న్యూఢిల్లీ: కైలాశ్ సత్యార్థి నోబెల్ పురస్కారాన్ని అందుకున్న ఐదో భారతీయుడిగా నిలిచారు. భారత్‌లో జన్మించి, నోబెల్ శాంతి బహుమతి అందుకున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు. నోబెల్ అవార్డు పొందిన మిగతా నలుగురు భారతీయులు, రవీంద్రనాథ్ ఠాగూర్(1913, సాహిత్యం), సీవీ రామన్(1930, భౌతికశాస్త్రం), మదర్ థెరిసా(1978, శాంతి), అమర్త్యసేన్(1998, ఆర్థికశాస్త్రం). ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ గెల్చుకున్న తొలి భారతీయుడు. మదర్ థెరిసా నాటి యుగోస్లేవియాలో జన్మించినప్పటికీ 1948లో భారత పౌరసత్వం తీసుకున్నారు. కాబట్టి ఆమెను భారతీయురాలిగానే పరిగణిస్తున్నారు.
వీరే కాకుండా భారత్‌తో సంబంధమున్న నోబెల్ గ్రహీతలు
భారత్‌లో పుట్టిన బ్రిటిష్ పౌరులు-రొనాల్డ్ రాస్(1902, వైద్యం), రుడ్‌యార్డ్ కిప్లింగ్(1907, సాహిత్యం)
భారత్‌లో పుట్టి అమెరికా పౌరసత్వం తీసుకున్న భారత సంతతి శాస్త్రవేత్త హర్‌గోబింద్ ఖురానా(1968, వైద్యం)
భారత్‌లో పుట్టిన పాకిస్థాన్ పౌరుడుఅబ్దుస్ సలాం (1979, భౌతిక శాస్త్రం)
భారత్‌లో జన్మించి, అమెరికా పౌరసత్వం తీసుకున్న భారత సంతతి శాస్త్రవేత్త సుబ్రమణ్యం చంద్రశేఖర్(1983, భౌతిక శాస్త్రం)
భారత్‌లో నివసిస్తున్న టిబెట్ బౌద్ధుల గురువు దలైలామా(1989, శాంతి)
ట్రినిడాడ్‌లో పుట్టి బ్రిటన్‌లో స్థిరపడిన భారత సంతతి రచయిత వీఎస్ నైపాల్(2001, సాహిత్యం)
భారత్‌లో పుట్టిన బంగ్లాదేశ్ పౌరుడు మహ్మద్ యూనస్(2006, శాంతి)
భారత్‌లో పుట్టి అమెరికా, బ్రిటన్ పౌరసత్వాలున్న వెంకట్రామన్ రామకృష్ణన్(2009, రసాయన శాస్త్రం)
ఐపీసీసీ పేరుతో భారతీయుడు రాజేంద్రకుమార్ పచౌరి నిర్వహిస్తున్న ఛారిటీ సంస్థ కూడా 2007లో నోబెల్ శాంతి బహుమతి గెల్చుకుంది.