పాక్ సరిహద్దులో ఆత్మాహుతి దాడి: ఆరుగురు మృతి | Suicide bombing kills six in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్ సరిహద్దులో ఆత్మాహుతి దాడి: ఆరుగురు మృతి

Published Wed, Oct 2 2013 3:25 PM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM

Suicide bombing kills six in Pakistan

పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ దేశ సరిహద్దుల్లోని బలూచిస్థాన్ ప్రావెన్స్ లోని చమన్ పట్టణంలో ఈ రోజు ఉదయం ఆత్మహుతి దాడిలో ఆరుగురు వ్యక్తులు మరణించారని స్థానిక మీడియా డాన్ న్యూస్ బుధవారం వెల్లడించింది. ఆ ఘటనలో అనేక మంది గాయపడ్డారని తెలిపింది. క్షతగాత్రులందరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పింది.

 

వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. కస్టమ్స్ హౌస్ వద్ద ఓ వ్యక్తి తనకు తాను పేల్చుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించింది. అయితే ఆ ఘటనకు పాల్పడింది తామే అని ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని డాన్ న్యూస్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement