కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్, ప్రేయసి హోన్ సాంగ్ వోల్
ప్యోంగ్ యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ తొలిసారిగా తమ శత్రుదేశం దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. దక్షిణ కొరియాలో జరగనున్న శీతాకాల ఒలింపిక్స్‌లో ఉ.కొరియాకు చెందిన 22 మంది ప్లేయర్లు పాల్గొననున్నారు. ఉ.కొరియాలోని అధికార వర్కర్స్ పార్టీలో కీలక నాయకురాలయిన తన సోదరిని నియంత కిమ్ ద.కొరియాకు తమ దేశ ప్రతినిధిగా పంపాలని నిర్ణయించుకున్నారు. ఒలింపిక్స్‌లో ఉ.కొరియా తరపున ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్ల బృందానికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే సభ్యులలో కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ ఒకరు. కిమ్ సోదరితో పాటు కిమ్ ప్రేయసి సైతం ద.కొరియాలో పర్యటించనుండటంతో అక్కడ చర్చనీయాంశమైంది.
బ్యూటీ ఆర్మీతో కిమ్ ప్రేయసి..
హత్యకు గురైందన్న వదంతుల అనంతరం ఇటీవల వెలుగులోకి వచ్చింది కిమ్ ప్రేయసి హోన్ సాంగ్ వోల్. శీతాకాల ఒలింపిక్స్‌కు ఓ అందగత్తెల సైన్యాన్ని కిమ్ ద.కొరియా పంపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ బృందానికి నేతృత్వం వహించేది ఎవరంటే కిమ్ ప్రేయసి హోన్ సాంగ్ వోల్. ఇదివరకే హోన్ ద.కొరియా చేరుకున్నారు. హోన్ అక్కడికి రాగానే కిమ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ దిష్టిబొమ్మలు తగలబెట్టారు. నియంతగా దేశాన్ని పాలిస్తున్నాడన్న అపప్రతను తొలగించుకోవడానికి అందగత్తెలను కిమ్ ద.కొరియాకు పంపుతున్నారట. 22 మంది తమ అథ్లెట్లను కిమ్ వింటర్ ఒలింపిక్స్ లో భాగస్వాములు చేయనున్నారు. ప్యోంగ్ యాంగ్‌కు చెందిన మారన్ బాంగ్ బ్యాండ్‌కు హోన్ సాంగ్ వోల్ లీడ్ చేస్తోంది. ఈ బ్యాండ్‌ను హస్తగతం చేసుకున్న కిమ్.. ఒలింపిక్స్ సందర్భంగా ఏర్పాటు చేసే షోలో ప్రదర్శన ఇవ్వాలని వీరిని ఆదేశించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment