winter olympics 2022
-
రష్యాకు మరో షాక్.. పుతిన్ అహంకారానికి అథ్లెట్లు బలి
Russian and Belarus Athletes Banned From Winter Paralympics: ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యాపై యావత్ క్రీడా జగత్తు కన్నెర్ర చేస్తుంది. ఇప్పటికే ఆ దేశంపై ప్రముఖ ఫుట్‌బాల్ సంస్థలు ఫిఫా, UEFA బ్యాన్ విధించగా.. తాజాగా వింటర్ పారాలింపిక్ కమిటీ కత్తి దూసింది. 2022 వింటర్ పారాలింపిక్స్‌లో రష్యాతో పాటు బెలారస్ అథ్లెట్లు పాల్గొనకుండా అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిషేధం విధించింది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్ల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఆండ్రూ పార్సన్స్ తెలిపారు. రాజకీయాలతో క్రీడలకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ, అనివార్య కారణాల వల్ల రష్యా, బెలారస్ పారా అథ్లెట్లను బహిష్కరించాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఇలా జరిగినందుకు చింతిస్తున్నామని పేర్కొన్నారు. ఆయా దేశ ప్రభుత్వాల చర్యలకు, ముఖ్యంగా పుతిన్ అహంకారానికి పారా అథ్లెట్లు బలైపోయారని వాపోయారు. కాగా, రేపటి (మార్చి 4) నుంచి బీజింగ్‌లో వింటర్ పారాలింపిక్స్ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల్లో రష్యా నుంచి 71 మంది, బెలారస్ నుంచి 12 మంది పారా అథ్లెట్లు పాల్గొనాల్సి ఉండింది. చదవండి: రష్యా అధ్యక్షుడికి వరుస షాక్‌లు.. తైక్వాండో బ్లాక్ బెల్ట్ కూడా తొలగింపు -
పాపం ఉక్రెయిన్.. చైనా పాడుబుద్ధి బయటపడిందిగా!
కుక్క తోక వంకర.. అట్లాగే ఏ మాత్రం విశ్వాసంలేని డ్రాగన్ కంట్రీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రపంచం ఏమైపోయినా ఫర్వాలేదనే అనుకోవడం సహజం. ఒకవైపు ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా బలగాలు మోహరించిన వేళ.. ప్రపంచమంతా శాంతిని కోరుకుంటే, చైనా మాత్రం తనకు బాగా అలవాటైన వక్రబుద్ధిని ప్రదర్శించింది. నాటో కూటమిలో చేరొద్దంటూ రష్యా, ఉక్రెయిన్ ఆక్రమణకు తెగపడిన విషయం తెలిసిందే. వారం రోజులుగా ఈ పరిణామాలు ప్రపంచాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ తరుణంలో చైనా ఇరు దేశాల మధ్య దౌత్యానికి ముందుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తమది శాంతికాముక దేశమని, యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించేందుకు, సయోధ్య కుదిర్చేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రకటించుకుంది చైనా. కట్ చేస్తే.. రష్యాపై ఆంక్షలు ఏమాత్రం కరెక్ట్ కాదని తాజాగా ప్రకటన ఇచ్చింది. ఇంతలోనే ఉక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాకు చేసిన ఓ రిక్వెస్ట్ ఇప్పుడు బయటకు పొక్కడం సంచలనంగా మారింది. చైనా రాజధాని బీజింగ్ వేదికగా 2022 వింటర్ ఒలింపిక్స్ జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ ఈవెంట్స్ జరిగాయి. ఉయిగర్లపై హింసాకాండ, మానవ హక్కుల ఉల్లంఘన, ప్రపంచానికి కరోనా వైరస్‌ను అంటగట్టిందనే అపవాదు.. ఇలా రకరకాల కారణాలతో అగ్రరాజ్యం సహా చాలా దేశాలు ఈ ఈవెంట్లను బహిష్కరించాయి. అయినప్పటికీ అంతర్జాతీయ సమాజానికి దూరంగా వింటర్ ఒలింపిక్స్‌ను అత్యంత గోప్యంగా నిర్వహించుకుంది చైనా. ఈ తరుణంలో.. రష్యా గనుక ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెగబడితే తమకు ఇబ్బంది కలుగుతుందని, కాబట్టి శీతాకాల ఒలింపిక్స్ ముగిసేవరకు ఓపిక పట్టాలని, ఆ తర్వాత ఉక్రెయిన్‌పై ఎలాంటి చర్యలకు దిగినా పర్వాలేదనే ప్రతిపాదనను మాస్కో(రష్యా రాజధాని) ముందు ఉంచిందట. ఈ మేరకు చైనా సీనియర్ అధికారులు, మాస్కోతో పలుదఫాలుగా మంతనాలు చేపట్టగా.. వాళ్ల మధ్య సంభాషణలన్నీ రికార్డయ్యాయి. పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వ్యవస్థ నివేదికలు, పలు స్టింగ్ ఆపరేషన్ల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఇప్పుడు. అయితే చైనా విజ్ఞప్తికి రష్యా నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనే విషయాన్ని మాత్రం ఆ నివేదికలు బయటపెట్టలేదు. ఈ ఆరోపణలపై వెంటనే స్పందించేందుకు సీఐఏ, వైట్‌హౌజ్ జాతీయ భద్రతా మండలి నిరాకరించింది. అయితే ఉక్రెయిన్ సంక్షోభ విషయంలో రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తమ స్వార్థం కోసం ఆక్రమణను వాయిదా వేయాలని కోరడం బయటకు పొక్కడంతో చైనాను ఛీ కొడుతున్నాయి పలు దేశాలు. న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్ ప్రచురించిన ఈ సంచలనాత్మక కథనాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. చూద్దాం.. ఈ కథనాలపై చైనాగానీ, రష్యాగానీ ఎలా స్పందిస్తాయో!. చదవండి: రష్యాకు సపోర్ట్!! పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్.. జాగ్రత్త! -
'నరకంలా అనిపిస్తుంది.. పెట్టిందే పెట్టి మమ్మల్ని చంపుతున్నారు'
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ క్రీడాకారుల పాలిట శాపంగా మారాయి. జీరో కరోనా కేసులు ఉండాలనే ఉద్దేశంతో ఆ దేశ ప్రభుత్వం క్రీడాకారులపై చూపిస్తున్న పైశాచికం తారాస్థాయికి చేరింది. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు పొరపాటున కరోనా సోకిందే ఇక అంతే సంగతులు. ఐసోలేషన్ పేరుతో చైనా అధికారులు క్రీడాకారులకు చుక్కలు చూపిస్తున్నారు. అది ఎంత దారుణంగా ఉందో ఒక క్రీడాకారిణి తన మాటల్లో వర్ణించింది. రష్యాకు చెందిన వలేరియా వాస్నేత్సోవా అనే అథ్లెట్ తమ దయనీయ పరిస్థితిని ట్విటర్ ద్వారా చెప్పుకొచ్చింది. చదవండి: Beijing Winter Olympics 2022: వింటర్ ఒలింపిక్స్‌పై కరోనా పంజా ''జీరో కరోనా కేసులు ఉండాలనే లక్ష్యంతో బీజింగ్ ఒలింపిక్స్‌కు వచ్చిన ఆటగాళ్లకు రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పొరపాటున పాజిటివ్ వస్తే ఐసోలేషన్‌కు వెళ్లాల్సిందే. ఆ బాధితుల్లో నేను ఒకదానిని. కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్‌లో ఉంచారు. మాములుగా ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తులకు మంచి ఆహారం అందించడం చూస్తాం. కానీ మాకు మాత్రం మూడు పుటలా(బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్) ఒకే రకమైన ఆహారం.. ఐదు రోజుల పాటు ఇచ్చారు. ఆ ఆహారం తినాలంటేనే విసుగు పుట్టేది. దెబ్బకు నా ఎముకలన్ని బయటకు పొడుచుకొచ్చేలాగా అనిపించేది. ఒక రకంగా నరకంలా కనిపించే ఆ ఐసోలేషన్‌తో మమ్నల్ని చంపుతున్నారు'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ''బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు వస్తే.. ఇక్కడి అధికారులు మాకు చుక్కలు చూపిస్తున్నారు. సరైన వసతి కల్పించలేదు.. ఐసోలేషన్ పేరుతో మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు. చిన్నవిగా ఉండే ఐసోలేషన్ గదులు.. నాణ్యత లేని ఆహారం.. పీసీఆర్ టెస్టులు చేస్తున్నప్పటికి వాటి ఫలితాలు క్రీడాకారులకు అందించకపోవడం లాంటివి చేసి క్రీడాకారులను జైళ్లో బంధించినట్లుగా చేశారని'' జర్మనీ జట్టు హెడ్ డిర్క్ స్కిమ్మిలెప్ఫెన్నింగ్ పేర్కొన్నారు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో అరుదైన ఘనత.. సోషల్ మీడియాను వదల్లేదు Russian biathlete Valeria Vasnetsova posted a photo of one of the unappetizing meals at Beijing Games on Instagram, showing plain pasta, some potatoes, charred meat, and no vegetables. She claims the same meal was served for “breakfast, lunch and dinner for five days already.” pic.twitter.com/T9rCF7tUbM — Byron Wan (@Byron_Wan) February 6, 2022 -
మా ఎంపిక సరైనదే అంటూ చైనా కొత్త పల్లవి
Winter Olympic 2022: వింటర్ ఒలంపిక్స్‌లో టార్చ్‌బేరర్‌గా గల్వాన్‌లోయ ఘర్షణతో సంబంధం ఉన్న సైనికుడిని ఎంపిక చేయడాన్ని చైనా సమర్థించుకుంది. సదరు సైనికుడిని ప్రమాణాలకు అనుగుణంగా ఎంచుకున్నామని తెలిపింది. ఇందులో రాజకీయ దురుద్దేశాలు చూడవద్దని కోరింది. గల్వాన్ లోయ ఘర్షణలో గాయపడిన కమాండర్ క్వి ఫాబావోను చైనా టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. దీనికి నిరసనగా వింటర్ ఒలంపిక్స్ ఆరంభోత్సవాలను భారత్ బహిష్కరించింది. యూఎస్ సైతం చైనా చర్యను తప్పుబట్టింది. అయితే ఇది కేవలం ముందుగా అనుకున్న ప్రమాణాలకు లోబడి తీసుకున్న నిర్ణయమని చైనా విదేశాంగ మంత్రిత్వ ప్రతినిధి ఝావో లిజియన్ చెప్పారు. ఈ విషయాన్ని భారత్ హేతుబద్ద దృష్టితో చూడాలని, అనవసర రాజకీయ విమర్శలు చేయవద్దని కోరారు. అయితే ఒలంపిక్స్లాంటి కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేయాలని చూడడం చైనా కోరికని భారత ప్రతినిధి బాగ్చీ విమర్శించారు. -
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌పై కరోనా పంజా
Beijing Winter Olympics 2022: బీజింగ్ వేదికగా జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌పై కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. తాజాగా 45 కొత్త కేసులు నమోదైనట్లు ఒలింపిక్ నిర్వాహక కమిటీ శనివారం ప్రకటించింది. ఇందులో 26 మంది కొత్తగా విదేశాల నుంచి వచ్చిన వారు కాగా, మిగతా వారు ఇప్పటికే అక్కడికి చేరుకున్న వారు. ఒలింపిక్స్ కోసం అథ్లెట్లు, సహాయ సిబ్బంది కలుపుకుని దాదాపు 12 వేల మంది బీజింగ్‌లో అడుగుపెట్టగా.. వీరిలో 353 మంది మహమ్మారి బారిన పడినట్లు నిర్వాహకులు తెలిపారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, భారత్ నుంచి ఒకే ఒక అథ్లెట్ బీజింగ్ ఒలింపిక్స్ బరిలో నిలిచాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఆరిఫ్ ఖాన్.. స్కీయింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. చదవండి: 'ఐదేళ్లలో ఒక్కసారి కూడా చోటు కోల్పోలేదు.. ఆరోజు మాత్రం' -
పుతిన్ కావాలనే ఇలా చేశారా?
బీజింగ్: వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్ జట్టు ఫ్లాగ్ పట్టుకుని వచ్చే సమయంలో కునుకు తీశారు. నిజంగా నిద్ర వచ్చే కునుకు తీశారో.. లేక ఉక్రెయిన్ జట్టును చూడలేక కునుకు వేశారో కానీ ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిబ్రవరి 4వ తేదీ(శుక్రవారం) బీజింగ్ వేదికగా వింటర్ ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా పుతిన్.. చైనాకు వచ్చారు. ఈ పోటీల్లో రష్యా పాల్గొనక పోయినప్పటికీ పుతిన్ మాత్రం వచ్చారు. డోపింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన రష్యా.. గత కొంతకాలంగా చాలా మెగా ఈవెంట్లలో పోటీ చేయడం లేదు. కానీ ఆ స్థానంలో రష్యన్ ఒలింపిక్ కమిటీ(ఆర్ఓసీ) పాల్గొంటుంది. ఈ క్రమంలోనే పుతిన్ వింటర్ ఒలింపిక్స్ వేడుకలకు హాజరయ్యారు. ఉక్రెయిన్ జట్టు బీజింగ్ జాతీయ స్టేడియంలోకి వచ్చేటప్పుడు కునుకు తీసిన పుతిన్.. రష్యా ఒలింపిక్ కమిటీ జట్టు వచ్చినప్పుడు మాత్రం మళ్లీ మామూలు స్థితికి వచ్చారు. దాంతో పుతిన్ కావాలనే ఉక్రెయిన్ జట్టు వచ్చినప్పుడు కునుకు తీసినట్లు నటించారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కాగా, రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రరూపం దాలుస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ చుట్టుపక్కల రష్యా సైనిక బలగాలను మోహరించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది.. ఉక్రెయిన్‌పై కన్నెసిన రష్యా.. పలు విమర్శలు ఎదుర్కొంటుంది. రష్యా మొండి వైఖరిపై అగ్రరాజ్యం అమెరికా సైతం కన్నెర్ర చేస్తోంది. Putin sleeping during #OpeningCeremony pic.twitter.com/xvRDfHQ5vW — Bill Enright (@BillEnright) February 5, 2022 చదవండి: పోస్ట్‌మార్టం చేయబోతుండగా లేచి కూర్చున్న ఖైదీ! షాక్ తిన్న వైద్యులు!! -
ఒకే ఒక్కడు త్రివర్ణంతో...
బీజింగ్: కరోనా పుట్టిన దేశం రెండేళ్ల తర్వాత కరోనా ఆంక్షల మధ్య ఒలింపిక్ క్రీడలకు వేదికైంది. దేశంలో పలు చోట్ల ఇంకా లాక్డౌన్లు కొనసాగుతుండగానే మరోవైపు చైనా రాజధాని నగరంలో వింటర్ ఒలింపిక్స్–2022 శుక్రవారం ప్రారంభమయ్యాయి. 2008 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన నేషనల్ స్టేడియంలోనే ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీంతో ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ రెండింటినీ నిర్వహించిన తొలి నగరంగా బీజింగ్ ఘనత వహించింది. ఆరంభ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో పాటు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా దీనికి హాజరు కాగా... భారత్ సహా పలు దేశాలు ‘దౌత్యపర బహిష్కరణ’ను ప్రకటించి కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి. 2020లో గాల్వాన్ సరిహద్దుల్లో భారత్‌తో పోరులో గాయపడిన సైనికుడు ఖి ఫాబియోను రిలేలో టార్చ్ బేరర్‌గా పెట్టడంపై తమ అసంతృప్తిని ప్రదర్శిస్తూ భారత్ ‘డిప్లొమాటిక్ బాయ్‌కాట్’ను ప్రకటించింది. మానవ హక్కుల విషయంలో చైనా వ్యవహార శైలిని విమర్శిస్తూ పలు ఇతర దేశాలు కూడా ప్రారంభోత్సవానికి దూరమయ్యాయి. వింటర్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఒకే ఒక్క ఆటగాడు ఆరిఫ్ ఖాన్ అర్హత సాధించాడు. స్కీయింగ్‌లో స్లాలొమ్, జెయింట్ స్లాలొమ్ ఈవెంట్లలో అతను పోటీ పడుతున్నాడు. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లాకు చెందిన 31 ఏళ్ల ఆరిఫ్ ప్రారంభోత్సవ కార్య క్రమంలో భారత జాతీయ జెండాతో ముందుండగా ... భారత సహాయక సిబ్బందిలోని మరో ముగ్గురు కూడా ఆరిఫ్ వెంట నడిచారు. ఆరిఫ్ ఈవెంట్లు ఈనెల 13, 16వ తేదీల్లో ఉన్నాయి. -
చైనాతో వివాదం: మా మద్దతు భారత్‌కే.. స్పష్టం చేసిన అమెరికా
వాషింగ్టన్: గాల్వాన్ ఘర్షణలో పాల్గొన్న సైనికాధికారిని బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడంపై చైనాతో ఏర్పడ్డ వివాదంలో తమ మద్దతు భారత్‌కేనని అమెరికా పేర్కొంది. పొరుగు దేశాలను బెదిరించే, ఇబ్బంది పెట్టే చైనా చర్యలను గతంలో కూడా తప్పుబట్టామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ప్రైస్ అన్నారు. ఇలాంటి విషయాల్లో భారత్ వంటి మిత్ర దేశాలకు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తామని చెప్పారు. భారత్, చైనా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. సీనియర్ యూఎస్ సెనేటర్లు మార్కో రూబియో, జిమ్ రిచ్ కూడా చైనా చర్యను దుయ్యబట్టారు. వింటర్ ఒలింపిక్స్‌కు చైనా రాజకీయ రంగు పూస్తున్న తీరుకు ఇది మరో నిదర్శనమని రూబియో విమర్శించారు. భారత దళాలపై దొంగచాటున దాడికి దిగిన సైనిక బృందంలోని అధికారిని టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడం కచ్చితంగా రెచ్చగొట్టే ప్రయత్నమేనని ట్వీట్ చేశారు. ఈ విషయంలో చైనా తీరు సిగ్గుచేటని రిచ్ ట్వీట్ చేశారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు చేసే అన్ని ప్రయత్నాలకూ అమెరికా మద్దతుంటుందన్నారు. 2020 జూన్‌లో లడఖ్‌లోని గాల్వాన్ లోయ వద్ద మన దళాలపై చైనా జరిపిన దొంగచాటు దాడిలో పాల్గొన్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారిని శుక్రవారం నాటి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల టార్చిబేరర్ల బృందంలోకి చైనా ఎంపిక చేయడంపై దుమారం రేగింది. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలను బహిష్కరించాలని నిర్ణయించింది. దూరదర్శన్ కూడా ప్రారంభ, ముగింపు వేడుకలను ప్రత్యక్షప్రసారం చేయబోదని ప్రసారభారతి వెల్లడించింది. -
చైనా చేష్టలు.. భారత్ రియాక్షన్ ఇది
గల్వాన్ లోయ ఘర్షణల్లో పాల్గొన్న కమాండర్, ఉయిగర్ల ఊచకోతలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తిని టార్చ్‌బేరర్‌గా అర్హత ఇవ్వడం ద్వారా పెను వివాదానికే కేంద్రం బిందువుగా మారింది వింటర్ ఒలింపిక్స్ 2022. పైపెచ్చు ఇప్పుడు అథ్లెటిక్స్ను స్వేచ్ఛగా మాట్లాడేందుకు వీలు లేకుండా ఆంక్షలు పెట్టింది. ఇక గల్వాన్ లోయ ఘర్షణలకు కారణమైన సీపీఏల్ఏ కమాండర్ క్వీ ఫబోవోను టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడంపై భారత్, చైనా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సరిహద్దు అంశాన్ని కెలిగి.. రాజకీయం చేయాలని చూస్తోందని భారత్ అంటోంది. అందుకే వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత రాయబారి, దౌత్యవేత్తలు పాల్గొనడని స్పష్టం చేసింది. ఈ బహిష్కరణతో పాటు ఒలింపిక్స్ ఈవెంట్స్‌ను టెలికాస్ట్ చేయడంలో దూరదర్శన్ దూరంగా ఉంటుందని ప్రసారభారతి స్పష్టం చేసింది. Consequent to the announcement by @meaindia, @ddsportschannel will not telecast live the Opening and Closing ceremonies of the Winter Olympics being held in Beijing. https://t.co/sSP1EX9pSQ — Shashi Shekhar Vempati शशि शेखर (@shashidigital) February 3, 2022 పదహారు రోజులపాటు బీజింగ్ వేదికగా శీతాకాల ఒలింపిక్స్ జరగున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మునుపెన్నడూ లేనంతగా అథ్లెటిక్స్ మీద ఆంక్షలు విధించింది. అంతేకాదు చైనా చట్టాల మీద, రూల్స్‌కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే.. శిక్ష తప్పదని హెచ్చరించింది బీజింగ్ ఆర్గనైజింగ్ కమిటీ. అంతేకాదు నిరసనలు తెలిపే హక్కును తొలగిస్తూ.. అందుకు సంబంధించిన పోడియంలను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. -
చైనా టూర్‌కు ముందు ఇమ్రాన్ ఖాన్‌కు చేదు అనుభవం!
చైనా పర్యటనకు ముందు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. వేర్పాటువాదులు బలూచిస్తాన్‌లోని రెండు మిలిటరీ బేస్‌ల మీద దాడి చేసి.. పాక్ సైనికులను మట్టుబెట్టారు. అయితే ఈ నష్టంపై చైనాకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఇమ్రాన్‌కు ఎదురైంది. శుక్రవారం(ఫిబ్రవరి 4) నుంచి మొదలుకాబోయే వింటర్ ఒలింపిక్ గేమ్స్ కోసం బీజింగ్(చైనా)కు వెళ్తున్నాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. పనిలో పనిగా మరో రెండు రోజులు అక్కడే ఉండి వాణిజ్యపరమైన ఒప్పందాలపై చర్చించనున్నారు. చైనా పెట్టుబడులు ఎక్కువగా బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోనే పెడుతుందన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే తాజా దాడులపై చైనాకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురు కానుంది. మరోవైపు రాత్రికి రాత్రే జరిగిన ఈ దాడితో పాటు గత మూడు నెలల పరిణామాలపై పాక్ పీఎం కార్యాలయాన్ని చైనా ప్రభుత్వం వివరణ కోరినట్లు సమాచారం. ఇక దాడికి తామే బాధ్యులమంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. సూసైడ్ బాంబర్ ఎటాక్‌లో యాభై మందికి పైగా చనిపోయినట్లు ప్రకటించగా.. తమ తరపున నష్టం మాత్రం ఐదుగురు అని పాక్ సైన్యం ప్రకటించుకుంది. చైనా పర్యటన నేపథ్యంలోనే తాము ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టం చేసింది. దోపిడీకి ప్రతీకారంగానే.. బలూచ్ గెరిల్లాలు.. ప్రత్యేక రాష్ట్ర నినాదంతో పాక్ ప్రభుత్వంతో పోరాడుతున్నాయి. బలూచిస్థాన్‌లో గ్యాస్, విలువైన ఖనిజ సంపద ఉందని, పాక్ ప్రభుత్వం వాటిని అప్పనంగా చైనాకు కట్టబెడుతోందన్నది వాళ్ల అభ్యంతరం. తమ ప్రాంతం అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటోందని ఆరోపిస్తోంది. అందుకే చైనా పెట్టుబడులు పెట్టిన ప్రాజెక్టుల మీదే వేర్పాటువాదులు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో చైనా ఉద్యోగులు చనిపోతుండగా.. చైనా ఒత్తిడి మేరకు పాక్ సైన్యమోహరింపును ఎక్కువ చేస్తోంది. ఇక బలూచిస్తాన్ చోరబాటుదారుల అంశంలోనూ పాక్ భారత్ మీదే ఆరోపణలు చేస్తోంది. భారత్ దన్నుతోనే వాళ్లు చెలరేగిపోతున్నారంటూ స్టేట్మెంట్లు ఇస్తున్న విషయం తెలిసిందే. -
చైనాకు కొంచెమైనా సిగ్గు ఉందా?
ఒకవైపు కరోనా కేసులు దాచి పెడుతూ.. ఎలాగైనా వింటర్ ఒలింపిక్స్ వేడుకల్ని నిర్వహించాలని చైనా తాపత్రయపడుతోంది. ఈ క్రమంలో సరిహద్దు అంశాన్ని కెలికి మరీ విమర్శలు ఎదుర్కొంటోంది. చైనా తాజాగా చేసిన పనిని అగ్రరాజ్యం తీవ్రంగా ఖండించింది. బుధవారం వింటర్ ఒలింపిక్ టార్చ్ రిలేను నిర్వహించిన ఆతిథ్య చైనా.. టార్చ్‌బేరర్‌గా క్వీ ఫబోవోను ఎంచుకుంది. ఇతను గల్వాన్ లోయ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన సీపీఏల్ఏ కమాండర్. ఈ విషయాన్ని డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన షిన్జియాంగ్ మిలటరీ కమాండర్, గల్వాన్ లోయ వీరుడు క్వీ ఫబోవో.. బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు వాంగ్ మింగ్‌తో కలిసి ఒలింపిక్ జ్యోతిని పట్టుకుని రిలేను ప్రారంభించారని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. కాగా, ఈ చర్యను అమెరికా తీవ్రంగా ఖండించింది. ‘‘ఇది సిగ్గుమాలిన పని. గల్వాన్ లోయ దాడిలో పాల్గొన్న వ్యక్తిని.. అదీ ఉయిగర్ల ఊచకోతకు కారణమైన వ్యక్తి టార్చ్ బేరర్‌గా ఎంచుకోవడం వెనుక ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపింది. భారత సార్వభౌమత్వానికి, ఉయిగర్ల స్వేచ్ఛకు అమెరికా ఎప్పుడూ మద్ధతు ఇస్తూనే ఉంటుంది’’ అని యూఎస్ సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ర్యాంకింగ్ మెంబర్ ఈ ఉదయం ఒక ట్వీట్ చేశారు. ఇక, శీతాకాల ఒలింపిక్స్‌ను భారత్ బహిష్కరించనప్పటికీ.. ప్రారంభ వేడుకలు సహా ఒలింపిక్ కార్యక్రమానికి మన దేశం నుంచి ఎవ్వర్నీ పంపడంలేదు. It's shameful that #Beijing chose a torchbearer for the #Olympics2022 who's part of the military command that attacked #India in 2020 and is implementing #genocide against the #Uyghurs. The U.S. will cont. to support #Uyghur freedoms & the sovereignty of India. — Senate Foreign Relations Committee Ranking Member (@SenateForeign) February 3, 2022 నష్టం ఎక్కువే! భారత్ సైన్యంతో గల్వాన్ లోయలో 2020 జూన్ 15న జరిగిన ఘర్షణల్లో 40 మందికిపైగా సీపీఎల్ఏ జవాన్లు చనిపోయినా.. పరువు పోతుందనే భయంతో నలుగురు మాత్రమే మరణించారని డ్రాగన్ తక్కువచేసి చెప్పింది. నలుగురు సైనికులకు మరణానంతరం గత సంవత్సరం గౌరవ బిరుదులు, ఫస్ట్-క్లాస్ మెరిట్ పతకాలను అందజేసింది. గతంలో రష్యా ఏజెన్సీలు చైనా నష్టంపై ఒక ప్రకటన చేయగా.. తాజాగా ఆస్ట్రేలియా పేపర్ ఒకటి ఏడాది విచారణ తర్వాత ఆ మరణాల సంఖ్య ఎక్కువేనని ప్రకటించింది. చీకట్లో శీతల వరద ప్రవాహాంలో పడి చాలామంది సైనికులు కొట్టుకు పోయి ఉంటారని, కానీ, చైనా ఆ విషయాన్ని దాస్తోందని ఆ వార్తా పత్రిక.. ఈ మేరకు చైనా నుంచే పలు ఆధారాలను సేకరించినట్లు మరీ వెల్లడించింది. ఇక గల్వాన్ ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారైన సంగతి తెలిసిందే. చదవండి: షిన్జియాంగ్ కాదు మొత్తం చైనాకే ముడిపెట్టిన బైడెన్ -
భారత జట్టు మేనేజర్‌కు కరోనా
Beijing Winter Olympics 2022: వింటర్ ఒలింపిక్స్ కోసం ఆరుగురు సభ్యుల భారత బృందం చైనాకు చేరుకున్న తర్వాత ఒకరికి కరోనా సోకింది. జట్టు మేనేజర్ మొహమ్మద్ అబ్బాస్ వాని కోవిడ్ పాజిటివ్‌గా తేలారు. ఫిబ్రవరి 4నుంచి 20 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. భారతదేశంనుంచి ఒకే ఒక్క ఆటగాడు, జమ్ము కశ్మీర్‌కు చెందిన స్కైయర్ ఆరిఫ్ ఖాన్ వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాడు. ప్లేయర్, మేనేజర్‌తో పాటు మరో నలుగురు బీజింగ్‌కు వెళ్లారు. -
Winter Olympics 2022: చైనాకు షాకివ్వనున్న మరో రెండు దేశాలు..
UK And Canada Boycotts China Winter Olympics: చైనా రాజధాని బీజింగ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించాలని బ్రిటన్, కెనడా దేశాలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బుధవారం ప్రకటించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరగుతుందన్న కారణంగా ఈ దేశాలు శీతాకాల విశ్వక్రీడలను బహిష్కరించాలనుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ఒలింపిక్స్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు ఇదివరకే ప్రకటించాయి. అయితే, వరుసగా ఒక్కో దేశం ఒలింపిక్స్‌ను బహిష్కరించడంపై చైనా అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. ఒలింపిక్స్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్న దేశాలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. కాగా, జపాన్, న్యూజిలాండ్ కూడా చైనా ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి కోవిడ్ ఉద్భవించిందన్న కారణంగా ఆయా దేశాలు ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజింగ్ ఒలింపిక్స్ 2022 ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 20 వరకు జరగనున్నాయి. చదవండి: IND A Tour Of SA: టీమిండియాలో ఒమిక్రాన్ కలకలం.. ఇద్దరికి పాజిటివ్..! -
అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ
US Diplomatic Boycott Of Beijing Winter Olympics: అమెరికా 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యసంబంధమైన బహిష్కరణ(డిప్లొమేటిక్ బాయ్‌కాట్) చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీసీ) పేర్కొంది. ఈ మేరకు దౌత్యవేత్తలు అయిన ప్రభుత్వ అధికారుల ఉనికి ప్రతి దేశ ప్రభుత్వానికి పూర్తిగా రాజకీయ నిర్ణయం అని అందువల్ల ఆయా దేశాల రాజకీయ తటస్థ వైఖరిని పూర్తిగా గౌరవిస్తాం అని ఐఓసీ ప్రతినిధి అన్నారు. (చదవండి: దేనికైనా రెడీ అంటూ!... సింహానికి సవాలు విసురుతూ... ఠీవిగా నుంచుంది కుక్క!!) అయితే ఈ దౌత్యపరమైన బహిష్కరణ అనేది యూఎస్ అథ్లెట్లు పోటీ పడకుండా నిరోధించే చైనా మానవ హక్కుల రికార్డుకు క్రమాంకనం చేసిన మందలింపు చర్యగా యూఎస్ అభివర్ణించింది. అంతేకాదు దౌత్యపరమైన బహిష్కరణ అంటే ఈ ఒలింపిక్ క్రీడలు ప్రారంభ, ముగింపు కార్యక్రమాల్లో అమెరికా దౌత్య అధికారులను పంపకుండా ఒలింపిక్ ప్రాధాన్యతను తగ్గించేలా చైనాతో నేరుగా ఢీ కొనే పరంపరలో అమెరికా తీసుకున్న తొలి నిర్ణయం ఇది. వాయువ్య జిన్జియాంగ్ ప్రాంతంలో ఉయ్ఘర్ ముస్లింలపై చైనా మారణకాండకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే వింటర్ ఒలింపిక్స్ క్రీడలపై ఎటువంటి నిర్ణయం తీసకువాలని వాషింగ్టన్ నెలల తరబడి తర్జనభర్జనలు పడిన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు ఐఓసీ కూడా అమెరికా ప్రభుత్వ ప్రకటన మేరకు ఒలింపిక్ క్రీడలు, అథ్లెట్ల భాగస్వామ్య రాజకీయాలకు అతీతమైనదని, పైగా దీనిని తాము స్వాగతిస్తున్నాం అని తెలపడం విశేషం. అంతేకాదు యూఎన్ జనరల్ అసెంబ్లీలో దాదాపు 193 సభ్య దేశాల ఏకాభిప్రాయంతో 173 సభ్య దేశాలు సహకారంతో ఈ తీర్మానాన్ని ఆమోదించినట్లు ఐఓసీ తెలిపింది. అయితే చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అటువంటి బహిష్కరణ అమలు చేస్తే "నిశ్చయమైన ప్రతిఘటన" ఉంటుందంటూ ముందుగానే బెదిరించింది. (చదవండి: ఆ షార్క్ చేప వాంతి చేసుకోవడంతోనే మిస్టరీగా ఉన్న హత్య కేసు చిక్కుముడి వీడింది!!) -
చైనాను వెంటాడుతున్న సమస్యలు.. రహదారులు మూసివేత!
చైనాను ఒక సమస్య పోతే మరొక సమస్య వెంటాడుతుంది. చైనాలో తిరిగి కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. వీటిని అరికట్టడం కోసం అక్కడ చైనా ఆంక్షలు కూడా విధిస్తుంది. ఈ సమస్య సమసిపోక ముందే ఆ దేశంలో భారీ కాలుష్యం కారణంగా బీజింగ్‌లోని రహదారులు, పాఠశాల ఆట స్థలాలను మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే, చైనా ఇటీవల విద్యుత్ తయారీ కోసం బొగ్గు ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడమే. ఇటీవల తీవ్ర బొగ్గు కొరత కారణంగా.. ఆ దేశంలో భారీగా విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని అరికట్టడం కోసం బొగ్గు ఉత్పత్తి, వినియోగాన్ని ఒక్కసారిగా పెంచింది. దీంతో ఉత్తర చైనాలో దట్టమైన పొగమంచు కప్పబడి ఉంది. కొన్ని ప్రాంతాల్లో 200 మీటర్ల వరకు రహదారుల మీద ఎవరు నడిచేది కూడా కనిపించడం లేదు. దీంతో ఆ దేశ వాతావరణ శాఖ.. ఫిబ్రవరిలో జరగబోయే వింటర్ ఒలింపిక్స్ 2022కు ఆతిథ్యం ఇచ్చే రాజధానిలో పాఠశాలలు, శారీరక విద్యా తరగతులు, బహిరంగ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. షాంఘై, టియాన్జిన్, హార్బిన్ తో సహా ప్రధాన నగరాలకు వెళ్లే హైవేలను మూసివేశారు. బీజింగ్‌లోని యుఎస్ రాయబార కార్యాలయం వద్ద ఒక మానిటరింగ్ స్టేషన్ ద్వారా వాయు నాణ్యతను పరిశీలించగా అక్కడ వాయు కాలుష్యం సాధారణ జనాభాకు హానికలిగించే విధంగా ఉన్నట్లు తేలింది. (చదవండి: గంగిరెద్దులకు క్యూఆర్ కోడ్.. నిర్మలా సీతారామన్ ఆసక్తికర వీడియో!) డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన స్థాయి కంటే 15పాయింట్లు అధికంగా అక్కడ వాయు కాలుష్యం ఉంది. శనివారం సాయంత్రం వరకు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని బీజింగ్ అధికారులు తెలిపారు. గ్రీన్ హౌస్ వాయువులను ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశం చైనా. ఆ దేశం విద్యుత్ తయారీ కోసం 60 శాతం వరకు బొగ్గు ఉత్పత్తి మీద ఆధారపడుతుంది. అక్టోబర్ మధ్యలో సగటు రోజువారీ బొగ్గు ఉత్పత్తి సెప్టెంబర్ చివరి కంటే 1.1 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉందని దేశంలోని ఉన్నత ఆర్థిక ప్రణాళిక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ బొగ్గు కేంద్రాలు ఈ వారం ప్రారంభంలో 112 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేశాయి అని ప్రభుత్వ ఏజెన్సీ తెలిపింది. కాలుష్యాన్ని అరికట్టడం కోసం సీఓపీ 26 సదస్సులో ప్రపంచ దేశాలు తీర్మానం చేస్తుంటే.. చైనా వారి నిర్ణయాలను పెడచెవిన పెడుతుంది. -
ఒక్క కేసు.. లాక్డౌన్లో 6 మిలియన్ల మంది ప్రజలు
City Heihe in Heilongjiang Province Under Lockdown: కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో పలు నగరాల్లో లాక్డౌన్ విధించిన చైనా.. ఇప్పుడు మరో పెద్ద నగరమైన హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని హీహెలో లాక్డౌన్ విధించింది. ఒక్క కేసు కారణంగా.. 6 మిలియన్ల మంది ప్రజలు లాక్డౌన్ అయ్యారు. వీరందరిని ఇంటి వద్దనే ఉండాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది. వింటర్ ఒలింపిక్స్ నాటికి బీజింగ్‌లో జీరో కరోనా కేసులు సాధించాలనే లక్ష్యంతో ఉంది చైనా. 2019లో తొలి కరోనా కేసు వెలువడిన నాటి నుంచి చైనాలో కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మహమ్మారి కట్టడి కోసం సరిహద్దులను మూసేసింది.. విదేశాల నుంచి ప్రయాణిలకు అనుమతించలేదు. కఠిన క్వారంటైన్, లాక్డౌన్ నియమాలు పాటిస్తూ.. జీరో కేసులు సాధించింది. (చదవండి: చైనాలో డెల్టా వేరియెంట్ భయం) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతుండగా.. చైనాలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచలోనే అత్యధిక జనాభా గల చైనాలో ప్రస్తుతం కనీసం పదకొండు ప్రావిన్సులలో కరోనా వ్యాప్తి వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో వైరస్ కట్టడి కోసం ఈ వారంలో నాలుగు మిలియన్లకు పైగా జనాభా ఉన్న లాన్జౌ నగరం, ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని ఎజిన్‌లో లాక్డౌన్ విధించింది డ్రాగన్ ప్రభుత్వం. తాజాగా గురువారం ఒక్క కొత్త కేసు నమోదవడంతో 6 మిలియన్ల జనాభా గల హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని హీహెలో అధికారులు లాక్డౌన్ విధించారు. ప్రజలు ఇంటికే పరిమితం కావాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని జనాలను హెచ్చిరించారు. ఈ క్రమంలో బస్సు, టాక్సీ సేవలను నిలిపివేసినట్లు రాష్ట్ర మీడియా తెలిపింది. వాహనాలు నగరం దాటి బయటకు వెళ్లడానికి అనుమతిలేదని పేర్కొంది. (చదవండి: మరో డ్రామాకు తెరతీసిన చైనా.. కొత్తగా సరిహద్దు చట్టం) రష్యాకు ఉత్తరాన సరిహద్దుగా ఉన్న నగరంలోని 1.6 మిలియన్ల మంది నివాసితులను పరీక్షించడంక కోసం కరోనా సోకిన వ్యక్తి సన్నిహిత పరిచయాలను గుర్తించడం ప్రారంభించినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు చైనా ఆరోగ్య శాఖ అధికారులు. ఇక చైనాలో గురువారం 23 కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారంతో పోల్చితే.. కొత్త కేసులు సంఖ్య సగం తగ్గినప్పటికి దేశంలో కఠిన నియమాలు అమలు చేస్తున్నారు. చదవండి: థర్డ్ వేవ్ ముప్పు: 5 రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ -
335 అడుగుల లోతులో రైల్వేస్టేషన్!
బీజింగ్: 2022 శీతాకాలపు ఒలింపిక్స్ ను నిర్వహించనున్న చైనా ఏర్పాట్లలో భాగంగా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కింద హై స్పీడ్ రైల్వేస్టేషన్ నిర్మించాలని నిర్ణయించింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉండే బద్లింగ్ ప్రాంతంలో స్టేషన్ ను నిర్మిస్తామని చైనా ప్రకటించింది. భూమిపై భాగం నుంచి 335 అడుగుల లోతులో ఐదు ఫుట్ బాల్ మైదానాల విస్తీర్ణంలో రైల్వే స్టేషన్ నిర్మాణం ఉంటుందని చైనా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. స్టేషన్ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే భూ అంతర్భాగంలో ఉన్న అతి పెద్ద రైల్వేస్టేషన్, అతి పెద్ద హైస్పీడ్ రైల్వేస్టేషన్ గా పేరుగాంచుతుందని పలు పేపర్లు పేర్కొన్నాయి. మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ రైల్వేస్టేషన్ నుంచి బీజింగ్, ఝాంజియాకో నగరాలకు రైళ్ల మార్గాలను ప్రస్తుతం నిర్మిస్తున్నారు. ఈ రెండు నగరాల్లోనే చైనా శీతాకాలపు ఒలింపిక్స్ ను నిర్వహించనుంది. కాగా, రైల్వేస్టేషన్ నిర్మాణాన్ని 2019కల్లా పూర్తి చేసేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది.