winter olympics
-
చైనా అధ్యక్షుడికి బ్రెయిన్‌కి సంబంధించిన వ్యాధి
Cerebral or intracranial aneurysm: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మెదడుకి సంబంధించిన "సెరిబ్రల్ అనూరిజం"తో బాధపడుతున్నారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ వ్యాధి కారణంగానే గతేడాది 2021 చివరిలో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది. జిన్‌పింగ్ ఎదుర్కొంటున్న సెరెబ్రల్ అనూరిజం అనే వ్యాధి ప్రమాదకరమైనదని వెల్లడించింది. అందువల్లే కరోనా విజృంభించినప్పటి నుంచి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ వరకు కూడా జిన్‌పింగ్ విదేశీ నాయకులను ఎవర్నీ కలవలేదు. దీంతో జిన్‌పింగ్ ఆరోగ్యం క్షీణించిందంటూ పుకార్లు వెల్లువెత్తాయి. ఏంటీ సెరిబ్రల్ లేదా ఇంట్రాక్రానియల్ అనూరిజం సెరిబ్రల్ లేదా ఇంట్రాక్రానియల్ అనూరిజం అనేది మెదడులోని ధమని అసాధారణ ఫోకల్ డైలేషన్. దీని ఫలితంగా రక్తనాళాల గోడ లోపలి కండరాల పొర బలహీనపడుతుంది. దీంతో మెదడులో రక్తం క్లాట్ అవుతుంటుంది. అంతేకాదు ఈ రక్తనాళాలు ఎప్పుడూ పగిలిపోతాయో చెప్పలేం. దీంతో మెదడు చుట్టూ రక్తస్రావం అవుతుంది. దీన్ని సబ్‌అరాక్నోయిడ్ హెమరేజ్ (ఎస్ఏహెచ్) అంటారు. ఈ రక్తస్రావం కారణంగా సదరు వ్యక్తి స్ట్రోక్ లేదా కోమాలోకి వెళ్లిపోవడం లేదా మరణించడం జరుగుతుంది. ఎప్పుడూ ఈ వ్యాధి బయటపడిందంటే? మార్చి 2019 లో జిన్‌పింగ్ తన ఇటలీ పర్యటనలో ఆయన సరిగా నడవలేకపోయారు. ఆ తర్వాత ఫ్రాన్స్ పర్యటనలో కూడా కూర్చోవడానికి చాలా ఇబ్బందిపడ్డారు. అప్పుడే ఈ వ్యాధి బయటపడింది. అంతేకాదు 2020లో షెన్జెన్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు దగ్గుతో చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో అప్పటి నుంచి జిన్‌పింగ్ ఆరోగ్యం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. (చదవండి: అల్ జజీర్ మహిళా జర్నలిస్ట్‌ను చంపిన ఇజ్రాయిల్ దళాలు) -
జీరో కోవిడ్ టాలరెన్సే లక్ష్యంగా... ఇంత పైశాచిక నిబంధనలా!!
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి భారిన పడేసిన దేశంగా అపకీర్తిని మూటగట్టుకట్టుకున్న డ్రాగన్ దేశం..కరోనా కట్టడిలో భాగంగా ప్రజలపై పలు కఠినమైన ఆంక్షలు విధించి వారిని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. మరోవైపు వచ్చే నెలలో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ కల్లా జీరో కేసులే లక్ష్యంగా ఒక్కొక్క ప్రాంతాన్ని నిర్భందించుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత దారుణంగా పౌరులను కిక్కిరిసిన బాక్స్‌లో నిర్భంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. China has imposed several draconian rules: చైనా కరోనా కట్టడిలో భాగంగా పలు కఠిన ఆంక్షలు విధించుకుంటూ పోతుంది. మరోవైపు వచ్చే నెలల జరగనున్న వింటర్ ఒలింపిక్స్ ఆతిథ్యం ఇచ్చే నేపథ్యంలో ఆ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. జీరో కోవిడ్ విధానం అంటూ చైనా తన దేశంలో పౌరులపై క్రూరమైన నిబంధనలను అమలు చేసింది. ఇందులో భాగంగా మిలియన్ల మంది ప్రజలను కిక్కిరిసిన మెటల్ బాక్స్‌లలో నివశించేలా నిర్భంధించింది. అయితే వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో కరోనా సోకిన వారిని తీసుకువెళ్లేందుకు బస్సుల వరుసలు, మరోవైపు ప్రజలను నిర్భందించే మెటల్ బాక్స్‌ల వరుసలు కనిపించాయి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు వృద్ధులతో సహా ప్రజలు, చెక్క మంచం, టాయిలెట్‌తో అమర్చబడిన ఈ కిక్కిరిసిన పెట్టెల్లో ఉండేలా బలవంతం చేస్తోంది. పైగా అనేక ప్రాంతాల్లో నివాసితులను అర్ధరాత్రి దాటిన తర్వాత తమ ఇళ్లను విడిచిపెట్టి, నిర్భంధ కేంద్రాలకు వెళ్లాలని పేర్కొంది. ఈ మేరకు చైనాలోని తమ ప్రజల కదిలికలను సైతం ట్రాక్-అండ్-ట్రేస్ యాప్ ద్వారా గుర్తించి మరీ నిర్భంధిస్తోంది. చైనాలో ఇప్పుడు దాదాపు 20 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆఖరికి ఆహారం కొనడానికి కూడా తమ ఇంటిని వదిలి వెళ్లకుండా నిషేధించారు. Millions of chinese people are living in covid quarantine camps now! 2022/1/9 pic.twitter.com/wO1cekQhps — Songpinganq (@songpinganq) January 9, 2022 Millions of chinese people are living in covid quarantine camps now! 2022/1/9 pic.twitter.com/wO1cekQhps — Songpinganq (@songpinganq) January 9, 2022 -
ఒక్క కేసు.. లాక్డౌన్లో 6 మిలియన్ల మంది ప్రజలు
City Heihe in Heilongjiang Province Under Lockdown: కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో పలు నగరాల్లో లాక్డౌన్ విధించిన చైనా.. ఇప్పుడు మరో పెద్ద నగరమైన హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని హీహెలో లాక్డౌన్ విధించింది. ఒక్క కేసు కారణంగా.. 6 మిలియన్ల మంది ప్రజలు లాక్డౌన్ అయ్యారు. వీరందరిని ఇంటి వద్దనే ఉండాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది. వింటర్ ఒలింపిక్స్ నాటికి బీజింగ్‌లో జీరో కరోనా కేసులు సాధించాలనే లక్ష్యంతో ఉంది చైనా. 2019లో తొలి కరోనా కేసు వెలువడిన నాటి నుంచి చైనాలో కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మహమ్మారి కట్టడి కోసం సరిహద్దులను మూసేసింది.. విదేశాల నుంచి ప్రయాణిలకు అనుమతించలేదు. కఠిన క్వారంటైన్, లాక్డౌన్ నియమాలు పాటిస్తూ.. జీరో కేసులు సాధించింది. (చదవండి: చైనాలో డెల్టా వేరియెంట్ భయం) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతుండగా.. చైనాలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచలోనే అత్యధిక జనాభా గల చైనాలో ప్రస్తుతం కనీసం పదకొండు ప్రావిన్సులలో కరోనా వ్యాప్తి వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో వైరస్ కట్టడి కోసం ఈ వారంలో నాలుగు మిలియన్లకు పైగా జనాభా ఉన్న లాన్జౌ నగరం, ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని ఎజిన్‌లో లాక్డౌన్ విధించింది డ్రాగన్ ప్రభుత్వం. తాజాగా గురువారం ఒక్క కొత్త కేసు నమోదవడంతో 6 మిలియన్ల జనాభా గల హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని హీహెలో అధికారులు లాక్డౌన్ విధించారు. ప్రజలు ఇంటికే పరిమితం కావాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని జనాలను హెచ్చిరించారు. ఈ క్రమంలో బస్సు, టాక్సీ సేవలను నిలిపివేసినట్లు రాష్ట్ర మీడియా తెలిపింది. వాహనాలు నగరం దాటి బయటకు వెళ్లడానికి అనుమతిలేదని పేర్కొంది. (చదవండి: మరో డ్రామాకు తెరతీసిన చైనా.. కొత్తగా సరిహద్దు చట్టం) రష్యాకు ఉత్తరాన సరిహద్దుగా ఉన్న నగరంలోని 1.6 మిలియన్ల మంది నివాసితులను పరీక్షించడంక కోసం కరోనా సోకిన వ్యక్తి సన్నిహిత పరిచయాలను గుర్తించడం ప్రారంభించినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు చైనా ఆరోగ్య శాఖ అధికారులు. ఇక చైనాలో గురువారం 23 కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారంతో పోల్చితే.. కొత్త కేసులు సంఖ్య సగం తగ్గినప్పటికి దేశంలో కఠిన నియమాలు అమలు చేస్తున్నారు. చదవండి: థర్డ్ వేవ్ ముప్పు: 5 రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ -
రష్యాపై అమెరికా సంచలన ఆరోపణలు
వాషింగ్టన్ : రష్యాపై అగ్రరాజ్యం అమెరికా సంచలన ఆరోపణలకు దిగింది. వింటర్ ఒలంపిక్స్‌లో అధికారులు ఉపయోగించే కంప్యూటర్లను రష్యా హ్యాక్ చేసిందని చెబుతోంది. వందలాది కంప్యూటర్ల నుంచి విలువైన సమాచారాన్ని దొంగిలించిందని అంటోంది. దక్షిణ కొరియాలోని ప్యాంగ్ చాంగ్ వేదికగా వింటర్ ఒలంపిక్స్ క్రీడలు జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9న ప్రారంభమైన ఈ క్రీడా సమరం నేటితో (ఫిబ్రవరి 25) ముగియనుంది. అయితే రష్యన్ మిలిటరీ గూఢాచారులు ఒలంపిక్స్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగిలించారంటూ అమెరికా ఆరోపిస్తోంది. ఫిబ్రవరి 9న ప్రారంభ వేడుకల సందర్భంగా సైబర్ దాడులు జరిగినట్లు నిర్వాహకులు ప్రకటించారు. కానీ, అది రష్యా పనేనా అన్న విషయం మాత్రం వాళ్లు ధృవీకరించలేదు. దీంతో అమెరికా చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనన్న అనుమానాలు మొదలయ్యాయి. డోపింగ్ ఆరోపణల కారణంగా రష్యన్ బృందంలోని సభ్యులపై అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ(ఐవోసీ) నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ కారణంతో రష్యా నుంచి ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఐవోసీపై ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యా ఈ దాడులకు పాల్పడిందని అమెరికా చెబుతోంది. ముగింపు వేడుకలకు కూడా రష్యా అంతరాయం కలిగించే ఆస్కారం ఉందన్న ఆరోపణలతో దగ్గరుండి పర్యవేక్షించబోతున్నట్లు అమెరికా ప్రకటించగా.. అందుకు దక్షిణ కొరియా అంగీకరించింది. మరోవైపు రష్యా మాత్రం అమెరికా ప్రకటనను ఖండించింది. -
వింటర్ ఒలింపిక్స్‌కు ఇవాంకా
వాషింగ్టన్ : వింటర్ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ హాజరుకానున్నారు. ఆదివారం ప్యాంగ్చాంగ్లో జరిగే ఈ వేడుకల నిమిత్తం ఇవాంకా సారథ్యంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం దక్షిణ కొరియాలో పర్యటించబోతున్నట్లు శ్వేతసౌధం బుధవారం ప్రకటించింది. ఉత్తరకొరియా అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా(డబ్ల్యూపీకే) ఉపాధ్యక్షుడు కిమ్ యోంగ్ చోల్ కూడా 8 మంది ప్రతినిధులతో ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దీంతో ఇవాంకా, కిమ్ యోంగ్ చోల్ ఒకరికొకరు ఎదురుపడే అవకాశాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్లు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న విషయం తెలిసిందే. వింటర్ ఒలింపిక్స్ ప్రారంభమైనప్పటి నుంచి మాటల యుద్ధం తగ్గుముఖం పట్టింది. -
‘వింటర్’లో టాపర్‌గా...
ప్యాంగ్‌చాంగ్: వింటర్ ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 14 పతకాలు గెలిచిన ప్లేయర్‌గా నార్వేకు చెందిన మారిట్ జోర్జెన్ చరిత్ర సృష్టించింది. తాజా ఒలింపిక్స్‌లో ఆమె ఖాతాలో నాలుగో పతకం చేరింది. స్కీయింగ్‌లో మెరిక అయిన జోర్జెన్ క్రాస్ కంట్రీ టీమ్ స్ప్రింట్ ఫ్రీ ఈవెంట్లో మైకెన్ కాస్పెర్సన్ ఫల్లాతో కలిసి కాంస్య పతకం గెలుచుకుంది. దాంతో 13 పతకాలతో నార్వే క్రీడాకారుడు ఒలె ఇనార్ జోర్న్‌డాలెన్ (నార్వే) పేరిట ఉన్న రికార్డును ఆమె తెరమరుగు చేసింది. ఏ ఒలింపిక్స్ (వింటర్, సమ్మర్)లోనైనా అత్యధిక పతకాలు గెలిచిన రెండో మహిళా అథ్లెట్‌గా 37 ఏళ్ల జోర్జెన్ ఘనత వహించింది. అలనాటి సోవియెట్ (ఇప్పటి ఉక్రెయిన్) జిమ్నాస్ట్ దిగ్గజం లారిసా లాతినినా సమ్మర్ ఒలింపిక్స్‌లో అత్యధికంగా 18 పతకాలు సాధించింది. -
కంటతడి పెట్టినా లైవ్‌లో పరువు తీశారు
సియోల్ : దక్షిణ కొరియా స్కేటర్లపై అభిమానులు భగ్గుమంటున్నారు. సెమీ-ఫైనల్ క్వాలిఫైయింగ్ రేసులో ఓడిపోయి వింటర్ ఒలంపిక్స్ నుంచి టీమ్ నిష్క్రమించింది. అయితే వారు ఓటమి గురించి ఆటగాళ్లపై మండిపడటం లేదు. టీమ్ సభ్యురాలైన నో సెయాన్-యెయాంగ్పై మిగతా సభ్యులు లైవ్‌లోనే విమర్శలు చేసినందుకు... సోమవారం 500 మీటర్ల క్వాలిఫైయింగ్ రేసులో కిమ్ బో-రెమ్ నేతృత్వంలో బృందం పాల్గొంది. అయితే రేసులో కిమ్, మరో ప్లేయర్ పార్క్ జీ-వూ లు దూసుకుపోగా.. నో సెయాన్ మాత్రం వెనకబడిపోయింది. చివరకు రేసులో సౌత్ కొరియా టీమ్ ఓటమి పాలైంది. దీనిని జీర్ణించుకోలేక నో సెయాన్ వెక్కి వెక్కి ఏడ్చేసింది. అయితే టీమ్ సభ్యులు మాత్రం ఆమెపై కనికరం చూపలేదు. కిమ్, పార్క్‌లు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ... ‘మేం మా ఆట సరిగ్గానే ఆడాం. కానీ, నో సెయాన్ విఫలమైంది. చాలా చెత్త ప్రదర్శన ఇచ్చింది. ఆమె మూలంగానే ఓటమి చెందాం’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై చూసిన దక్షిణ కొరియా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటలో గెలుపొటములు సహజమని.. అంత మాత్రానికి తోటి క్రీడాకారిణిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సబబు కాదని వారంటున్నారు. అంతేకాదు కిమ్, పార్క్‌లను తక్షణమే నిషేధం విధించాలంటూ ఓ పిటిషన్‌ను రూపొందించారు. దానిని అధ్యక్ష కార్యాలయ అధికారిక సైట్‌కు పొందుపరచగా... దీనిపై ఇప్పటిదాకా దాదాపు 2,50,000 మంది సంతకాలు చేశారు. అయితే వారిద్దరిపై నిషేధం విధించే అంశంపై మాత్రం దక్షిణ కొరియా క్రీడా శాఖ, ఒలంపిక్స్ కమిటీ స్పందించలేదు. -
కెమెరాను 'గే'లిచారు..
-
కెమెరాను 'గే'లిచారు..
సియోల్: దక్షిణాకొరియాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో అమెరికాకు చెందిన ఫ్రీస్టైల్ స్కైయెర్ గస్ కెన్‌వర్తీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. ఆదివారం స్లోప్స్టైయిల్ ఈవెంట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కెన్‌వర్తీ..తన బాయ్‌ఫ్రెండ్‌కు ముద్దు ఇస్తూ కెమెరాను మాత్రం 'గే' లిచాడు. సాధారణంగా ఎవరైనా అత్యుత్తమ ప్రదర్శన చేసిన తర్వాత మాత్రమే ఎక్కువ దృష్టి సారించే కెమెరాలు..కెన్‌వర్తీ 12వ స్థానంలో నిలిచినా మొత్తం అతన్నే టార్గెట్ చేశాయి. అందుకు కారణం అతని బాయ్‌ఫ్రెండ్‌ను ముద్దు పెట్టుకోవడమే. ఎవరికైనా ప్రేమ అనేది ప్రేమే కాబట్టి ఈ జోడి ఒకరినొకరు అభినందించుకునే క్రమంలో చుట్టూ ఉన్న పరిస్థితిని పట్టించుకోకుండా ముద్దుల్లో మునిగిపోయారు. అంతే కెమెరాలన్నీ ఒక్కసారిగా వీరి వైపు తిరిగాయి. తమ కెమెరాల్లో బంధిస్తూ ఏదో అద్భుతం జరుగుతుదేమో అనేంతంగా పోటీ పడి క్లిక్‌లు మీద క్లిక్‌లు కొట్టాయి. ఆపై ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కెన్‌వర్తీ వెలుగులోకి వచ్చాడు. దీనిపై సోమవారం ట్వీట్ చేసిన కెన్‌వర్తీ..' ఈ మూమెంట్‌ను కెమెరాలో బంధిస్తారని అనుకోలేదు. ఈ రకంగా మా గురించి ప్రపంచానికి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నా చిన్నతనంలో ఎప్పుడూ గే కిస్‌ను టీవీల్లో చూడలేదు. ఇదే తొలిసారి కావొచ్చు. ఒక పిల్లాడు ఇంట్లో కూర్చొని మా ప్రేమను చూసే అవకాశం కల్పించారు' అని కెన్‌వర్తీ సంతోషం వ్యక్తం చేశాడు. -
దక్షిణ కొరియాపై కిమ్ ప్రశంసల వర్షం
సియోల్: దక్షిణకొరియా అంటే భగ్గున మండిపడే ఉత్తర కొరియా నేత కిమ్ మనస్సు ఒక్కసారిగా మారిపోయింది. దక్షిణకొరియా వైఖరి బాగా నచ్చిందని మెచ్చుకున్న ఆయన ఆ దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. దక్షణకొరియా ప్యాంగ్చాంగ్లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌కు వెళ్లి వచ్చిన తన సోదరి, ఇతర ప్రతినిధుల బృందం సోమవారం రాజధాని ప్యాంగ్యాంగ్లో కిమ్‌ను కలుసుకుంది. వారితో చర్చల అనంతరం అధికార మీడియా ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. తమదేశ ప్రతినిధి బృందం దక్షిణ కొరియా పర్యటనపై అధ్యక్షుడు కిమ్ సంతృప్తి వ్యక్తం చేశారని, పర్యటనకు అత్యంత ప్రాముఖ్యం ఇచ్చిన ఆ దేశ వైఖరి కిమ్‌కు నచ్చిందని పేర్కొంది. సియోల్ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించింది. -
ఎన్నో ఆశలతో వచ్చాను.. కానీ!
సియోల్: దక్షిణ కొరియాలో జరగుతున్న శీతాకాల ఒలింపిక్స్‌లో డోపింగ్ ఆరోపణలు మొదలయ్యాయి. డోపింగ్ టెస్టులో విఫలమైన జపాన్‌కు చెందిన షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్ కీయ్ సైటోను ఒలింపిక్స్ నుంచి తప్పించారు. డోపింగ్ టెస్టులో విఫలమైనట్లు సోమవారం తమకు తెలిసిందని పేర్కొన్న జపాన్ అధికారులు తమ స్కేటర్ కీయ్ సైటోపై అనర్హత వేటు వేస్తున్నట్లు మంగళవారం వెల్లడించారు. తొలిసారి శీతాకాల ఒలింపిక్స్‌లో పాల్గోబోతున్న ఆ స్కేటర్ నిషేధిత అసిటలోజమైడ్ ను వినియోగించినట్లు టెస్టుల్లో తేలినట్లు సమాచారం. కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ త్వరలోనే అతడిపై చర్యలు తీసుకోనుంది. ఫిబ్రవరి 4న జపాన్ నుంచి ఒలింపిక్ గ్రామానికి వచ్చిన ప్లేయర్ కీయ్ సైటోకు నిర్వహించిన డోప్ టెస్ట్ ఫలితాలు చూసి అధికారులు షాకయ్యారు. మరోవైపు డోపీగా తేలిన స్కేటర్ కీయ్ సైటో మాట్లాడుతూ.. డోపింగ్ చేయాలని నేనెప్పుడూ భావించలేదు. వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొని పతకం సాధించాలని ఎంతో ఆశగా ఇక్కడికి వచ్చాను. కానీ డోప్ టెస్టుల్లో విఫలమైనట్లు తెలియగానే షాక్‌కు గురయ్యాను. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తా. తోటి ఆటగాళ్లకు భారం అవ్వకూడదని భావిస్తున్నాను. ప్రస్తుతం జపాన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ నిర్ణయానికి కట్టుబడి బరిలో దిగలేకపోతున్నాంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, గత జనవరి 29న అంతర్జాతీయ స్కేటింగ్ యూనియన్ (ఐఎస్‌యూ) ఈ జపాన్ స్కేటర్ కీయ్ సైటోకు నిర్వహించిన డోప్ టెస్టుల్లో నెగటీవ్ అని వచ్చిన విషయం తెలిసిందే. జపాన్‌కు చెందిన షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్ కీయ్ సైటో (కుడి) -
శివ కేశవన్‌కు 34వ స్థానం
తన వింటర్ ఒలింపిక్స్ కెరీర్‌ను భారత క్రీడాకారుడు శివ కేశవన్ నిరాశగా ముగించాడు. ల్యూజ్ క్రీడాంశంలో శివ 34వ స్థానంలో నిలిచాడు. 40 మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో ఆదివారం జరిగిన మూడో రేసును శివ 48.900 సెకన్లలో పూర్తి చేశాడు. టాప్–20లో నిలిచిన వారు ఫైనల్ రేసుకు అర్హత సాధించారు. వరుసగా ఆరు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న 36 ఏళ్ల శివ 2014 సోచి ఒలింపిక్స్‌లో 37వ స్థానంలో నిలిచాడు. -
నాడు మృత్యు ఒడిలో... నేడు మెడలో పతకంతో
ప్యాంగ్‌చాంగ్: మృత్యువును జయిస్తేనే వార్తయితే... మృత్యువును, కాంస్యాన్ని జయించిన వ్యక్తిది కచ్చితంగా ఓ విజయగాథే అవుతుంది. ఇప్పుడు వింటర్ ఒలింపిక్స్‌లో అదే జరిగింది. కెనడాకు చెందిన స్నోబోర్డ్ ఆటగాడు మార్క్ మెక్‌మోరిస్ గతేడాది ఆరంభంలో చావు నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు దక్షిణ కొరియాలోని ప్యాంగ్చాంగ్లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో అతను స్లోప్‌స్టైల్‌లో కాంస్య పతకం గెలిచి పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించాడు. ఇందులో అమెరికాకు చెందిన 17 ఏళ్ల టీనేజ్ కుర్రాడు రెడ్ గెరాడ్ బంగారు పతకం నెగ్గగా... కెనడాకే చెందిన మ్యాక్స్ పారట్ రజతం సాధించాడు. గతంలో ప్రపంచ స్నోబోర్డ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన మెక్‌మోరిస్ నాలుగేళ్ల క్రితం సోచి (రష్యా)లో జరిగిన గత వింటర్ ఒలింపిక్స్‌లోనూ కాంస్యం నెగ్గాడు. అయితే 11 నెలల క్రితం చావుకు అత్యంత చేరువయ్యాడు. ఇక బతికే పరిస్థితేలేనంత దూరం వెళ్లాడు. స్నోబోర్డే తన ప్రపంచమైన అతను 11 నెలల క్రితం లాస్ ఏంజెల్స్‌లో జరిగిన స్నోబోర్డ్ స్లోప్స్టైల్ ఈవెంట్లో పోటీ పడుతుండగా పెద్ద ప్రమాదమే జరిగింది. బుల్లెట్ వేగంతో స్నోబోర్డ్పై దూసుకెళ్తున్న అతను పెద్ద చెట్టును బలంగా ఢీకొట్టాడు. దీంతో ముఖ్యమైన ఊపిరితిత్తులు, ఒంట్లోని ఎముకలు విరిగాయి. ఇక బతకడం కష్టమని డాక్టర్లు చేతులెత్తేశారు. కానీ దురదృష్టం ఢీకొట్టించినా... అదృష్టం ఊపిరిపోయడంతో బతికిపోయాడు. కోలుకునేందుకు నెలల సమయం పట్టింది. ఒక్కసారి పూర్తిగా కోలుకోగానే మళ్లీ స్నోబోర్డ్ బాటపట్టాడు. ఈ ఏడాది ఆరంభంలో కాంస్యం గెలుచుకున్నాడు. ఈ 24 ఏళ్ల ఈ స్నోబోర్డ్ స్కీయర్ తన అద్భుతమైన నైపుణ్యంతో అస్పెన్‌లో జరిగిన ఎక్స్ గేమ్స్‌లో నాలుగు స్వర్ణాలు గెలిచాడు. -
తొలి స్వర్ణం స్వీడన్ ఖాతాలో
ప్యాంగ్‌చాంగ్ (దక్షిణ కొరియా): వింటర్ ఒలింపిక్స్‌లో తొలి పసిడి పతకం స్వీడన్ ఖాతాలోకి వెళ్లింది. పోటీల తొలి రోజు శనివారం మహిళల స్కీయాథ్లాన్ క్రాస్ కంట్రీ ఈవెంట్లో స్వీడన్‌కు చెందిన చార్లోటి కల్లా విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మారిట్ జోయెర్న్ (నార్వే) రజతం... క్రిస్టా పర్మాకోస్కీ (ఫిన్లాండ్) కాంస్యం సాధించారు. ఆతిథ్య దక్షిణ కొరియా జట్టు తొలి రోజే పసిడి బోణీ చేసింది. పురుషుల 1500 మీటర్ల షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్‌లో లిమ్ హయోజున్ కొరియాకు బంగారు పతకాన్ని అందించాడు. మరోవైపు మహిళల ఐస్ హాకీ మ్యాచ్‌లో దక్షిణ కొరియా–ఉత్తర కొరియా క్రీడాకారిణులతో కూడిన ఉమ్మడి కొరియా జట్టుకు ఓటమి ఎదురైంది. స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమ్మడి కొరియా 0–8తో పరాజయం పాలైంది. 34వ స్థానంలో శివ కేశవన్ వరుసగా ఆరో వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత స్టార్ శివ కేశవన్‌కు తొలి రోజు నిరాశే ఎదురైంది. ల్యూజ్ క్రీడాంశం సింగిల్స్ ఈవెంట్లో బరిలోకి దిగిన శివ కేశవన్ తొలి రోజు రెండు రేసులు ముగిశాక 1ని:39.288 సెకన్లతో 34వ స్థానంలో ఉన్నాడు. 1,365 మీటర్లతో కూడిన ట్రాక్‌పై అతను తొలి రేసును 50.578 సెకన్లలో... రెండో రేసును 48.710 సెకన్లలో ముగించాడు. 40 మంది పాల్గొంటున్న ఈ రేసులో ఆదివారం మరో రెండు రేసులు జరుగుతాయి. నిర్ణీత నాలుగు రేసులు ముగిశాక అత్యుత్తమ సమయం నమోదు చేసిన తొలి ముగ్గురికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందజేస్తారు. -
శత్రుదేశాలు.. ఆసక్తికర దృశ్యాలు!
