధంగా అసోం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జమ్మూ కశ్మీర్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా యాత్రలు ప్రారంభమై ప్రధాన యాత్రలో కలుస్తాయి. ఈ యాత్రకు రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్ర పతిలతో పాటు పార్టీలకు అతీతంగా ఎంపీల మద్దతు లభించింది. దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 11వేల కిలోమీటర్ల మేర సాగనుంది. యాత్రలో భాగంగా ఆయా ప్రాంతాల్లోన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాల యాల విద్యార్థులతో మమేకమై వారిలో చైతన్యం నింపుతారు. -
సత్యార్థి ‘నోబెల్’ దొరికింది
న్యూఢిల్లీ: నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నోబెల్ బహుమతి నమూనా సహా పలు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 7న సత్యార్థి ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. అదే వీధిలో మరో రెండు ఇళ్లలోనూ నిందితులు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాలల హక్కు లపై పోరాడినందుకు గానూ సత్యార్థికి 2014లో నోబెల్ బహుమతి లభించింది. -
ఢిల్లీ పోలీసులకు థ్యాంక్స్: సత్యార్ధి
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగలు ఎత్తుకెళ్లిన నోబెల్ శాంతి బహుమతి నమూనా, మిగతా విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదింనందుకు ఢిల్లీ పోలీసులకు సత్యార్థి ధన్యవాదాలు తెలిపారు. పోలీసు వ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉందని చెప్పారు. తన తండ్రి పోలీసు కానిస్టేబుల్ అని ఆయన తెలిపారు. పాకిస్థాన్ అక్షర సాహసి మలాలా యూసఫ్‌జాయ్, సత్యార్థికి సంయుక్తంగా 2014లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. తనకు వచ్చిన మెడల్ ను 2015, జనవరిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సత్యార్థి అందజేశారు. -
కైలాష్ సత్యార్థి ఇంట్లో చోరి నోబెల్ సర్టిఫికెట్ మాయం
-
కైలాష్ సత్యార్థి ఇంట్లో చోరి.. నోబెల్ సర్టిఫికెట్ మాయం
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి ఇంట్లో దొంగలు పడ్డారు. సామాజిక సేవకు గుర్తింపుగా ఆయనకు లభించిన విశిష్ట అవార్డు నోబెల్ బహుమతికి సంబంధించిన సర్టిఫికెట్‌ను ఎత్తుకెళ్లారు. ఆయన ఇంటిని దుండగులు చిన్నాభిన్నం చేసినట్లు కూడా తెలిసింది. అయితే, నోబెల్ బహుమతి ఆయన జాతికి అంకితం చేసిన నేపథ్యంలో అది ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లో ఉన్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. సామాజిక ఉద్యమకారుడే అయినప్పటికీ కైలాస్ సత్యార్థి భారతీయ బాలలహక్కుల కోసం అమితంగా పోరాడే ప్రముఖ ఉద్యమకారుడు. ఆయన 1980లో బచ్పన్ బచావో ఆందోళన్ (బాల్యాన్ని కాపాడే ఉద్యమం) స్థాపించి, 80వేల మంది పిల్లల హక్కులు కాపాడేందుకు ఉద్యమాలు నడిపారు. ఆయన 2014 నోబెల్ బహుమతిని, పాకిస్థాన్ అక్షర సాహసి మలాలా యూసఫ్జాయ్తో సంయుక్తంగా "యువత, బాలల అణచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి, బాలలందరికీ విద్యాహక్కు’ అనే అంశానికి నోబెల్ పురస్కారం పొందారు. తాజాగా ఆయన ఇంట్లో పడిన దొంగలు ఈ నోబెల్ అవార్డుతోపాటు పలు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కైలాష్ అమెరికా పర్యటనలో ఉన్నారు. -
రాజ‘నీతి’లో మార్పు రావాలి
* నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి * 18 ఏళ్లలోపు వారితో పనులను చేయించకుండా చట్టంలో మార్పులు తేవాలి * నోబెల్ అవార్డు వచ్చిందంటే నమ్మలేకపోయా * అది దేశానికి లభించిన గౌరవం..అందుకే దేశప్రజలకు అంకితమిచ్చా సాక్షి, హైదరాబాద్: దేశంలో బాల కార్మిక వ్యవస్థను సంపూర్ణంగా రూపుమాపాలంటే కఠిన చట్టాలతోపాటు రాజకీయ సంస్కృతిలో మార్పురావాలని అప్పుడే దేశం నుంచి ఈ వ్యవస్థను పారదోలగలమని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి అన్నారు. నాయకులు రాబోయే ఎన్నికల గురించి కాకుండా రాబోయే తరం గురించి ఆలోచించాలని సూచించారు. ప్రస్తుతం అమలవుతున్న 1986 నాటి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టంలో అనేక లోపాలున్నాయని, వాటిని సవరిస్తూ తదుపరి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతోపాటు సమాజం కూడా నైతిక బాధ్యత వహిస్తూ బాల కార్మిక వ్యవస్థను అరికట్టాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో కైలాశ్ సత్యార్థి మీడియాతో మాట్లాడారు. తనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చిందని ఓ మిత్రుడు చెబితే నమ్మలేకపోయానని, ఇది తనకు మాత్రమే కాదని.. దేశానికి లభించిన గౌరవంగా భావించి పురస్కారాన్ని దేశ ప్రజలకు అంకితం చేశానని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, దీనిని నిర్మూలిస్తేనే బాలల విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, పేదరిక నిర్మూలన వంటి లక్ష్యాలు సాకారమవుతాయని పేర్కొన్నారు. బాలలు కార్మికులుగా మారితే వంద శాతం విద్య సాధ్యపడదన్నారు. 14 ఏళ్ల లోపు పిల్లలతో పనులు చేయించడం.., 18 ఏళ్ల లోపు వయసు వారితో కఠినమైన పనులు చేయించడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తూ చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో 1988 లో తాను చేపట్టిన వరల్డ్ మార్చ్ కారణంగా 179 దేశాలు తమ చట్టాల్లో ఆ మేరకు మార్పులు చేశాయని, కానీ ఇంత వరకూ మన చట్టంలో మార్పులు తేలేకపోయామని సత్యార్థి అసంతృప్తి వ్యక్తం చేశారు. జువైనల్ జస్టిస్ యాక్ట్‌ను కూడా సవరించాలని, 18 ఏళ్ల వయోపరిమితి కొనసాగిస్తూనే హత్యలు, అత్యాచారాల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని శిక్షించేలా ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని సూచించారు. మన దేశంలో ఎంతో మంది బాలికలను వ్యవభిచార కూపంలోని దింపుతున్నారని, పసి పిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని నోబెల్ గ్రహీత ఆవేదన చెందారు. బాలికలపై జరుగుతున్న ఇలాంటి దుర్మార్గాలను రూపుమాపనంత వరకూ లక్ష్మీ, దుర్గా, సరస్వతి మాతలను కొలిచే నైతిక హక్కు మనకు లేదన్నారు. బాలికల రక్షణకు ధార్మిక సంస్థలు ముందుకు రావాలని సూచించారు. తనకు నోబెల్ వచ్చాక దేశ వ్యాప్తంగా బాలల దుస్థితిపై అవగాహన పెరిగిందని, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మరింత చురుకుగా పనిచేస్తుండడం సంతోషకరంగా ఉందని అన్నారు. అయితే దేశంలో ఇంకా లక్షలాది మంది పిల్లలు పరిశ్రమలు, కర్మాగారాల్లో మగ్గుతున్నారని, వారందరికీ స్వేచ్ఛ ప్రసాదించేందుకు ప్రతి ఒక్క పౌరుడూ కృషి చేయాలని సత్యార్థి కోరారు. ప్రపంచంలో ఏ ఒక్క పిల్లవాడు కూడా తన స్వేచ్ఛను నష్టపోకూడదన్నదే తన లక్ష్యమని, దాని కోసం చివరి వరకూ పోరాడతానని సత్యార్థి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రమాకాంత్, కార్యదర్శి రాజమౌళి పాల్గొన్నారు. సమాజ హితమే లక్ష్యం కావాలి: ఐఎస్బీ స్నాతకోత్సవంలో సత్యార్థి సాక్షి, హైదరాబాద్: విద్యాధికులు సమాజ, ప్రపంచహితం కోసం కృషి చేయాలని సత్యార్థి పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవాలని, నిత్యాన్వేషిగా ఉండాలని, నమ్మిన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని ఈ సందర్భంగా పట్టభద్రులను కోరారు. ‘‘మీలో ఒకొక్కరూ ఓ అగ్ని కణం. ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపగల సామర్థ్యం మీ సొంతం. ఈ ప్రపంచాన్ని వెలుగులతో నింపండి’’ అని పిలుపునిచ్చారు. ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ఉద్యోగం వదిలేసి, బాలల హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నప్పుడు మిత్రులు తనను పిచ్చివాడన్నారని గుర్తు చేసుకున్నారు. అయినా మనసు చెప్పిన మాట వినడం వల్లే ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానన్నారు. తన జీవితంలో ఎదురైన సవాళ్లను, వాటిని అధిగమించిన తీరును చిన్న కథల రూపంలో చెప్పారు. ‘‘ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాకపోయి ఉంటే విద్యార్థుల కుటుంబసభ్యుల మధ్య కూర్చుని ఉండేవాడిని. నా కుమార్తె మేనేజ్మెంట్ పట్టాను అందుకోవడం చూస్తూ, ఆమె స్కూలుకెళ్లిన తొలి రోజున నేను రాసుకున్న కవితను గుర్తు చేసుకునేవాడిని’’ అంటూ దాన్ని చదివి వినిపించారు. ‘నా కుమార్తె తొలిసారి బడికెళ్లింది. ప్రపంచాన్ని జయించే కొత్త అస్త్రశస్త్రాలను సమకూర్చుకునేందుకు బయల్దేరింది’ అనే అర్థంతో సాగిన ఆ హిందీ కవితను అంతా ఆస్వాదించారు. సత్యార్థి తన ప్రసంగానికి ముందు పట్టభద్రులను కాకుండా చిన్నపిల్లలను పలకరించడం ఆకట్టుకుంది. ఐఎస్బీ అతి తక్కువ సమయంలోనే ప్రపంచంలోనే అగ్రశ్రేణి విద్యాసంస్థగా ఎదిగిందని సంస్థ డీన్ అజిత్ రంగనేకర్ అన్నారు. ‘‘దాదాపు ఏడు వేల మంది పూర్వ విద్యార్థుల్లో 200 మంది అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. 23 దేశాల్లో ఐఎస్బీ పూర్వ విద్యార్థులుండటం సంస్థ సామర్థ్యానికి గీటురాయి’’ అని చెప్పారు. ప్రభుత్వాల విధాన రూపకల్పన తదితరాల్లోనూ ఐఎస్బీ పాలుపంచుకుంటోందన్నారు. స్నాతకోత్సవంలో 2015 ఏడాదికి 551 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ పట్టాలు, 62 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు 2014కు పీజీపీ మ్యాక్ కోర్సు పట్టాలు అందుకున్నారు. ఐఎస్బీ బోర్డు సభ్యులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు ఆది గోద్రెజ్, రాహుల్ బజాజ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
లండన్ లో కైలాశ్, రాణి
-
సత్యార్థి నోబెల్ జాతికి అంకితం
రాష్ట్రపతికి అందజేసిన అవార్డు గ్రహీత సందర్శకులకు అందుబాటులో మెడల్ న్యూఢిల్లీ: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి తన అవార్డును జాతికి అంకితం చేశారు. బుధవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో సత్యార్థి తన మెడల్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. సత్యార్థి నోబెల్ బహుమతి అందుకోవడంపై రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. సత్యార్థి తన సేవలను మరింతగా కొనసాగించాలని కోరారు. గతంలో బహుమతి పొందిన భారతీయులు మెడల్‌ను తమ వద్దే ఉంచుకున్నారని, సత్యార్థి తన మెడల్‌ను రాష్ట్రపతి భవన్ మ్యూజియమ్‌లో అందుబాటులో ఉంచడం మంచి నిర్ణయమని ప్రశంసించారు. డా.సి.వి. రామన్ తన నోబెల్ బహుమతిని జాతికి అంకితం చేస్తూ చేసిన ప్రసంగాన్ని రాష్ట్రపతి గుర్తుచేశారు. కైలాష్ మాట్లాడుతూ దేశానికి తన మెడల్‌ను అంకితం చేస్తున్నానన్నారు. ప్రపంచం భారత్‌వైపు చూస్తోందని, బాలల హక్కులను రక్షించడం అందరి సమష్టి బాధ్యత అని చెప్పారు. నోబెల్ ద్వారా గెలుచుకున్న నగదును బాలల సంక్షేమానికే వినియోగిస్తానని ఆయన తెలిపారు. సత్యార్థి బహూకరించిన నోబెల్ అవార్డు రాష్ట్రపతి భవన్‌లోని మ్యూజియమ్‌లో సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. సత్యార్థి గత డిసెంబర్ 10న పాకిస్తాన్ బాలిక మలాలాతో కలిసి నోబెల్ బహుమతి అందుకున్నారు. -
పిల్లల్ని చంపొద్దు: సత్యార్థి
న్యూఢిల్లీ: అభం శుభం తెలియని పిల్లలను చంపొద్దని తీవ్రవాద సంస్థలకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి విజ్ఞప్తి చేశారు. తీవ్రవాదంపై పోరుకు అంతర్జాతీయ సమాజం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్ లోని పెషావర్ లో ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాదుల దాడి మానవాళి అత్యంత చీకటి దినాల్లో ఒకటని వ్యాఖ్యానించారు. ప్రపంచ విషాదాల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. దాడి గురించి తెలిసిన వెంటనే తన మనసంతా పెషావర్ లోనే ఉందని తెలిపారు. ఉగ్రవాదులు పిల్లలను వదిలేసి తనను చంపేసినా బాగుండునని పేర్కొన్నారు. అమాయక పిల్లలను చంపడాన్ని ఏ మతం అంగీకరించదని సత్యార్థి చెప్పారు. జర్మనీ ఎంబసీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
బాల కార్మిక వ్యవస్థ చరిత్రలో కలవాలి
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సత్యార్థి న్యూఢిల్లీ: బాల కార్మిక వ్యవస్థ చరిత్ర పుటల్లో కలసిపోవాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి ఆకాంక్షించారు. దీని కోసం విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని విన్నవించారు. నోబెల్ బహుమతి అందుకుని ఆదివారం భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించేందుకు రూపొందించిన ‘బాల కార్మిక వ్యవస్థ(నిషేధం, నియంత్రణ) సవరణ బిల్లు’ను వెంటనే ఆమోదించి చట్టం చేయాలని కోరారు. బిల్లు ఆమోదం పొందకపోతే ఈ శాసనకర్తలను చరిత్ర క్షమించబోదన్నారు. ‘‘కీలకమైన ఆ బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించాల్సిందిగా పార్లమెంటేరియన్లందరికీ, ఇతర నాయకులందరికీ నేను విన్నవించుకుంటున్నాను. మహాత్మాగాంధీ సత్యాన్ని, అహింసను, శాంతిని ఓ ప్రజా ఉద్యమంగా మలిచారు. నేను మీ దయాగుణాన్ని ఓ ప్రజా ఉద్యమంగా మార్చాలని కోరుతున్నాను’ అని ఆయన పిలుపునిచ్చారు. ఓస్లోలో నోబెల్ ప్రదాన కార్యక్రమంలో పోడియంలో కూర్చొని ఉన్నప్పుడు తనకు నిరంతరం మహాత్ముడే గుర్తొస్తూ ఉన్నాడని, ఆయనే నేరుగా వెళ్లి తన అవార్డు అందుకున్నట్లుగా భావించానన్నారు. నోబెల్ బహుమతి సొమ్ములో ప్రతి పైసా పేద పిల్లల కోసమే వెచ్చిస్తానని చెప్పారు. ఆయన భారత్‌లో దిగీ దిగగానే ట్వీటర్లో ‘జై హింద్’ అంటూ ట్వీట్ చేశారు. -
కైలాస్ సత్యార్థికి నోబెల్ బహుమతి
-
'పాకిస్తానీ, భారతీయుడు కలసి పనిచేయగలరు'
-
'విశ్వశాంతికి అందరూ కృషి చేయాలి'
-
'పాకిస్తానీ, భారతీయుడు కలసి పనిచేయగలరు'
న్యూఢిల్లీ: ఒక పాకిస్థానీ, ఒక భారతీయుడు కలసి పనిచేయగలరని పాక్ ధీర బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ అన్నారు. ప్రముఖ భారత బాలల హక్కుల కార్యకర్త కైలాస్ సత్యార్థితో కలసి నోబెల్ బహుమతి అందుకోవడం గర్వకారణంగా ఉందని మలాలా చెప్పారు. నార్వే రాజధాని ఓస్లోలో బుధవారం జరిగిన కార్యక్రమంలో మలాలా, సత్యార్థి సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు. అనంతరం మలాలా ప్రసంగిస్తూ తల్లిదండ్రులకు, గురువులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆంక్షలు విధించకుండా స్వేచ్ఛగా ఎదగనిచ్చినందుకు తన తండ్రికి కృతజ్ఞతలు చెప్పారు. బాలల హక్కుల కోసం జాలి చూపకుండా, వారి కోసం పోరాడాలాని మలాలా కోరారు. -
'విశ్వశాంతికి అందరూ కృషి చేయాలి'
న్యూఢిల్లీ: తూర్పు-పశ్చిమ, ఉత్తర-దక్షిణ ప్రాంతాలన్నీ విశ్వశాంతి కోసం పాటుపడాలని ప్రముఖ బాలల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నారు. పాకిస్థాన్ ధీర బాలిక మలాలా యూసఫ్జాయ్తో కలసి కైలాస్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకోనున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వీరికి సంయుక్తంగా బహుమతిని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కైలాస్ వేదాల్లోని ఓ శ్లోకాన్ని వినిపించి హిందీలో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ బహుమతిని బాలల హక్కుల కోసం పోరాడుతున్న అందరికీ అంకితం చేస్తున్నట్టు చెప్పారు. మలాలా తనకు కూతురు లాంటిదని, ఓస్లో వేదికగా పాక్ కూతురును ఓ భారతీయ తండ్రి కలుసుకున్నారని కైలాస్ చెప్పారు. 'ప్రతి చిన్నారి స్వేచ్ఛగా పాఠశాలకు వెళ్లాలి. ఆడుకోవాలి. చిన్నారులెవరూ బాలకార్మికులుగా మారరాదు. విముక్తులయిన బాల కార్మికుల్లో ఈశ్వరుడిని చూశాను' అని కైలాస్ అన్నారు. బుద్ధుడు జన్మించిన భూమి నుంచి నార్వే వరకు తన యాత్ర సాగిందని కైలాస్ అన్నారు. కైలాస్ స్వరాష్ట్రం మధ్యప్రదేశ్. అధ్యాపక వృత్తికి గుడ్ బై చెప్పి బాలల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. -
'నోబెల్' స్వీకరించిన కైలాస్, మలాలా
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్లకు చెందిన ప్రముఖ బాలల హక్కుల కార్యకర్తలు కైలాస్ సత్యార్థి, మలాలా యూసఫ్‌జాయ్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వీరికి సంయుక్తంగా బహుమతిని ప్రదానం చేశారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ఎనిమిదో భారతీయుడు కైలాస్. బాలల హక్కుల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. బహుమతి కింద కైలాస్ సత్యార్థి, మలాలాకు నోబెల్ పతకం, ప్రశంసాపత్రం, 1.1 మిలియన్ డాలర్ల (రూ.6.1 కోట్లు) నగదు చెరిసగం అందజేశారు. అవార్డును స్వీకరించడానికి సత్యార్థి తన భార్య సుమేధ, కుమారుడు, కోడలు, కూతురుతో సహా సోమవారమే ఓస్లోకు వెళ్లారు. ఓస్లోలో మంగళవారం జరిగిన చర్చా కార్యక్రమంలో కైలాస్ సత్యార్థి, మలాలా పాల్గొన్నారు. -
నేడు సత్యార్థి, మలాలాకు నోబెల్
-
నేడు సత్యార్థి, మలాలాకు నోబెల్
స్టాక్‌హోం(స్వీడన్): భారత్, పాకిస్తాన్లకు చెందిన ప్రముఖ బాలల హక్కుల కార్యకర్తలు కైలాస్ సత్యార్థి(60), మలాలా యూసఫ్‌జాయ్ (17)లు బుధవారం ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకోనున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో జరిగే కార్యక్రమంలో వీరికి సంయుక్తంగా బహుమతిని ప్రదానం చేయనున్నారు. బహుమతి కింద వీరికి నోబెల్ పతకం, ప్రశంసాపత్రం, 1.1 మిలియన్ డాలర్ల (రూ.6.1 కోట్లు) నగదు చెరిసగం అందజేస్తారు. అవార్డును స్వీకరించడానికి సత్యార్థి తన భార్య సుమేధ, కుమారుడు, కోడలు, కూతురుతో సహా సోమవారమే ఓస్లోకు చేరుకున్నారు. ఆయన ‘పీటీఐ’తో మాట్లాడుతూ.. ‘ఈ అవార్డును భారత్‌లోని బాలలకు అంకితమిస్తున్నా. ఈ బహుమతి వారి కోసమే. దేశ ప్రజల కోసం కూడా’ అని సంతోషం వ్యక్తం చేశారు. భారత్, పాకిస్తాన్ల మధ్య శాంతి కొనసాగడానికి విశ్వాసం, స్నేహమే ముఖ్యమని ఓస్లోలో జరిగిన ఓ కార్యక్రమంలో సత్యార్థి, మలాలా అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల ప్రధానుల చర్చల కన్నా ప్రజల మధ్య సంబంధాలు మరింత ముఖ్యమని సత్యార్థి అన్నారు. కాగా, భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక శాస్త్రాలు, సాహిత్యం విభాగాల్లో విజేతలుగా నిలిచిన మరో 11 మందికి స్వీడన్‌లోని స్టాక్‌హోంలో జరిగే కార్యక్రమంలో నోబెల్ బహుమతులను అందజేయనున్నారు. నోబెల్ బహుమతిని నెలకొల్పిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థం ఆయన వర్ధంతి రోజైన డిసెంబరు 10న 1901 నుంచి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. -
'ఐపాడ్లు కాదు పుస్తకం అడుగుతున్నారు'
న్యూఢిల్లీ: పిల్లలు ఐపాడ్లు కోరుకోవడం లేదని, పుస్తకం అడుగుతున్నారని పాకిస్థాన్ ధీర బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూసఫ్‌జాయ్ మలాలా అన్నారు. కైలాష్ సత్యార్థి, మాలాలా నార్వేలోని ఓస్లోలో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత సామాజిక కార్యకర్త కైలాష్ సత్యార్థితో కలసి మాలాలా నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన సంగతి తెలిసిందే. తాము పెన్ను, పుస్తకం అడుగుతున్నామని మలాలా అన్నారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య శాంతి కోరుకుంటున్నాని చెప్పారు. కైలాస్ సత్యార్థి మాట్లాడుతూ.. మలాలా పోరాట స్ఫూర్థి అందరికీ గర్వకారణమని ప్రశంసించారు. బాలల హక్కుల కోసం పోరాటంలో యువతను చైతన్య పరచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. వీరిద్దరూ బుధవారం నోబెల్ పురస్కారాన్ని అందుకోనున్నారు. -
నోబెల్ సందేశం
‘కైలాష్ సత్యార్థి’ ఎవరు..? ఈ ప్రశ్న నేను ఒక వారం ముందు అడిగి ఉంటే సమాధానం విచిత్రంగా, అయోమయంగా వచ్చి ఉండేది. వారం కిందటి వరకూ ఎవరికీ సరిగా తెలియని భారతీయుడి గురించి ఇప్పుడు అందరం మాట్లాడుకుంటున్నాం. 1979లో మదర్ థెరిసా తర్వాత నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న భారతీయ వ్యక్తి కైలాష్ సత్యార్థి అని భారతీయులందరూ సగర్వంగా మాట్లాడుకుంటున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ లాంటి సోషల్ మీడియాల్లో లక్షల్లో సందేశాలు షేర్ చేసుకుంటున్నారు. ఆయన ఎవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తారన్న సెర్చులు మొదలయ్యాయి. లోకల్‌గా చర్చల్లో లేని, మీడియాలో సంచలనం కాని, ప్రభుత్వ అవార్డులకు నోచుకోని ఓ సాధారణ పౌరుడు నార్వే కంట్లో ఎలా పడ్డాడు. అంతర్జాతీయ గుర్తింపు ఎలా పొందాడు. తాలిబన్ల చేతుల్లో నరకయాతన అనుభవించి, బాలికావిద్య గురించి పోరాటం చేసిన పాకిస్థానీ బాలిక మలాలా గురించి ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే ఆమె జీవితం ఓ సంచలనం. అందుకే నోబెల్ శాంతి పురస్కారం ఆమెకు దక్కిందంటే ఎవరికీ ఆశ్చర్యం కలగలేదు. మరి మన కైలాష్‌ను కూడా ఈ అవార్డు వరించిందంటే మాత్రం అందరిలో కుతూహలం బయల్దేరింది. ఏ రంగంలో అయినా గొప్ప ఆవిష్కరణలు చేసి నోబెల్ పురస్కారం అందుకుంటే మనమంతా గర్వించవచ్చు. పండుగ చేసుకోవచ్చు. కానీ ఈ నోబెల్ శాంతి పురస్కారం మాత్రం పండుగ చేసుకునే అవకాశం కాదు. మనదేశంలో కష్టాల్లో ఉన్న బాల్యాన్ని చూడమని ఇచ్చిన సంకేతం. నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న సత్యార్థి ఏ పురస్కారం ఆశించి ఉండరు. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పని చేస్తున్న ఆయన పిలుపు వినడానికి ఒక ‘నోబెల్ పురస్కారం’ కావాల్సి వచ్చింది. కరిగిపోతున్న బాల్యాన్ని ఆదుకునేందుకు మనమందరం కలసి సాగాలని ఈ నోబెల్ పిలుపునిస్తుంది. ఆలోచిస్తే చాలు బాల్యం అంటే మెరిసే కళ్ల అమాయకత్వం. బాదరబందీలు లేని బాల్యంలోకి మరోసారి వెళ్తే బాగుంటుందని ఒక్కసారైనా కోరుకుంటాం. కానీ.. అందరికీ ఇలాంటి అందమైన బాల్యం ఉండే అదృష్టం లేదు. నలిగిపోతున్న బాల్యం నుంచి రక్షించమని జాలిగా చూసే కళ్లు మన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో ఉన్నాయి. పేదరికం, వెనుకబాటుతనం పిల్లల పాలిట శాపంగా మారుతున్నాయి. అందుకే అందమైన బాల్యం కష్టాల కొలిమిలో కార్మిక అవస్థగా మారుతోంది. దీనికి తల్లిదండ్రులనో, యాజమాన్యాలనో నిందిస్తే సరిపోతుందా..? చట్టాలు చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వాలను, కళ్లెదుటే పసిమొగ్గలు మసిబారుతున్నా పట్టించుకోని సమాజాన్ని వదిలేద్దామా..? ఎందుకీ నిస్తేజం అని ప్రశ్నిస్తున్న సత్యార్థి, శాంతి సిన్హా, హర్ష్ మందర్ వంటి బాలల హక్కుల ఉద్యమకారులను మనం సీరియస్‌గా తీసుకోం. స్పందిస్తే మేలు.. బాల కార్మికులు, బాల్య వివాహాలు, బడికి పంపకపోవడం, లైంగిక వేధింపులు ఇవన్నీ ఎక్కడో దూరంగా పేదింటి పిల్లలకే ఎదురవుతున్నాయని.. వాటితో మనకు సంబంధం లేనట్టు అంటీముట్టనట్టు ప్రవర్తిస్తాం. అదే ఓ కార్పొరేట్ స్కూల్లో విద్యార్థిని టీచర్ కాస్త కఠినంగా శిక్షిస్తే.. బ్రేకింగ్ న్యూస్‌లతో ఖండించి పారేస్తాం. మరి ఇదే ఆవేశం పేదింటి పిల్లలకు వర్తించదా..? మన పిల్లలను చూసుకున్నట్టు ఊళ్లోని చిన్నారులందరినీ ఎలా చూసుకోగలం అని ఎదురు ప్రశ్నించే వారికి నాదో చిన్నమాట. మీరు ఎవరి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ బాలల సమస్యలపై స్పందిస్తే చాలు. వారి హక్కులను కాలరాస్తున్నవారు వెనుకడుగు వేస్తారు. అనాథ బాలలను ఆదుకోవడానికి ఏర్పడిన సంస్థలను ప్రోత్సహిస్తే అందమైన బాల్యాన్ని ఆదరించినవారం అవుతాం. సహకరిస్తే జేజేలు.. సరైన ఆదరణ లేక రోడ్డెక్కిన బాల్యాన్ని తప్పుదోవ పట్టించేందుకు అసాంఘిక శక్తులు కాచుకు కూర్చుంటాయి. వాటి చేతికి చిక్కకుండా బాలలను సంరక్షించే సంస్థలు కొన్ని ఉన్నాయి. ఎవరికీ అవసరం లేని ఈ పిల్లల బాధ్యతను తీసుకుని వారికి ఆసరాగా నిలుస్తున్నాయి. మన హైదరాబాద్‌లో ఎస్‌వోఎస్, ఎమ్వీ ఫౌండేషన్, రెయిన్బో హోమ్స్, దివ్యదశ వంటి స్వచ్ఛంద సంస్థలు పిల్లలకు తగిన హోమ్స్ నిర్వహిస్తున్నాయి. మనకు తోచిన రీతిలో వీటికి సహకరించ వచ్చు. అంతేకాదు.. మన చుట్టూ ఉన్న సమాజంలో బాలలహితంగా లేని పరిస్థితులను సరిదిద్దవచ్చు. అవసరమైతే ఎదిరించొచ్చు. అందరం కలిస్తే అందమైన బాల్యాన్ని ఆనందంగా ఎదగనివ్వవచ్చు. నోబెల్ శాంతి పురస్కారంతో దేశాన్ని తట్టిలేపిన కైలాష్ సత్యార్థి గారికి అభినందనలతో.. నేను సైతం. -
కైలాశ్ సత్యార్థి, మలాలాకు నోబెల్ శాంతి బహుమతి
అంతర్జాతీయం యాంగ్ చాంగ్‌లో జీవ వైవిధ్య సదస్సు దక్షిణ కొరియాలోని యాంగ్ చాంగ్ నగరంలో జీవ వైవిధ్య సదస్సు (కాప్ 12)ను అక్టోబర్ 12 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించారు. అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణంలో భారత్ హవాయ్ దీవిలో నిర్మిస్తున్న ప్రపంచ అతిపెద్ద థర్టీ మీటర్ టెలిస్కోప్ (టీఎంటీ) నిర్మాణంలో జపాన్, అమెరికా, చైనా, కెనడాలతోపాటు భారత్ కూడా భాగం పంచుకుంటోంది. దీని నిర్మాణ ప్రారంభ కార్యక్రమం అక్టోబర్ 7న జరిగింది. హవాయి దీవిలో 4,012 మీటర్ల ఎత్తై మౌనా కీ అగ్ని పర్వతంపై 1.4 బిలియన్ డాలర్ల (రూ. 8,618 కోట్లు) వ్యయంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ టెలిస్కోపు ద్వారా 500 కి.మీ దూరంలో ఉన్న నాణెం పరిమాణాన్ని స్పష్టంగా చూడొచ్చు. ఈ టీఎంటీ నిర్మాణం 2022 నాటికి పూర్తవుతుంది. బెల్జియం ప్రధానిగా చార్లెస్ మైఖేల్ బెల్జియమ్‌లో కొత్త సెంటర్- రైట్ గవర్నమెంట్ అక్టోబరు 11న బాధ్యతలు చేపట్టింది. ప్రధానమంత్రిగా చార్లెస్ మైఖేల్ (38) ప్రమాణ స్వీకారం చేశారు. 1841 నుంచి ప్రధాని పదవి చేపట్టిన వారిలో అతి పిన్న వయస్కుడు చార్లెస్. ఆకలి సూచీలో భారత్‌కు 55వ స్థానం ప్రపంచ ఆకలి సూచీ(జీహెచ్ఐ)లో భారత్‌కు ఈ ఏడాది 55వ స్థానం దక్కింది. ఈ జాబితాలో గతేడాది 63వ స్థానంలో నిలిచిన భారత్.. ఏడాది కాలంలో 17.8 పాయింట్లు తగ్గించుకుని 55వ స్థానంలో నిలిచింది. జాతీయం మెట్రో పొలిస్ ప్రపంచ కాంగ్రెస్-2014 హైదరాబాద్‌లో 11వ మెట్రో పొలిస్ ప్రపంచ కాంగ్రెస్ అక్టోబర్ 6 నుంచి 10 వరకు జరిగింది. సదస్సును అక్టోబర్ 7న గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ అధికారికంగా ప్రారంభించారు. ఆసియా ఖండంలో ఈ సదస్సు జరగడ ం ఇదే తొలిసారి. ‘అందరి కోసం నగరాలు’ అనే ఇతి వృత్తం తో యువత, అందరికీ నివాసం, నగరాల్లో జీవనం అనే అంశాలపై సదస్సు సాగింది. తర్వాత సదస్సు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వేదికగా 2017లో జరగనుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అక్టోబర్ 9న అంతర్జాతీయ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. భారత నిర్మాణంలో రాష్ట్రాలు కేంద్రంతో కలిసి పనిచేయాలని ఆయన కోరారు. జాతీయ మానసిక ఆరోగ్య విధానం మొట్టమొదటి జాతీయ మానసిక ఆరోగ్య విధానా(నేషనల్ మెంటల్ హెల్త్ పాలసీ ఆఫ్ ఇండియా)న్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అక్టోబర్ 10న ప్రారంభించారు. మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, మానసిక అనారోగ్యం నుంచి కోలుకొనేలా చేయడం, ప్రతి వ్యక్తి తన పూర్తి జీవిత కాలం అనుభవించడం ఈ పాలసీ ఉద్దేశం. ఎంపీ ఆదర్శ గ్రామ పథకం ప్రారంభం లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ జయంతిని పురస్కరించుకొని ఎంపీ ఆదర్శగ్రామ పథకం (సాంసద్ ఆదర్శ గ్రామ్ యోజన-ఎస్ఏజీవై)ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 11న న్యూఢిల్లీలో ప్రారంభించారు. పథకం కింద ప్రతీ ఎంపీ 2019 నాటికి తన నియోజకవర్గంలోని ఏవైనా మూడు గ్రామాల్లో సదుపాయాలను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. పని చేయడానికి ప్రాధాన్యతనిచ్చే దేశాల్లో భారత్‌కు 18వ స్థానం పని చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే దేశాల్లో భారత్ 18వ స్థానంలో నిలిచింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు అక్టోబరు 6న విడుదల చేసిన నివేదికలో అమెరికా మొదటి స్థానంలో, రెండు మూడు స్థానాల్లో బ్రిటన్, కెనడా ఉన్నాయి. వార్తల్లో వ్యక్తులు భారత్‌లో పర్యటించిన ఫేస్బుక్ సీఈఓ ఫేస్బుక్ సీఈఓ, సహ వ్యవస్థా పకుడు మార్క్ జుకర్‌బెర్గ్ తొలిసారి భారత్‌లో పర్యటించారు. అక్టోబర్ 9న ఢిల్లీలో జరిగిన ఇంటర్నెట్ ఆర్గ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీని కలిసి డిజిటల్ ఇండియా కార్యక్రమానికి సాయం అందిస్తామని తెలిపారు. యునిసెఫ్ రాయబారిగా అమీర్‌ఖాన్ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ అక్టోబర్ 9న ఐక్యరాజ్యసమితి బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) దక్షిణ ఆసియా రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పిల్లల పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించేందుకు కృషి చేస్తారు. హెచ్‌యూఎల్ డెరైక్టర్‌గా కల్పనా హిందూస్థాన్ యునీ లీవర్ (హెచ్‌యూఎల్) డెరైక్టర్‌గా కల్పనా మోర్పారియా అక్టోబర్ 9న బాధ్యతలు స్వీకరించారు. హెచ్‌యూఎల్‌కు డెరైక్టర్‌గా పగ్గాలు చేపట్టిన తొలి మహిళ ఈమె. ప్రస్తుతం జేపీ మోర్గాన్ ఇండియాలో ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అంతేకాకుండా రెడ్డీస్ ల్యాబొరేటరీస్, బెన్నెట్ కోల్ మేన్ అండ్ కో తదితర సంస్థలలో ఆమె కీలక బాధ్యతలు నిర్విహిస్తున్నారు. క్రీడలు ఫోర్బ్స్ విలువైన క్రీడాకారుల్లో ధోనీ ఫోర్బ్స్ అక్టోబరు 8న విడుదల చేసిన ప్రపంచ విలువైన క్రీడాకారుల జాబితాలో భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని ఐదో స్థానంలో నిలిచాడు. ధోనీ బ్రాండ్ విలువ 20 మిలియన్ డాలర్లు (రూ. 122 కోట్లు). అమెరికా బాస్కెట్ బాల్ ప్లేయర్ లీ బ్రాన్ జేమ్స్ 37 మిలియన్ డాలర్లతో ఒకటో స్థానంలో ఉన్నాడు. టైగర్ ఉడ్స్ (గోల్ఫ్), రోజర్ ఫెదరర్ (టెన్నిస్) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఫెదరర్‌కు షాంఘై మాస్టర్స్ టోర్నీ చైనాలో జరిగిన షాంఘై మాస్టర్స్ టోర్నీ విజేతగా రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) నిలిచాడు. అక్టోబర్ 12న జరిగిన ఫైనల్లో గైల్స్ సైమన్‌పై గెలిచాడు. జయరామ్‌కు డచ్ ఓపెన్ టైటిల్ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అజయ్ జయరామ్ డ చ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఇది అతనికి తొలి గ్రాండ్ ప్రి టైటిల్. గతంలో చేతన్ ఆనంద్ (2009), ప్రకాశ్ పదుకొనె(1982)లు ఈ టైటిల్‌ను గెలుచుకున్నారు. అవార్డులుకైలాశ్ సత్యార్థి, మలాలాకు నోబెల్ శాంతి బహుమతిభారత్కు చెందిన కైలాశ్ సత్యార్థి, పాకిస్థాన్ బాలికమలాలా యూసుఫ్ జాయ్లు నోబెల్ శాంతి బహుమతికి సంయుక్తంగా ఎంపికయ్యారు. కైలాశ్ సత్యార్థి: వెట్టి చాకిరి నుంచి బాలల విముక్తికి 1980లో బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థను స్థాపించి మూడు దశాబ్దాలుగా పిల్లల హక్కుల కోసం కైలాశ్ సత్యార్థి పోరాడుతున్నారు. ఇప్పటి వరకూ 80 వేల మంది పిల్లల్ని వెట్టి చాకిరి, అక్రమ రవాణా నుంచి విముక్తి కల్పించారు. ఆయన చేపట్టిన ‘గ్లోబల్ మార్చ్ అగెనైస్ట్ చైల్డ్ లేబర్’ ఉద్యమం పలు దేశాల్లో కొనసాగుతోంది. కైలాశ్ సత్యార్థి నోబెల్ పురస్కారాన్ని అందుకున్న ఐదో భారతీయుడిగా నిలిచారు. భారత్‌లో జన్మించి, నోబెల్ శాంతి బహుమతి అందుకున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు. నోబెల్ అవార్డు పొందిన మిగతా నలుగురు భారతీయులు, రవీంద్రనాథ్ ఠాగూర్(1913, సాహిత్యం), సీవీ రామన్(1930, భౌతికశాస్త్రం), మదర్ థెరిసా (1978, శాంతి), అమర్త్యసేన్ (1998, ఆర్థికశాస్త్రం). ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ గెల్చుకున్న తొలి భారతీయుడు. మలాలా యూసుఫ్ జాయ్: పాకిస్థాన్‌కు చెందిన పదిహేడేళ్ల మలాలా యూసుఫ్ జాయ్ బాలికల విద్యకోసం ప్రాణాలకు తెగించి పోరాడింది. బాలికలు చదువుకోరాదంటూ తాలిబన్లు పాఠశాలల్ని పేల్చేశారు. తాలిబన్ల చర్యలకు ఎదురు తిరగడంతో 2012లో పాఠశాలకు వెళ్తున్న ఆమెపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన మలాలా లండన్‌లో చికిత్సపొందింది. ప్రస్తుతం ఆమె బర్మింగ్హమ్ స్కూల్లో చదువుకుంటోంది. ఐక్యరాజ్యసమితితో కలిసి విద్యా హక్కుల కోసం కృషి చేస్తోంది. అతి చిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతి పొందిన వ్యక్తిగా మలాలా రికార్డులకెక్కింది. రసాయన శాస్త్రం ఆప్టికల్ మైక్రోస్కోపును నానో స్కోపుగా మార్చే పరిజ్ఞానాన్ని ఆవిష్కరించిన అమెరికా, జర్మనీ శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్ లభించింది. అమెరికా శాస్త్రవేత్తలు ఎరిక్ బెట్జిగ్(54), విలియం మోర్నర్ (61), జర్మన్‌కు చెందిన స్టీఫెన్ హెల్ (51)్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్ వరించింది. అర్థశాస్త్రం ఫ్రాన్స్ ఆర్థిక వేత్త జీన్ టిరోల్ (61) కు నోబెల్ బహుమతి దక్కింది. మార్కెట్ శక్తి సామర్థ్యాలు, నియంత్రణ గురించి ఆయన చేసిన పరిశోధనను గుర్తిస్తూ అకాడ మీ ఎంపిక చేసింది. సాహిత్యం నాజీ మూకల దురాగతాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఫ్రెంచ్ సాహితీవేత్త పాట్రిక్ మోడియానో (69)కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం దక్కింది. మానవ జీవితాలను, నాజీల చేతుల్లో మారణ కాండకు గురైన యూదుల మనో భావాలు, వారు ఎదుర్కొన్న అవమానాలు, అస్థిత్వాన్ని కోల్పోవడం వంటివి ఆయన నవలల్లో ప్రధాన అంశాలు. మోడియానో ఫ్రెంచిలో 40కు పైగా నవలలు రాశారు. వాటిలో మిస్సింగ్ పర్సన్ నవలకు 1978లో ప్రతిష్ఠాత్మక ప్రిక్స్‌గాన్ కోర్టు అవార్డు లభించింది. ఆయన నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీతల్లో 11వ ఫ్రెంచ్ రచయిత. మైఖేల్ బ్లూమ్ బర్గ్‌కు బ్రిటన్ గౌరవ నైట్‌హుడ్ న్యూయార్క్ మాజీ మేయర్, సంఘ సేవకుడు మైఖేల్ బ్లూమ్‌బర్గ్‌కు అక్టోబర్ 6న బ్రిటన్ గౌరవ నైట్‌హుడ్‌ను అందించింది. శివథాను పిళ్లైకి లాల్ బహ దూర్ శాస్త్రి అవార్డు బ్రహ్మోస్ క్షిపణి పితామహుడు ఎ.శివథాను పిళ్లైకి 15వ లాల్‌బహదూర్ శాస్త్రి అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలో అక్టోబర్ 7న అందజేశారు. అగ్ని, పృథ్వి, నాగ్, ఆకాశ్ క్షిపణుల రూపకల్పనలో పిళ్లై పాత్ర ఎంతో ఉంది. అనూప్ జైన్‌కు ‘వెయిస్‌లిట్జ్ గ్లోబల్ సిటిజన్’ అవార్డు ప్రతిష్టాత్మక ‘వెయిస్‌లిట్జ్ గ్లోబల్ సిటి జన్ అవార్డుకు అనూప్ జైన్ ఎంపిక య్యాడు. పారిశుధ్య వసతులు కల్పనలో కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. అవార్డుతోపాటు లక్ష డాలర్ల నగదును ఆయన అందుకున్నాడు. 2011 లో అనూప్ జైన్ బీహార్‌లో హుమనుర్ పవర్(హెచ్‌పీ) అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నాడు. రాష్ట్రీయం ఆర్థిక పరిస్థితిలో హైదరాబాద్‌కు ఏఏ రేటింగ్ దేశంలో ఆరో పెద్ద నగరంగా పేరొందిన హైదరాబాద్ ఆర్థిక పరిస్థితిలోనూ బలమైందిగా రేటింగ్ సాధించింది. దేశ వ్యాప్తం గా పది నగరాలు ఏఏ (అఅ) రేటింగ్‌లో ఉండగా దక్షిణ భారతం నుంచి ఒక్క హైదరాబాద్ మాత్రమే ఉండటం విశేషం. జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆయా నగరాల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఒక్కో నగరానికి ఏఏఏ (అఅఅ) నుంచి సీ(ఇ) వరకు రేటింగ్ ఇస్తుంది. ఏఏఏ రేటింగ్ ఏ నగరానికీ దక్కలేదు. ఏఏ రేటింగ్‌లో హైదరాబాద్‌తోపాటు గ్రేటర్ ముంబై, నవీ ముంబై, నాసిక్, సూరత్, పుణే, న్యూఢిల్లీ, ఢిల్లీ, పింప్రి-చించ్వాడ్, థానే ఉన్నాయి. హుదూద్ పెను తుపాను హుదూద్ పెను తుపాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసింది. అక్టోబర్ 12న విశాఖపట్నం సమీపంలో తీరం దాటిన హుదూద్ పెను తుపాను.. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులతో ఈ సముద్ర తీర నగరంలో కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించింది. రవాణా, సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయి. విశాఖపట్నంతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి తుపాను తాకిడికి గురయ్యాయి. ఈ తుపాన్‌కు హుదూద్ అనే పేరును ఒమన్ సూచించింది. హుదూద్ అనేది ఇజ్రాయిల్ జాతీయ పక్షి. ఈ పేరును ఒమన్ దేశం సూచించింది. ఇది ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాల్లో కనిపిస్తుంది. సుద్దాలకు ‘కొమురం భీం’ జాతీయ పురస్కారం 2014 కొమురం భీం జాతీయ పురస్కారానికి ప్రముఖ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ ఎంపికయ్యారు. కొమురం భీం స్మారక ఉత్సవ పరిషత్, ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ సమితి, భారత్ కల్చరల్ అకాడమీ, ఓం సాయి తేజ ఆర్ట్స్ సంయుక్తంగా ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నాయి. దీనికింద రూ.50,116 నగదుతోపాటు, ప్రశంసాపత్రం అందజేస్తారు. -
'40 ఏళ్లుగా గుడికెళ్లడం లేదు'
తాను దేవుళ్లను పూజించనని బాలబంధు, నోబెల్ శాంతి పురస్కార విజేత కైలాష్ సత్యార్థి తెలిపారు. పిల్లలు దేవుళ్లకు ప్రతిరూపాలని చెప్పారు. వారి స్వేచ్ఛా, బాల్యాన్ని కాపాడడమే తన భక్తి మార్గమని వెల్లడించారు. తాను గత 40 ఏళ్లుగా ఆలయాలకు లేదా మసీదులకు వెళ్లలేదని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బాలలే తన బలమని అన్నారు. ఇంజినీరింగ్ కెరీర్ ను వదులుకున్నప్పుడు తన తల్లి కన్నీళ్లు పెట్టుకుందని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.... 'నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోయారు. మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివించింది. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నేను ఉద్యోగాన్ని వదులుకున్నప్పుడు ఆమె చాలా బాధపడింది. ఏదో ఒక రోజు నన్ను చూసి గర్వపడతావని అప్పుడు మా అమ్మతో చెప్పా. వ్యక్తిగతంగా ఆడంబరాలు, అవార్డులు, పురస్కారాలు నాకు ఇష్టం ఉండవు. ఐక్యరాజ్యసమితి కంటే ముందుగా 1981లో బాలల హక్కుల కోసం గళం విప్పాను. 1989 నుంచి బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి దృష్టి సారించింది. ఈ విషయాలన్ని నోబెల్ కమిటీ పరిశీలించింది. నోబెల్ శాంతి పురస్కారంతో పాటు వచ్చే నగదు ఏవిధంగా ఖర్చు చేయాలనే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 400 మంది బాలలతో కూడిన బాల మహాపంచాయతీ నిర్ణయం మేరకు నిధులు ఖర్చుచేస్తాం. ప్రతిపైసా చిన్నారుల సంక్షేమం కోసం ఉపయోగపడాలన్నదే నా ఆకాంక్ష. మేము కొత్తగా చేపట్టిన 'పీస్ ఫర్ చిల్డ్రన్' కార్యక్రమంలో చేరాలని నాతో కలిసి నోబెల్ శాంతి పురస్కారం గెల్చుకున్న పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ ను ఆహ్వానించాను. భారత్, పాకిస్థాన్ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా చిన్నారులు శాంతియుత వాతావరణంలోనే పెరగాలి. మాలాలా అంటే నాకెంతో గౌరవం. పాకిస్థాన్ లో బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక పోరాటాలకు నేను మద్దతుపలికే నాటికి ఆమె ఇంకా పుట్టనేలేదు. 1987లో పాకిస్థాన్ సైన్యం నన్ను లాహోర్ వెలుపల మట్టుబెట్టాలని చూసింది. ఇటుక తయారీ కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా పాకిస్థాన్ సైనికులు వచ్చి నా తలపై తుపాకులు ఎక్కుపెట్టారు. నేను చిరునవ్వు నవ్వాను. కొన్ని నిమిషాలు ఆగితే నా ప్రసంగం పూర్తవుతుంది తర్వాత నన్ను చంపండి అని సమాధానమిచ్చాను. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని భావిస్తున్నాం. టీ అమ్మే స్థాయిని నుంచి దేశానికి ప్రధాని అయ్యే స్థాయికి ఎదిగానని మోడీ చెబుతున్నారు. ఇక ఏ చిన్నారి బాలకార్మికుడిగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ప్రతి కుర్రాడు దేశ ప్రధాని కాలేడు. కానీ ప్రతి పిల్లాడు స్కూల్ కు వెళ్లగలడు. మంచి విద్య పొందగలడు' అని కైలాష్ సత్యార్థి అన్నారు. -
‘నోబెల్’ సందేశం గ్రహించారా?
తొమ్మిది రోజులుగా గర్జించిన పాక్ శతఘు్నలు ఇప్పుడు మూగపోయాయి. అది ఆశావహమైన నోబెల్ కమిటీ సదుద్దేశాల ఫలితమేనని దానికి ధన్యవాదాలు తెలపాల్సిన పనేమీ లేదు. పాక్‌కు తగ్గట్టుగానే ఇంతకింత అన్న తీరుగా భారత్ బదులు చెప్పడమే కాదు, ఇంకాస్త ఎక్కువగానే ముట్టజెప్పింది. పాక్ ప్రభుత్వం మరింతగా ఈ ఘర్షణలను తీవ్రతరం చేస్తుందని ఊహాగానాలు సాగాయి. పాక్ సైనికాధికారుల సరికొత్త వ్యూహాత్మక లక్ష్యం దీర్ఘకాలిక శతృత్వ స్థితి అయితే తప్ప అలా జరిగే సూచనలేవీ లేవు. వారు అటల్ బిహారీ వాజ్‌పేయిని పరీక్షించి చూసినట్టుగా మోదీని కూడా పరీక్షించాలనుకుంటున్నారా? అలా చేస్తే అంతకు మించిన మూర్ఖత్వం ఉండదు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఢిల్లీకి చెందిన గాంధేయవాది కైలాష్ సత్యార్థిని, ప్రవాసంలో గడుపుతున్న అసాధారణ పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్‌లను ఎంపిక చేశారు. వారి ఎంపిక ద్వారా నార్వే నోబెల్ కమిటీ... ప్రపంచం మెచ్చేది సంక్షేమ మంత్రాన్నే గానీ యుద్ధ తంత్రాన్ని కాదనే శక్తివంతమైన సందేశాన్ని పంపింది. పాకిస్థాన్ యుద్ధ సైనిక వ్యవస్థలో ఉన్నవారెవరైనాగానీ కాస్త చెవులకు పట్టిన తుప్పును వదలించుకుని ఆ సందేశాన్ని వినడం మొదలెట్టాలి. అదేదో నిరాకారమైన మానవాళి ఉద్ధరణ కోసమనో లేక సంఘర్షణలో చిక్కుపడి ఉన్న ఉపఖండం మంచి కోసమనో గాక పాకిస్థాన్ బాగు కోసమేనని భావించి మరీ వినాలి. ఇంతవరకు ఇద్దరు పాకిస్థానీలకు నోబెల్ బహుమతి లభించింది. 1979లో భౌతిక శాస్త్రవేత్త అబ్దుస్ సలామ్‌కు, ఇప్పుడు మలాలాకు. సలామ్ దైవ భక్తి గలిగిన ధర్మ నిష్టాపరుడే. అయినాగానీ ఆయన హత్యకు గురవుతానే మోనన్న భయంతో పాక్‌లో అడుగు పెట్టలేరు. కారణం ఆయన ఖాదీయానీ (అహ్మదీ ముస్లిం) శాఖకు, మత భ్రష్టమైనదిగా ముద్రవేసిన శాఖకు చెందినవాడు. ఉగ్రవాదాన్ని దుందుడుకు తిరోగమనవాద సామాజిక అజెండాతో కలగలిపిన ఆటవిక ఉగ్రవాదులకు బాలికల విద్యలో విశ్వాసంలేదు. కాబట్టి మలాలా వారికి లక్ష్యంగా మారింది. భారత్, అఫ్ఘానిస్థాన్‌లకు వ్యతిరేకంగా సాగు తున్న ముసుగు యుద్ధంలో అగ్రశ్రేణిలో నిలవడానికి ఆత్మాహత్యా సదృశమైన ఉత్సాహాన్ని ప్రదర్శించే పాక్ ‘రాజ్యంలోని రాజ్యం’ ఆ ఉగ్రవాద ముఠాలకు రక్షణను కల్పిస్తోంది. తొమ్మిది రోజులుగా వైషమ్యంతో గర్జించిన పాక్ శతఘు్నలు ఇప్పుడు మూగపోయాయి. అది ఆశావహ మైన నోబెల్ కమిటీ సదుద్దేశాల ఫలితమేనని దానికి ధన్య వాదాలు తెలపాల్సిన పనేమీ లేదు. పాక్‌కు తగినట్టుగానే ఇంత కింత అన్న తీరుగా భారత్ బదులు చెప్పడమే కాదు, ఇంకాస్త ఎక్కువగానే ముట్టజెప్పింది. పాక్ ప్రభుత్వం మరింత ప్రమాదకరంగా ఈ ఘర్షణలను తీవ్రతరం చేస్తుందని ఊహాగానాలు సాగాయి. పాక్ సైనికాధికారుల సరికొత్త వ్యూహాత్మక లక్ష్యం దీర్ఘకాలిక శతృత్వ స్థితి అయితే తప్ప అలా జరిగే సూచనలేవీ లేవు. వారు అటల్ బిహారీ వాజ్‌పేయిని పరీక్షించి చూసినట్టుగా నరేంద్ర మోదీని కూడా పరీక్షించాలనుకుంటున్నారా? అలా చేస్తే అంతకు మించిన మూర్ఖత్వం ఉందడు. ఒత్తిడికి లొంగి పోవడానికి ఆయనేమీ బలహీనుైడైన నేత కారు. రాహుల్ గాంధీ తిరిగి తనకే బెడిసి కొట్టగుండా తుపాకీని పేల్చడం అతి అరుదు. పాక్ ఒత్తిడికి మోదీ, రక్షణ మంత్రి అరుణ్ై జెట్లీలు లొంగిపోతున్నారని ఆయన శాసన సభ ఎన్నికల ప్రచారంలో అన్నారు. అలా అని ఆయన కాంగ్రెస్ ఓట్లు మరింత క్షీణించి పోయేలా చేశారు. క్విక్జోట్లాగా రాహుల్ ఇలా గాలి మరలపైకి తిరిగారో లేదో, 48 గంటలు గడిచేలోగానే పాక్ వెనక్కు తగ్గింది. పాక్ దౌత్య, సైనిక అధికారులు టీవీల్లో లేదా సమా వేశాల్లో కనిపించినప్పుడల్లా ఇదంతా ముందుగా ప్రారంభించినది భారత దేశమేనంటూ ఒకే ఒక్క సుపరిచితమైన ఆధారాన్ని చూపుతుంటారు. ఇతర రంగాల్లో, ప్రత్యేకించి దేశంలోపలే పలు అంతర్గత యుద్ధాల్లో పాక్ సైన్యం పెద్ద ఎత్తున మునిగి ఉండగా భారత్‌తో ఘర్షణకు దిగడానికి తగు కారణమేదీ లేదని వివరణ ఇస్తుంది. ఇదో కుత్సితం. హేతుబద్ధత మాటున పాక్ హేతువిరుద్ధమైనదాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేస్తోంది. భారత్‌పై యుద్ధానికి దిగడానికి హేతుబద్ధమైన కార ణం ఏదైనాగానీ ఉండాల్సిన అవసరం ఉన్నదని పాక్‌కు ఎప్పుడూ అనిపించలేదు. శాంతియుతంగా చర్చలతో సాధించుకోగల దాన్ని యుద్ధంతో చేజిక్కిం చుకోవాలనే దే స్వాతంత్య్రం తర్వాత అది తీసుకున్న మొట్టమొదటి ముఖ్య నిర్ణయం. అటు పాక్‌లోగానీ, ఇటు భారత్‌లో గానీ విలీనం కాకుండా ఉన్న కాశ్మీర్ కోసం అది అక్టోబర్ 1947లోనే తిరుగు బాటు దార్లను, ఉగ్రవాదులను ప్రయోగించి దురాక్రమణను ప్రారం భించింది. ఏ మాత్రం సాధారణ ఇంగితం మార్గ దర్శకత్వంలోనైనా పాక్ విధానం సాగి ఉంటే 1948 వసంతం లేదా వేసవి నాటికే (అప్పటికి మనకు లభిం చినది అధినివేశ ప్రతిపత్తి మాత్రమే) బ్రిటిష్‌వారి అజమాయిిషీ కిందనే కాశ్మీర్ సమస్య శాంతి యుతంగా పరిష్కారమై ఉండేది. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదం, ముసుగు యుద్ధం, సాధారణ సంఘర్షణలను కలగలిపి 1965లో భారత్‌పై యుద్ధానికి దిగింది. సాధారణ యుద్ధం ద్వారా కాశ్మీర్‌ను జయించడం ఎన్నటికీ సాధ్యంకాదని అది 1965, 1971 యుద్ధాల తదుపరి గ్రహించింది. దీంతో అది ఉగ్రవాదం, మంద్ర స్థాయి రెచ్చగొట్టే చర్యలు, సరిహద్దు ఉద్రిక్తతల ఎత్తుగడలను కలగలిపి కాశ్మీర్ సమస్యను సజీవంగా ఉంచగలిగే ఏకైక ఆధరువుగా మార్చింది. తద్విరుద్ధంగా, 1949 జనవరిలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన ప్పటి నుండి భారత్ ఎన్నడూ కాశ్మీర్లో తన భూభాగాన్ని విస్తరింపజేసుకోవాలని కోరుకోలేదు. 1971 యుద్ధంలో ఢాకాలో దాని 90 వేల బలగాలు మనకు లొంగిపోయిన దుస్థితిలో పాక్ ఉన్నప్పుడు కూడా మన దేశం ఆ ప్రయత్నం చేయలేదు. అలా అని దాడికి గురైనప్పుడు భారత్ బల గాలు చేతులు ముడుచుకు కూచుంటాయని కాదు. దశాబ్దిగా ఎన్నడూ ఎరుగని స్థాయి లలో పాక్ గత వారంలో హింసను రేకెత్తించగా మన బలగాలు మోదీ నాయకత్వంలో గట్టిగా బదులు చెప్పాయి. అసలు ఇప్పడు ఎందుకీ సరిహద్దు కాల్పులు? అనే ప్రశ్న మనకింకా మిగిలే ఉంటుంది. సమాధానంలోని కొంత భాగం ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు బరాక్ ఒబామాలు వాషింగ్టన్లో విడుదల చేసిన కీలకమైన సంయుక్త ప్రకటనలో ఉన్నదేమోనని ఆశ్చర్యం కలుగుతోంది. అమెరికా మొట్టమొదటిసారిగా పాక్ అభ్యం తరాలను పక్కన పెట్టి పాక్ భూభాగంపై ఉన్న ఉగ్రవాద స్థావరాలకు వ్యతిరేకంగా సాగే యుద్ధంలో భారత్ నిర్వహించాల్సిన సమంజసమైన పాత్ర ఉన్నదని అంగీకరించింది. తప్పుడు వ్యాఖ్యానాలకు గురికాకుం డటం కోసం నిర్దిష్టంగా ఆ ప్రకటన లష్కరే తోయిబా, జైషే మొహ్మద్, అల్‌కాయిదా, హక్కానీ నెట్ వర్క్ (అఫ్ఘానిస్థాన్‌లో పనిచేసేది), దావూద్ ఇబ్రహీం ‘డి’ కంపెనీ, ఇరాక్ ఇస్లామిక్ రాజ్యం వంటి సంస్థల పేర్లను పేర్కొనలేదు. ఇది భారత్, అమెరికా వ్యూహాత్మక సంబంధాన్ని అత్యంత ప్రమాదకరమైన యుద్ధ ప్రాంతంలోకి విస్తరింపజేసి, ఈ యుద్ధంలో భారత్‌ను అమెరికాకు ముఖ్య మిత్రునిగా మారుస్తుంది. అమెరికా రక్షణశాఖ పెంటగాన్‌తో వ్యవహరించేట్పపుడు అమెరికా రక్షణ దుర్గంగానూ, జిహాదిస్టులతో వ్యవహరించేటప్పుడు ఉగ్రవాద స్థావరంగాగానూ పాక్ ద్విపాత్రాభి నయం చేస్తోంది. ఆ ద్విపాత్రాభినయం ఇప్పడు పూర్తిగా బహిర్గతం కాకపోయినా మునుపెన్నడూ ఎరుగని విధంగా ఇబ్బందుల్లో పడింది.పాక్ సైన్యాధికారులు తమ సాయుధ శక్తిని తూర్పు రంగానికి మరలుస్తున్నామని భారత్, అమెరికా లకు సంకేతం పంపుతున్నారా? (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఎం.జె. అక్బర్ -
శాసిస్తే... ఖబడ్దార్
ఒంగోలు: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రెండో రోజైన శనివారం కూడా తీవ్ర వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశం హాలులో ప్రారంభమైన ఈ సమావేశంలో బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి మాట్లాడుతూ పలుమార్లు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ జడ్పీ చైర్మన్‌ను విమర్శించడంతో ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అడ్డగోలు’ అనే పదాన్ని ఉపసంహరించుకోవాలి. సభాధ్యక్షుడ్ని గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి అంటూ హితవు పలికారు. తాను అడ్డగోలు తనంగా తీర్మానం పెట్టరాదని మాత్రమే చెప్పానని, అలా చేస్తే చట్టవిరుద్ధంగా చేశారంటూ ప్రభుత్వం రద్దుచేస్తుంది...అప్పుడు ఏం చేస్తారంటూ ఎంపీ చెబుతుండగానే జడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ మరింత ఆగ్రహానికి గురయ్యారు. ప్రభుత్వంలో ఉన్నది మీరు...మంచిపనికి ..చెడ్డపనికి తేడా తెలియదా....మంచి పనిని ఫ్రభుత్వం ఎందుకు రద్దుచేస్తుంది....రాజకీయంగా మాట్లా డి జడ్పీని నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదంటూ మండిపడ్డారు. ఇప్పటికే స్టాండింగ్ కమిటీలు వేయకుండా అడ్డుకుంటున్నారు. ఇంకా జిల్లా అభివృద్ధిని కూడా నిర్వీర్యం చేయాలని చూస్తే జడ్పీటీసీ సభ్యులు, జిల్లా ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. వ్యవసాయంపై చర్చ... అనంతరం వ్యవసాయశాఖపై చర్చకు జెడ్పీ చైర్మన్ అనుమతించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడుతూ శనగకు ప్రత్యామ్నాయంగా ఏయే పంటలు వేసుకోవాలో రైతులను చైతన్యం చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైందని విమర్శించారు. ఇప్పటికే కోల్డ్ స్టోరేజీలలో శనగలు నిల్వ ఉంచుకొని రైతాంగం తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నా ప్రత్యామ్నాయ చర్యలపై మౌనం వహించడం సరికాదంటూ పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, కౌలు రైతులకు రుణాలు తదితర అంశాలపైనా ప్రశ్నల పరంపర కొనసాగించారు. మార్కాపురం ప్రాంతాల్లో ఎరువులు, పురుగు మందుల ధరలు ఎంఆర్పీ కంటే దాదాపు వంద రూపాయల తక్కువకు విక్రయిస్తున్నారని, నాసిరకంగా ఉన్నాయేమో పరిశీలించాలని సూచించారు. అద్దంకి నియోజకవర్గంలో కొన్ని సొసైటీలకు ఎరువులు ఇచ్చి, మరికొన్ని సొసైటీలకు నిధులు ఇవ్వకుండా అధికారులు వ్యవహరించడం సరికాదంటూ అద్దంకి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బల్లికురవ ఏవోపై ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లోపం ఎక్కడ జరిగిందో పరిశీలించి చర్యలు తీసుకుంటామని జేడీ మురళీకృష్ణ సమాధానమిచ్చారు. ఫారెస్ట్ అకాడమీని దోర్నాలలో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలి సమైక్య రాష్ట్రంలో ఫారెస్ట్ అకాడమీ అదిలాబాద్ జిల్లాలో ఉందని, అయితే నేడు రాష్ట్రం విడిపోయిన తరువాత నల్లమల అటవీప్రాంతం దట్టంగా ఉన్న యర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాలలో ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలంటూ సమావేశంలో డేవిడ్‌రాజు సూచించారు. ప్రతిపాదనను తప్పకుండా ప్రభుత్వానికి పంపుతామంటూ జడ్పీ చైర్మన్ ప్రకటించారు. అనంతరం అధికారులు తుఫాను ప్రభావ ప్రాంతాలలో సేవలందించేందుకు అం దుబాటులో ఉండాల్సి ఉన్నందున సర్వసభ్య సమావేశాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించారు. కైలాష్ సత్యార్థి....మలాలకు జడ్పీ అభినందనలు... బాల కార్మికుల నిర్మూలనకు , బాలికా విద్య కోసం ఒంటరి పోరాటం చేస్తూ నోబుల్ శాంతి బహుమతికి ఎంపికైన మధ్యపదేశ్ ఇంజినీర్ కైలాష్ సత్యార్థి, పాక్ బాలిక మలాలాను అభినందించే తీర్మానాన్ని అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవి కుమార్ ప్రవేశపెట్టగా సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ ప్రతిపాదించారు. మార్కాపురం శాసనసభ్యుడు జంకే వెంకటరెడ్డి, యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజులు మాట్లాడుతూ మధర్థెరెస్సా తరువాత నోబుల్ శాంతి బహుమతికి ఎంపికైన సత్యార్థి మన దేశవాసులందరికీ గర్వకారణమంటూ ప్రశంసించారు. 80 వేలమంది బాల కార్మికులకు విముక్తి కల్పించిన సత్యార్థికు అభినందనలు ప్రకటిస్తూ ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే అంశంపై కొండేపి శాసన సభ్యుడు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ తీర్మానాన్ని తాము కూడా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. -
హక్కుల కోసం ఇక్కడికీ వచ్చారు..
నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థికి తాండూరుతో అనుబంధం 13 ఏళ్ల క్రితం చైతన్య ర్యాలీలో స్ఫూర్తిదాయక ప్రసంగం తాండూరు: ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికైన కైలాష్ సత్యార్థికి తాండూరుతోనూ అనుబంధముంది. బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం, వెట్టిచాకిరి నుంచి బాల కార్మికులకు విముక్తి కల్పిం చడం, వారి ఆరోగ్యం కోసం దక్షిణాసియా యాత్రలో భాగంగా కైలాష్ సత్యార్థి దాదాపు పదమూడేళ్ల క్రితం తాండూరుకు వచ్చారు. మావిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేష్(ఎంవీఎఫ్) కార్యదర్శి పద్మశ్రీ శాంతసిన్హాను ఎన్నోసార్లు ఢిల్లీలో కలిసి తాండూరులో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కులపై ఉపాధ్యాయులు, చైల్డ్ రైట్స్‌ఫోరం తదితర స్వచ్ఛంధ సంస్థలు చేస్తున్న కార్యక్రమాలను కైలాష్ సత్యార్థి అడిగి తెలుసుకున్నారు. బాలల హక్కులు, విద్య, ఆరోగ్య, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలనే ఆలోచనతో ఆయన దక్షిణాసియాలో గ్లోబల్ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 2001లో ఆయన భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. 2001 మార్చి 22న కైలాష్ సత్యార్థి కర్ణాటక రాష్ట్రం నుంచి మహబూబ్‌నగర్ జిల్లా మీదుగా తాండూరుకు వచ్చారు. ఆయనతోపాటు జర్మనీ తదితర దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం కూడా వచ్చింది. తాండూరు ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో ఆయనకు స్థానిక ఉపాధ్యాయులు, స్వచ్ఛంధ సంస్థలు స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఎంపీటీ హాల్లో భారీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఆయన విద్యార్థులు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, వెట్టిచాకిరీ నుంచి విముక్తి పొందిన బాలలతో కలిసి తాండూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, విద్య, వెట్టిచాకిరీ విముక్తికి ఇక్కడి బాలల హక్కుల సంఘం, ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటాల గురించి ఆయన తెలుసుకొని అభినందించారు. ఎంపీటీ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ బాలల హక్కుల పరిరక్షణ బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిదని అన్నారు. వెట్టిచాకిరీ చేయకుండా ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత స్వచ్ఛంధ సంస్థలు చేపట్టాలని స్ఫూర్తి నింపారు. అందరం బాధ్యతగా బాలల హక్కుల కోసం పోరాడినప్పుడే వెట్టిచాకిరీ నశిస్తుందన్నారు. భారతయాత్ర అనంతరం వివిధ రాష్ట్రాల్లో ఆయన పరిశీలించిన అంశాలను అప్పటి ప్రధాన మంత్రికి వివరించారు. అలాంటి సామాజిక కార్యకర్తకు ప్రతిష్టాత్మకమైన శాంతి నోబెల్ పురస్కారం దక్కడం పట్ల స్థానిక రిటైర్డ్ ఉపాధ్యాయుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యా య అవార్డు గ్రహీత జనార్దన్ హర్షం వ్యక్తం చేశారు. తాండూరు పర్యటనలో కైలాష్ సత్యార్థి చేసిన ప్రసంగం, ర్యాలీ స్ఫూర్తితో బాలల హక్కుల సంఘాలు, ఉపాధ్యాయులు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయడానికి ఉద్యమించారు. ఎంతోమంది బాలకార్మికులకు విముక్తి కలిగించడం జరిగిందని జనార్దన్ గుర్తు చేశారు. 2005 సంవత్సరంలో హైదరాబాద్ లలిత కళాతోరణంలో జరిగిన ప్రపంచస్థాయి సదస్సుల్లో కూడా ఆయన పాల్గొని బాలలను వెట్టి నుంచి విముక్తి చేయడానికి చైతన్య పరిచారని ఆయన గుర్తు చేశారు. సుందరయ్య విజ్ఞాన భవన్లో అప్పట్లో జరిగిన మరో కార్యక్రమంలో కూడా కైలాష్ సత్యార్థి పాల్గొని ఎన్జీఓలను బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని ప్రేరణ కల్పించారని ఆయన గుర్తు చేశారు. ఆయన నోబెల్ పురస్కారం రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. -
కేంద్ర పథకాలకు సత్యార్థి సహకారం
ప్రధాని మోదీతో భేటీ అయిన నోబెల్ విజేత న్యూఢిల్లీ: నోబెల్ శాంతి బహుమతి విజేత కైలాష్ సత్యార్థి కుటుంబ సభ్యులతో కలసి శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్ భారత్, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకాలకు తన సహకారం అందిస్తానని ఈ సందర్భంగా సత్యార్థి ఆసక్తి వ్యక్తం చేశారు. తప్పిపోయిన చిన్నారులను గుర్తించేందుకు తాను సోషల్ మీడియా, ఇంటర్నెట్ను ఎలా వినియోగించుకున్నదీ ప్రధానికి వివరించారు. బాల కార్మికులు లేని దేశంగా భారత్‌ను మార్చేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. నోబెల్ అవార్డుకు ఎంపికైన సత్యార్థికి ప్రధాని ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆయన ప్రయత్నాలు ఫలించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అలాగే, ప్రపంచంలో తొలి చిన్నారుల యూనివర్సిటీని గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటన జారీ చేసింది. వీరి భేటీ ఫొటోను మోదీ ట్విట్టర్ ఖాతాలోనూ ఉంచారు. నోబెల్ శాంతి పురస్కారానికి సత్యార్థి, మలాలా సంయుక్తంగా ఎంపికైన విషయం తెలిసిందే. సత్యార్థి నోబెల్ పురస్కారానికి ఎంపికవడం దేశానికి గర్వకారణంగా పేర్కొంటూ మోదీ శుక్రవారమే ట్విట్టర్ ద్వారా స్పందించారు. -
అభినందన వెనుక అభిశంసన
త్రికాలమ్ భారతీయులకో, భారతదేశానికో అంతర్జాతీయ ఖ్యాతి లభించినప్పుడు ఆనం దించని దేశవాసులు ఉండరు. కొన్ని సందర్భాలు మాత్రం సందిగ్ధంలో పడవే స్తాయి. గుండెనిండా దేశభక్తి నింపుకున్నవారికి సైతం సంకటావస్థలు ఎదురవు తాయి. ఏ విధంగా స్పందించాలో తెలియని అయోమయం ఆవహిస్తుంది. బాల బంధు కైలాష్ సత్యార్థికీ, సాహస బాలిక మలాలా యూసఫ్జాయికీ ఉమ్మడిగా ఈ యేడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న నిర్ణయాన్ని ప్రకటించిన సన్నివేశం ఇటువంటిదే. తనపైనా, తన సహచరులపైనా ఎన్ని దాడులు జరిగినా బాలకార్మికుల విముక్తికోసం మొక్కవోని ధైర్యంతో, అకుంఠిత దీక్షతో మూడు దశాబ్దాలు అహరహం శ్రమించినందుకు సత్యార్థికి అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతి దక్కింది. పాకిస్థాన్‌లో నెలకొన్న హింసాయుత వాతావరణంలో తాలిబాన్‌ను ఎదిరించి, ప్రాణాలకు తెగించి బాలికలకు చదువుకునే హక్కు సాధించడం కోసం పోరాడుతున్న మలాలాను అతి పిన్నవయస్సులోనే అత్యున్నత పురస్కారం వరించింది. వారిని సహస్రాభినందనలతో ముంచెత్తడం సముచితం. ఇది వారి వ్యక్తిగత విజయం. ఇందులో భారతదేశం కానీ పాకిస్థాన్ కానీ గర్వించవలసింది ఏమైనా ఉన్నదా? రెండు దేశాల అగ్ర నాయకులూ, వివిధ రంగాల ప్రముఖులూ సంతోషం వెలిబుచ్చడంలో అర్థం ఉందా? నోబెల్ కమిటీ చేసిన ప్రకటనలో అభినందన వెనుక దాగున్న అభిశంసనను రెండు దేశాల ప్రజలూ, పాలకులూ గమనించాలి. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. మలాలా పాకిస్థాన్‌లో పుట్టకపోయినా, సత్యార్థి భారత దేశంలో పుట్టి పెరగక పోయినా నోబెల్ శాంతి బహుమతి వచ్చేది కాదు. సత్యార్థి సత్య నాదెళ్ళలాగానే ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తికాగానే అమెరికా వెళ్ళి ఉంటే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీకి అధిపతి అయ్యేవాడేమో కానీ ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో)ను నెలకొల్పి బాలకార్మికుల విముక్తికోసం బచ్పన్ బచావ్ ఆందోళన్ నిర్వహించవలసిన అవసరం ఉండేది కాదు. అమెరికాలో తివాచీ కార్ఖానాలలో కానీ ఇటుక బట్టీలలో కానీ బాలకార్మికులను నియమించిన దాఖలా లేదు. ఇప్పుడు చదువుకుంటున్న ఇంగ్లండ్‌లోనే మలాలా పుట్టి ఉంటే బాలికల విద్యాహక్కు కోసం అక్కడ పోరాటం చేయవలసిన అవసరం ఉండేది కాదు. అక్కడ తాలిబాన్లు లేరు. బాలికల చదువుపైనా, టీకాలు వేయడంపైనా నిషేధం లేదు. బడికి వెళ్ళే బాలికలను చంపివేసే రాక్షసత్వం లేదు. పాకిస్థాన్‌లో పుట్టింది కనుకనే మలాలా తాలిబాన్ తూటాలకు గాయపడవలసి వచ్చింది. అక్కడ పెరిగింది కనుకనే బడికి వెళ్ళడం పెద్ద సాహస కార్యం అయింది. తనబోటి బాలికలకు చదువుకునే హక్కు ఉండాలంటూ పోరాటం చేసే స్ఫూర్తి లభించింది. మలాలాకు పాశ్చాత్య దేశాలలోని ప్రభుత్వాల, రాజకీయ వ్యవస్థల, మీడియా వ్యవస్థల సహకారం సంపూర్ణంగా లభించింది. ఇంట్లో తుపాకీ మోత బయట పల్లకీ మోత చందం ఆమె పరిస్థితి. సత్యార్థి 49 దేశాలలో బాలకార్మికుల విమోచన కోసం కృషి చేసినప్పటికీ మొన్నటి వరకూ మీడియా సంస్థలు పట్టించుకోలేదు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటన జరిగినప్పుడు దాయాది దేశాలు ఏ స్థితిలో ఉన్నాయి? సరిహద్దులో కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. కాల్పులు జరుపుకుం టున్నాయి. పరస్పరం దూషించుకుంటూ మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఇండియాలో ఇప్పుడు ఉన్నది మన్మోహన్ ప్రభుత్వం కాదనీ నరేంద్ర భాయ్ మోదీ సర్కార్ ఉన్నదని గమనించాలనీ పాకిస్థాన్‌ను హెచ్చరిస్తూ దేశీయాంగ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బడాయి పోతున్నారు. మన సైనికులు పాకిస్థాన్ సైనికులకు తగిన శాస్తి చేశారనీ (ముహ్‌తోడ్ జవాబ్ దియే), శత్రు సైనికులు తోకముడిచారనీ ప్రధాని మోదీ సగర్వంగా చాటుతూ ఎన్నికల ప్రచారాన్ని రక్తికట్టిస్తున్నారు. కాంగ్రెస్ ఉపా ధ్యక్షుడు రాహుల్ గాంధీ సరిహద్దు ప్రహసనాన్ని ప్రచారాస్త్రంగా సంధించారు. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటున్నదనీ, ప్రజలూ, సైనికులూ ప్రశాంతంగా బక్రీద్ వేడుకలు జరుపుకుంటున్నారనీ, కాల్పులు విరమించాలనీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు. రెండు ముఖ్యమైన రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో సరిహద్దులో నిజంగా ఏమి జరిగిందో సైన్యాధికారు లకూ, ప్రభుత్వాధినేతలకూ, ఇంగ్లిష్ టీవీ చానళ్ళకు మాత్రమే తెలుసు. యుద్ధ సన్నాహాలలో ఉన్న రెండు దేశాలకు చెందిన ఇద్దరు సాహసులకూ శాంతి బహుమతి ప్రకటించడం ద్వారా నోబెల్ కమిటీ ఒక సందేశం ఇచ్చింది. ఒక హెచ్చరిక చేసింది. రెండు దేశాలలో శాంతి కాముకులు ఉన్నారు. జనాభాలలో అత్యధికులు శాంతిప్రియులే. బహుమతి ప్రకటన తర్వాత మలాలా, సత్యార్థి చెప్పినట్టు రెండు దేశాల అధినేతలూ రెండు దేశాలలోనూ, రెండు దేశాల మధ్యా శాంతి సుస్థిరత లు నెలకొల్పే మహోద్యమానికి నాయకత్వం వహించాలన్నది సందేశం. రెండు దేశాలలోనూ అమానవీయమైన, అవమానకరమైన పరిస్థితులు నెలకొ న్నాయనీ, వాటిని సరిదిద్దుకోవాలనీ హెచ్చరిక. అమెరికా అగ్రవాదానికి ఒకవైపు అండగా ఉంటూనే దాన్ని ధిక్కరించే ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం అనే ఒకానొక ప్రమాదకరమైన, వంచనాత్మకమైన, ఆత్మహత్యాసదృశమైన విధానంవల్ల పాకిస్థాన్ అశాంతితో, అరాచకత్వంతో అట్టుడికి పోతోంది. ఎప్పుడు ఎక్కడ ఏ మానవ బాంబు పేలుతుందో, ఎంతమందిని పొట్టనపెట్టుకుంటుందో తెలియని అనిశ్చితి. ప్రజాస్వామ్య పాలనకోసం అర్రులుచాస్తున్న ప్రజలు ఒక వైపు. ఎప్పుడు పడి పోతుందో తెలియని ప్రభుత్వం మరో వైపు. అధికారం కబళించేందుకు అదను కోసం కాచుకొని కూర్చున్న సైన్యాధిపతులు ఇంకోవైపు. ఈ పరిస్థితిని సకాలంలో సరిచేసుకోవాలన్న హెచ్చరిక నోబెల్ ప్రకటనలో అప్రకటితంగా ఉంది. భారత్‌కు స్వాతంత్య్రం 1947లో వచ్చినప్పటికీ ఆర్థిక, సామాజిక పరిస్థితులు 2014లో కూడా అంతే అథమస్థాయిలో ఉన్నాయన్న అభిశంసన కూడా నోబెల్ నిర్ణయం వెనుక ఉన్నది. పేదరికం, దురాశ, అసమానతలు, పీడన వంటి దుర్భర మైన పరిస్థితుల నుంచి సమాజానికి విముక్తి కలిగించేందుకు కృషి చేయాలన్న సందేశం, లేకపోతే అశాంతి అనివార్యమన్న హెచ్చరిక గమనించకపోతే మన ఉపఖండానికి నిష్కృతి ఉండదు. ఇండియాలో పుట్టి అమెరికాలోనో, బ్రిటన్‌లోనో పరిశోధన చేసి నోబెల్ బహు మతి గెలుచుకున్న భారత సంతతి శాస్త్రవేత్తలను కూడా మన ఖాతాలో వేసుకొని సంబరం చేసుకుంటాం. వారు విదేశాలకు వెళ్ళకుండా స్వదేశంలోనే ఉంటే నోబెల్ బహుమతి కాదు కదా భట్నాగర్ అవార్డుకు కూడా నోచుకునేవాళ్ళు కాదు. 2009లో రసాయనశాస్త్రంలో నోబెల్ గెలుచుకున్న వెంకట్రామన్ రామకృష్ణన్ చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం చెప్పులరిగే దాకా తిరిగి చివరికి అమెరికా వెళ్ళిపోయాడు. ఇండియాలో కనుక ఉద్యోగం దొరికి ఉంటే నోబెల్ వచ్చేది కాదని ఆయనే వ్యాఖ్యానించాడు. దేశంలో ఉండి పరిశోధన చేస్తున్న శాస్త్రజ్ఞులకు అత్యున్నత పురస్కారం లభించకపోవడానికి లేనిపోని కారణాలు చెప్పుకొని సమాధానపడతాం. మన ప్రతిభను గుర్తించడం లేదని ఫిర్యాదు చేస్తాం. ఇందులోనూ రాజకీయాలేనని ఈసడించుకుంటాం. అసలు సమస్య మన వ్యవస్థలోనూ, మన దృక్పథంలోనూ ఉన్నదని గుర్తించడానికి నిరాకరిస్తాం. ఈ రోజుకూ మరుగుదొడ్లు సవ్యంగా లేని పాఠశాలలూ, కళాశాలలూ ఉన్న దేశంలో ప్రయోగశాలలు ఉంటాయని ఎట్లా ఊహించగలం. కనీస సౌకర్యాలు లేని విద్యాసంస్థల నుంచి నోబెల్ వంటి సర్వోన్నత బహుమతిని గెలుచుకోగల ప్రతిభావంతులు ఎట్లా తయారవుతారు? ప్రపంచం మొత్తం మీద అగ్రశ్రేణికి చెందిన రెండు వందల విశ్వవిద్యాలయాల జాబితాలో మన దేశానికి చెందిన విశ్వవిద్యాలయం ఒక్కటి కూడా లేదంటే మనం ఎక్కడ ఉన్నామో గ్రహించాలి. విశ్వవిద్యాలయాల కులపతులు విద్యామంత్రుల దగ్గరా, విద్యాశాఖ కార్యదర్శుల దగ్గరా పడిగాపులు కాయాలి. అనేక విశ్వవిద్యాలయాలకు కులపతుల నియామకమే జరగదు. ఇన్ని భయంకరమైన లోపాలు విద్యారంగాన్ని పట్టిపల్లార్చుతున్నా పట్టించుకోకుండా, ప్రమాణాలు పెంచుకునే ప్రయత్నమే చేయకుండా మనకు ఎవరో పనికట్టుకొని అన్యాయం చేస్తున్నారంటూ బాధపడటం ఆత్మవంచన. ’స్వచ్ఛ్ భారత్ అభియాన్’ను ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించినందుకు ఆయనను అందరూ అభినందిస్తున్నారు. ఆయన ప్రశంసార్హుడే. సందేహం లేదు. ఇన్నేళ్ళ స్వాతంత్య్రం తర్వాత కూడా ఇటువంటి దుస్థితిలో ఎందుకున్నామో ప్రశ్నిం చుకోవాలి. ప్రపంచంలోని బాలకార్మికులలో అత్యధికులు మన దేశంలో ఉన్నం దుకూ, సత్యార్థి వంటి సంఘ సేవకులు ఎంతోమంది పోరాటం చేస్తున్నా బాల కార్మికుల సంఖ్య తగ్గక పోగా ఏటేటా పెరుగుతున్నందుకూ సమష్టిగా సిగ్గుపడాలి. సర్వశిక్షాఅభియాన్ అమలు జరుగుతున్నప్పటికీ, విద్యను సార్వజనీనం చేయాలనీ, అందరికి చదువుకునే హక్కు కల్పించాలనీ చట్టాలు చేసుకున్నప్పటికీ చట్టాలను సవ్యంగా అమలు చేయలేకపోతున్నందుకు మనలను మనమే నిందించుకోవాలి. దాదాపు ఇటువంటి సిగ్గుమాలిన పరిస్థితులే పాకిస్థాన్‌లోనూ ఉన్నాయి. మతోన్మాదం, ఉగ్రవాదుల బెడద, సైన్యం పెత్తనం వారికి అదనం. నోబెల్ గెలుచుకొని చరితార్థులైనందుకు సత్యార్థినీ, మలాలానూ మనసారా అభినందిస్తూ, మన దేశాలు ఇంకా సామాజికంగా, ఆర్థికంగా, నైతికంగా వెనకబడి ఉన్నందుకు మనమూ, మన పొరుగువారూ మనస్తాపం చెందాలి. ఈ పరిస్థితులను మార్చ డానికి కృతనిశ్చయంతో కార్యోన్ముఖులం కావాలి. ఇదీ ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి నీతి. ప్రపంచంలోని బాలకార్మికులలో అత్యధికులు మన దేశంలో ఉన్నందుకూ, సత్యార్థి వంటి సంఘ సేవకులు ఎంతోమంది పోరాటం చేస్తున్నా బాలకార్మికుల సంఖ్య తగ్గక పోగా ఏటేటా పెరుగుతున్నందుకూ సమష్టిగా సిగ్గుపడాలి. కె. రామచంద్రమూర్తి -
