Pakistan: లోయలో పడిన బస్సు.. 17 మంది మృత్యువాత | Pakistan: 17 Killed And 38 Others Injured In A Road Accident At Pakistan, Details Inside - Sakshi
Sakshi News home page

Pakistan Road Accident: లోయలో పడిన బస్సు.. 17 మంది మృత్యువాత

Apr 12 2024 5:55 AM | Updated on Apr 12 2024 9:38 AM

Pakistan: 17 killed, 38 others injured in a road accident at Pakistan - Sakshi

కరాచీ: పాకిస్తాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. 38 మంది గాయపడ్డారు. సింధ్, బలోచిస్తోన్‌ ప్రావిన్స్‌ల సరిహద్దుల్లోని హుబ్‌ పట్టణ సమీపంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

సింధ్‌ ప్రావిన్స్‌లోని తట్టా పట్టణానికి చెందిన కొందరు బలోచిస్తాన్‌లోని హుబ్‌ పట్టణంలోని షా నూరానీ దర్గాకు బుధవారం మధ్యాహ్నం బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు రాత్రి 8 గంటల సమయంలో అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. క్షతగాత్రులను అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరాచీ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement