Appreciated
-
పిల్లల కథ: ప్రతిభకు పట్టం
దేవరకొండ రాజ్యానికి రాజు శివవర్మ. తన తెలివితేటలతో, శక్తితో రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు. ప్రజల సుఖశాంతుల కోసం పాలనలో ఎన్నో సంస్కరణలు చేశాడు. తను వృద్ధుడు అవుతున్నాడు. తన తర్వాత రాజ్యానికి రాజు ఎవరు అనే ఆలోచన ఆయన్ని ఎప్పుడూ తొలుస్తూ ఉండేది. రాజు కొడుకుని రాజు తర్వాత రాజుగా పట్టాభిషేకం చేయటం అనే సంప్రదాయానికి శివవర్మ పూర్తిగా వ్యతిరేకం. సమర్థుడు, తెలివైనవాడు, ప్రజల మనసు తెలిసినవాడు దేవరకొండ రాజ్యానికి రాజు కావాలనేది శివవర్మ కోరిక. తన తర్వాత రాజ్యానికి రాజును ఎంపిక చేసేందుకు తను ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నానని, ఆ పరీక్షలో తన ఇద్దరు కుమారులతో పాటు రాజ్యంలోని పౌరులు ఎవరైనా పాల్గొనవచ్చని ప్రకటించాడు శివవర్మ. ఆ పరీక్షకు రాజు పెద్దకొడుకుతో పాటు అనేక మంది హాజరయ్యారు. రాజు చిన్నకొడుకు హాజరుకాలేదు. అత్యంత క్లిష్టమైన రాత పరీక్ష, శరీర సామర్థ్య పరీక్షలలో రాజు పెద్దకొడుకు విఫలమయ్యాడు. పరీక్షలలో విజయం సాధించింది కేవలం ముగ్గురు. వారు అనంతుడు, వీరాచారి, కేశవుడు. ఆ ముగ్గురిని శివవర్మ తన మందిరానికి పిలిపించాడు. ‘నా తర్వాత రాజ్య బాధ్యతలు చేపట్టడానికి ముందుకు వచ్చి, రెండు పరీక్షలలో ఉత్తీర్ణులైన మీ ముగ్గురికీ ముందుగా నా శుభాకాంక్షలు. చివరిగా నేను పెట్టబోయే పరీక్ష చాలా చిన్నది. కేవలం నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాడు. ఎవరైతే నాకు సంతృప్తికరమైన సమాధానం ఇస్తారో వారే నా తర్వాత ఈ రాజ్యానికి రాజు ’ అంటూ ముగ్గురికీ స్వాగతం పలికాడు శివవర్మ. ‘ఈ భూమి మీద అనేక మంది ప్రజలు ఉన్నారు. వారందరిలోకి గొప్పవాడు ఎవరు?’ అడిగాడు రాజు. ‘అందరి కంటే గొప్పవాడు దేవుడు.. ప్రభూ’ చెప్పాడు అనంతుడు. ‘మనుషుల్లో గొప్పవారు ఎవరు అనేది నా ప్రశ్న’ తెలియజేశాడు రాజు. ‘ప్రభూ... మీ మాట ఎవరూ కాదనరు. మీ కంటే గొప్పవారు ఇంకెవరుంటారు’ చెప్పాడు వీరాచారి. ‘రాజు కంటే గొప్పవాడు ఎవరు?’ మళ్లీ అడిగాడు రాజు. ‘గొప్పవాడు ఉన్నాడు మహారాజా.. అయితే నేను మీకు అతన్ని నేరుగా చూపిస్తాను’ అన్నాడు కేశవుడు. అనంతుడు, రంగాచారి, కేశవుడు, రాజుగారు మారువేషాల్లో నగరంలోకి ప్రవేశించారు. ఊరి బయట రహదారి పక్కన కొన్ని విత్తులు నాటుతూ, కొన్ని మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించాడు ఒక వృద్ధుడు. తర్వాత మరో ఊరికి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి శుభాశుభ కార్యక్రమాలు జరిగే ఇళ్ళల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను పోగుచేసి నిరుపేదలకు పంచుతున్నాడు. ఇంకొక ఊరిలో ఒక వ్యక్తి అనాథ శవాలు, జంతు కళేబరాలకు అంతిమ సంస్కారం చేస్తున్నాడు. ‘ప్రభూ, తను పెంచుతున్న ఆ మొక్కలు వృక్షాలై ఫలాలను ఇచ్చేదాకా ఆ వృద్ధుడు జీవించి ఉండలేడు. అలాగే ఆహార పదార్థాలు వ్యర్థం కాకుండా నిరుపేదలకు పంచే.., అనాథ శవాలు, మృత కళేబరాలకు అంతిమ సంస్కారం చేసే వ్యక్తులు కూడా. ఈ ముగ్గురూ తమ కోసం కాక ఇతరుల కోసం పడే ప్రయాసను చూడండి. ఇతరులకు సేవ చేయడం కోసం జీవించేవాడి కంటే గొప్పవాడు ఎవరు ఉంటారు ప్రభూ? ’ అన్నాడు కేశవుడు. కేశవుడి సమాధానంతో రాజు శివవర్మ సంతృప్తి చెందాడు. సంతోషంతో కేశవుని ఆలింగనం చేసుకున్నాడు. కేశవుడిని తన తరువాత రాజుగా ప్రకటించాడు. వెంటనే కేశవుడు తననెవరూ గుర్తించలేని విధంగా ఉన్న తన మారువేషాన్ని తొలగించి అసలు రూపంతో కనిపించాడు. అతన్ని చూసిన రాజు, అనంతుడు, వీరాచారి ఆశ్చర్యపోయారు. అతను రాజు రెండవ కొడుకు కేశవవర్మ. ‘నువ్వు పోటీలో మారువేషంలో పాల్గొనడానికి కారణం ఏమిటి?’ అని కొడుకును ప్రశ్నించాడు శివశర్మ. (పిల్లల కథ: ఆనందమాత) ‘ప్రభూ.. రాజుగారి కొడుకు హోదాలో ఈ పోటీలో పాల్గొనటం నాకు ఇష్టంలేదు. రాజుగారి కొడుకుగా పోటీలో పాల్గొంటే నాతో పాటు పాల్గొనే సాధారణ పౌరులు నన్ను చూసి భయపడటం లేదా వెనకడుగు వేయటం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇలా మారువేషంలో పాల్గొన్నాను. క్షమించండి ప్రభూ’ చెప్పాడు కేశవవర్మ. ‘కుమారా.. నీ ఆలోచనా విధానం బాగుంది. నువ్వు ప్రజల మన్ననలను పొందే పాలకుడివి కాగలవు’ అంటూ కొడుకును ఆశీర్వదించాడు రాజు శివవర్మ. వీరాచారి, అనంతులకు తన ఆస్థానంలో తగిన ఉద్యోగాలు ఇచ్చాడు. (క్లిక్: మంచి పని.. ఈ కిరీటం నీకే!) -
ఏపీ ప్రభుత్వానికి యూఎస్ కాన్సులేట్ అభినందనలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యూఎస్ కాన్సులేట్ అభినందనలు తెలిపింది. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌పై యూఎస్ కాన్సులేట్ ప్రశంసలు కురిపించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైద్య సిబ్బందిని యూఎస్ కాన్సులేట్ అభినందించింది. ఒకే రోజు 1.3 మిలియన్ ప్రజలకు వ్యాక్సిన్ వేయడంపై ప్రశంసించింది. చదవండి: శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తిని ఆపండి ఏపీపీఎస్సీపై నిరాధార ఆరోపణలు -
బాలల సంక్షేమానికి ఏపీ కృషి భేష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి ప్రశంసించారు. ‘నేషనల్ కన్సల్టేషన్ కమిటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్’ సంస్థ శుక్రవారం వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 34,037 మంది బాల కార్మికులను ఏపీ పోలీసులు విముక్తుల్ని చేయడం హర్షణీయమన్నారు. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేయడం గొప్ప విషయమన్నారు. కోవిడ్ మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రూ.180 కోట్లతో పిల్లల కోసం 3 ఆసుపత్రులను నిరి్మంచాలన్న నిర్ణయాన్నీ ఆయన అభినందించారు. చదవండి: ఉద్యాన హబ్‌గా ఏపీ కౌలు రైతులకూ ‘భరోసా’ -
ప్రభుత్వం నిర్ణయంపై మంత్రి అంజాద్ బాషా హర్షం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంపుపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మన రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అని తెలిపారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలో అర్చకులు, పాస్టర్లు, మౌజన్లు, ఇమామ్‌లకు గౌరవ స్థానం ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పాస్టర్లకు కూడా వేతనాలు పెంచారని ఆయన తెలిపారు. ‘‘పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం వీరి సమస్యలను పట్టించుకోలేదు. కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్. ప్రణాళిక ప్రకారం పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం. కరోనా మహమ్మారిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు సైతం మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని’’ మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. కరోనా వ్యాక్సిన్ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోదని వివరించారు. ప్రజల్లో అభద్రతా భావం కలిగించేలా ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై కేసు నమోదు: సీఐడీ ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో ఏపీ పురోగతి -
ధర్మాడి సత్యంకు డీఐజీ ప్రశంసలు
సాక్షి, కాకినాడ లీగల్: గోదావరిలో దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును సవాలుగా తీసుకొని వెలికి తీసి ధర్మాడి సత్యం బృందం రాష్ట్రానికి, జిల్లాకు, ప్రభుత్వానికి కీర్తి తెచ్చిందని ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్‌ఖాన్ అన్నారు. ధర్మాడి సత్యం బృందాన్ని కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం డీఐజీ ఏఎస్ ఖాన్, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ అభినందించి, సత్కరించారు. డీఐజీ మాట్లాడుతూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. సుడులు తిరుగుతున్నాయి. ఇక్కడ బోటు వెలికితీయడం కష్టం అని నిపుణులు నిర్ధారణకు వచ్చినప్పటికీ ధర్మాడి సత్యం తన బృందం సభ్యులతో బోటును వెలికితీశారని కొనియాడారు. తమవారి మృతదేహాలను కడసారిగా చూడలేమని బంధువులు భావిస్తున్న తరుణం లో బోటును వెలికితీసి మృతదేహాలను అప్పగించారన్నారు. ధర్మాడి చేసిన కృషి మరువలేమని డీఐజీ ఖాన్ పేర్కొన్నారు. ఆ గిరిజనులనూ అభినందిస్తాం రాయల్ వశిష్ట బోటు ప్రమాదం జరిగిన వెంటనే కచ్చులూరు గ్రామస్తులు వెంటనే స్పందించి 26 మంది పర్యాటకుల ప్రాణాలను కాపాడారని రేంజి డీఐజీ ఖ>న్ అన్నారు. తాము కచ్చులూరు గ్రామం వెళ్లి వారిని ప్రత్యేకంగా అభినందిస్తామన్నారు. ధర్మాడి సత్యం బృందానికి రూ. 50 వేల రివార్డు, సభ్యులందరికీ ప్రశంసా పత్రాలు అందజేశారు. బోటు వెలికి తీసిన సమయంలో శవాలను బయటకు తీసిన ఐదుగురు తోటీలకు ప్రత్యేకంగా రూ. 10 వేలు ధర్మాడి సత్యానికి ఇచ్చి వాటిని ఆ తోటీలకు అందజేయాలని కోరారు. అడిషినల్ ఎస్పీ ఎస్వీ శ్రీధర్‌రావు, ఓఎస్డీ ఆరిఫ్ హఫీజ్, ఏఆర్ అడిíÙనల్ ఎస్పీ వీఎస్ ప్రభాకర్‌రావు, ఎస్పీ డీఎస్పీలు ఎస్.మురళీమోహన్, ఎం.అంబికా ప్రసాద్, కాకినాడ సబ్ డివిజన్ డీఎస్పీ కరణం కుమార్, కాకినాడ క్రైం డీఎస్పీ వి.భీమరావు, ఏఆర్ డీఎస్పీ ఎస్.వెంకట అప్పారావు, ఎస్పీ సీఐ ఎస్.రాంబాబు, డీసీఆర్బీ సీఐ వైఆర్కే శ్రీనివాస్, జిల్లా పోలీసు అధికారుల సంఘం గౌరవ అధ్యక్షుడు జి.బలరామమూర్తి, అధ్యక్షుడు పి.సత్యమూర్తి , సంఘ ప్రతినిధులు, సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
భారీగా పుంజుకున్న రూపాయి
సాక్షి, ముంబై: ఇటీవల వరుసగా చారిత్రక గరిష్టాలను నమోదు చేస్తూ వచ్చిన దేశీయ కరెన్సీ రూపాయి విలువ క్రమేపీ పుంజుకుంటోంది. శుక్రవారం ఆరంభంలోనే పాజిటివ్‌గా ఉన్న రూపాయి మరింత బలపడింది. డాలరు మారకంలో రూపాయి ఏకగా 62 పైసలు పుంజుకుని 73స్థాయినుంచి పైకి ఎగిసింది. ప్రస్తుతం 72.72వద్ద స్తిరంగా కొనసాగుతోంది. గురువారం 50 పైసలు ఎగిసి 73.45వద్ద ముగిసింది. మరోవైపు అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 73 డాలర్లు కు చేరింది. గత అయిదు సెషన్లుగా క్షీణిస్తూ వస్తున్న ఇంధన ధరలు శుక్రవారం 6శాతం పతనమయ్యాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా 4 శాతానికిపైగా ఎగిసాయి. ఈ వారం 10సంవత్సరాల బ్యాండ్ మార్కెట్ ఈల్డ్స్ 7.8 శాతానికి తగ్గాయి. గత నెలలో ఇది 8 శాతంగా ఉంది. -
తెలంగాణ రాష్ట్రానికి నీతి అయోగ్ కితాబు
-
దక్షిణ కొరియాపై కిమ్ ప్రశంసల వర్షం
సియోల్: దక్షిణకొరియా అంటే భగ్గున మండిపడే ఉత్తర కొరియా నేత కిమ్ మనస్సు ఒక్కసారిగా మారిపోయింది. దక్షిణకొరియా వైఖరి బాగా నచ్చిందని మెచ్చుకున్న ఆయన ఆ దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. దక్షణకొరియా ప్యాంగ్చాంగ్లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌కు వెళ్లి వచ్చిన తన సోదరి, ఇతర ప్రతినిధుల బృందం సోమవారం రాజధాని ప్యాంగ్యాంగ్లో కిమ్‌ను కలుసుకుంది. వారితో చర్చల అనంతరం అధికార మీడియా ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. తమదేశ ప్రతినిధి బృందం దక్షిణ కొరియా పర్యటనపై అధ్యక్షుడు కిమ్ సంతృప్తి వ్యక్తం చేశారని, పర్యటనకు అత్యంత ప్రాముఖ్యం ఇచ్చిన ఆ దేశ వైఖరి కిమ్‌కు నచ్చిందని పేర్కొంది. సియోల్ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించింది. -
విరాట్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో కేన్ విలియమ్సన్కు సొగసైన ఆటగాడిగా పేరుంది. అయినా కూడా భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటతీరుపై ఈ కివీస్ కెప్టెన్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. అతడి బ్యాటింగ్‌ను చూస్తూ ఎంతో నేర్చుకోవచ్చని కొనియాడాడు. ‘విరాట్ ఓ గొప్ప ఆటగాడు. మూడు ఫార్మాట్లలోనూ అతడి ఆధిపత్యం ఎంతో ప్రత్యేకమైంది. అది నన్ను చాలా ప్రభావితుడ్ని చేస్తోంది. అతడు బ్యాటింగ్ చేస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంటుంది. అలాంటి ఆటగాడి నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు’ అని ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌సలో మూడో స్థానంలో ఉన్న విలియమ్సన్ చెప్పాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో కోహ్లి, విలియమ్సన్, స్టీవ్ స్మిత్, రూట్లను బిగ్ ఫోర్‌గా పరిగణిస్తున్నారు. ‘స్మిత్, రూట్ కూడా నాణ్యమైన ఆటగాళ్లే. మా అందరికీ విభిన్న శైలి ఉంది. ఎవరి సొంత శైలిని బట్టి వారు ఆడడం ఈ గేమ్‌కున్న గొప్ప అందం. అందుకే అందరికీ విజయాలున్నారుు’ అని 26 ఏళ్ల ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ అన్నాడు. ఇక భారత్‌తో జరగబోయే సిరీస్‌లో స్పిన్ కీలక పాత్ర పోషిస్తుందని అంగీకరించాడు. తమ జట్టులోనూ ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారని అతడు గుర్తుచేశాడు. స్పిన్‌తో పాటు రివర్స్ స్వింగ్ కూడా భారత్‌తో టెస్టు సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తుందని విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో ఈ నెల 22 నుంచి జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్ చేరుకుంది. -
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్: ఆర్ఎల్వీ-టీడీ రాకెట్ ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో నిర్వహించే ప్రయోగాలను ఇదే స్ఫూర్తితో విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రీ యూజబుల్ లాంచింగ్ వెహికల్-టెక్నికల్ డిమాన్స్ట్రేటర్(ఆర్ఎల్వీ-టీడీ)ని అంతరిక్ష వాహన నౌక ప్రయోగానికి ఇస్రో పదేళ్ల క్రితమే శ్రీకారం చుట్టింది. తిరువనంతపురం సమీపంలోని విక్రమ్ సారాభాయ్ కేంద్రంలో ప్రయోగాలు చేపట్టింది. సుమారు 600మంది శాస్త్రవేత్తలు పదేళ్లుగా శ్రమించారు. మరోవైపు ఆర్ఎల్వీ-టీడీ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. Congratulations to #ISRO scientists on the successful launch of #RLV-TD. — YS Jagan Mohan Reddy (@ysjagan) 23 May 2016 -
ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: పీఎస్ఎల్వీ-సీ 33 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో నిర్వహించే ప్రయోగాలను ఇదే స్ఫూర్తితో విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. -
మోదీ గ్రేట్
భారత్‌ను ఆధ్యాత్మిక రాజధానిని చేశారు: వెంకయ్య న్యూఢిల్లీ: తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం దేశంలో ముందుండి ఘనంగా నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రశంసలతో ముంచెత్తారు. ‘మోదీ గొప్పవ్యక్తి. భారత్‌ను ఆధ్యాత్మిక రాజధానిని చేశారు. ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్యదేశాలు యోగా డే జరుపుకున్నాయి. ఇది నిజంగా ప్రపంచ ఏకీకరణే’ అని సోమవారం ట్విటర్లో కొనియాడారు. మోదీ భారత్‌ను ప్రతి అంశంలో మార్చేస్తున్నారంటూ స్వచ్ఛభారత్, బేటీ పడావో బేటీ బచావో తదితరాలను ప్రస్తావించారు. రాష్ట్రపతి భవన్లో యోగా డేను నిర్వహించి దేశానికి మార్గదర్శకత్వం వహించారంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపైనా ప్రశంసల వర్షం కురిపించారు.