సత్యార్థి కార్యాలయం కిటకిట
సాక్షి, న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త కైలాష్ సత్యార్థి నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికైన నేపథ్యంలో దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలోగల ఆయన కార్యాలయం సందర్శకులతో కిటకిటలాడుతోంది. పరిచయం ఉన్నవారు, పరిచయం లేనివారు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నిజానికి నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించేంతవరకు నగరంలో చాలామందికి ఆయన ఎవరో తెలియదు. కైలాష్ సత్యార్థి నేతృత్వంలోని ఎన్జీఓ బచ్పన్ బచావో ఆందోళన సంస్థ పేరు తరచూ వార్తాపత్రికల్లో కనిపించడమే తప్ప మీడియాలో పెద్దగా రాలేదు. బాలకార్మికుల విముక్తి కోసం, అక్రమ వ్యాపారుల కోరల్లోంచి బాలలను రక్షించడం కోసం జరిపిన కృషికి ఆయనకు ఎన్నో పురస్కారాలు లభించినప్పటికీ వాటిలో ప్రముఖ భారతీయ పురస్కారమేదీ లేదు. నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యేంతవరకు ఆయన ట్విటర్ అకౌంట్ ఫాలోయర్ల సంఖ్య 150 మాత్ర మే పురస్కారం వార్త తెలిసిన వెంటనే పరిస్థితి మారిపోయింది. శుక్రవారం సాయంత్రం నాటికి ఆయన ట్విటర్ ఫాలోయర్ల సంఖ్య 13,500కు పెరిగింది. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపాయినా బచ్పన్ బచావో ఆందోళన్ మూడు దశాబ్దాలుగా దేశమంతటా బాలకార్మికుల విముక్తి కలిగించడానికి కృషి చేస్తూనే ఉంది. ఈప్రయత్నంలో ఎన్నో సార్లు బెదిరంపులకు, దాడులకు గురైనా సత్యార్థి వెరవలేదు. నగర పరిధిలో మొత్తం ఏడు వేలమంది బాలకార్మికులకు ఈ సంస్థ విముక్తి కలిగించింది. సత్యార్థి, ఆయన నడిపే బచ్పన్ బచావో ఆందోళన్ తప్పిపోయిన పిల్లల ఆచూకీ తెలుసుకోవడం కోసం, ప్ల్లేస్మెంట్ ఏజెన్సీల ద్వారా ఇళ్లలో పనిచేసే పిల్లలను వేధింపుల బారినుంచి రక్షించడానికి పోరాటం కొనసాగిస్తున్నారు. తప్పిపోయిన పిల్లలకు సంబంధించిన అన్ని కేసులను తప్పనిసరిగా నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించడం వెనుక బచ్పన్ బచావో ఆందోళన్ కృషి ఎంతో ఉంది. -
మన సత్యార్థికి శాంతి నోబెల్
పాక్ బాలిక మలాలాతో కలిపి ఉమ్మడిగా శాంతి పురస్కారం ఓస్లో: ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఈసారి భారత్, పాకిస్థాన్ పౌరులను సంయుక్తంగా వరించింది. భారత ఉపఖండంలోని భారత్, పాకిస్థాన్ దేశాల్లో బాలల హక్కులు, బాలికల విద్య కోసం అలుపెరుగని ఉద్యమం సాగిస్తున్న సామాజిక కార్యకర్తలు కైలాష్ సత్యార్థి (60), మలాలా యూసఫ్‌జాయ్ (17)లను నోబెల్ కమిటీ ఈ ఏడాది శాంతి బహుమతికి ఎంపిక చేసింది. ‘‘బాలల అణచివేతకు వ్యతిరేకంగా, బాలలందరి విద్యా హక్కు కోసం పోరాడుతున్న కైలాష్ సత్యార్థి, మలాలా యూసఫ్‌జాయ్‌లకు 2014 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని అందించాలని నోబెల్ కమిటీ నిర్ణయించింది’’ అని జ్యూరీ శుక్రవారం ప్రకటించింది. నార్వేకు చెందిన నోబెల్ కమిటీ 11 లక్షల డాలర్ల నగదు బహుమతిని కూడా అందించే ఈ అవార్డును డిసెంబర్లో ఓస్లోలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. బాలల హక్కుల కోసం 3 దశాబ్దాలుగా పోరాటం భారత్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించటం ఇది రెండోసారి. మానవ సేవయే మాధవ సేవ అంటూ అభాగ్యులు, అన్నార్తుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మథర్ థెరిస్సా 1979లో భారత్ తరఫున నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. అయితే.. ఆమె తన జీవితాన్ని భారత్‌లోనే గడిపినా జన్మించింది మాత్రం ఒకప్పటి యుగోస్లోవియాలో కావడం గమనార్హం. ఆమె భారత్‌కు వచ్చి స్థిరపడి ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భారతీయ పౌరసత్వం పొందారు. అయితే.. జన్మతః భారతీయుడైన వ్యక్తి నోబెల్ శాంతి బహుమతి పొందడం ఇదే తొలిసారి. మధ్యప్రదేశ్‌కు చెందిన కైలాష్ సత్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మూడు దశాబ్దాల కిందట ‘బచ్పన్ బచావో ఆందోళన్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. బలవంతపు చాకిరి, అక్రమ రవాణా నుంచి బాలలను రక్షించేందుకు ఈ సంస్థ ద్వారా కృషి చేస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 80,000 మందికి పైగా బాలబాలికలను రక్షించారు. బాలల హక్కుల కోసం కైలాష్ సత్యార్థి ఎంతగానో కృషి చేశారని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఎన్నో ఉద్యమాలు నడిపారని నోబెల్ కమిటీ కొనియాడింది. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో శాంతియుత ఆందోళనలకు నేతృత్వం వహించారని పేర్కొంది. నోబెల్ శాంతి బహుమతి లభించటంపై సత్యార్థి స్పందిస్తూ.. ఈ అవార్డు తనలో నూతనోత్తేజాన్ని నింపుతోందని, భారత్‌లో బాలల బానిసత్వాన్ని నిర్మూలించేందుకు మరింతగా కృషి చేస్తానని సత్యార్థి పేర్కొన్నారు. తనతో సంయుక్తంగా అవార్డుకు ఎంపికైన పాక్ బాలిక మలాలాకు ఆయన అభినందనలు తెలిపారు. తాము మరింత ముందుకెళ్లి భారత్ - పాక్‌ల మధ్య శాంతి కోసం కృషి చేయాల్సి ఉందన్నారు. బాలికల విద్యా హక్కుల ప్రతినిధిగా మలాలా రెండేళ్ల కిందట తాలిబాన్ ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడి.. మరణాన్ని జయించి ఉద్యమ బాటలో కొనసాగుతున్న పాక్ బాలిక మలాలా.. నోబెల్ బహుమతికి ఎంపికైన అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. పాక్‌లో తాలిబాన్ల ప్రాబల్యమున్న ప్రాంతంలో బాలల హక్కుల కోసం, బాలికల విద్యా హక్కు కోసం ఉద్యమం కొనసాగిస్తోంది. గత ఏడాది కూడా నోబెల్ శాంతి బహుమతికి ఆమె పేరును నామినేట్ చేశారు. ‘‘మలాలా పిన్నవయస్కురాలే అయినప్పటికీ.. బాలికల విద్యా హక్కు కోసం కొన్నేళ్లుగా పోరాడుతోంది. బాలలు, చిన్నారులు కూడా స్వీయ పరిస్థితులను మెరుగుపరుచుకునేందుకు ఉద్యమించగలరని ఆమె నిరూపించింది. అదికూడా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఆమె చేసి చూపింది. ఆమె వీరోచిత పోరాటం ద్వారా బాలికల విద్యా హక్కుల కోసం గళమెత్తే ప్రధాన ప్రతినిధిగా నిలిచారు’’ అని నోబెల్ కమిటీ ప్రశంసించింది. నోబెల్ శాంతి బహుమతి విజేతలిద్దరికీ భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితర నేతలు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఉద్రిక్తతలను చల్లార్చాలి భారత్ - పాక్ దేశాల మధ్య ఆధీనరేఖ, అంతర్జాతీయ సరిహుద్దు వెంట భారీగా కాల్పులు, మోర్టారు షెల్లింగ్‌లు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో రెండు దేశాల పౌరులకూ సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించటం.. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చాల్సిన ఆవశ్యకతను బలంగా చెప్పినట్లయిందని పరిశీల కులు అభివర్ణిస్తున్నారు. ‘‘బాలల హక్కుల కోసం, బాలల విద్య కోసం, అతివాదానికి వ్యతిరేకంగా పోరాడటమనే ఉమ్మడి లక్ష్యం కోసం ఒక హిందువు, ఒక ముస్లిం - ఒక భారతపౌరుడు, ఒక పాకిస్థాన్ పౌరురాలు పనిచేయటం ముఖ్యమైన అంశంగా మేం పరిగణిస్తున్నాం’’ అని నోబెల్ కమిటీ అవార్డు ప్రకటనలో పేర్కొంది. నోబెల్ కమిటీ గతంలో కూడా.. ప్రపంచంలో ఏవైనా రెండు దేశాలు లేదా వర్గాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలను పరిష్కరించి శాంతి నెలకొల్పడం కోసం కృషి చేసిన రెండు వైపుల వారికీ సంయుక్తంగా శాంతి బహుమతిని ప్రకటించింది. 1993: దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష పాలనకు ముగింపు పలికేందుకు చేసిన కృషికి గాను.. నాటి వివక్షాపూరిత ప్రభుత్వానికి చివరి అధ్యక్షుడు ఎఫ్.డబ్ల్యు. డిక్లెర్క్, నల్ల సూరీడు నెల్సన్ మండేలాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. 1994: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేసిన కృషికి గాను.. ఇజ్రాయెల్ నాయకులు షిమన్ పెరెస్, యిత్జాక్ రాబిన్లకు, పాలస్తీనా నేత యాసర్ అరాఫత్‌కు సంయుక్తంగా శాంతి బహుమతి ఇచ్చారు. 1997: నార్తర్న్ ఐర్లాండ్‌లో సంఘర్షణకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు చేసిన కృషికి గాను.. నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన జాన్హ్యూమ్, బ్రిటన్‌కు చెందిన డేవిడ్ ట్రింబుల్లకు సంయుక్తంగా శాంతి బహుమతిని ప్రదానం చేశారు. -
భారత్‌లోనే అత్యధికంగా బాల కార్మికులు
న్యూఢిల్లీ: బాలల హక్కుల ఉద్యమ కారుడు కైలాశ్ సత్యార్థికి నోబెల్ పురస్కారం లభించడంతో భారత్‌లోని బాల కార్మిక వ్యవస్థపై ఒక్కసారిగా ప్రపంచం దృష్టి పడింది. పిల్లలను పనిలో పెట్టుకోవడంపై నిషేధం ఉన్నప్పటికీ.. లక్షలాదిగా పేద పిల్లలు భారత్‌లో బాల కార్మికులుగా జీవితం వెల్లదీస్తున్నారు. కార్ఖానాల్లో, వస్త్ర పరిశ్రమల్లో, ఇటుక బట్టీల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, ఇళ్లల్లో, షాపుల్లో, హోటళ్లలో, రోడ్డు పక్క తినుబండారాల బండ్ల వద్ద.. ప్రమాదకర పరిస్థితుల్లో నిరుపేద పిల్లలు వయసుకు మించిన పనులు చేస్తూ కనిపిస్తుంటారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బాల కార్మికులున్న దేశం భారతే కావడం అత్యంత దురదృష్టకర విషయం. కార్మిక శాఖ లెక్కల ప్రకారం దేశలో 50 లక్షల మంది బాల కార్మికులున్నారు. వాస్తవానికి ఆ సంఖ్య 5 కోట్ల కన్నా ఎక్కువని బచ్పన్ బచావో ఆందోళన్ సహా పలు ఎన్జీవోలు స్పష్టం చేస్తున్నాయి. -
నోబెల్ విజేతలకు సెల్యూట్..
న్యూఢిల్లీ/లండన్/ఐక్యరాజ్యసమితి: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం సాధించిన కైలాష్ సత్యార్థి, మలాలా యూసుఫ్ జాయ్‌లను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సహా పలువురు ప్రముఖులు అభినందించారు. ‘‘దేశంలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కైలాష్ సత్యార్థి చేసిన కృషి ఎనలేనిది. శక్తివంతమైన భారత పౌర సమాజం బాలకార్మిక వ్యవస్థ వంటి సామాజిక సమస్యలపై చేస్తున్న పోరాటానికి దక్కిన గుర్తింపు ఇది’’ అని ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం తన సందేశంలో పేర్కొన్నారు. ‘‘శ్రమ, భయం అనేది లేకుండా పోరాడిన ఇద్దరు అద్భుతమైన వ్యక్తులకు దక్కిన అరుదైన గౌరవం ఇది.’’ అని అన్సారీ చెప్పారు. ‘‘నోబెల్ శాంతి పురస్కారం సాధించిన కైలాష్ సత్యార్థికి అభినందనలు. ఆయన అందించిన సేవలకు నా సెల్యూట్’’ అని మోదీ సామాజిక వెబ్సైట్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పాక్ బాలిక మలాలా నోబెల్ సాధించినందుకు ఆమెకు నా అభినందనలు’’ అని మోదీ పేర్కొన్నారు. సత్యార్థి నోబెల్ రావడం దేశానికే గర్వకారణమని, వారు దక్షిణాసియాకే తలమానికమని సోనియాగాంధీ అభివర్ణించారు. బాలల హక్కుల కోసం సత్యార్థి చేసిన పోరాటానికి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. బాలల హక్కుల కోసం పోరాడిన సత్యార్థి, మలాలాకు నోబెల్ శాంతి బహుమతి వరించడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్వాగతించింది. సత్యార్థి, మలాలా చిన్నారులకు సంబంధించి గొప్ప చాంపియన్లని ఐక్యరాజ్యసమితి చీఫ్ బాన్ కీ మూన్ ఓ ప్రకటనలో కొనియాడారు. నోబెల్ గ్రహీతకు జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: నోబెల్ బహుమతి గెలుచుకున్న బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రకాలుగా క్షోభ అనుభవిస్తున్న 80 వేల మంది బాలలకు తోడ్పాటునివ్వడంలో ఆయన సేవలను కొనియాడారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నోబెల్ గ్రహీతలను అభినందించారు. మలాలా పాకిస్థాన్‌కు గర్వకారణం: నవాజ్ షరీఫ్ ఇస్లామాబాద్: మలాలా పాకిస్థాన్‌కు గర్వకారణమని, ఆమె తన దేశ ప్రజలు తల ఎత్తుకునేలా చేసిందని పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కొనియాడారు. -
నెటిజన్ల జపం..!
న్యూఢిల్లీ/విదిశ: నోబెల్ పురస్కారం ప్రకటించడానికి ముందు కైలాష్ సత్యార్థికి ట్విట్టర్లో ఉన్న ఫాలోవర్లు 200 మంది కన్నా తక్కువే. కానీ ప్రకటన వెలువడ్డ గంటన్నరలోనే ఆ సంఖ్య 4,500, శుక్రవారం సాయంత్రానికి 6,820కి చేరింది. ఇంకా పెరుగుతూనే ఉంది. ఆయన వెబ్సైట్ www.kailashsatyarthi.net సందర్శకుల డిమాండ్‌ను తట్టుకోలేక స్పందించడమే మానేసింది. ‘బచ్పన్ బచావో ఆందోళన్(బీబీఏ)’ సంస్థ వెబ్సైట్ కూడా క్రాష్ అయింది. కాగా, కైలాష్ సత్యార్థికి నోబెల్ పురస్కారం వార్త తెలియగానే ఆయన సొంత పట్టణం విదిశలో సంబరాలు ప్రారంభమయ్యాయి. స్వీట్లు పంచుకుంటూ, బాణాసంచా కాలుస్తూ ప్రజలు పండుగ చేసుకున్నారు. ముఖ్యంగా సత్యార్థి నివాసం ‘చోటీ హవేలీ’లో ఉత్సవ వాతావరణం నెలకొంది. సత్యార్థి కుటుంబసభ్యులంతా విదిశలోనే నివసిస్తున్నారు. -
‘బాల్య’ మిత్రుడు..!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని విదిశలో 1954 జనవరి 11న కైలాష్ సత్యార్థి జన్మించారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా తన కెరీర్‌ను వదిలి.. 26 ఏళ్ల వయసులోనే బాలల హక్కుల ఉద్యమ బాట పట్టారు. ‘బచ్పన్ బచావో ఆందోళన్(బాలల హక్కుల రక్షణ ఉద్యమం)’ను ప్రారంభించారు. చిన్నారుల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థల్లో ఇదే ప్రముఖమైనది. సత్యార్థి ప్రారంభించిన ‘గ్లోబల్ మార్చ్ అగెనైస్ట్ చైల్డ్ లేబర్’ ఉద్యమం చాలా దేశాల్లో క్రియాశీలంగా ఉంది. కైలాష్ సత్యార్థిగతంలోనూ పలుమార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. 1994లో బాల కార్మికులు లేని సంస్థలు తయారు చేస్తున్న రగ్గులు, కార్పెట్ల కోసం ‘రగ్‌మార్క్’ అనే ముద్రను సృష్టించారు. ఈ రగ్గులు, కార్పెట్లు విదేశాల్లో చాలా ఫేమస్. ప్రస్తుతం ఈ రగ్మార్క్ను ‘గుడ్వేవ్స్’గా మార్చారు. భారత్‌లో 50లక్షల బాల కార్మికులున్నారన్నది అంచనా. కానీ సత్యార్థి,ఇతర ఎన్జీవోల లెక్కల ప్రకారం అది 5 కోట్లు. బాల కార్మిక వ్యవస్థ వల్ల పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, జనాభా పెరుగుదల లాంటి సమస్యలు ఉత్పన్నవవుతాయని సత్యార్థి వివరిస్తారు. బాలలపై పాల్పడే నేరాలకు మరింత కఠినమైన శిక్షలు ఉండాలని, బాలలకు సంబంధించి సమగ్ర చట్టాలను రూపొందించాల్సి ఉందని ఆయన వాదిస్తారు. బాలల హక్కుల కోసం పోరాడుతున్న ‘ద ఇంటర్నేషనల్ సెంటర్ ఆన్ చైల్డ్ లేబర్ అండ్ ఎడ్యుకేషన్’, ‘ద గ్లోబల్ క్యాంపెయిన్ ఫర్ ఎడ్యుకేషన్’ సహా పలు అంతర్జాతీయ సంస్థలతో కలసి పనిచేస్తున్నారు. సత్యార్థి అందుకున్న అంతర్జాతీయ అవార్డులు డిఫెండర్స్ ఆఫ్ డెమొక్రసీ అవార్డ్ ( 2009- అమెరికా) మెడల్ ఆఫ్ ఇటాలియన్ సెనేట్ ( 2007 - ఇటలీ) రాబర్ట్ ఎఫ్ కెనెడీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ ( అమెరికా) ఫ్రెడెరిక్ ఎబర్ట్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ (జర్మనీ) అల్ఫాన్సో కొమిన్ ఇంటర్నేషనల్ అవార్డ్ (2008 - స్పెయిన్) సత్యార్థి చేసిన ప్రముఖ వ్యాఖ్యలు ‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడు?, నువ్వు కాకపోతే మరెవ్వరు? ఈ మౌలిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగితే.. బానిసత్వాన్ని సంపూర్ణంగా నిర్మూలించగలం’ ‘ఇదొక పరీక్ష అని నేననుకుంటున్నా. ఈ నైతిక పరీక్షను అంతా కచ్చితంగా పాస్ కావాలి(బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటంపై)’ ‘బాలలను బానిసలు గా చేయ డం నేరం. మానవత్వమే ఇక్కడ పణంగా ఉంది. ఇం కా చేయాల్సిన పని చాలా ఉంది. అయితే, నేను చనిపోయేలోపు బాలకార్మిక వ్యవస్థ అంతాన్ని చూస్తాను’ -
అక్షరాల కోసం తుపాకీపై పోరాటం!
లండన్: ఆంక్షల రాజ్యంలో హక్కుల కోసం ఎలుగెత్తి నినదించడం అంత సులభం కాదు. ఇక చిన్నపిల్లల పరిస్థితి చెప్పనక్కర్లేదు. కానీ మలాలా అధైర్యపడలేదు. అన్నపానీయాలెంత అవసరమో, జ్ఞానం కూడా అంతే అవసరమనుకుంది ఆ చిన్నారి. తాలిబన్ల రాజ్యంలో బాలికల హక్కుల అణచివేతపై గొంతు విప్పింది. తుపాకులు, బాంబులతో విరుచుకుపడే శత్రువులను కేవలం కలంతో, మాటలతో ప్రాణాలకు తెగించి ప్రతిఘటించింది. మతోన్మాదుల పాలనలో అక్షరాలకు దూరమైన బాలికల వెతలను ఆవేదనతో ఆర్తిగా ప్రపంచం కళ్లకు కట్టింది. ఆ అకుంఠిత పోరాటంలో శత్రువు తూటాల దాడికి గురై మృత్యువుకు చేరువదాకా వెళ్లింది. తర్వాత కూడా ఆమె వీరోచిత పోరాటం ఆగలేదు. తమ దేశంలోనే కాకుండా అణగారిన దేశాలన్నింటిలోని బాలికల హక్కుల రక్షణకు నడుం బిగించింది. ఈ కృషికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి ఆమె ఒడిలో వచ్చి వాలింది. ప్రపంచంలో అందరికీ తెలిసిన టీనేజర్‌గా గుర్తింపు పొందిన మలాలా యూసఫ్ జాయ్ 1997 జూలై 12నలో పాకిస్థాన్‌లోని ఖైబర్-పక్తూన్క్వా రాష్ట్రం స్వాత్‌లోయలోని మింగోరా పట్టణంలో సున్నీ ముస్లింల కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి జియావుద్దీన్ స్కూలు యజమాని. విద్యాహక్కు కార్యకర్త. మలాలా ఆయన స్కూల్లోనే చదువుకుంది. 2007 నుంచి 2012 వరకు స్వాత్ లోయలోని పలు ప్రాంతాల్లో తాలిబన్ల నిరంకుశ పాలన సాగింది. ఉగ్రవాదులు టీవీలు, సినిమాలు, పుస్తకాలపై నిషేధం విధించారు. బాలికలు చదువుకోకూడదంటూ వారి పాఠశాలలను పేల్చేశారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితిలో మలాలా గొంతువిప్పింది. 2008లో పెషావర్ సభలో ‘విద్య నా ప్రాథమిక హక్కు. దాన్ని లాగేసుకోవడానికి తాలిబన్లకు ఎంత ధైర్యం?’ అని మండిపడింది. 2009లో 12 ఏళ్ల వయసులో బీబీసీ బ్లాగులో గుల్ మకాల్ అనే పేరుతో స్వాత్ బాలికల దయనీయ స్థితిని వివరించింది. మీడియాఇంటర్వ్యూల్లో తాలిబన్లపై నిప్పులు చెరిగింది. తలలోకూ తూటా.. :మలాలా పోరాటాన్ని తాలిబన్లు సహించలేకపోయారు. 2012 అక్టోబర్ 9న స్కూలుకు వెళ్తుండగా ఓ మిలిటెంట్ ఆమెపై మూడు తూటాలు పేల్చాడు. ఒకటి ఆమె తలలోకి దూసుకెళ్లి భుజం దాకా వెళ్లింది. ఆ ప్రాణాంతక గాయానికి మెరుగైన చికిత్స కోసం ఆమెను బ్రిటన్‌కు తరలించారు. చికిత్సతో కోలుకున్న మలాలా ప్రస్తుతం బర్మింగ్‌హామ్ స్కూల్లో చదువుకుంటోంది. పాక్‌కు వస్తే చంపుతామని తాలిబన్లు బెదిరించడంలో మలాలా కుటుంబం బ్రిటన్‌లోనే ఉంటోంది. ఐక్యరాజ్య సమితితో కలిసి విద్యా హక్కుకోసం పోరాడుతోంది. యూరోపియన్ యూనియన్ మానవ హక్కుల అవార్డు, పాకిస్థాన్ యువ శాంతి పురుస్కారం వంటి ఎన్నో అవార్డులు అందుకుంది. ‘ఐయామ్ మలాలా’ పేరుతో గత ఏడాది ఆత్మకథను వెలువరించింది. ‘‘ఉగ్రవాదులు నేను మారతాననుకున్నారు. వారి దాడితో నాలో బలహీనత, భయం పోవడం తప్ప నా జీవితంలో ఎలాంటి మార్పూ రాలేదు. నేను తాలిబ్(తాలిబన్ మిలిటెంట్)ను ద్వేషించడం లేదు. అతడు ఎదురుగా నిలబడితే నా చేతిలో తుపాకీ ఉన్నా కాల్చను’’ అని ఐరాసలో గత ఏడాది ఉద్వేగంగా చెప్పిన మలాలా నిజంగా శాంతదూతే. -
భారత్-పాక్ శాంతి కోసం కృషి చేస్తాం
మలాలా, సత్యార్థి వెల్లడి లండన్: నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన కైలాశ్ సత్యార్థి, మలాలా యూసఫ్‌జాయ్‌లు తమ దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు కృషి చేస్తామని చెప్పారు. ‘మేం కలిసి పనిచేస్తాం. భారత్, పాక్ మధ్య బలమైన సంబంధాల నిర్మాణానికి కృషి చేస్తాం. నేను శాంతిని విశ్వసిస్తున్నాను’ అని మలాలా విలేకర్లతో చెప్పింది. ఘర్షణకంటే అభివృద్ధి ముఖ్యమని పేర్కొంటూ, శాంతి నెలకొనేలా చూడాలని భారత్, పాక్‌ల ప్రధానులు మోదీ, షరీఫ్‌లకు విజ్ఞప్తి చేసింది. డిసెంబర్లో ఓస్లోలో జరిగే ఈ అవార్డు ప్రదాన కార్యక్రమానికి రావాలని వారిని తాను, సత్యార్థి కోరతామంది. నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన తొలి పాకిస్థానీని తానేనని, ఈ అవార్డును తమ గొంతును బలంగా వినిపించలేని బాలలకు అంకితం చేస్తున్నానని పేర్కొంది. కాగా, తనకు మలాలా వ్యక్తిగతంగా తెలుసని, అవార్డుకు ఎంపికైనందుకు ఆమెకు ఫోన్‌చేసి అభినందిస్తానని సత్యార్థి చెప్పారు. బాలల హక్కుల పరిరక్షణతో పాటు భారత ఉపఖండంలో శాంతి నెలకొనేందుకు కలిసి పనిచేద్దామని ఆమెను కోరతానన్నారు. శాంతియుతంగా జీవించడం భారత్, పాక్ బాలల హక్కు అని పేర్కొన్నారు. -
ఐదో ‘నోబెల్’ భారతీయుడు
న్యూఢిల్లీ: కైలాశ్ సత్యార్థి నోబెల్ పురస్కారాన్ని అందుకున్న ఐదో భారతీయుడిగా నిలిచారు. భారత్‌లో జన్మించి, నోబెల్ శాంతి బహుమతి అందుకున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు. నోబెల్ అవార్డు పొందిన మిగతా నలుగురు భారతీయులు, రవీంద్రనాథ్ ఠాగూర్(1913, సాహిత్యం), సీవీ రామన్(1930, భౌతికశాస్త్రం), మదర్ థెరిసా(1978, శాంతి), అమర్త్యసేన్(1998, ఆర్థికశాస్త్రం). ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ గెల్చుకున్న తొలి భారతీయుడు. మదర్ థెరిసా నాటి యుగోస్లేవియాలో జన్మించినప్పటికీ 1948లో భారత పౌరసత్వం తీసుకున్నారు. కాబట్టి ఆమెను భారతీయురాలిగానే పరిగణిస్తున్నారు. వీరే కాకుండా భారత్‌తో సంబంధమున్న నోబెల్ గ్రహీతలు భారత్‌లో పుట్టిన బ్రిటిష్ పౌరులు-రొనాల్డ్ రాస్(1902, వైద్యం), రుడ్యార్డ్ కిప్లింగ్(1907, సాహిత్యం) భారత్‌లో పుట్టి అమెరికా పౌరసత్వం తీసుకున్న భారత సంతతి శాస్త్రవేత్త హర్గోబింద్ ఖురానా(1968, వైద్యం) భారత్‌లో పుట్టిన పాకిస్థాన్ పౌరుడుఅబ్దుస్ సలాం (1979, భౌతిక శాస్త్రం) భారత్‌లో జన్మించి, అమెరికా పౌరసత్వం తీసుకున్న భారత సంతతి శాస్త్రవేత్త సుబ్రమణ్యం చంద్రశేఖర్(1983, భౌతిక శాస్త్రం) భారత్‌లో నివసిస్తున్న టిబెట్ బౌద్ధుల గురువు దలైలామా(1989, శాంతి) ట్రినిడాడ్‌లో పుట్టి బ్రిటన్‌లో స్థిరపడిన భారత సంతతి రచయిత వీఎస్ నైపాల్(2001, సాహిత్యం) భారత్‌లో పుట్టిన బంగ్లాదేశ్ పౌరుడు మహ్మద్ యూనస్(2006, శాంతి) భారత్‌లో పుట్టి అమెరికా, బ్రిటన్ పౌరసత్వాలున్న వెంకట్రామన్ రామకృష్ణన్(2009, రసాయన శాస్త్రం) ఐపీసీసీ పేరుతో భారతీయుడు రాజేంద్రకుమార్ పచౌరి నిర్వహిస్తున్న ఛారిటీ సంస్థ కూడా 2007లో నోబెల్ శాంతి బహుమతి గెల్చుకుంది. -
గాంధీజీకి వస్తే బావుండేది!
నోబెల్ పురస్కారంపై సత్యార్థి స్పందన న్యూఢిల్లీ: నోబెల్ శాంతి బహుమతికి తనను ఎంపిక చేయడంపై కైలాశ్ సత్యార్థి సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకో గొప్ప గౌరవమని, అయితే, తనకన్నాముందు గాంధీజీకి ఈ అవార్డ్ వచ్చి ఉంటే మరింత గౌరవంగా భావించేవాడినన్నారు. సత్యార్థి స్పందన ఆయన మాటల్లోనే.. ‘నోబెల్ కమిటీకి కృతజ్ఞతలు. ఇదో గొప్ప గౌరవం నాకు. అయితే, ఈ అవార్డ్ జాతిపిత మహాత్మాగాంధీకి వచ్చి ఉంటే నేను మరింత సంతోషించేవాడిని. గాంధీజీ తరువాత నాకు లభించి ఉంటే మరింత గౌరవంగా భావించేవాడిని. ఈ అవార్డ్ భారతీయులకే అంకితం. ఇది నా బాధ్యతను మరింత పెంచింది. బాలల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం ఇకపై రెట్టించిన ఉత్సాహంతో కృషి చేస్తాను. ప్రస్తుత ఆధునిక సమాజంలోని లక్షలాది చిన్నారుల దుస్థితిని గుర్తించిన నోబెల్ కమిటీకి కృతజ్ఞతలు. ఈ పురస్కారంతో చిన్నారుల సమస్యలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుంది. ఈ సమస్య కేవలం పేదరికానికో, బాలల హక్కులకో సంబంధించినది కాదు. అంతకన్నా లోతైనది. భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో బాలల పరిస్థితి దయనీయంగా ఉంది. బానిసత్వంలో మగ్గుతున్న, హక్కులకు దూరంగా ఉన్న ప్రతీ బాలుడికీ స్వేచ్ఛ లభించేంతవరకు మా పోరాటం కొనసాగుతుంది. అప్పటివరకు నాకు విశ్రాంతి లేదు’ అన్నారు. బాలల హక్కు లు బాల్యం నుంచి తనకు ఇష్టమైన అంశమని సత్యార్థి తెలిపారు. ‘సహజమైన హక్కులకు దూరమైన పిల్లల కోసం ఏదైనా చేయాలని నాకప్పటినుంచే అనిపించేది’ అన్నారు. బచ్పన్ బచావో ఆందోళన్! ‘బచ్పన్ బచావో ఆందోళన్’ను సత్యార్థి 1980లో ప్రారంభించారు. ఆ సంస్థ దేశవ్యాప్తంగా 80 వేలకు పైగా బాల కార్మికులకు.. వెట్టి చాకిరీ నుంచి విముక్తి కలిగించింది. ముఖ్యంగా ఢిల్లీలో బాల కార్మికులను రక్షించేందుకు దాడులు నిర్వహిస్తున్న అధికారులకు అన్నివిధాలుగా సహకరించింది. బాలల హక్కుల కోసం ఈ సంస్థ శాంతియుత ఆందోళనలు నిర్వహిస్తుంటుంది. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్‌లలో ఈ సంస్థ చాలా క్రియాశీలంగా ఉంది. ఈ సంస్థకు 70 వేలమంది వ్యక్తిగతంగా సహకరిస్తుంటారు. 750 పౌరసంస్థలు దీని కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాయి. ప్రజాఉద్యమంలాంటి ఈ సంస్థ ప్రధాన కార్యకలాపాలను ముఖ్యంగా.. ‘ది అసోసియేషన్ ఆఫ్వాలంటరీ యాక్షన్’, ‘ద బాల్ ఆశ్రమ్ ట్రస్ట్’, ‘సేవ్ ది చైల్డ్‌హుడ్ ఫౌండేషన్’ అనే మూడు స్వచ్ఛంద సంస్థలు నిర్వర్తిస్తుంటాయి. మోదీజీ.. మీదే బాధ్యత! ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం నరేంద్రమోదీ గురించి సత్యార్థి ట్విటర్లో ఇలా స్పందించారు. ‘టీ అమ్మే ఒక బాలుడు ప్రతికూలతలను జయించి భారత ప్రధాని అవుతున్నారు. ఇక ఏ చిన్నారీ బాల కార్మికుడిగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఆయనదే’ అని ట్వీట్ చేశారు. -
‘శాంతి’ సార్థకం!
మన దేశానికి చెందిన బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాస్ సత్యార్థి... బాలికల చదువుకునే హక్కు కోసం పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో ఉగ్రవాదులతో పోరాడి మృత్యువు అంచులవరకూ వెళ్లొచ్చిన మలాలా యూసఫ్జాయ్లను ప్రపంచ శాంతి బహుమతికి ఎంపికచేసి ఈసారి నోబెల్ కమిటీ అందరి మన్ననలనూ పొందింది. భారత్, పాకిస్థాన్ సరిహద్దులు కాల్పుల మోతతో దద్దరిల్లుతూ ఉద్రిక్త వాతావరణం అలుముకొని ఉండగా ఈ శాంతి బహుమతిని రెండు దేశాలకూ చెందిన ఇద్దరికి ప్రకటించడం యాదృచ్ఛికమే కావొచ్చుగానీ ఆసక్తికరమైన అంశం. వీరిలో ఒకరు హిందూ, మరొకరు ముస్లిం. ఒకరు భారతీయుడు, ఇంకొకరు పాకిస్థానీ. ఒకరు అనుభవంతో తలపండిన 60 యేళ్ల వ్యక్తి. మరొకరు టీనేజ్ ఇంకా దాటని పదిహేడేళ్ల బాలిక. ఇద్దరినీ ఒకటిగా చూసే అంశాలూ ఉన్నాయి. ఇద్దరికిద్దరూ అసాధారణ వ్యక్తులు. గతంలోనే నోబెల్ శాంతి బహుమతి పరిశీలనకొచ్చినవారు. ఇద్దరూ భారత ఉపఖండం పౌరులు. కొన్ని దశాబ్దాలక్రితం ఒకే దేశంగా మనుగడ సాగించిన గడ్డపై జన్మించినవారు. అంతేకాదు... తాము నమ్మిన సత్యం కోసం పట్టుదలతో, దృఢ చిత్తంతో పోరాడిన వారు. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ప్రాణాలకే ముప్పు ముంచుకొచ్చినా వాటన్నిటినీ తృణప్రాయంగా భావించి అధిగమించినవారు. పిల్లలనూ, చదువుకోవడానికి వారికుండే హక్కునూ అణిచేస్తున్న ధోరణులపై ఇద్దరూ అలుపెరగని పోరాటం చేశారని నోబెల్ కమిటీ చెప్పిన ప్రశంసావాక్యాలు అక్షర సత్యాలు. అయితే, ఇద్దరూ తమ తమ దేశాల్లోని పాలకులనుంచి ఇంత వరకూ ఎలాంటి గుర్తింపూ పొందనివారు. సత్యార్థికి ఇంతవరకూ పద్మశ్రీ కూడా రాలేదు. మలాలా అయితే అక్కడివారి దృష్టిలో విద్రోహి! కైలాస్ సత్యార్థి మూడు దశాబ్దాలక్రితం బచ్పన్ బచావో ఆందోళన్ (బీబీఏ) సంస్థను స్థాపించి అత్యంత అమానుషమైన, దుర్మార్గమైన పని పరిస్థితుల్లో బతుకులీడుస్తున్న వేలాది మంది బాలబాలికలను కాపాడిన అరుదైన వ్యక్తి. చదివింది ఇంజనీరింగే అయినా ప్రపంచం మొత్తంలో అంతవరకూ ఎవరికీ పట్టని బాల కార్మిక వ్యవస్థపై దృష్టిసారించాడాయన. అదే తన కార్యక్షేత్రమనుకున్నాడు. అది రణరంగమని తెలిసినా, అక్కడ తన పోరాటానికి ఆసరాగా నిలబడేవారు అరుదని అర్ధమైనా... కావాలని ఏరికోరి ఎంచుకున్నాడు. ఆరేళ్ల లేలేత ప్రాయం లోని పిల్లలతో కూడా గంటల తరబడి పనులు చేయిస్తూ వారి రెక్కల కష్టాన్ని దిగమింగి తెగబలుస్తున్న రాబందులపై శరసంధానం చేశాడు. మైకా గనుల్లో, రగ్గుల తయారీ, జరీ పరిశ్రమల్లో...ఇంకా అనేకానేక కర్మాగారాల్లో వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న వేలాదిమంది జీవితాలకు వెలుగుపంచాడు. వారితో పలకా బలపం పట్టించాడు. వారిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తయారుచేసి చూపాడు. పేదరికంవల్ల మాత్రమే పిల్లలు కార్మికులుగా మారవలసి వస్తున్నదన్న వాదనలోని డొల్లతనాన్ని ఎత్తిచూపాడు. నిజానికి బాల్యం వెట్టిచాకిరీలో మగ్గుతున్న కారణంగా మాత్రమే పేదరికం తరంనుంచి తరానికి వారసత్వంగా వస్తున్నదని, అది వారిని పీల్చిపిప్పి చేస్తున్నదని ఎలుగెత్తిచాటాడు. ప్రపంచాన 17 కోట్లమంది బాలలు వెట్టిచాకిరీలో మగ్గుతుంటే...పని చేయగలిగే సత్తా ఉన్న 20 కోట్లమంది అర్హులైన యువతీ యువకులకు ఉపాధి దొరకడంలేదని గణాంకాలతో వివరించాడు. దేశంలో 5 కోట్లమంది బాలకార్మికుల శ్రమతో ఏటా 1.2 లక్షల కోట్ల రూపాయల నల్లధనం పోగుపడుతున్నదని హెచ్చరించాడు. బాలల శ్రమతో తయారయ్యే ఉత్పత్తులను విక్రయించబోమని, వినియోగించబోమని ప్రకటించే చైతన్యాన్ని కలిగించాడు. ఇంతవరకూ 80,000 మంది పిల్లలను వెట్టిచాకిరీనుంచి, దాంతోపాటు లైంగిక వేధింపులనుంచి కూడా రక్షించాడు. ఆ క్రమంలో బీబీఏ కార్యకర్తలిద్దరిని దుండగులు పొట్టనబెట్టుకున్నారు. స్వాత్ లోయ అంతటా బాలికా విద్యను నిషేధించి, బడికొస్తే కాల్చేస్తామని ఉగ్రవాదులు రెచ్చిపోతున్న వేళ ‘నా చదువును చిదిమేందుకు మీరెవర’ని నిలబడిన ధీర మలాలా. చిత్రమేమంటే తనకు నోబెల్ ప్రకటించారని తెలిశాక ఇంటర్వ్యూ చేయడానికొచ్చిన మీడియాకు కూడా తన తొలి ప్రాధాన్యం చదువేనని చాటింది. ‘స్కూల్ అయ్యాకే మీతో మాట్లాడతాన’ని కబురంపింది. తుపాకుల భాష తప్ప మరేమీ రాని క్షుద్ర మూకకు భయపడొద్దని తోటి బాలికలకు ధైర్యం నూరిపోసి, వారితోపాటు స్కూల్ బస్సులో వెళ్తుండగా మలాలా 2009లో ఉగ్రవాదుల దాడికి లోనైంది. ‘మలాలా ఎవరు?’ అన్న ప్రశ్నకు నేనేనని జవాబివ్వబోతుండగానే తుపాకి గుళ్లు ఆమె తలలోకి దూసుకెళ్లాయి. అప్పటికామె వయసు పన్నెండేళ్లు. రోజుల తరబడి ఆస్పత్రిలో కోమాలో ఉండి కోలుకున్నా ఆమెలోని దృఢ సంకల్పం చెదిరిపోలేదు. తనను ఆరోజు మాట్లాడనివ్వని ఉగ్రవా దులకు జవాబుగా ‘అవును... నేనే మలాలా’ అంటూ గ్రంథం వెలువరించింది. వేర్వేరు రూపాల్లోనే కావొచ్చుగానీ... చదువుకునేందుకు నిత్యం ఎన్నెన్నో అవరోధా లను ఎదుర్కొంటున్న లక్షలమంది బాలికలకు ఆమె స్ఫూర్తి ప్రదాత. ఉగ్రవాదుల గురించి అంతర్జాతీయ వేదికలపై ఎంతో మాట్లాడిన మలాలా... పాక్-అఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాల్లో ద్రోన్ దాడులతో మారణకాండ సాగిస్తున్న పాశ్చాత్య దేశాల ఆగడాలను ప్రశ్నించదేమని కొందరు అంటున్నారు. కానీ, ఆ వయసు బాలిక నుంచి ఇంత పెద్ద బాధ్యతను ఆశించడం కూడా సరైనది కాదు. ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి ప్రకటన ద్వారా మలాలా, సత్యార్థి చేసిన పోరాటాలకూ, ఆ క్రమంలో వారు పెంపొందించిన విలువలకూ అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఇప్పటికీ అధ్వాన్నస్థితిలో మగ్గుతున్న లక్షలమంది బాలబాలికలపై అందరి దృష్టీ పడటానికి, వారిని కాపాడటానికి ఇది నిస్సందేహంగా తోడ్పడు తుంది. ఈ ప్రకటన ద్వారా నోబెల్ కమిటీ తన స్థాయిని పెంచుకుంది. -
'గాంధీజీకి వచ్చి ఉంటే సంతోషించేవాడిని'
న్యూఢిల్లీ: తనకన్నా ముందు గాంధీజీకి ఈ అవార్డ్ వచ్చి ఉంటే మరింత గౌరవంగా భావించేవాడినని నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి తెలిపారు. నోబెల్ శాంతి బహుమతికి తనను ఎంపిక చేయడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన ముందుగా గాంధీజీకి వచ్చే ఉంటే మరింత సంతోషించేవాడినని అన్నారు. ‘నోబెల్ కమిటీకి కృతజ్ఞతలు. ఇదో గొప్ప గౌరవం నాకు. అయితే, ఈ అవార్డ్ జాతిపిత మహాత్మాగాంధీకి వచ్చి ఉంటే నేను మరింత సంతోషించేవాడిని. గాంధీజీ తరువాత నాకు లభించి ఉంటే మరింత గౌరవంగా భావించేవాడిని. ఈ అవార్డ్ దేశానికి అంకితం. ఇది నా బాధ్యతను మరింత పెంచింది. బాలల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం ఇకపై రెట్టించిన ఉత్సాహంతో కృషి చేస్తాను'అని తెలిపారు. -
'నోబెల్' విజేతలకు వైఎస్ జగన్ అభినందన
హైదరాబాద్: నోబెల్ శాంతి బహుమతి విజేతలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. వెట్టిచాకిరి నుంచి చిన్నారులకు విముక్తి కల్పించి.. విద్య, ఆశ్రయం కల్పించిన కైలాశ్ సత్యార్థి కృషి మరువలేనిదని కొనియాడారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత బాలల హక్కుల కార్యకర్త కైలాశ్ సత్యార్థి, పాకిస్థాన్ లో బాలికల విద్యాహక్కు కోసం పోరాడాడిన మలాలా యూసఫ్‌జాయ్ లకు 2014 సంవత్సరాలనికి నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. -
భారతీయుడికి నోబెల్ శాంతి బహుమతి
-
ఎవరీ కైలాశ్ సత్యార్థి?
భారతీయుడు కైలాశ్ సత్యార్థికి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించడంతో ఆయన పేరు మీడియాలో మార్మోగుతోంది. బాలల హక్కుల కార్యకర్త అయిన ఇప్పటివరకు 80 వేల మంది పిల్లలకు వెట్టిచారికి నుంచి విముక్తి లభించారు. బచ్పన్ బాచావో ఆందోళన్ సంస్థను స్థాపించి అనాథ బాలలకు పునరావాసం, విద్య అందిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని విదిశ ప్రాంతానికి చెందిన ఆయన బాలల హక్కుల కోసం అవిరాళ పోరాటం చేశారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, మానవ హక్కులు, అనాథ చిన్నారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. కైలాశ్ సత్యార్థి న్యూఢిల్లీలో నివసిస్తూ తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆయన కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన పోరాటాలకు గుర్తింపుగా పలు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. -
పోరాటానికి లభించిన గుర్తింపు: కైలాశ్ సత్యార్ధి
న్యూఢిల్లీ: బాలల హక్కుల కోసం చేసిన పోరాటానికి లభించిన గుర్తింపు అని నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి వ్యాఖ్యానించారు. నోబెల్ బహుమతికి లభించడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. నార్వేయిన్ నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించిన నోబెల్ పురస్కారాన్ని మలాలా యూసఫ్ జాయ్ తో కలిసి కైలాశ్ సత్యార్ధి అందుకున్న సంగతి తెలిసిందే. 1990 నుంచి బాల కార్మికుల నిర్మూలన కోసం పాటు పడుతున్నారు. ఇప్పటి వరకు 80 వేల మంది బాలలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి విద్య, పునరావాసాన్ని కల్పించారు. -
భారతీయుడికి నోబెల్ శాంతి బహుమతి
స్టాక్‌హోం: ఈ సంవత్సరం నోబెల్ శాంతి పురస్కారం భారత్, పాకిస్థాన్ లకు సంయుక్తంగా దక్కింది. భారతీయుడు కైలాశ్ సత్యార్థి, పాకిస్థాన్ హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ లను సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి వరించింది. వీరిద్దరూ బాలల హక్కుల కార్యకర్తలు కావడం విశేషం. బాలలు, యువత హక్కుల కోసం పోరాడినందుకు వీరికి నోబెల్ పురస్కార కమిటీ ఈ అవార్డు ప్రకటించింది. చిన్నారుల చదువు కోసం వీరు రాజీలేని పోరాటం చేశారని కమిటీ ప్రశసించింది. పాకిస్థాన్ బాలికల విద్యాహక్కు కోసం మలాలా తీవ్రవాదులకు తూటాలకు ఎదురునిలిచింది.