సియోల్: శీతాకాల ఒలింపిక్స్ నేపథ్యంలో శత్రుదేశాలు ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఆసక్తికర దృశ్యాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని రోజుల కిందట నార్త్ కొరియా నియంత ప్రేయసి హోన్ సాంగ్ వోల్ దక్షిణకొరియాకు చేరుకోగా ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కిమ్ జాంగ్ ఉన్ దిష్టిబొమ్మలు తగలబెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్, కొందరు ఉత్తర కొరియా ప్రతినిధులతో కలిసి వింటర్ ఒలింపిక్స్ నిమిత్తం ద.కొరియాకు వెళ్లగా సాదర స్వాగతం లభించింది. ద.కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ కిమ్ సోదరి కిమ్ యో జాంగ్‌కు, ఉన్నత స్థాయి అధికారులకు శనివారం ప్రత్యేక విందు ఇచ్చారు. సియోల్‌లోని అధ్యక్ష భవనంలో మూన్ వారితో లంచ్ సమయంలో నార్త్ కొరియా ప్రతినిధుల బృందం సమావేశమైంది. సమావేశం అనంతరం ఆతిథ్య ద.కొరియా నేతలు కిమ్ యో జాంగ్ సహా ఉ.కొరియా ఒలింపిక్స్ అధికారుల బృందానికి నేతృత్వం వహిస్తున్న కియ్ యాంగ్ నామ్‌కు రుచికరమైన విందు ఇచ్చింది. శత్రుదేశాల మధ్య జరిగిన ఈ విందు సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న (శుక్రవారం) ప్యాంగ్చాంగ్లో జరిగిన వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో కిమ్ యో జాంగ్, కిమ్ యాంగ్ నామ్‌లు వీఐపీ గ్యాలరీలో కనిపించారు. అమెరికాతో ఏ విషయాన్ని చర్చించే ప్రసక్తే లేదని కిమ్ జాంగ్ ఉన్ ఇదివరకే స్పష్టం చేసిన నేపథ్యంలో నార్త్ కొరియా, అమెరికా అధికార బృందాలు ఎడమొహం పెడమొహంగా వ్యవహరించాయి. -
వింటర్ ఒలింపిక్స్‌లో ఆశ్చర్యం..!
-
వింటర్ ఒలింపిక్స్‌లో ఆశ్చర్యం..!
ప్యాంగ్ చాంగ్, దక్షిణకొరియా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అంతేకాదు ఇద్దరూ కలసి దక్షిణ కొరియాలోని ప్యాంగ్ చాంగ్‌లో జరగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఇది నిజంగానే జరిగితే బావుటుంది. కిమ్, ట్రంప్‌లు కలసి వస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఇద్దరు వ్యక్తులు(హోవార్డ్ ఎక్స్, డెన్నిస్ అలన్) అచ్చూ ట్రంప్, కిమ్‌ల మారువేషాలతో వింటర్ ఒలింపిక్స్‌కు వచ్చారు. తొలుత వారిని చూసిన ఒలింపిక్స్ నిర్వహకులు వారి కళ్లను నమ్మలేకపోయారు. ఆనందంతో ఇద్దరికి లోపలికి సాదరంగా ఆహ్వానం పలికారు. అయితే, క్రీడాకారులను దగ్గరగా చూసేందుకు జర్నలిస్టుల గ్యాలరీలోకి వెళ్లేందుకు ఇరువురూ యత్నించారు. దీన్ని గమనించిన నిర్వహకులు ఇరువురిని వారి సీట్ల వద్దకు తీసుకెళ్లారు. ట్రంప్, కిమ్ గెటప్‌లలో ఉన్న ఇద్దరితో మాట్లాడేందుకు జర్నలిస్టులు వారి వెనుక పరుగులు పెట్టారు. నకిలీ ట్రంప్, కిమ్‌ల ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమానికి అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్‌లు హాజరయ్యారు. -
వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం
-
అట్టహాసంగా వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం
-
వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం
దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌చాంగ్ నగరం వేదికగా ప్రతిష్టాత్మక వింటర్ ఒలింపిక్స్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 25 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. 92 దేశాల నుంచి 2,920 మంది క్రీడాకారులు 102 స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు. భారత్ తరఫున ఇద్దరు మాత్రమే (శివ కేశవన్, జగదీశ్) బరిలో ఉన్నారు. వరుసగా ఆరో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న శివ కేశవన్ ప్రారంభోత్సవంలో భారత పతాకధారిగా వ్యవహరించాడు. -
అట్టహాసంగా వింటర్ ఒలింపిక్స్ వేడుకలు
ప్యాంగ్‌చాంగ్ : దక్షిణకొరియాలోని ప్యాంగ్ చాంగ్‌లో వింటర్ ఒలింపిక్స్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్యాంగ్‌చాంగ్ ఒలింపిక్ స్టేడియంలో కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు, బాణసంచా వెలుగుల మధ్య దక్షిణ కొరియా స్కేటింగ్ క్రీడాకారిణి యూనా కిన్ వింటర్ ఒలింపిక్స్ జ్యోతి వెలిగించారు. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే యిన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 92 దేశాల జట్లు ఈ ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నాయి. ప్రతి దేశానికి చెందిన జట్టు ఆటగాళ్లు వేడుకల్లో పాల్గొన్నారు. తమ జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని స్టేడియంలో సందడి చేశారు. స్కీయింగ్, స్కేటింగ్, లుజ్, ఐస్ హాకీ సహా 15 క్రీడల్లో 102 ఈవెంట్లలో నిర్వాహకులు పోటీలు నిర్వహించనున్నారు. భారత్ నుంచి ఇద్దరు క్రీడాకారులు శివ్‌కేశవన్, జగదీశ్ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నెల 25 వరకు వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. -
షర్ట్‌లెస్ టోంగన్ మళ్లీ వచ్చేశాడు.. వైరల్
సియోల్: పిటా టఫాటోఫౌ.. ఆ పేరు వినగానే రియో ఒలింపిక్స్ గుర్తురాక మానదు. ఎందుకంటే బ్రెజిల్‌లోని రియోడీజనీరోలో జరిగిన ఆ ఒలింపిక్స్‌లో ‘షర్ట్‌లెస్’గా ఒంటినిండా నూనెతో కనిపించిన తైక్వాండో ఆటగాడే ఈ టఫాటోఫౌ. ప్రస్తుతం వింటర్ ఒలింపిక్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో టోంగకు చెందిన ఈ ఆటగాడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఒలింపిక్స్‌లో మెడల్ సంగతేమోకానీ అంతకుముందే.. అప్పుడే అమ్మాయిల హృదయాలు కొల్లగొడుతున్నాడు తైక్వాండో ఆటగాడు. దక్షిణ కొరియాలో జరుగుతున్న శీతాకాల ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రావడంతో అందరి దృష్టి అతడిపై నెలకొంది. రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలో టోంగన్ సంప్రదాయ వేషధారణలో కనిపించి.. తమ జాతీయ పతాకాన్ని ప్రదర్శించి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా పిటా నిలిచిన విషయం తెలిసిందే. షర్ట్ లేకుండా ఒంటినిండా నూనెతో, కండలు తిరిగిన దేహంతో అతిపెద్ద స్డేడియంలో అతడు ఎంతోమంది మహిళా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన పిటా.. సమ్మర్ (రియో)తో పాటు నేటి వింటర్ ఒలింపిక్స్‌లోనూ ప్రాతినిథ్యం వహించిన తొలి టోంగన్ క్రీడాకారుడిగా రికార్డు సృష్టించనున్నాడు. ‘రియో తర్వాత ఎంతో ఆలోచించాను. కొత్త చాలెంజ్‌ను ఏర్పాటు చేసుకున్నా. కొత్త గేమ్ ద్వారా మళ్లీ ఒలింపిక్స్‌లో టోంగన్ తరపున బరిలోకి దిగాలని భావించా. దానికోసం ఐస్లాండ్కు వెళ్లి తీవ్రంగా శ్రమించి ప్రాక్టీస్ చేశాను. క్రాస్ కంట్రీ స్కైయింగ్‌కు అర్హత సాధించాను. పతకం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తానని’ టఫాటోఫౌ తెలిపాడు. -
సమయం చూసి.. కిమ్ బల ప్రదర్శన
ప్యాంగ్యాంగ్ : సద్దుమణిగిందనుకున్న ఉత్తరకొరియా వివాదం మళ్లీ రాజుకునే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ కొరియాలో జరిగే శీతాకాల ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఒప్పుకోవడంతో ఇరుదేశాల మధ్య మళ్లీ చర్చలు మొదలవుతాయని, శాంతి మార్గాలను కొరియా దేశాలు అన్వేషిస్తాయని అందరూ భావించారు. అయితే, ఓ వైపు శీతాకాల ఒలింపిక్స్‌కు ప్లేయర్లను, మాజీ ప్రేయసి, సోదరిని పంపిన కిమ్.. గురువారం సైనిక కవాతును నిర్వహించారు. ఈ మేరకు ఉత్తరకొరియా అధికార మీడియా సంస్థ కవాతును ప్రసారం చేసింది. ఉత్తరకొరియా గతంలో నిర్వహించిన సైనిక బల ప్రదర్శనలతో పోల్చితే ఇది అతి చిన్నది. బల ప్రదర్శనకు సతీ సమేతంగా హాజరైన కిమ్.. సాయుధ దళాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరకొరియా వద్ద ప్రపంచ స్థాయి బలగాలు ఉన్నాయన్నారు. ఈ పరేడ్‌లో అణ్వస్త్ర సామర్ధ్య ఖండాంతర క్షిపణులైన హ్వసంగ్-14, హ్వసంగ్-15లను ప్రదర్శించారు. ఇలా పరేడ్‌లో ఉత్తరకొరియా క్షిపణులను ప్రదర్శించడం ఇదే మొదటిసారి. ఉత్తరకొరియా బల ప్రదర్శనపై దక్షిణ కొరియా ఇంకా స్పందించలేదు. -
క్రీడాభిమానులకు జియో గుడ్‌న్యూస్
క్రీడాభిమానులకు రిలయన్స్ జియో చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. రేపటినుంచి ప్రారంభం కానున్న (ఫిబ్రవరి 9) పియాంగ్ చాంగ్ వింటర్ ఒలింపిక్స్ 2018ను పాపులర్ జియో టీవీ యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఫిబ్రవరి 9-25వ తేదీవరకు దక్షిణ కోరియాలో అట్టహాసంగా నిర్వహించనున్న వింటర్ ఒలింపిక్స్ లైవ్ అప్డేట్స్ను దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా అందించనున్నామని రిలయన్స్ జియో ప్రకటించింది. దీనికి సంబంధించిన డిజిటల్ హక్కులను పియాంగ్ చాంగ్ 2018 ఒలింపిక్ కమిటీనుంచి సాధించామని వెల్లడించింది. జియో టీవీ యాప్‌లో లైవ్ కవరేజీని అందించడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆటల సమగ్ర కవరేజీని అందించడానికి ఐవోసీతో కలిసి జియో టీవీ పనిచేస్తుంది, తద్వారా లక్షలాది మంది తమ మొబైల్స్‌లో లైవ్ అండ్ క్యాచ్-అప్ కంటెంట్‌ను వీక్షించే అవకాశం కల్పిస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫాంలో మొట్టమొదటి, కీలక ముందడుగు అని పేర్కొన్నారు. అలాగే పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్ దీవుల్లో కూడా ఆసియా ఫసిఫిక్ యూనియన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని ఐవోసీ ప్రకటించింది. వందల కోట్ల ఖర్చుతో సరికొత్త హంగులతో, అద్భుతంగా నిర్మించిన భారీ స్టేడియంలో ‘ఒలింపిక్ వింటర్ గేమ్స్ 2018’ దక్షిణ కొరియా, పియాంగ్ చాంగ్ కౌంటీలో జరుగనున్నాయి. స్కీయింగ్, స్కేటింగ్, ల్యుగే, స్కై జంపింగ్, ఐస్ హాకీ, మంచు బోర్డింగ్ సహా 15 క్రీడల్లో 102 ఈవెంట్స్ నిర్వహించనున్నారు. భారతదేశంతో సహా 90కి పైగా దేశాలు ఈ క్రీడల్లో పాల్గొంటాయి. కాగా ఆండ్రాయిడ్‌లో రిలయన్స జియో టీవీ యాప్ లక్షల డోన్లోడ్లను కలిగింది. సుమారు 400 చానల్స్‌ను, 60హెచ్డీ చానల్స్‌ను వీక్షించే అవకాశాన్ని చందాదారులకు అందిస్తోంది. తెలుగు, హిందీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, బెంగాలీ, ఇంగ్లీష్, మలయాళం, తమిళం, గుజరాతి, ఒడియ, భోజ్‌పురి, కన్నడ, అస్సామీ, నేపాలీ, ఫ్రెంచ్ లాంటి వివిధ భాషలలోని ఛానెళ్లకు జియో టీవీ యాప్‌లో యాక్సెస్ లభిస్తుంది. -
శత్రు దేశానికి తొలిసారిగా..కిమ్ సోదరి, ప్రేయసి!
ప్యోంగ్ యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ తొలిసారిగా తమ శత్రుదేశం దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. దక్షిణ కొరియాలో జరగనున్న శీతాకాల ఒలింపిక్స్‌లో ఉ.కొరియాకు చెందిన 22 మంది ప్లేయర్లు పాల్గొననున్నారు. ఉ.కొరియాలోని అధికార వర్కర్స్ పార్టీలో కీలక నాయకురాలయిన తన సోదరిని నియంత కిమ్ ద.కొరియాకు తమ దేశ ప్రతినిధిగా పంపాలని నిర్ణయించుకున్నారు. ఒలింపిక్స్‌లో ఉ.కొరియా తరపున ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్ల బృందానికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే సభ్యులలో కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ ఒకరు. కిమ్ సోదరితో పాటు కిమ్ ప్రేయసి సైతం ద.కొరియాలో పర్యటించనుండటంతో అక్కడ చర్చనీయాంశమైంది. బ్యూటీ ఆర్మీతో కిమ్ ప్రేయసి.. హత్యకు గురైందన్న వదంతుల అనంతరం ఇటీవల వెలుగులోకి వచ్చింది కిమ్ ప్రేయసి హోన్ సాంగ్ వోల్. శీతాకాల ఒలింపిక్స్‌కు ఓ అందగత్తెల సైన్యాన్ని కిమ్ ద.కొరియా పంపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ బృందానికి నేతృత్వం వహించేది ఎవరంటే కిమ్ ప్రేయసి హోన్ సాంగ్ వోల్. ఇదివరకే హోన్ ద.కొరియా చేరుకున్నారు. హోన్ అక్కడికి రాగానే కిమ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ దిష్టిబొమ్మలు తగలబెట్టారు. నియంతగా దేశాన్ని పాలిస్తున్నాడన్న అపప్రతను తొలగించుకోవడానికి అందగత్తెలను కిమ్ ద.కొరియాకు పంపుతున్నారట. 22 మంది తమ అథ్లెట్లను కిమ్ వింటర్ ఒలింపిక్స్ లో భాగస్వాములు చేయనున్నారు. ప్యోంగ్ యాంగ్‌కు చెందిన మారన్ బాంగ్ బ్యాండ్‌కు హోన్ సాంగ్ వోల్ లీడ్ చేస్తోంది. ఈ బ్యాండ్‌ను హస్తగతం చేసుకున్న కిమ్.. ఒలింపిక్స్ సందర్భంగా ఏర్పాటు చేసే షోలో ప్రదర్శన ఇవ్వాలని వీరిని ఆదేశించిన విషయం తెలిసిందే. -
బాహుబలులను పంపుతున్నాం: రష్యా
మాస్కో: ఒలింపిక్స్‌లో పతకాలు గెలవటంలో పోటీపడే దేశాలలో రష్యా ఒకటి. అయితే దక్షిణ కొరియాలో జరగనున్న శీతాకాల ఒలింపిక్స్‌లో రష్యా పాల్గొంటుందా లేదా అనేది సగటు క్రీడాభిమానులకు కలిగిన సందేహం. గత కొన్ని రోజులుగా ప్రపంచమంతా ఈ అంశంపై పెద్ద చర్చ జరుగుతోంది. శీతాకాల ఒలింపిక్స్‌లో రష్యా పాల్గొనటంపై ఎందుకింత చర్చ అనుకుంటున్నారా.. రియో ఒలింపిక్స్‌లో కొంత మంది ఆటగాళ్లు డోపింగ్‌లో పట్టుబడంటంతో రష్యా అపఖ్యాతి మూటగట్టుకుంది. దీంతో శీతాకాల ఒలింపిక్స్‌లో పాల్గొంటుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నామని రష్యా ప్రకటించింది. రష్యా ప్రకటనతో ఒలింపిక్ అభిమానుల అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ఎందుకంటే ఒలింపిక్‌లో రష్యా అథ్లెట్స్ ప్రదర్శన అలాంటిది. అథ్లెట్స్ సంఖ్య తగ్గినా పతకాలు తెచ్చే 169మంది బాహుబలులను పంపుతున్నామని రష్యా ప్రకటించింది. ఈ సంఖ్య గతంలో జరిగిన ఒలింపిక్స్ పోటీలకు పంపిన అథ్లెట్ల కంటే తక్కువే ఉంది. రియో ఒలింపిక్స్‌కి 232 మందిని, వాంకోవర్ ఒలింపిక్స్‌కి 177 మందిని పంపింది. రష్యా అథ్లెట్లను శీతాకాల ఒలింపిక్స్‌కి పంపకపోతే ఆ దేశ జెండా, జాతీయ గీతం ప్రదర్శనలో ఉండబోదని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) ముందే హెచ్చరించింది. ఒలింపిక్స్ ప్యానెల్ నిర్వహించే డోపింగ్ పరీక్షలోనూ నెగ్గాలని, లేకపోతే ఆదేశం నిర్వహించిన పరీక్షలపై అనుమానాలు కలిగే అవకాశం ఉంటుందని ఐఓసీ తెలిపింది. -
చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్లు!
పియాంగ్ చాంగ్ : వందల కోట్ల ఖర్చుతో నిర్మితమైన భారీ స్టేడియం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు వేడుకల తర్వాత నిర్వీర్యంగా మారనుందా అంటే అవుననే చెప్పాలి. కొత్త హంగులతో, అద్భుతంగా నిర్మించిన కట్టడం చరిత్రలో కలిసిపోనుంది. శీతాకాల ఒలింపిక్స్-2018 కోసం పియాంగ్ చాంగ్ (దక్షిణ కోరియా) ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఒలింపిక్స్ వేడుకలను అట్టహాసంగా జరపాలని ఉద్దేశంతో పియాంగ్ చాంగ్ లో భారీ స్టేడియాన్ని నిర్మించారు. కానీ ఆ తర్వాత తాము చేసిన పనికి అధికారులు తలలు పట్టుకున్నారు. అదేంటి స్డేడియాన్ని నిర్మించడం తప్పేమి కాదుగా.. ఎందుకీ అవస్థ అంటారా. ఆ స్టేడియం నిర్మాణానికి అక్షరాల వంద మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు 635కోట్లు) ఖర్చు చేసింది. ఒకేసారి 35000 మంది వీక్షించే సదుపాయం కలదు. ఇంత భారీ ఖర్చుతో నిర్మించిన స్టేడియాన్ని కేవలం నాలుగంటే నాలుగు సార్లు మాత్రమే ఉపయోగిస్తారు. శీతాకాల ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలకు మాత్రమే వేదిక కానుంది. ఆ తర్వాత స్టేడియాన్ని ఏ అవసరాలకు వినియోగించాలో అర్థంకాక అధికారులు తికమక పడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఒలింపిక్స్ స్టేడియాల పరిస్థితి ఇలానే ఉన్నాయి. రియో, అట్లాంట ఒలింపిక్స్ స్టేడియాలు శిథిలావస్థకు చేరగా, మరికొన్ని స్టేడియాలు ఆటగాళ్ల వసతులకు ఉపయోగపడుతున్నాయి. పియాంగ్ చాంగ్ లో స్డేడియం సామర్థ్యం కంటే కేవలం 10 వేల మంది ఎక్కువ ప్రజలు ఉన్న దేశంలో భవిష్యత్తులో దాని నిర్వహణకు చేసే ఖర్చు తలుచుకుంటే అధికారులకు వారి తప్పిదం అర్థమవుతోంది. -
నార్త్ కొరియా నియంత సంచలన నిర్ణయం
ప్యోంగ్ యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తరచుగా అణు క్షిపణి పరీక్షలతో అగ్రదేశాలను సైతం గడగడలాడించే వ్యక్తి నియంత కిమ్. తమ పొరుగుదేశం దక్షిణ కొరియాలో జరగనున్న శీతాకాల ఒలింపిక్స్‌కు ఓ అందగత్తెల సైన్యాన్ని పంపాలని కిమ్ డిసైడ్ అయ్యారట. ఆ భామలు ఆయుధాలు లాంటివి చేతపట్టేవారైతే కాదు సుమా.. కేవలం తమ అధ్యక్షుడు పంపుతున్నారన్న కారణంగా దక్షిణ కొరియాకు వెళ్తున్నారు. అందగత్తెల బృందానికి నేతృత్వం వహించేది ఎవరంటే కిమ్ ప్రేయసి హోన్ సాంగ్ వోల్. ఇటీవల కిమ్ ఆమెను హత్య చేయించారని విస్తృత ప్రచారం జరిగింది. కానీ ఆమె దర్శనమివ్వడంతో అవన్నీ వదంతులేనని తేలిపోయింది. నియంతగా దేశాన్ని పాలిస్తున్నాడన్న అపప్రతను తొలగించుకోవడానికి అందగత్తెలను కిమ్ ద.కొరియాకు పంపుతున్నారట. 22 మంది తమ అథ్లెట్లను కిమ్ వింటర్ ఒలింపిక్స్ లో భాగస్వాములు చేయాలనుకున్న తరుణంలో ఆయన ప్రేయసి సాంగ్ వోల్ బయటి ప్రపంచానికి దర్శనమిచ్చింది. ప్యోంగ్ యాంగ్‌కు చెందిన మారన్ బాంగ్ బ్యాండ్‌కు హోన్ సాంగ్ వోల్ లీడ్ చేస్తోంది. ఈ బ్యాండ్ ను తన హస్తగతం చేసుకున్న కిమ్ ఆదేశానుసారం ఆ మహిళలు స్టేజ్ షోలు చేస్తుంటారు. సాధారణంగా కొంతమంది అందెగత్తెలు ఓ బృందంగా ఉంటే 'ఆర్మీ ఆఫ్ బ్యూటీస్' అని సంబోధిస్తారు. ఈ అందగత్తెలు అథ్లెట్లతో పాటు ద.కొరియా వెళ్తారు. సైనికుల డ్రెస్ కోడ్ తరహాలో రూపొందించిన దుస్తులను ధరించి నృత్యాలు చేసి తమదేశం గురించి నినాదాలు చేస్తారు. దీంతో ఉత్తర కొరియాలో నియంత పాలన లేదని ప్రపంచ దేశాలకు చాటిచెప్పాలని కిమ్ ప్లాన్ చేస్తున్నారు. ఒలింపిక్స్ అనగానే అథ్లెట్లను ప్రోత్సహించి పంపించే అధినేతలను చూశాం కానీ, ఇలా డ్యాన్సర్స్ (అందగత్తెలు) ను పంపే వ్యక్తి కేవలం కిమ్ జాంగ్ ఉన్ ఒక్కడే అయి ఉంటారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కిమ్ తరపున ప్రత్యేక దూతలు
ప్యాంగ్యాంగ్ : దక్షిణ కొరియాలో జరగబోయే వింటర్ ఒలంపిక్స్ ఈసారి హాట్ హాట్‌గా సాగనున్నాయి. దశాబ్దాల తర్వాత ఉత్తర కొరియా ఆటగాళ్లు కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. పొరుగు దేశంతో శాంతి చర్చలకు తెరలేపిన నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరితోపాటు ఛీర్‌లీడర్స్‌ను కూడా పంపేందుకు ఉత్తర కొరియా సిద్ధమైంది. ఆర్మీ ఆఫ్ బ్యూటీ పేరుతో 18-20 ఏళ్లలోపు ఉన్న అమ్మాయిలను(300 మంది) అధికారులు ఎంపిక చేశారు. ఈ బృందానికి కిమ్ సతీమణి రి సోల్-జూ ప్రాతినిధ్యం వహించనున్నారు. ‘‘ఉత్తర కొరియా అంటే ప్రపంచం దృష్టిలో కరుడుగట్టిన దేశంగా అభిప్రాయం ఉంది. కానీ, ఇక్కడ అందగత్తెలకు లోటు లేదు. అది నిరూపించేందుకే ఈ ప్రయత్నం’’ అని రి సోల్ ఓ ప్రకటనలో తెలిపారు. 2005 ఇన్చియాన్ ఏషియన్ అథ్లెటిక్స్ పోటీల్లో ఆమె ఛీర్ గాళ్‌గా అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా, 2002 బుసన్ ఏషియన్ గేమ్స్ లో ఉత్తర కొరియా తరపున ఛీర్ లీడర్స్ సందడి చేశారు. కొరియన్ వార్ తర్వాత 1953 నుంచి ఇరు దేశాల మధ్య ఎటువంటి సంబంధాలు లేవు. ఈ నెల 9న ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగ్గా.. వింటర్ ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొరియా దేశాల మధ్య మైత్రి నెలకొనేందుకు వింటర్ ఒలంపిక్స్ 'మంచి అవకాశం'గా ఉపయోగపడుతుందని ఇరు దేశాల ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు. -
కొరియాల మధ్య హాట్‌లైన్
సియోల్: ఉభయ కొరియా దేశాల మధ్య సుమారు రెండేళ్ల తరువాత మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వచ్చే నెలలో దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌కు తన బృందాన్ని పంపడానికి ఉత్తర కొరియా అంగీకరించింది. అలాగే దక్షిణ కొరియాతో మిలటరీ హాట్‌లైన్ సర్వీసును పునఃప్రారంభించినట్లు వెల్లడించింది. అణు పరీక్షలతో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ద.కొరియాతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ చొరవ చూపడంతో ఇరు దేశాల సరిహద్దు గ్రామం పాన్‌మున్‌జోమ్‌లో సోమవారం ఈ చర్చలు మొదలయ్యాయి. చర్చల పేరిట ద.కొరియా, అమెరికా మధ్య దూరం పెంచడానికి కిమ్ యత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కుటుంబాల కలయిక, సైనిక చర్చల ప్రస్తావన అధికారులు, అథ్లెట్లు, పాత్రికేయులు, చీర్లీడర్లతో కూడిన తమ బృందాన్ని వింటర్ ఒలింపిక్స్‌కు పంపుతామని ఉ.కొరియా ప్రతినిధి బృందం తెలిపింది. యుద్ధం వల్ల రెండు దేశాల మధ్య విడిపోయిన కుటుంబాలను తిరిగి కలిపే చర్యలను పునరుద్ధరించాలని చర్చల్లో పాల్గొన్న ద.కొరియా మంత్రి చున్ హాయె సుంగ్ ప్రతిపాదించారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గించేలా ఇరు దేశాల మధ్య సైనిక చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ అవసరాన్ని ద.కొరియా నొక్కి చెప్పగా.. చర్చల ద్వారానే రెండు కొరియా దేశాలు శాంతి, స్థిరత్వానికి పాటుపడాలని ఉ.కొరియా బదులిచ్చింది. ఇటీవల నిలిపేసిన హాట్‌లైన్ సర్వీసుల్లో రెండింటిని పునరుద్ధరించినట్లు కూడా ద.కొరియా ప్రతినిధి బృందానికి వెల్లడించింది. మిలటరీ చర్చలు, కుటుంబాల కలయికకు సంబంధించి ద.కొరియా చేసిన ప్రతిపాదనలకు బదులుగా ఉ.కొరియా కూడా కొన్ని డిమాండ్లు చేసే అవకాశాలున్నాయి. వాటిలో అమెరికాతో కలసి ద.కొరియా నిర్వహిస్తున్న సంయుక్త సైనిక విన్యాసాల నిలిపివేత వంటివి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
శివ కేశవన్‌కు స్వర్ణం
నగానో (జపాన్): భారత స్టార్ వింటర్ ఒలింపియన్ శివ కేశవన్ మరోసారి రాణించాడు. ఆసియా ల్యూజ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ అతను అద్భుత ప్రతిభతో విజేతగా నిలిచాడు. గంటకు 130.4 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన అతను ఒక నిమిషం 39.962 సెకన్లలో గమ్యానికి చేరుకొని అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తనాకా షోహీ (జపాన్–1ని:44.874 సెకన్లు) రజత పతకాన్ని సంపాదించగా... లియెన్ తె ఆన్ (చైనీస్ తైపీ–1ని:45.120 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. 35 ఏళ్ల శివ కేశవన్ ఇప్పటివరకు వరుసగా ఐదు వింటర్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆర్థిక సమస్యల కారణంగా ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు దూరంగా నిలిచిన కేశవన్... 2018లో కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, వరల్డ్ కప్ సర్క్యూట్ ఈవెంట్స్‌లో పాల్గొని ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తానని తెలిపాడు. -
ఈ బ్రిడ్జి డిజైన్ చూస్తే కళ్లు చెదరాల్సిందే!
-
ఈ బ్రిడ్జి డిజైన్ చూస్తే కళ్లు చెదరాల్సిందే!
చైనా ఎంతైనా ఘటికురాలే. అందుకే 2022లో నిర్వహించనున్న వింటర్ ఒలింపిక్స్ కోసం భారీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా రోలార్ కోస్టర్ తరహాలో ఉండే భారీ నాటకీయ బ్రిడ్జీను నిర్మిస్తామని ఆ దేశానికి చెందిన ఓ నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది. బీజింగ్, దాని సమీపంలో ఉన్న జాంగ్జియాకౌ నగరాలను కలుపుతూ 1482 అడుగుల పొడవున్న వంతెనను నిర్మించేందుకు "పెండా' కంపెనీ ముందుకొచ్చింది. ఈ రెండు నగరాలు వింటర్ ఒలింపిక్స్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ వంతెన కోసం కళ్లు చెదిరే రీతిలో ఒలింపిక్స్ రింగులను తలపించేలా, డీఎన్ఏ కణాలను ప్రతిబింబించేలా డిజైన్ ను ఆ కంపెనీ ప్రభుత్వానికి సమర్పించింది. 278 అడుగుల వెడల్పుతో నిర్మించనున్న ఈ బ్రిడ్జికి సంబంధించిన కంప్యూటర్ ఇమేజ్ డిజైన్లను 'పెండా' కంపెనీ విడుదల చేసింది. భవిష్యత్తులో రానున్న అద్భుతమైన వంతెనలకు ఈ డిజైన్లు అద్దం పడుతున్నాయని పీపుల్స్ డైలీ ఆన్ లైన్ వీటిని ప్రచురించింది. అవి ఇవే.. -
2022 వింటర్ ఒలింపిక్స్ వేదిక బీజింగ్
కౌలాలంపూర్: ప్రపంచ క్రీడల చరిత్రలో చైనా రాజధాని బీజింగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2008లో సమ్మర్ ఒలింపిక్స్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించిన బీజింగ్... 2022 వింటర్ ఒలింపిక్స్‌కూ ఆతిథ్యమివ్వనుంది. దీంతో రెండు ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన నగరంగా బీజింగ్ రికార్డులకెక్కనుంది. పోటీల వేదికను ఖరారు చేయడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ (ఐఓసీ) శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైంది. బిడ్డింగ్‌లో బీ జింగ్ 44 ఓట్లు సాధించగా... చివరి వరకు గట్టిపోటీ ఇచ్చిన కజకిస్తాన్‌కు 40 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆరు దేశాలు ఈ బిడ్డింగ్‌లో పాల్గొనగా... రకరకాల కారణాలతో నాలుగు దేశాలు వైదొలిగాయి. -
ముగిసిన వింటర్ ఒలింపిక్స్
సోచి: చరిత్రలో అతి ఖరీదైన వింటర్ ఒలింపిక్స్ ఆదివారం ముగిశాయి. పదిహేడు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో ఆతిథ్య రష్యా అత్యధికంగా 13 స్వర్ణాలతోపాటు మొత్తం 33 పతకాలు గెలుచుకొని అగ్రస్థానంలో నిలిచింది. 11 స్వర్ణాలతో నార్వే, 10 స్వర్ణాలతో కెనడా వరుసగా ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ తరపున ముగ్గురు అథ్లెట్లు పాల్గొన్నా ఒక్క పతకమూ నెగ్గని సంగతి తెలిసిందే. 2018 వింటర్ ఒలింపిక్స్‌కు దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌చాంగ్ నగరం ఆతిథ్యమిస్తుంది. త్రివర్ణ రెపరెపలు: భారత్‌పై ఐఓసీ నిషేధం ఎత్తివేయడంతో వింటర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత అథ్లెట్లు త్రివర్ణ పతాకంతో పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలో భారత అథ్లెట్లు ఐఓసీ పతాకంతో పాల్గొన్న సంగతి తెలిసిందే. -
హిమాన్షుకు 72వ స్థానం
సోచి ఒలింపిక్స్ సోచి (రష్యా): వింటర్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు నిరాశపర్చా రు. బుధవారం జరిగిన జెయింట్ స్లాలోమ్ ఈవెంట్లో స్కీయర్ హిమాన్షు ఠాకూర్ 72వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. కెరీర్లో తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న అతను 3 నిమిషాల 37.55 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. అంతకుముందు జరిగిన రెండు రేసుల్లో హిమాన్షు చివరి స్థానాల్లో నిలిచాడు. మొత్తం 107 మంది స్కీయర్స్ రేసులో పాల్గొనగా 35 మంది రేసును పూర్తి చేయలేకపోయారు. టెడ్ లిగెటీ (2ని.45.29 సెకన్లు-అమెరికా) స్వర్ణం, స్టీవ్ మిస్లీయర్ (ఫ్రాన్స్-2ని.45.77 సెకన్లు) రజతం, అలెక్సిస్ పింటూరౌల్ట్ (2ని.45.93 సెకన్లు-ఫ్రాన్స్) కాంస్య పతకాలు గెలిచారు. -
‘సోచి’లో మువ్వన్నెల రెపరెపలు...
