bhahiranga sabha
-
విద్యలో వివక్ష ఉండొద్దు
విద్యారణ్యపురి(హనుమకొండ): ‘విద్య ప్రాథమిక హక్కు. బాలబాలికలందరికీ సమానంగా విద్యావకాశాలు ఉండాలి. విద్యనందించడంలో వివక్ష ఉండొద్దు. బాలలు విద్యార్థి దశ నుంచే మానవీయ విలువలను పెంపొందించుకోవాలి’అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి అన్నారు. సోమవారం ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వేలాదిమంది విద్యార్థులతో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ప్రపంచంలో వాస్తవ హీరోలు బాలబాలికలేనని పేర్కొన్నారు. సమాజంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లంటూ మత విభేదాలు లేకుండా కలిసికట్టుగా చదువుకోవడానికి విద్యార్థులు ముందుకురావాలన్నారు. విద్యార్థి దశ నుంచే తాము భవిష్యత్‌లో ఏమి కావాలో నిర్దేశించుకోవాలని, అందుకు కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ‘మీలో ఎవరైనా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కావాలని అనుకుంటున్నారా’అని విద్యార్థులను ప్రశ్నించారు. తాను ఒకప్పుడు జర్మనీలో ఓ నోబెల్ బహుమతి గ్రహీతను కలిసినప్పుడు అప్పట్లో తనకు మొబైల్ ఫోన్ లేదని, అతనితో ఫొటో తీసుకోలేకపోయానన్నారు. కానీ అప్పుడే నోబెల్ బహుమతి గ్రహీతను కావాలనే సంకల్పం పెట్టుకున్నానని, చివరికి దానిని సాధించగలిగానని పేర్కొన్నారు. ఆఫ్రికా లాంటి దేశాల్లో చాక్లెట్లు తయారీ చేసే పరిశ్రమల్లో బాలకార్మికులు పనిచేస్తున్నారని, అలాంటి చాక్లెట్‌ను తినొద్దని, అలా చేస్తేనే బాలకార్మిక వ్యవస్థకు విముక్తి కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్, కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, గోపి, బల్దియా కమిషనర్ ప్రావీణ్య, సీపీ ఏవీ రంగనా«థ్, వడుప్సా అధ్యక్షుడు రమేశ్‌రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాలల హక్కులు రక్షించినప్పుడే శాంతి బాలల హక్కులు రక్షించినప్పుడే ప్రపంచశాంతి, సుస్థిరత నెలకొంటుందని కైలాస్ సత్యార్థి అభిప్రాయపడ్డారు. సభ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పెద్దల కంటే బాలబాలికలపైనే తీవ్రప్రభావం చూí³ందని, పిల్లలు ఎంతోమంది మరణించారన్నారు. బాల్యవివాహాల నిరోధక చట్టం ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవటంలేదని, గ్రామాల్లో ప్రతి నలుగురు బాలికల్లో ఒకరికి బాల్య వివాహం జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. -
నేడు సకల జనుల సమరభేరి
-
నేడు ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమరభేరి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా బుధవారం సకల జనుల సమరభేరి పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభలో విపక్ష పార్టీలన్నీ పాల్గొనబోతున్నాయి. తొలుత ఈ సభను సరూర్‌నగర్ మైదా నంలో భారీ స్థాయిలో నిర్వహించాలని అనుకున్నా.. హైకోర్టు సూచనలతో పరిమితులతో కూడిన సభలాగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సభ జరగనుంది. స్టేడియం సామర్థ్యం ఐదు వేలే... సభను 3 లక్షల మందితో భారీగా నిర్వహించాలని జేఏసీ తొలుత నిర్ణయించింది. వీరిలో దాదాపు లక్షన్నర మంది కార్మికుల కుటుంబీకులే ఉంటారని అంచనా వేసింది. సమ్మెకు విపక్షాలన్నీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుండటంతో, జనసమీకరణకు ఆయా పార్టీలన్నీ హామీ ఇచ్చాయి. సరూర్‌నగర్ మైదానంలో సభకు ప్రణాళిక సిద్ధం చేసుకుని అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు చెప్పడంతో మంగళవారం జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న అనంతరం షరతులతో అనుమతి మంజూరు చేసింది. ఫలితంగా వేదికను ఇండోర్ స్టేడియంలోకి మార్చాల్సి వచి్చంది. స్టేడియం సామర్థ్యం కేవలం 5 వేలే కావడంతో జనసమీకరణ కసరత్తును విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉధృతంగా నిరసనలు.. హైకోర్టు వ్యాఖ్యలతో కార్మికుల్లో ఉత్సాహం పెరిగింది. దీంతో గత రెండు రోజులుగా వారు నిరసనల హోరు పెంచారు. మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, విపక్షాల కార్యకర్తలు నిరసనలు నిర్వహించారు. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద కార్మికులు ధర్నా చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు సమ్మెకు మద్దతుగా నిలిచారు. ఆర్మూర్‌లో కార్మికులు, అఖిలపక్ష నేతలు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి బస్టాండు వద్ద కార్మికులు మోకాళ్లపై మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల పోరాట సహాయ నిధికి తెలంగాణ ఉపాధ్యాయ సంఘం పక్షాన రూ.25 వేలు, కామారెడ్డి కోర్టు సిబ్బంది రూ.5 వేలు అందజేశారు. సమ్మె మొదలయ్యాక మృతి చెందిన ఆర్టీసీ కార్మికులకు బాన్సువాడ, జగిత్యాల, మెట్పల్లి, గోదావరిఖని, హుస్నాబాద్ డిపోల వద్ద నివాళులరి్పంచారు. మంథని వద్ద గోదావరి నదిలో బీజేపీ ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు. నల్లగొండలో కార్మికుల నిరసనలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మద్దతు ప్రకటించారు. కండక్టర్ నీరజ ఆత్మహత్య నేపథ్యంలో సత్తుపల్లిలో బంద్‌కు పిలుపినివ్వటంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. సీఐటీయూ నేతను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ కార్యకర్తలు, కార్మికులు ఖమ్మం టూటౌన్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. సిద్దిపేటలో కార్మికుల దీక్షా శిబిరం వద్ద సీపీఐ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎమ్మారీ్పఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కార్మికులకు సంఘీభావంగా ఆందోళనల్లో పాల్గొన్నారు. మరోవైపు ఆర్టీసీ పరిరక్షణ, హక్కుల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నది వీరోచిత పోరాటమని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కొనియాడింది. వారి పోరాటానికి ఏపీఎస్‌ఆరీ్టసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మరోవైపు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 73 శాతం బస్సులను తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. ‘కోర్టుకు తప్పుడు వివరాలిస్తోంది’ ప్రభుత్వం కోర్టుకు తప్పుడు వివరాలు అందిస్తోం దని ఆర్టీసీ జేఏసీ ఆరోపించింది. ముఖ్యంగా నిధులకు సంబంధించి తప్పుడు లెక్కలు ఇస్తోందని ఆరోపించింది. మంగళవారం సాయంత్రం జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్‌రావు తదితరులు మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో 2014 వరకు రూ.1,099 కోట్లు, ఆ తర్వాత 2019 వరకు రూ.1,375 కోట్లు రాయితీ పాస్‌లకు సంబంధించి రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాల్సి ఉందని, జీహెచ్ఎంసీ నుంచి రూ.1,496 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చామంటూ ప్రభుత్వం చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. షరతులతో హైకోర్టు అనుమతి ఆర్టీసీ జేఏసీ బుధవారం తలపెట్టిన సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. దీని ప్రకారం సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. సరూర్‌నగర్ స్టేడియంలో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఈనెల 24న పోలీసులకు దరఖాస్తు చేసుకుంది. అయితే, పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ టి.వినోద్‌కుమార్ షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేశారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 3 నుంచి 6 గంటల మధ్య సభ నిర్వహించి, 7 గంటల కల్లా ఖాళీ చేయాలని, శాంతియుతంగా నిర్వహిస్తామని పోలీసులకు జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి హామీ ఇవ్వాలని ఆదేశించారు. సభలో ప్రసంగించే వారి సంఖ్యను ఐదుగురికి పరిమితం చేయాలన్నారు. మరో ఒకరిద్దరికి అవకాశం ఇవ్వొచ్చని, ప్రసంగించే వారి పేర్లను పోలీసులకు ఇవ్వాలని సూచించారు. సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని, ఐదువేల మందికి మించి పాల్గొనవద్దని ఆదేశించారు. -
ఆత్మబంధువుకు ఆత్మీయ హారతి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కాయి. విజయనగరంలో వెల్లువలా కదిలాయి. నెల్లిమర్లలో పోటెత్తాయి. అభిమానం ముందు మండే ఎండ సైతం చిన్నబోయింది. ఆ ఆప్యాయతను చూసి అభిమానం పూల వానై కురిసింది. ఆత్మీయనేతను అక్కున చేర్చుకున్నాయి. ఆప్యాయతతో పలకరించి ఆద్యంతం వెంట నడిచాయి. జన ప్రయోజనం కోసం ఆరాటపడి, ప్రజలకు మేలు చేయాలని పాటు పడి, పది కాలాల పాటు గుర్తుండిపోయే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన మహానేత తనయుడిపై అపురూపమైన అభిమానాన్ని చూపించాయి. వైఎస్ఆర్ జనభేరిలో భాగంగా విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పర్యటించారు. పర్యటనలో తొలి రోజు విజయనగరంలో రోడ్‌షో నిర్వహించారు. నెల్లిమర్లలో రోడ్‌షోతో పాటు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. విజయనగరంలోని బాలాజీనగర్‌లో ప్రారంభమైన రోడ్ షో మయూరి జంక్షన్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ మీదుగా అంబేద్కర్ కాలనీకి చేరుకుంది. అక్కడి నుంచి బాలాజీ టెక్స్టైల్స్ మార్కెట్, ఎన్సీఎస్ రోడ్డు, ఎంఆర్ఓ ఆఫీసు మీదుగా బొడ్డువారి జంక్షన్‌కు చేరుకుంది. అక్కడి నుంచి శాంతినగర్, బీసెంట్ స్కూల్రోడ్, నాగవంశపు వీధి, హకుంపేట, కొత్తపేట జంక్షన్, పూల్‌బాగ్ మీదుగా నెల్లిమర్లలో ప్రవేశించింది. విజయనగరం పట్టణంలో జరిగిన రోడ్‌షోలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆద్యంతం ప్రజలతో మమేకమయ్యారు. అవ్వలను మురిపెంగా ముద్దాడితే... పెద్దయ్యలను ఆత్మీయంగా పలకరించారు. అక్కలతో సోదర భావాన్ని పెనవేశారు. ఓ చెల్లెలికి అన్నగా సమస్యలు తెలుసుకున్నారు. అడుగడుగునా మహిళల ఆనందాన్ని చూసి, కారు దిగి, ఆప్యాయంగా మాట్లాడారు. వారితో మమేకమై కష్టాలు తెలుసుకున్నారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. భవిష్యత్ మనదే అన్న ఆశలు రేకెత్తిం చారు. అభిమాన నేత కోసం నిలువెల్లా కళ్లు చేసుకుని ఎదురు చూశారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి రోడ్డు పక్కన బారులు తీరారు. వీధి పొలిమేరల్లో ఎదురేగి స్వాగతం పలికారు. చెక్కు చెదరని ఆదరణతో అక్కున చేర్చుకున్నారు. దీంతో పుర వీధులు కిటకిటలాడాయి. రహదారులన్నీ జనసంద్రమ య్యాయి. ఏ నాయకుడూ వెళ్లని మురికివాడల్లోకి వెళ్లి ప్రజల బాధలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. బడుగు, బలహీన వర్గాల వారంతా నీరాజనం పట్టారు. ఇక యువకులు కూడా పోటీ పడ్డారు. జగనన్న చేయి తాకేందుకు ప్రయత్నించారు. చేతుల్లో చెయ్యేసి అభిమానాన్ని చూపించారు. అడుగులో అడుగేసి ఆద్యంతం కదలివచ్చారు.ఇక నెల్లిమర్లలో అడుగు పెట్టేసరికి తరలి వచ్చిన జనంతో సభాప్రాంగణం కిక్కిరిసిపోయింది.దారిపొడవునా అభిమాన జనం ఆత్మీయ స్వాగతం పలికింది. అడుగడుగునా జగనన్నను కలిసేందుకు ఆరాటపడ్డారు. వారి ఆత్రుతను చూసి కారు దిగి ప్రతి ఒక్కర్నీ పలకరించి మాట్లాడారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి, రామతీర్థం జంక్షన్, గాంధీనగర్ కాలనీ జంక్షన్ మీదుగా నెల్లిమర్లలో మొయిద జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. తరలివచ్చిన జనంతో మొయిద జంక్షన్ పోటెత్తింది. జై జగన్ నినాదాలతో మార్మోగింది. యువకుల కేరింతలతో హోరెత్తింది. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రసంగాల పంచ్‌లతో హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. చంద్రబాబుపై విమర్శలు చేసిన ప్రతిసారీ చప్పట్లు మిన్నంటాయి. ప్రజల హర్షధ్వానాల మధ్య కాంగ్రెస్‌కు చెందిన పార్వతీపురం ఎమ్మెల్యే సవరపు జయమణి, ఆ పార్టీ నేతలు భీమవరపు కృష్ణమూర్తి, నడిమింటి రామకృష్ణ, బొంగు చిట్టిరాజు, పార్వతీపురం, సీతానగరం మండలాలకు చెందిన సర్పంచ్‌లు, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం థామస్‌పేట, జరజాపుపేట, పూతికపేట మీదుగా రోడ్‌షో నిర్వహించి మొయిద చేరుకున్నారు. ఇక్కడ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయకృష్ణ రంగారావు స్వాగతం పలికారు. రోడ్ షో ప్రారంభానికి ముందు పార్టీ విజయనగరం నియోజక వర్గ సమన్వయకర్త అవనాపు విజయ్ ఇంట్లో జిల్లాలోని పార్టీ అధ్యక్షులు, సమన్వయకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రానున్న మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమయ్యే విషయమై చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాడి వీరభద్రరావు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, పార్లమెంట్ సమన్వయకర్త బేబీనాయన, ఖమ్మం పార్లమెంట్ సమన్వయకర్త పొంగులేటి. శ్రీనివాస రెడ్డి, టూర్ ప్రొగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, నియోజక వర్గ సమన్వయకర్తలు అవనాపు విజయ్, గురాన అయ్యలు, శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు, కడుబండి శ్రీనివాసరావు, బోకం శ్రీనివాస్, జమ్మాన ప్రసన్నకుమార్, డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, కోరాడ రాజబాబు, కర్రి సీతారాం, చీపురుపల్లి నాయకులు బెల్లాన చంద్రశేఖర్, జిల్లా ప్రాదేశిక ఎన్నికల పరిశీలకులు పిరియా సాయిరాజ్, పార్టీ నాయకులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, సత్తిరామకృష్ణారెడ్డి, కాకర్లపూడి శ్రీనివాసరాజు,వేచలపు చిన రామునాయుడు, వల్లూరు జయప్రకాష్‌బాబు, అంబళ్ల శ్రీరాములునాయుడు, చనమల్లు వెంకటరమణ,అవనాపు విక్రమ్, అవనాపు చిన్నమ్మలు, కాళ్ల గౌరీశంకర్, మైనార్టీ విభాగం నాయకులు నాజీర్,అబ్దుల్ కరీం వాజీబ్, బీసీ మహిళా నాయకులు రమాదేవి, పట్టణ కౌన్సిలర్ అభ్యర్థులు బాలి శిరీష, శిరుగుడి లావణ్యకుమార్, విక్టోరియా విజయ, మ ద్దిల.గోపి, బొద్దూరు లక్ష్మణరావు, గీతారాణి, ఆడారి శ్రీను, టి, వెంకటలత, నండూరి లక్ష్మి పాల్గొన్నారు.