'నరకంలా అనిపిస్తుంది.. పెట్టిందే పెట్టి మమ్మల్ని చంపుతున్నారు' | Winter Olympics Russian Athlete Complains Inedible Food Crying Everyday | Sakshi
Sakshi News home page

Beijing Winter Olympics: 'నరకంలా అనిపిస్తుంది.. పెట్టిందే పెట్టి మమ్మల్ని చంపుతున్నారు'

Published Tue, Feb 8 2022 4:31 PM | Last Updated on Tue, Feb 8 2022 8:12 PM

Winter Olympics Russian Athlete Complains Inedible Food Crying Everyday - Sakshi

బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ క్రీడాకారుల పాలిట శాపంగా మారాయి. జీరో కరోనా కేసులు ఉండాలనే ఉద్దేశంతో ఆ దేశ ప్రభుత్వం క్రీడాకారులపై చూపిస్తున్న పైశాచికం తారాస్థాయికి చేరింది. బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు పొరపాటున కరోనా సోకిందే ఇక అంతే సంగతులు. ఐసోలేషన్‌ పేరుతో చైనా అధికారులు క్రీడాకారులకు చుక్కలు చూపిస్తున్నారు. అది ఎంత దారుణంగా ఉందో ఒక క్రీడాకారిణి తన మాటల్లో వర్ణించింది. రష్యాకు చెందిన వలేరియా వాస్నేత్సోవా అనే అథ్లెట్‌ తమ దయనీయ పరిస్థితిని ట్విటర్‌ ద్వారా చెప్పుకొచ్చింది.

చదవండి: Beijing Winter Olympics 2022: వింటర్‌ ఒలింపిక్స్‌పై కరోనా పంజా

''జీరో కరోనా కేసులు ఉండాలనే లక్ష్యంతో బీజింగ్‌ ఒలింపిక్స్‌కు వచ్చిన ఆటగాళ్లకు రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పొరపాటున పాజిటివ్‌ వస్తే ఐసోలేషన్‌కు వెళ్లాల్సిందే. ఆ బాధితుల్లో నేను ఒకదానిని. కరోనా పాజిటివ్‌ రావడంతో ఐసోలేషన్‌లో ఉంచారు. మాములుగా ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తులకు మంచి ఆహారం అందించడం చూస్తాం. కానీ మాకు మాత్రం మూడు పుటలా(బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌) ఒకే రకమైన ఆహారం.. ఐదు రోజుల పాటు ఇచ్చారు. ఆ ఆహారం తినాలంటేనే విసుగు పుట్టేది. దెబ్బకు నా ఎముకలన్ని బయటకు పొడుచుకొచ్చేలాగా అనిపించేది. ఒక రకంగా నరకంలా కనిపించే ఆ ఐసోలేషన్‌తో మమ్నల్ని చంపుతున్నారు'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

''బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌కు వస్తే.. ఇక్కడి అధికారులు మాకు చుక్కలు చూపిస్తున్నారు. సరైన వసతి కల్పించలేదు.. ఐసోలేషన్‌ పేరుతో మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు. చిన్నవిగా ఉండే ఐసోలేషన్‌ గదులు.. నాణ్యత లేని ఆహారం.. పీసీఆర్‌ టెస్టులు చేస్తున్నప్పటికి వాటి ఫలితాలు క్రీడాకారులకు అందించకపోవడం లాంటివి చేసి క్రీడాకారులను జైళ్లో బంధించినట్లుగా చేశారని'' జర్మనీ జట్టు హెడ్‌ డిర్క్‌ స్కిమ్మిలెప్‌ఫెన్నింగ్‌ పేర్కొన్నారు.
చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో అరుదైన ఘనత.. సోషల్‌ మీడియాను వదల్లేదు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement