Balochistan province
-
Pakistan: లోయలో పడిన బస్సు.. 17 మంది మృత్యువాత
కరాచీ: పాకిస్తాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. 38 మంది గాయపడ్డారు. సింధ్, బలోచిస్తోన్ ప్రావిన్స్‌ల సరిహద్దుల్లోని హుబ్ పట్టణ సమీపంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సింధ్ ప్రావిన్స్‌లోని తట్టా పట్టణానికి చెందిన కొందరు బలోచిస్తాన్‌లోని హుబ్ పట్టణంలోని షా నూరానీ దర్గాకు బుధవారం మధ్యాహ్నం బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు రాత్రి 8 గంటల సమయంలో అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. క్షతగాత్రులను అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరాచీ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఇరాన్‌పై పాక్ ప్రతీకార దాడి
ఇస్లామాబాద్: ఇరాన్ బుధవారం జరిపిన దాడులకు గురువారం పాక్ ప్రతీకారం తీర్చుకుంది. సరిహద్దులకు సమీపంలోని ఇరాన్ సియెస్తాన్–బలోచిస్తాన్ ప్రావిన్స్‌లో దాడులు జరిపింది. ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా రాకెట్లు, డ్రోన్లతో చేపట్టిన ‘ప్రెసిషన్ మిలటరీ స్ట్రయిక్స్’లో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్లకు చెందిన 9 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం ఉందని పాక్ ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్‌కు తమ నిరసన తెలిపినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. పాక్ దాడుల్లో ఇరానేతర జాతీయులైన ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు చనిపోయినట్లు అధికార వార్తా సంస్థ ఇర్నా పేర్కొంది. పాక్ కేంద్రంగా పనిచేస్తూ తమ దేశంలో ఉగ్రదాడులకు తెగబడుతున్న జైష్ అల్–అదిల్ ఉగ్రసంస్థ స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణి దాడులతో బుధవారం విరుచుకుపడింది. ఈ దాడులకు నిరసనగా పాక్ తమ దేశంలోని ఇరాన్ రాయబారిని బహిష్కరించడంతోపాటు ఇరాన్‌లోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ భూభాగంపై ఇరాన్ దాడులను భారత్ సమర్థించింది. ఉగ్రవాదాన్ని అంతమొందించాలన్న తమ వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేసింది. ఇది ఆ రెండు దేశాలకు సంబంధించిన విషయమే అయినప్పటికీ, దేశాలు తమ ఆత్మరక్షణ కోసం తీసుకునే చర్యలను భారత్ అర్థం చేసుకుందని పేర్కొంది. -
పాకిస్తాన్లో దారుణం.. చైనీయులపై కాల్పులు..
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాక్‌లో ఉన్న చైనా ఇంజినీర్ల వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. కాగా, ఈ ఘటనలో చైనా ఇంజినీర్లు చనిపోయినట్టు.. భద్రతా సిబ్బంది ఒకరు గాయపడినట్లు సమాచారం. ఇక, దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులను వారు మట్టుబెట్టారు. వివరాల ప్రకారం.. బలూచిస్తాన్‌లోని గ్వాదర్ వద్ద చైనాకు చెందిన ఇంజినీర్ల వాహనాలపై ఉగ్రదాడి జరిగింది. స్థానికంగా ఉన్న ఫకీర్ కాలనీ వంతెనపైకి చైనా ఇంజినీర్లకు చెందిన ఏడు వాహనాలు చేరుకోగానే రెబల్స్ కాల్పులు జరిపారు. దాదాపు రెండు గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక, ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక చైనా ఇంజినీర్లు చనిపోయినట్టు తెలుస్తోంది. భద్రతా సిబ్బంది ఒకరు గాయపడినట్లు అక్కడి మీడియా పేర్కొంది. 7 vehicles of Chinese engineers came under intense attack in Gwadar, #Balochistan According to local media, several Chinese engineers have been killed. This is an earlier video of Baloch fighters warning #China https://t.co/BhC5NZu1E0 pic.twitter.com/UKuG4itS1R — Eternal Optimist (@etoptimist) August 13, 2023 చైనా అలర్ట్.. మరోవైపు.. చైనా భద్రతా సిబ్బంది ఎదురు దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం ముందురోజు(ఆగస్టు 14)న ఉగ్రవాదుల దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ దాడితో పాక్‌లో ఉన్న చైనా దౌత్యకార్యాలయం అప్రమత్తమైపోయింది. పాక్‌లోని బలూచిస్తాన్, సింధ్ ప్రావిన్స్‌ల్లోని చైనీయులు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇళ్లలోనే ఉండిపోవాలని సూచించింది. కాగా, ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో చైనీయులపై దాడులు ఎక్కువయ్యాయి. గ్వాదర్ పోర్టుపై చైనా పెత్తనం చేయడంతో స్థానికులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దాడులు జరగడం గమనార్హం. ఇది కూడా చదవండి: దేవాలయంపై దాడి.. గోడలపై ఖలిస్థానీల నినాదాలు.. -
చైనా టూర్‌కు ముందు ఇమ్రాన్ ఖాన్‌కు చేదు అనుభవం!
చైనా పర్యటనకు ముందు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. వేర్పాటువాదులు బలూచిస్తాన్‌లోని రెండు మిలిటరీ బేస్‌ల మీద దాడి చేసి.. పాక్ సైనికులను మట్టుబెట్టారు. అయితే ఈ నష్టంపై చైనాకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఇమ్రాన్‌కు ఎదురైంది. శుక్రవారం(ఫిబ్రవరి 4) నుంచి మొదలుకాబోయే వింటర్ ఒలింపిక్ గేమ్స్ కోసం బీజింగ్(చైనా)కు వెళ్తున్నాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. పనిలో పనిగా మరో రెండు రోజులు అక్కడే ఉండి వాణిజ్యపరమైన ఒప్పందాలపై చర్చించనున్నారు. చైనా పెట్టుబడులు ఎక్కువగా బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోనే పెడుతుందన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే తాజా దాడులపై చైనాకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురు కానుంది. మరోవైపు రాత్రికి రాత్రే జరిగిన ఈ దాడితో పాటు గత మూడు నెలల పరిణామాలపై పాక్ పీఎం కార్యాలయాన్ని చైనా ప్రభుత్వం వివరణ కోరినట్లు సమాచారం. ఇక దాడికి తామే బాధ్యులమంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. సూసైడ్ బాంబర్ ఎటాక్‌లో యాభై మందికి పైగా చనిపోయినట్లు ప్రకటించగా.. తమ తరపున నష్టం మాత్రం ఐదుగురు అని పాక్ సైన్యం ప్రకటించుకుంది. చైనా పర్యటన నేపథ్యంలోనే తాము ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టం చేసింది. దోపిడీకి ప్రతీకారంగానే.. బలూచ్ గెరిల్లాలు.. ప్రత్యేక రాష్ట్ర నినాదంతో పాక్ ప్రభుత్వంతో పోరాడుతున్నాయి. బలూచిస్థాన్‌లో గ్యాస్, విలువైన ఖనిజ సంపద ఉందని, పాక్ ప్రభుత్వం వాటిని అప్పనంగా చైనాకు కట్టబెడుతోందన్నది వాళ్ల అభ్యంతరం. తమ ప్రాంతం అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటోందని ఆరోపిస్తోంది. అందుకే చైనా పెట్టుబడులు పెట్టిన ప్రాజెక్టుల మీదే వేర్పాటువాదులు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో చైనా ఉద్యోగులు చనిపోతుండగా.. చైనా ఒత్తిడి మేరకు పాక్ సైన్యమోహరింపును ఎక్కువ చేస్తోంది. ఇక బలూచిస్తాన్ చోరబాటుదారుల అంశంలోనూ పాక్ భారత్ మీదే ఆరోపణలు చేస్తోంది. భారత్ దన్నుతోనే వాళ్లు చెలరేగిపోతున్నారంటూ స్టేట్మెంట్లు ఇస్తున్న విషయం తెలిసిందే. -
మత గురువు నుంచి తాలిబన్ చీఫ్‌గా..
కాబూల్: ముల్లా హైబతుల్లా అఖుంద్జాదా.. కల్లోలిత అఫ్గానిస్తాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇస్లాంపై అచంచల విశ్వాసం, షరియా చట్టంపై అపారమైన పరిజ్ఞానమే ఆయనకు అత్యున్నత పదవి దక్కేలా చేసిందని చెప్పొచ్చు. 60 సంవత్సరాల అఖుంద్జాదా అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ ప్రాంతంలో జన్మించారు. పషూ్తన్లలోని నూర్జాయ్ అనే బలమైన తెగకు చెందిన ఆయన పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో కచ్లాక్ మసీదులో 15 ఏళ్లపాటు మత గురువుగా పనిచేశారు. అనంతరం తాలిబన్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. తాలిబన్ల అత్యున్నత మత గురువుగా ఎదిగారు. 1990వ దశకంలో తాలిబన్లలో చేరిన అఖుంద్జాదాకు 1995లో తొలిసారిగా పెద్ద గుర్తింపు లభించింది. 2016లో తాలిబన్ పగ్గాలు అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక కాందహార్‌లోని తాలిబన్ మిలటరీ కోర్టులో అఖుంద్జాదాకు కీలక స్థానం దక్కింది. తర్వాత నాంగార్హర్ ప్రావిన్స్‌లో మిలటరీ కోర్టు అధినేతగా పదోన్నతి పొందారు. 2001లో అమెరికా సైన్యం దండెత్తడంతో అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనకు తెరపడింది. అప్పుడు తాలిబన్ సుప్రీంకోర్టు డిప్యూటీ చీఫ్‌గా అఖుంద్జాదా అవతరించారు. మత గురువుల మండలికి పెద్ద దిక్కుగా మారారు. 2015లో తాలిబన్ అధినేత ముల్లా మన్సూర్ తన తదుపరి నాయకుడిగా (వారసుడు) అఖుంద్జాదా పేరును ప్రకటించారు. 2016లో తాలిబన్ అధినేతగా అఖుంద్జాదా పగ్గాలు చేపట్టారు. 2017లో ఆయన పేరు ప్రఖ్యాతలు విస్తరించాయి. అఖుంద్జాదా కుమారుడు అబ్దుర్ రెహమాన్ అలియాస్ హఫీజ్ ఖలీద్(23) అప్పటికే తాలిబన్ ఆత్మాహుతి దళంలో సభ్యుడిగా పని చేసేవాడు. ఓ ఉగ్రవాద దాడిలో ఖలీద్ మరణించాడు. కనిపించడం అత్యంత అరుదు తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ తరహాలోనే అఖుంద్జాదా కూడా గోప్యత పాటిస్తుంటారు. అత్యంత అరుదుగా జనం ముందుకు వస్తుంటారు. తాలిబన్లు అఖుంద్జాదా ఫొటోను ఇప్పటిదాకా కేవలం ఒక్కటే విడుదల చేశారు. బహిరంగంగా కనిపించకపోయినా, మాట్లాడకపోయినా తాలిబన్లకు ఆయన మాటే శిలాశాసనం. అఖుంద్జాదా ప్రస్తుతం కాందహార్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. సుప్రీం లీడర్‌గా అఫ్గానిస్తాన్ ప్రజలకు ఎలాంటి పరిపాలన అందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. -
పాక్‌లో రోడ్డు ప్రమాదం.. 23 మంది మృతి
కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో అందులోని 23 మంది మరణించారు. వాధ్ నుంచి దాదు వైపు వేగంగా వెళ్తున్న బస్సు ఖుజ్దార్ జిల్లాలోని ఖోరి వద్ద అదుపు తప్పిబోల్తా పడింది. ఘటనాస్థలంలోనే 15 మంది మరణించారు. గాయపడిన 30 మందిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా మరో ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 23కు చేరింది. ఇంకా కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. చదవండి: తలవంచిన ఎల్‌చాపో భార్య.. నవ్వుతూ శిక్షకు సిద్ధం -
బలూచ్‌లో మారణహోమం
బలూచిస్థాన్ : నైరుతి పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్సులో సూఫీ టెంపుల్ టార్గెట్‌గా ఉగ్రవాది గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బ్లాస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఝల్ మగ్సీ టెంపుల్ ప్రాంగణంలో ఆత్మాహుతి దాడి జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. భక్తుడిలా ఆలయం వద్దకు వచ్చిన ఉగ్రవాదిని అనుమానం వచ్చిన పోలీసులు నిలువరించారు. దీంతో ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, 20 మంది గాయాలపాలైనట్లు ఓ అధికారి తెలిపారు. -
'స్వాతంత్ర్యం ఇచ్చేందుకు మేం ఒప్పుకోం'
న్యూయార్క్: బెలూచిస్తాన్ స్వాతంత్ర్యానికి తాము ఒప్పుకోబోమని అమెరికా స్పష్టం చేసింది. పాకిస్థాన్ సమైక్యతను తాము గౌరవిస్తామని అమెరికా సహాయ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ ఓ మీడియా సమావేశంలో చెప్పారు. బెలూచిస్తాన్ ప్రాంతంలో సామాన్యుల హక్కులను కాలరాస్తూ హింసాత్మక చర్యలకు పాక్ బలగాలు పాల్పడుతున్న నేపథ్యంలో అటు అక్కడ ఇతర ప్రాంతాల నుంచి కూడా బెలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం అవసరం అని డిమాండ్ పెరుగుతుంది కదా..! దీనిని మీరెలా సమర్థిస్తారు అని ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు. 'పాక్ దేశ సమైక్యతను, కలిసి ఉండటాన్ని అమెరికా ప్రభుత్వం ఎప్పటికీ గౌరవిస్తుంది. బెలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం ఇవ్వడాన్ని మేం ఏ మాత్రం అంగీకరించం' అని ఆయన అన్నారు. ప్రత్యేకంగా భారత ప్రధాని నరేంద్రమోదీ బెలూచిస్తాన్ అంశాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో మీడియా ప్రతినిధులు అమెరికా వైఖరిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. -
మందుపాతర పేలి 8 మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్ మర్వార్ ప్రాంతంలో గురువారం అర్థరాత్రి గిరిజన తెగ నాయకుడి కాన్వాయినే లక్ష్యంగా చేసుకుని ఆగంతకులు మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదంలో గిరిజన నాయకుడితోపాటు ఏడుగురు మృతిచెందారు. ఈ మేరకు శుక్రవారం మీడియా డైలీ టైమ్స్ వెల్లడించింది. అలాగే కాన్వాయినే లక్ష్యంగా చేసుకుని ఆగంతకులు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పేర్కొంది. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు. -
బస్సులో బాంబు పేలుడు : 11 మంది మృతి
క్వెట్టా : పాకిస్థాన్ బెలూచిస్థాన్‌లోని ప్రావెన్స్లో సోమవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. క్వెట్టాలోని సర్యబ్ రహదారి వద్ద బస్టాండ్‌లోని అప్పుడే కదులుతున్న బస్సులో శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణీకులు అక్కడికక్కడే మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చాలా మంది దినసరి కూలీలేనని బెలూచిస్థాన్ ప్రావెన్స్ పోలీసు ఉన్నతాధికారి అల్మీష్ ఖాన్ మంగళవారం వెల్లడించారు. నగరంలో దినసరి కూలీ పనులు చేసుకునే వారిని... వారివారి స్వస్థలాలకు తీసుకు వెళ్లేందుకు ప్రతిరోజు రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఓ బస్సు ఉంటుందని తెలిపారు. ఆ క్రమంలో వారిని తీసుకువెళ్లేందుకు అప్పుడే బయలుదేరిన బస్సులో కూలీలు ఉన్నారని చెప్పారు. బస్సుపై భాగంలో బాంబు అమర్చారని చెప్పారు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు. ఎనిమిది మంది ప్రయాణీకుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ బాంబు పేలుడును బెలూచిస్థాన్ ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. -
నిద్రే వారికి ... శాశ్వత నిద్ర అయింది
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లోని ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని 11 మంది ఊపిరాడక మరణించారని పోలీసులు గురువారం వెల్లడించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం పిష్ని జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. గత రాత్రి కుటుంబ సభ్యులంతా నిద్రకు ఉపక్రమించారు. అనంతరం ఇంట్లో గ్యాస్ లీక్ అయింది. దీంతో వారంతా ఊపిరాడక నిద్రలోనే మరణించారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఈ మేరకు స్థానిక మీడియా కథనాన్ని ప్రచురించింది. -
పాక్ సరిహద్దులో ఆత్మాహుతి దాడి: ఆరుగురు మృతి
పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ దేశ సరిహద్దుల్లోని బలూచిస్థాన్ ప్రావెన్స్ లోని చమన్ పట్టణంలో ఈ రోజు ఉదయం ఆత్మహుతి దాడిలో ఆరుగురు వ్యక్తులు మరణించారని స్థానిక మీడియా డాన్ న్యూస్ బుధవారం వెల్లడించింది. ఆ ఘటనలో అనేక మంది గాయపడ్డారని తెలిపింది. క్షతగాత్రులందరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పింది. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. కస్టమ్స్ హౌస్ వద్ద ఓ వ్యక్తి తనకు తాను పేల్చుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించింది. అయితే ఆ ఘటనకు పాల్పడింది తామే అని ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని డాన్ న్యూస్ తెలిపింది. -
పాకిస్థాన్ భూకంపం ఘటనలో 359 చేరిన మృతులు
పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 359కి చేరిందని ఉన్నతాధికారి జన్ మహ్మద్ బులెది శనివారం ఇక్కడ వెల్లడించారు. ఆ ఘటనలో గాయపడిన వారు 755 మంది వరకు ఉన్నారని తెలిపారు. వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. భుకంపం సంభవించిన మారుమూల ప్రాంతాల్లో భద్రత సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారని వివరించారు. భూకంపం ధాటికి బెలూచిస్థాన్ ప్రావెన్స్లోని అవారన్, కచ్ జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయని బులెది తెలిపారు. అయితే రెండు జిల్లాలో మృతులు, గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లోమంగళవారం భూకంపం సంభవించింది. రిక్టారె స్కేల్‌పై 7.7గా నమోదు అయింది. ఆ భూకంపం ధాటికి రోడ్డులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో సహాయ చర్యలు చేపట్టడానికి తీవ్ర జాప్యం ఏర్పడిన సంగతి తెలిసిందే.