బాలలనుద్దేశించి ప్రసంగిస్తున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి
విద్యారణ్యపురి(హనుమకొండ): ‘విద్య ప్రాథమిక హక్కు. బాలబాలికలందరికీ సమానంగా విద్యావకాశాలు ఉండాలి. విద్యనందించడంలో వివక్ష ఉండొద్దు. బాలలు విద్యార్థి దశ నుంచే మానవీయ విలువలను పెంపొందించుకోవాలి’అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి అన్నారు. సోమవారం ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వేలాదిమంది విద్యార్థులతో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
ప్రపంచంలో వాస్తవ హీరోలు బాలబాలికలేనని పేర్కొన్నారు. సమాజంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లంటూ మత విభేదాలు లేకుండా కలిసికట్టుగా చదువుకోవడానికి విద్యార్థులు ముందుకురావాలన్నారు. విద్యార్థి దశ నుంచే తాము భవిష్యత్‌లో ఏమి కావాలో నిర్దేశించుకోవాలని, అందుకు కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
‘మీలో ఎవరైనా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కావాలని అనుకుంటున్నారా’అని విద్యార్థులను ప్రశ్నించారు. తాను ఒకప్పుడు జర్మనీలో ఓ నోబెల్ బహుమతి గ్రహీతను కలిసినప్పుడు అప్పట్లో తనకు మొబైల్ ఫోన్ లేదని, అతనితో ఫొటో తీసుకోలేకపోయానన్నారు. కానీ అప్పుడే నోబెల్ బహుమతి గ్రహీతను కావాలనే సంకల్పం పెట్టుకున్నానని, చివరికి దానిని సాధించగలిగానని పేర్కొన్నారు.
ఆఫ్రికా లాంటి దేశాల్లో చాక్లెట్లు తయారీ చేసే పరిశ్రమల్లో బాలకార్మికులు పనిచేస్తున్నారని, అలాంటి చాక్లెట్‌ను తినొద్దని, అలా చేస్తేనే బాలకార్మిక వ్యవస్థకు విముక్తి కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్, కుడా చైర్మన్ సుందర్‌రాజు యాదవ్, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, గోపి, బల్దియా కమిషనర్ ప్రావీణ్య, సీపీ ఏవీ రంగనా«థ్, వడుప్సా అధ్యక్షుడు రమేశ్‌రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాలల హక్కులు రక్షించినప్పుడే శాంతి
బాలల హక్కులు రక్షించినప్పుడే ప్రపంచశాంతి, సుస్థిరత నెలకొంటుందని కైలాస్ సత్యార్థి అభిప్రాయపడ్డారు. సభ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పెద్దల కంటే బాలబాలికలపైనే తీవ్రప్రభావం చూí³ందని, పిల్లలు ఎంతోమంది మరణించారన్నారు. బాల్యవివాహాల నిరోధక చట్టం ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవటంలేదని, గ్రామాల్లో ప్రతి నలుగురు బాలికల్లో ఒకరికి బాల్య వివాహం జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment