మువ్వన్నెల పతాకంతో శివ కేశవన్
దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌చాంగ్ నగరం వేదికగా ప్రతిష్టాత్మక వింటర్ ఒలింపిక్స్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 25 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. 92 దేశాల నుంచి 2,920 మంది క్రీడాకారులు 102 స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు. భారత్ తరఫున ఇద్దరు మాత్రమే (శివ కేశవన్, జగదీశ్) బరిలో ఉన్నారు. వరుసగా ఆరో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న శివ కేశవన్ ప్రారంభోత్సవంలో భారత పతాకధారిగా వ్యవహరించాడు.
Comments
Please login to add a commentAdd a comment