Russian athletes
-
'నరకంలా అనిపిస్తుంది.. పెట్టిందే పెట్టి మమ్మల్ని చంపుతున్నారు'
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ క్రీడాకారుల పాలిట శాపంగా మారాయి. జీరో కరోనా కేసులు ఉండాలనే ఉద్దేశంతో ఆ దేశ ప్రభుత్వం క్రీడాకారులపై చూపిస్తున్న పైశాచికం తారాస్థాయికి చేరింది. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు పొరపాటున కరోనా సోకిందే ఇక అంతే సంగతులు. ఐసోలేషన్ పేరుతో చైనా అధికారులు క్రీడాకారులకు చుక్కలు చూపిస్తున్నారు. అది ఎంత దారుణంగా ఉందో ఒక క్రీడాకారిణి తన మాటల్లో వర్ణించింది. రష్యాకు చెందిన వలేరియా వాస్నేత్సోవా అనే అథ్లెట్ తమ దయనీయ పరిస్థితిని ట్విటర్ ద్వారా చెప్పుకొచ్చింది. చదవండి: Beijing Winter Olympics 2022: వింటర్ ఒలింపిక్స్‌పై కరోనా పంజా ''జీరో కరోనా కేసులు ఉండాలనే లక్ష్యంతో బీజింగ్ ఒలింపిక్స్‌కు వచ్చిన ఆటగాళ్లకు రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పొరపాటున పాజిటివ్ వస్తే ఐసోలేషన్‌కు వెళ్లాల్సిందే. ఆ బాధితుల్లో నేను ఒకదానిని. కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్‌లో ఉంచారు. మాములుగా ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తులకు మంచి ఆహారం అందించడం చూస్తాం. కానీ మాకు మాత్రం మూడు పుటలా(బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్) ఒకే రకమైన ఆహారం.. ఐదు రోజుల పాటు ఇచ్చారు. ఆ ఆహారం తినాలంటేనే విసుగు పుట్టేది. దెబ్బకు నా ఎముకలన్ని బయటకు పొడుచుకొచ్చేలాగా అనిపించేది. ఒక రకంగా నరకంలా కనిపించే ఆ ఐసోలేషన్‌తో మమ్నల్ని చంపుతున్నారు'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ''బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు వస్తే.. ఇక్కడి అధికారులు మాకు చుక్కలు చూపిస్తున్నారు. సరైన వసతి కల్పించలేదు.. ఐసోలేషన్ పేరుతో మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు. చిన్నవిగా ఉండే ఐసోలేషన్ గదులు.. నాణ్యత లేని ఆహారం.. పీసీఆర్ టెస్టులు చేస్తున్నప్పటికి వాటి ఫలితాలు క్రీడాకారులకు అందించకపోవడం లాంటివి చేసి క్రీడాకారులను జైళ్లో బంధించినట్లుగా చేశారని'' జర్మనీ జట్టు హెడ్ డిర్క్ స్కిమ్మిలెప్ఫెన్నింగ్ పేర్కొన్నారు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో అరుదైన ఘనత.. సోషల్ మీడియాను వదల్లేదు Russian biathlete Valeria Vasnetsova posted a photo of one of the unappetizing meals at Beijing Games on Instagram, showing plain pasta, some potatoes, charred meat, and no vegetables. She claims the same meal was served for “breakfast, lunch and dinner for five days already.” pic.twitter.com/T9rCF7tUbM — Byron Wan (@Byron_Wan) February 6, 2022 -
అటు నిషేధం... ఇటు బహుమతి
మాస్కో: డోపింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇటీవలి రియో పారాలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రీడల ప్రారంభోత్సవంలో మాత్రం అనూహ్యంగా రష్యా పతాకం కనిపించింది. బెలారస్ క్రీడా, పర్యాటక శాఖకు చెందిన ప్రతినిధి ఆండ్రే ఫొమోచ్కిన్ ఆ దేశ అథ్లెట్లకు సంఘీభావంగా పతాకాన్ని చేతపట్టి పరేడ్‌లో పాల్గొన్నాడు. దీనికి ఎంతగానో సంతోషపడిన రష్యా అతడికి ఏకంగా ఉచితంగా అపార్ట్‌మెంట్‌ను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జకరోవా ధృవీకరించారు. అన్ని విషయాలను పూర్తిగా ఇప్పుడు చెప్పలేకపోయినా అపార్ట్మెంట్ ఇచ్చేది మాత్రం నిజమేనని స్పష్టం చేశారు. మరోవైపు ఫొమోచ్కిన్ చర్యకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. నిషేధానికి గురైన దేశ పతాకాన్ని ప్రదర్శించినందుకు నిర్వాహకులు అతడి గుర్తింపును రద్దుచేసి స్వదేశానికి పంపారు. -
'300 టెస్టులను ధైర్యంగా ఎదుర్కొన్నాం'
రియో ఒలింపిక్స్ నేపథ్యంలో రష్యా డోపింగ్ టెస్టుల వివాదంలో కొన్ని క్రీడాంశాలలో గట్టెక్కగా మరికొన్ని ఈవెంట్లలో పోటీలో పాల్గొనకుండానే ఇంటిబాట పట్టింది. ముఖ్యంగా రష్యా అథ్లెట్లు ఒక్కో డోపింగ్ టెస్టులో పదుల సంఖ్యలో విఫలమైన విషయం తెలిసిందే. ఈ విషయంపై రష్యా క్రీడాశాఖ మంత్రి విటాలీ ముక్తో కొన్ని ఆసక్తికర విషయాలను శనివారం మీడియాకు వెల్లడించారు. ఏది ఏమైతేనేం రియో ఒలింపిక్స్ సందర్భంగా ఆటగాళ్లకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా మేము ఆ అవరోధాలను సమర్థవంతంగా ఎదర్కొని ముందుకు సాగిపోతున్నామని పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్ సందర్భంగా రష్యా అథ్లెట్లు 300 కంటే ఎక్కువ డోపింగ్ టెస్టులను దిగ్విజయంగా ఎదుర్కొందన్నారు. అయితే జూలైలో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) లో కీలక సభ్యుడిగా ఉన్న కెనడా ప్రొఫెసర్ రిచర్డ్ మెక్ లారెన్ దర్యాప్తు జరిపి రష్యా అథ్లెట్ల డోపింగ్ బాగోతాన్ని బయటపెట్టగా, కొందరు అథ్లెట్లపై నిషేధం వేటు పడింది. వాడా నివేదిక కంటే ముందుగానే తీసుకున్న శాంపిల్స్ టెస్టు చేయగా, వాటి ఫలితాల ఆధారంగానే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ) మా ఆటగాళ్లకు అవకాశం కల్పించిందని క్రీడాశాఖ మంత్రి వెల్లడించారు. -
19 మంది రష్యా రోయర్లపై నిషేధం
లుసానే: రియో ఒలింపిక్స్‌కు సమయం దగ్గరపడుతున్నా... రష్యా అథ్లెట్లపై నిషేధం మాత్రం ఆగడం లేదు. తాజాగా 19 మంది రోయర్లను గేమ్స్‌లో పాల్గొనకుండా ప్రపంచ రోయింగ్ సమాఖ్య (ఎఫ్ఐఎస్ఏ) అడ్డుకుంది. ఐదుగురు కనోయిస్ట్లు, ఇద్దరు మోడ్రన్ పెంటాథ్లాన్ అథ్లెట్లతో కలిపి గత ఆదివారం వరకు మొత్తం 41 మందిపై నిషేధం విధించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లతో కలుపుకుంటే ప్రస్తుతం ఈ సంఖ్య 108కి చేరింది. రష్యా నుంచి 28 మంది రోయర్లు రియోకు అర్హత సాధిం చగా, ఇందులో ఇప్పటివరకు మొత్తం 22 మందిపై అనర్హత వేటు పడిందని ఎఫ్ఐఎస్ఏ వెల్లడించింది. జూడో, ఈక్వెస్ట్రియాన్, టెన్నిస్, షూటింగ్ క్రీడాకారులు మాత్రం నిషేధం నుంచి తప్పించుకున్నారు. -
రష్యా ప్రాతినిధ్యంపై భిన్న వాదనలు
లాసానే: రష్యాను ఒలింపిక్స్ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తిరస్కరించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి ప్రభుత్వమే డోపింగ్ చేయించిందని తేలడంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఓ వర్గం వాదిస్తోంది. వాడాతో పాటు అమెరికా, న్యూజిలాండ్ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీలు ఈ విషయంలో ముందున్నాయి. మరోవైపు ఏకపక్షంగా అందరిపై నిషేధం విధిస్తే డోపింగ్‌కు పాల్పడని అథ్లెట్లను కూడా అన్యాయంగా శిక్షించినట్టు అవుతుందని యూరోపియన్ ఒలింపిక్ కమిటీ, జాతీయ ఒలింపిక్ కమిటీ సంఘం (ఏఎన్ఓసీ)లు వాదిస్తున్నాయి. రష్యా అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొనాలా? వద్దా? అనే విషయాన్ని ఆయా క్రీడా సమాఖ్యలకే వదిలేస్తూ ఐఓసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే గేమ్స్‌లో పాల్గొనడానికి ముందు తాము డోపింగ్‌కు పాల్పడలేదని ఆట గాళ్లు తమ క్రీడా సంఘాల నుంచి క్లియరెన్స్ పొందాల్సి ఉంటుంది.