వింటర్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు నిరాశపర్చా రు. బుధవారం జరిగిన జెయింట్ స్లాలోమ్ ఈవెంట్‌లో స్కీయర్ హిమాన్షు ఠాకూర్ 72వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
సోచి ఒలింపిక్స్
సోచి (రష్యా): వింటర్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు నిరాశపర్చా రు. బుధవారం జరిగిన జెయింట్ స్లాలోమ్ ఈవెంట్‌లో స్కీయర్ హిమాన్షు ఠాకూర్ 72వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. కెరీర్‌లో తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న అతను 3 నిమిషాల 37.55 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. అంతకుముందు జరిగిన రెండు రేసుల్లో హిమాన్షు చివరి స్థానాల్లో నిలిచాడు. మొత్తం 107 మంది స్కీయర్స్ రేసులో పాల్గొనగా 35 మంది రేసును పూర్తి చేయలేకపోయారు. టెడ్ లిగెటీ (2ని.45.29 సెకన్లు-అమెరికా) స్వర్ణం, స్టీవ్ మిస్‌లీయర్ (ఫ్రాన్స్-2ని.45.77 సెకన్లు) రజతం, అలెక్సిస్ పింటూరౌల్ట్ (2ని.45.93 సెకన్లు-ఫ్రాన్స్) కాంస్య పతకాలు గెలిచారు.