ప్రతీకాత్మక చిత్రం
City Heihe in Heilongjiang Province Under Lockdown: కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో పలు నగరాల్లో లాక్‌డౌన్ విధించిన చైనా.. ఇప్పుడు మరో పెద్ద నగరమైన హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని హీహెలో లాక్‌డౌన్ విధించింది. ఒక్క కేసు కారణంగా.. 6 మిలియన్ల మంది ప్రజలు లాక్‌డౌన్ అయ్యారు. వీరందరిని ఇంటి వద్దనే ఉండాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది. వింటర్ ఒలింపిక్స్ నాటికి బీజింగ్‌లో జీరో కరోనా కేసులు సాధించాలనే లక్ష్యంతో ఉంది చైనా.
2019లో తొలి కరోనా కేసు వెలువడిన నాటి నుంచి చైనాలో కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మహమ్మారి కట్టడి కోసం సరిహద్దులను మూసేసింది.. విదేశాల నుంచి ప్రయాణిలకు అనుమతించలేదు. కఠిన క్వారంటైన్, లాక్‌డౌన్ నియమాలు పాటిస్తూ.. జీరో కేసులు సాధించింది.
(చదవండి: చైనాలో డెల్టా వేరియెంట్ భయం)
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతుండగా.. చైనాలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచలోనే అత్యధిక జనాభా గల చైనాలో ప్రస్తుతం కనీసం పదకొండు ప్రావిన్సులలో కరోనా వ్యాప్తి వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో వైరస్ కట్టడి కోసం ఈ వారంలో నాలుగు మిలియన్లకు పైగా జనాభా ఉన్న లాన్‌జౌ నగరం, ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని ఎజిన్‌లో లాక్‌డౌన్ విధించింది డ్రాగన్ ప్రభుత్వం.
తాజాగా గురువారం ఒక్క కొత్త కేసు నమోదవడంతో 6 మిలియన్ల జనాభా గల హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని హీహెలో అధికారులు లాక్‌డౌన్ విధించారు. ప్రజలు ఇంటికే పరిమితం కావాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని జనాలను హెచ్చిరించారు. ఈ క్రమంలో బస్సు, టాక్సీ సేవలను నిలిపివేసినట్లు రాష్ట్ర మీడియా తెలిపింది. వాహనాలు నగరం దాటి బయటకు వెళ్లడానికి అనుమతిలేదని పేర్కొంది.
(చదవండి: మరో డ్రామాకు తెరతీసిన చైనా.. కొత్తగా సరిహద్దు చట్టం)
రష్యాకు ఉత్తరాన సరిహద్దుగా ఉన్న నగరంలోని 1.6 మిలియన్ల మంది నివాసితులను పరీక్షించడంక కోసం కరోనా సోకిన వ్యక్తి సన్నిహిత పరిచయాలను గుర్తించడం ప్రారంభించినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు చైనా ఆరోగ్య శాఖ అధికారులు. ఇక చైనాలో గురువారం 23 కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారంతో పోల్చితే.. కొత్త కేసులు సంఖ్య సగం తగ్గినప్పటికి దేశంలో కఠిన నియమాలు అమలు చేస్తున్నారు.
చదవండి: థర్డ్ వేవ్ ముప్పు: 5 రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్
Comments
Please login to add a commentAdd a comment