ఆత్మబంధువుకు ఆత్మీయ హారతి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కాయి. విజయనగరంలో వెల్లువలా కదిలాయి. నెల్లిమర్లలో పోటెత్తాయి. అభిమానం ముందు మండే ఎండ సైతం చిన్నబోయింది. ఆ ఆప్యాయతను చూసి అభిమానం పూల వానై కురిసింది. ఆత్మీయనేతను అక్కున చేర్చుకున్నాయి. ఆప్యాయతతో పలకరించి ఆద్యంతం వెంట నడిచాయి.
జన ప్రయోజనం కోసం ఆరాటపడి, ప్రజలకు మేలు చేయాలని పాటు పడి, పది కాలాల పాటు గుర్తుండిపోయే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన మహానేత తనయుడిపై అపురూపమైన అభిమానాన్ని చూపించాయి. వైఎస్‌ఆర్ జనభేరిలో భాగంగా విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పర్యటించారు.
పర్యటనలో తొలి రోజు విజయనగరంలో రోడ్‌షో నిర్వహించారు. నెల్లిమర్లలో రోడ్‌షోతో పాటు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. విజయనగరంలోని బాలాజీనగర్‌లో ప్రారంభమైన రోడ్ షో మయూరి జంక్షన్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ మీదుగా అంబేద్కర్ కాలనీకి చేరుకుంది. అక్కడి నుంచి బాలాజీ టెక్స్‌టైల్స్ మార్కెట్, ఎన్‌సీఎస్ రోడ్డు, ఎంఆర్‌ఓ ఆఫీసు మీదుగా బొడ్డువారి జంక్షన్‌కు చేరుకుంది. అక్కడి నుంచి శాంతినగర్, బీసెంట్ స్కూల్‌రోడ్, నాగవంశపు వీధి, హకుంపేట, కొత్తపేట జంక్షన్, పూల్‌బాగ్ మీదుగా నెల్లిమర్లలో ప్రవేశించింది. విజయనగరం పట్టణంలో జరిగిన రోడ్‌షోలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆద్యంతం ప్రజలతో మమేకమయ్యారు.
అవ్వలను మురిపెంగా ముద్దాడితే... పెద్దయ్యలను ఆత్మీయంగా పలకరించారు. అక్కలతో సోదర భావాన్ని పెనవేశారు. ఓ చెల్లెలికి అన్నగా సమస్యలు తెలుసుకున్నారు. అడుగడుగునా మహిళల ఆనందాన్ని చూసి, కారు దిగి, ఆప్యాయంగా మాట్లాడారు. వారితో మమేకమై కష్టాలు తెలుసుకున్నారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. భవిష్యత్ మనదే అన్న ఆశలు రేకెత్తిం చారు. అభిమాన నేత కోసం నిలువెల్లా కళ్లు చేసుకుని ఎదురు చూశారు.
మండే ఎండను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి రోడ్డు పక్కన బారులు తీరారు. వీధి పొలిమేరల్లో ఎదురేగి స్వాగతం పలికారు. చెక్కు చెదరని ఆదరణతో అక్కున చేర్చుకున్నారు. దీంతో పుర వీధులు కిటకిటలాడాయి. రహదారులన్నీ జనసంద్రమ య్యాయి. ఏ నాయకుడూ వెళ్లని మురికివాడల్లోకి వెళ్లి ప్రజల బాధలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. బడుగు, బలహీన వర్గాల వారంతా నీరాజనం పట్టారు. ఇక యువకులు కూడా పోటీ పడ్డారు. జగనన్న చేయి తాకేందుకు ప్రయత్నించారు. చేతుల్లో చెయ్యేసి అభిమానాన్ని చూపించారు.
అడుగులో అడుగేసి ఆద్యంతం కదలివచ్చారు.ఇక నెల్లిమర్లలో అడుగు పెట్టేసరికి తరలి వచ్చిన జనంతో సభాప్రాంగణం కిక్కిరిసిపోయింది.దారిపొడవునా అభిమాన జనం ఆత్మీయ స్వాగతం పలికింది. అడుగడుగునా జగనన్నను కలిసేందుకు ఆరాటపడ్డారు. వారి ఆత్రుతను చూసి కారు దిగి ప్రతి ఒక్కర్నీ పలకరించి మాట్లాడారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి, రామతీర్థం జంక్షన్, గాంధీనగర్ కాలనీ జంక్షన్ మీదుగా నెల్లిమర్లలో మొయిద జంక్షన్‌కు చేరుకున్నారు.
అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. తరలివచ్చిన జనంతో మొయిద జంక్షన్ పోటెత్తింది. జై జగన్ నినాదాలతో మార్మోగింది. యువకుల కేరింతలతో హోరెత్తింది. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రసంగాల పంచ్‌లతో హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. చంద్రబాబుపై విమర్శలు చేసిన ప్రతిసారీ చప్పట్లు మిన్నంటాయి. ప్రజల హర్షధ్వానాల మధ్య కాంగ్రెస్‌కు చెందిన పార్వతీపురం ఎమ్మెల్యే సవరపు జయమణి, ఆ పార్టీ నేతలు భీమవరపు కృష్ణమూర్తి, నడిమింటి రామకృష్ణ, బొంగు చిట్టిరాజు, పార్వతీపురం, సీతానగరం మండలాలకు చెందిన సర్పంచ్‌లు, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
అనంతరం థామస్‌పేట, జరజాపుపేట, పూతికపేట మీదుగా రోడ్‌షో నిర్వహించి మొయిద చేరుకున్నారు. ఇక్కడ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయకృష్ణ రంగారావు స్వాగతం పలికారు. రోడ్ షో ప్రారంభానికి ముందు పార్టీ విజయనగరం నియోజక వర్గ సమన్వయకర్త అవనాపు విజయ్ ఇంట్లో జిల్లాలోని పార్టీ అధ్యక్షులు, సమన్వయకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రానున్న మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమయ్యే విషయమై చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాడి వీరభద్రరావు.
జిల్లా పార్టీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, పార్లమెంట్ సమన్వయకర్త బేబీనాయన, ఖమ్మం పార్లమెంట్ సమన్వయకర్త పొంగులేటి. శ్రీనివాస రెడ్డి, టూర్ ప్రొగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, నియోజక వర్గ సమన్వయకర్తలు అవనాపు విజయ్, గురాన అయ్యలు, శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు, కడుబండి శ్రీనివాసరావు, బోకం శ్రీనివాస్, జమ్మాన ప్రసన్నకుమార్, డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, కోరాడ రాజబాబు, కర్రి సీతారాం, చీపురుపల్లి నాయకులు బెల్లాన చంద్రశేఖర్, జిల్లా ప్రాదేశిక ఎన్నికల పరిశీలకులు పిరియా సాయిరాజ్, పార్టీ నాయకులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, సత్తిరామకృష్ణారెడ్డి, కాకర్లపూడి శ్రీనివాసరాజు,వేచలపు చిన రామునాయుడు, వల్లూరు జయప్రకాష్‌బాబు, అంబళ్ల శ్రీరాములునాయుడు, చనమల్లు వెంకటరమణ,అవనాపు విక్రమ్, అవనాపు చిన్నమ్మలు, కాళ్ల గౌరీశంకర్, మైనార్టీ విభాగం నాయకులు నాజీర్,అబ్దుల్ కరీం వాజీబ్, బీసీ మహిళా నాయకులు రమాదేవి, పట్టణ కౌన్సిలర్ అభ్యర్థులు బాలి శిరీష, శిరుగుడి లావణ్యకుమార్, విక్టోరియా విజయ, మ ద్దిల.గోపి, బొద్దూరు లక్ష్మణరావు, గీతారాణి, ఆడారి శ్రీను, టి, వెంకటలత, నండూరి లక్ష్మి పాల్గొన్నారు.