దక్షిణ కొరియాపై కిమ్‌ ప్రశంసల వర్షం | Kim praises South Korea after Olympic visit | Sakshi
Sakshi News home page

దక్షిణ కొరియాపై కిమ్‌ ప్రశంసల వర్షం

Published Wed, Feb 14 2018 3:11 AM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM

Kim praises South Korea after Olympic visit - Sakshi

కిమ్‌

సియోల్‌: దక్షిణకొరియా అంటే భగ్గున మండిపడే ఉత్తర కొరియా నేత కిమ్‌ మనస్సు ఒక్కసారిగా మారిపోయింది. దక్షిణకొరియా వైఖరి బాగా నచ్చిందని మెచ్చుకున్న ఆయన ఆ దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. దక్షణకొరియా ప్యాంగ్‌చాంగ్‌లో జరుగుతున్న వింటర్‌ ఒలింపిక్స్‌కు వెళ్లి వచ్చిన తన సోదరి, ఇతర ప్రతినిధుల బృందం సోమవారం రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో కిమ్‌ను కలుసుకుంది.

వారితో చర్చల అనంతరం అధికార మీడియా ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. తమదేశ ప్రతినిధి బృందం దక్షిణ కొరియా పర్యటనపై అధ్యక్షుడు కిమ్‌ సంతృప్తి వ్యక్తం చేశారని, పర్యటనకు అత్యంత ప్రాముఖ్యం ఇచ్చిన ఆ దేశ వైఖరి కిమ్‌కు నచ్చిందని పేర్కొంది. సియోల్‌ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement