చైనా పర్యటనకు ముందు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. వేర్పాటువాదులు బలూచిస్తాన్‌లోని రెండు మిలిటరీ బేస్‌ల మీద దాడి చేసి.. పాక్ సైనికులను మట్టుబెట్టారు. అయితే ఈ నష్టంపై చైనాకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఇమ్రాన్‌కు ఎదురైంది.
శుక్రవారం(ఫిబ్రవరి 4) నుంచి మొదలుకాబోయే వింటర్ ఒలింపిక్ గేమ్స్ కోసం బీజింగ్(చైనా)కు వెళ్తున్నాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. పనిలో పనిగా మరో రెండు రోజులు అక్కడే ఉండి వాణిజ్యపరమైన ఒప్పందాలపై చర్చించనున్నారు. చైనా పెట్టుబడులు ఎక్కువగా బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోనే పెడుతుందన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే తాజా దాడులపై చైనాకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురు కానుంది.
మరోవైపు రాత్రికి రాత్రే జరిగిన ఈ దాడితో పాటు గత మూడు నెలల పరిణామాలపై పాక్ పీఎం కార్యాలయాన్ని చైనా ప్రభుత్వం వివరణ కోరినట్లు సమాచారం. ఇక దాడికి తామే బాధ్యులమంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. సూసైడ్ బాంబర్ ఎటాక్‌లో యాభై మందికి పైగా చనిపోయినట్లు ప్రకటించగా.. తమ తరపున నష్టం మాత్రం ఐదుగురు అని పాక్ సైన్యం ప్రకటించుకుంది. చైనా పర్యటన నేపథ్యంలోనే తాము ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టం చేసింది.
దోపిడీకి ప్రతీకారంగానే..
బలూచ్ గెరిల్లాలు.. ప్రత్యేక రాష్ట్ర నినాదంతో పాక్ ప్రభుత్వంతో పోరాడుతున్నాయి. బలూచిస్థాన్‌లో గ్యాస్, విలువైన ఖనిజ సంపద ఉందని, పాక్ ప్రభుత్వం వాటిని అప్పనంగా చైనాకు కట్టబెడుతోందన్నది వాళ్ల అభ్యంతరం. తమ ప్రాంతం అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటోందని ఆరోపిస్తోంది. అందుకే చైనా పెట్టుబడులు పెట్టిన ప్రాజెక్టుల మీదే వేర్పాటువాదులు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో చైనా ఉద్యోగులు చనిపోతుండగా.. చైనా ఒత్తిడి మేరకు పాక్ సైన్యమోహరింపును ఎక్కువ చేస్తోంది.
ఇక బలూచిస్తాన్ చోరబాటుదారుల అంశంలోనూ పాక్ భారత్ మీదే ఆరోపణలు చేస్తోంది. భారత్ దన్నుతోనే వాళ్లు చెలరేగిపోతున్నారంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment