గల్వాన్ లోయ ఘర్షణల్లో పాల్గొన్న కమాండర్, ఉయిగర్ల ఊచకోతలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తిని టార్చ్‌బేరర్‌గా అర్హత ఇవ్వడం ద్వారా పెను వివాదానికే కేంద్రం బిందువుగా మారింది వింటర్ ఒలింపిక్స్ 2022. పైపెచ్చు ఇప్పుడు అథ్లెటిక్స్‌ను స్వేచ్ఛగా మాట్లాడేందుకు వీలు లేకుండా ఆంక్షలు పెట్టింది.
ఇక గల్వాన్ లోయ ఘర్షణలకు కారణమైన సీపీఏల్‌ఏ కమాండర్ క్వీ ఫబోవోను టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడంపై భారత్, చైనా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సరిహద్దు అంశాన్ని కెలిగి.. రాజకీయం చేయాలని చూస్తోందని భారత్ అంటోంది. అందుకే వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత రాయబారి, దౌత్యవేత్తలు పాల్గొనడని స్పష్టం చేసింది. ఈ బహిష్కరణతో పాటు ఒలింపిక్స్ ఈవెంట్స్‌ను టెలికాస్ట్ చేయడంలో దూరదర్శన్ దూరంగా ఉంటుందని ప్రసారభారతి స్పష్టం చేసింది.
Consequent to the announcement by @meaindia, @ddsportschannel will not telecast live the Opening and Closing ceremonies of the Winter Olympics being held in Beijing. https://t.co/sSP1EX9pSQ
— Shashi Shekhar Vempati शशि शेखर (@shashidigital) February 3, 2022
పదహారు రోజులపాటు బీజింగ్ వేదికగా శీతాకాల ఒలింపిక్స్ జరగున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మునుపెన్నడూ లేనంతగా అథ్లెటిక్స్ మీద ఆంక్షలు విధించింది. అంతేకాదు చైనా చట్టాల మీద, రూల్స్‌కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే.. శిక్ష తప్పదని హెచ్చరించింది బీజింగ్ ఆర్గనైజింగ్ కమిటీ. అంతేకాదు నిరసనలు తెలిపే హక్కును తొలగిస్తూ.. అందుకు సంబంధించిన పోడియంలను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment