
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి ప్రశంసించారు. ‘నేషనల్ కన్సల్టేషన్ కమిటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్’ సంస్థ శుక్రవారం వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 34,037 మంది బాల కార్మికులను ఏపీ పోలీసులు విముక్తుల్ని చేయడం హర్షణీయమన్నారు. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేయడం గొప్ప విషయమన్నారు. కోవిడ్ మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రూ.180 కోట్లతో పిల్లల కోసం 3 ఆసుపత్రులను నిరి్మంచాలన్న నిర్ణయాన్నీ ఆయన అభినందించారు.