సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న సాంకేతికత, సమాచార విప్లవంతో ఇంటర్నెట్‌లో పోర్న్ వీడియోలు, బూతు సాహిత్యం విపరీతంగా అందుబాటులో ఉంటోందని, పిల్లలపై లైంగిక వేధింపులు అధికం కావడా నికి ఇదే ప్రధాన కారణమని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత బాలలను పోలీసులు వారి పిల్లలుగా భావించి పకడ్బందీగా దర్యాప్తు చేసినప్పుడే దోషులకు శిక్షపడుతుందన్నారు. శనివారం హైదరాబాద్ పర్యటనకు వచి్చన కైలాష్ సత్యారి్థ... డీజీ పీ కార్యాలయంలో పోలీస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు.
పిల్లల అక్రమ రవాణా వ్యవస్థీకృతమైన, అత్యంత బలమైన మూలాలున్న నేరంగా ఉందని కైలాష్ సత్యార్థి పేర్కొన్నారు. ఈ నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్న విధానాలతో గణనీయమైన ఫలితాలు లభిస్తున్నాయని ప్రశంసించారు. మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టడంలో తెలంగాణ పోలీసుల పాత్ర దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలుస్తోందని కితాబిచ్చారు.
డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో పిల్లలు, మహిళల భద్రతకు రాష్ట్రం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిచ్చిం దని, ఇందులో భాగంగా అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. అదనపు డీజీ మహేష్ భగవత్ మాట్లాడుతూ కైలాష్ సత్యార్థి కృషి వల్లే తప్పిపోయిన పిల్లల అంశంపై ఎఫ్‌ఐఆర్‌ల నమోదు ప్రారంభమైందని, ఆ తర్వాత అనేక సంస్కరణలు వచ్చాయని చెప్పారు.
అనంతరం పోలీసు అధికారులు కైలాష్ సత్యార్థిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీలు షికా గోయల్, సౌమ్యా మిశ్రా, సంజయ్ కుమార్ జైన్, ఐజీలు విక్రమ్‌జిత్‌సింగ్ మాన్, షానవాజ్ ఖాసీంతోపాటు రాష్ట్రంలోని పోలీసు కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థి భయాన్ని వీడాలి
రాయదుర్గం: ప్రతి విద్యార్థి తమకున్న ప్రతిబంధకాలు, చింతలు, భయాలన్నింటినీ వీడి ఆత్మవిశ్వాసంతో పోటీ ప్రపంచంలోకి అడుగు పెట్టాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి పిలుపునిచ్చారు. గచ్చిబౌలి శాంతిసరోవర్‌లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్ 22వ స్నాతకోత్సవాన్ని శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్ గవరి్నంగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ రాజ్‌రెడ్డి, డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణన్‌తో కలిసి విద్యార్థులకు పట్టాలను, పంపిణీ చేశారు. కైలాష్ మాట్లాడుతూ కేవలం జీతాలు, ప్యాకేజీల కోసం వెంటపడకుండా నైతిక విలువలు, సేవా భావంతో జీవితంలో ముందుకు వెళ్లాలని సూచించారు.
నారాయణన్ మాట్లాడుతూ పెరుగుతున్న పోటీ ప్రపంచంలో ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు స్వంత మార్గాలను రూపొందించే నైపుణ్యాలను కలిగి ఉన్నారని తె లిపారు. డ్యూయల్ డిగ్రీతోపాటు ఉత్తమ ఆల్‌రౌండర్ అవార్డును పొందిన కందాల సవితా విశ్వనాథ్‌ను పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment