
పిల్లల్ని చంపొద్దు: సత్యార్థి
న్యూఢిల్లీ: అభం శుభం తెలియని పిల్లలను చంపొద్దని తీవ్రవాద సంస్థలకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి విజ్ఞప్తి చేశారు. తీవ్రవాదంపై పోరుకు అంతర్జాతీయ సమాజం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్ లోని పెషావర్ లో ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాదుల దాడి మానవాళి అత్యంత చీకటి దినాల్లో ఒకటని వ్యాఖ్యానించారు. ప్రపంచ విషాదాల్లో ఇది ఒకటని పేర్కొన్నారు.
దాడి గురించి తెలిసిన వెంటనే తన మనసంతా పెషావర్ లోనే ఉందని తెలిపారు. ఉగ్రవాదులు పిల్లలను వదిలేసి తనను చంపేసినా బాగుండునని పేర్కొన్నారు. అమాయక పిల్లలను చంపడాన్ని ఏ మతం అంగీకరించదని సత్యార్థి చెప్పారు. జర్మనీ ఎంబసీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.