వింటర్ ఒలింపిక్స్ క్రీడాగ్రామంలో జాతీయ పతాకం ఆవిష్కరణ సోచి (రష్యా): వింటర్ ఒలింపిక్స్‌లో ఎట్టకేలకు భారత జాతీయ పతాకం రెపరెపలాడింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై 14 నెలలపాటు కమ్మిన నిషేధపు మబ్బులు ఐదు రోజుల క్రితం తొలగిపోవడంతో ఆదివారం సోచిలోని ఒలింపిక్స్ క్రీడాగ్రామంలో మూడు రంగుల జెండాను ఆవిష్కరించారు. ఐఓఏ నూతన అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్, వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అథ్లెట్లు శివ కేశవన్, హిమాంశు ఠాకూర్, నదీమ్ ఇక్బాల్, వారి కోచ్‌లు హాజరు కాగా, 45 నిమిషాలపాటు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో త్రివర్ణ పతాక ఆవిష్కరణ జరిగింది. అథ్లెట్లు భారత్ పేరు రాసిన దుస్తుల్ని ధరించగా, తొలుత ఐఓసీ జెండాను ఎగురవేసిన అధికారులు ఆ తరువాత జాతీయ గీతాన్ని ఆలపిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు ఉదయమే ఐఓసీ అధ్యక్షుడు థామస్ బ్యాచ్ పర్వత గ్రామానికి విచ్చేసి భారత అథ్లెట్లను కలిసి శుభాకాంక్షలు తెలపడంతోపాటు వారితో కలిసి అల్పాహారం కూడా చేశారు. ఐఓసీ అధ్యక్షుడి రాక తమకెంతో ఉత్సాహాన్నిచ్చిందని భారత కోచ్‌లలో ఒకరైన రోషన్‌లాల్ ఠాకూర్ తెలిపారు. కాగా, ఐఓఏపై నిషేధం అమల్లో ఉన్నందున ఈ నెల 7న జరిగిన వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమంలో కానరాని భారత పతాకం, ఈ నెల 23న జరగనున్న ముగింపు వేడుకల్లో కనిపించనుంది. -
పదేళ్లయినా పట్టేస్తారు
డోపీలపై ఐఓసీ చేతిలో సరికొత్త అస్త్రం సోచి: డోపీల భరతం పట్టేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నడుంబిగించింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో డోపీలను ఇప్పుడు కాకపోయినా పదేళ్ల కాలంలో ఎప్పుడైనా పట్టుకునేందుకు తమ ప్రణాళికలకు పదునుపెట్టింది. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకొన్నప్పటికీ ప్రస్తుత పరీక్షల్లో డోపీలుగా తేలకపోతే సదరు ఆటగాళ్లు నిశ్చింతగా ఉండటానికి వీళ్లేదు. ఎందుకంటే ఒకసారి తీసుకున్న రక్త, మూత్ర నమూనా (శాంపిల్స్)లను పదేళ్ల దాకా భద్రపరిచి వీలుచిక్కినప్పుడల్లా క్షుణ్నంగా పరీక్షించనున్నారు. దీంట్లో ఎప్పుడు దోషిగా తేలినా శిక్ష తప్పదన్న మాట. తాజాగా ఇక్కడ జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) తీసుకుంటున్న శాంపిల్స్‌ను కూడా పదేళ్ల పాటు భద్రపరిచి దోషుల్ని దొరకబుచ్చుకుంటారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ‘హ్యూమన్ గ్రోత్ హార్మోన్’ (హెచ్‌జీహెచ్) పరీక్ష ద్వారా డోపీల భరతం పడతారు. దీనిపై ఐఓసీ మెడికల్ కమిషన్ చైర్మన్ ఆర్నే జుంగ్‌క్విస్ట్ మాట్లాడుతూ ‘అథ్లెట్లు ఉత్ప్రేరకాలు తీసుకుంటే ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా పట్టుకుంటాం. ఈ సంగతిని గుర్తుంచుకుని మసలుకుంటే మంచిది’ అని చురకంటించారు. -
తొలి స్వర్ణం అమెరికాదే
క్రాన్స్నాయా పోల్యానా (రష్యా): సోచి వింటర్ ఒలింపిక్స్ క్రీడల్లో తొలి స్వర్ణం అమెరికాకు దక్కింది. పురుషుల స్నోబోర్డు స్లోప్‌స్టైల్‌లో కొత్సెన్‌బర్గ్ 93.50 పాయింట్లతో విజేతగా నిలిచి పసిడి పతకాన్ని అందుకున్నాడు. అమెరికా టాప్ అథ్లెట్ జాన్ వైట్ మరో టోర్నీపై దృష్టి నిలపడం కోసం ఈ పోటీలకు దూరమైనా... కొత్సెన్‌బర్గ్ అనూహ్యరీతిలో స్వర్ణం సాధించి ఆ లోటును పూడ్చాడు. బయాథ్లాన్ స్ప్రింట్ 10 కిలోమీటర్ల విభాగంలో బోజెర్న్డాలెన్ (నార్వే) స్వర్ణం నెగ్గాడు. ఈ క్రమంలో అతను వింటర్ ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 12 పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా జాన్ డెలీ (నార్వే) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. -
వైభవంగా ప్రారంభమైన వింటర్ ఒలింపిక్స్
-
భారత్‌కు అవమానం
ప్రపంచ ప్రఖ్యాత క్రీడల్లో ఏ దేశ ఆటగాడైనా తమ జాతీయ పతాకం రెపరెపలాడాలని భావిస్తాడు. సోచిలో అట్టహాసంగా ప్రారంభమైన వింటర్ ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లకు ఆ అదృష్టం లేకుండా పోయింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై ఉన్న నిషేధం కారణంగా శుక్రవారంనాటి ఈ వేడుకల్లో ఓరకంగా భారత ఆటగాళ్లు అవమానకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. నిషేధం కారణంగా వీరు భారతదేశం తరఫున కాకుండా ఒలింపిక్ పతాకం తరఫున ప్రాతినిథ్యం వహిస్తుండడంతో అక్కడ మువ్వన్నెల పతాకం కనిపించలేదు. అలాగే జాతీయ గీతాలాపనకూడా వినిపించలేదు. లూగర్ పిస్టల్ విభాగంలో పోటీ పడుతున్న శివ కేశవన్, అల్ఫైన్ స్కీయర్ హిమాన్షు ఠాకూర్, క్రాస్ కంట్రీ స్కీయర్ నదీమ్ ఇక్బాల్ ప్రారంభ కార్యక్రమంలో ఒలింపిక్ పతాకం చేతబట్టుకుని ముందుకు సాగారు. వైభవంగా వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం సోచి: చరిత్రలో అతి ఖరీదైన వింటర్ ఒలింపిక్స్ రష్యాలోని సోచిలో శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బాణాసంచా వెలుగులు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ నెల 23 వరకు వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయి. -
నేటి నుంచి వింటర్ ఒలింపిక్స్
సోచి: నేటి (శుక్రవారం) నుంచి రష్యాలో వింటర్ ఒలింపిక్స్ జరుగనున్నాయి. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన సోచి నగరంలో జరిగే ఈ క్రీడాపోటీల్లో నేడు ప్రారంభోత్సవం జరుగుతుంది. శుక్రవారం నుంచి ఈనెల 23 వరకు పోటీలుండగా 15 ఈవెంట్లలో ఆయా దేశాల ఆటగాళ్లు పోటీపడనున్నారు. వింటర్ ఒలింపిక్స్ చరిత్రలో అత్యంత ఖరీదైన గేమ్స్‌గా పేరు తెచ్చుకున్న ఈ ఈవెంట్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు 65 దేశాలకు చెందిన ప్రపంచ అగ్రస్థాయి నాయకులు హాజరుకానున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వీరిలో కెనడా, ఇంగ్లండ్ ప్రధానులతో పాటు అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ అధ్యక్షులున్నట్టు సమాచారం. భారత్ నుంచి ముగ్గురు క్రీడాకారులు పాల్గొంటున్నారు.