piligrim deaths
-
Pakistan: లోయలో పడిన బస్సు.. 17 మంది మృత్యువాత
కరాచీ: పాకిస్తాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. 38 మంది గాయపడ్డారు. సింధ్, బలోచిస్తోన్ ప్రావిన్స్‌ల సరిహద్దుల్లోని హుబ్ పట్టణ సమీపంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సింధ్ ప్రావిన్స్‌లోని తట్టా పట్టణానికి చెందిన కొందరు బలోచిస్తాన్‌లోని హుబ్ పట్టణంలోని షా నూరానీ దర్గాకు బుధవారం మధ్యాహ్నం బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు రాత్రి 8 గంటల సమయంలో అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. క్షతగాత్రులను అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరాచీ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
దైవ దర్శనానికి వెళ్తూ జీపు బోల్తా.. ఆరుగురు యాత్రికులు మృతి
బెళగావి: దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు చేరుకున్నారు యాత్రికులు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు హనుమవ్వ(25), దీప(31), సవిత(17), సుప్రీత(11), ఇందిరవ్వ(24), మారుతి(42)గా గుర్తించారు పోలీసులు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికల సాయంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. హులంద గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సౌందత్తి యల్లమ్మ దేవాలయానికి వెళ్తున్నారు. బొలెరో గూడ్స్ వాహనంలో మొత్తం 23 మంది యాత్రికులు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే మూల మలుపు వద్ద వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో మర్రి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: కోవిడ్ అలర్ట్: బెంగాల్లో నలుగురికి చైనా వేరియంట్ బీఎఫ్7 -
పుణ్యస్నానం చేద్దామని వచ్చి...
-
పుణ్యస్నానం చేద్దామని వచ్చి...
రాజమండ్రి : పుణ్యస్నానం చేద్దామని గోదావరి తీరానికి వచ్చిన భక్తులు పుణ్యలోకాలకు చేరిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కోటగుమ్మం పుష్కరఘాట్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో 27 మంది కన్నుమూశారు. అనేక మంది గాయపడ్డారు. భక్తిభావంతో కళకళలాడాల్సిన పుష్కరఘాట్లలో...ఓవైపు ఏడుపులు, మరోవైపు తమవారి జాడ కోసం...అయినవారి ఆర్తనాదాలతో ఇప్పుడు భీకర వాతావరణం నెలకొంది. రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్‌కు తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.. అయితే విఐపీల కోసం గేట్లన్నీ మూసి వుంచారు.. వీఐపీలు వెళ్లిపోయాక ఒక్కసారిగా గేటు తెరవటంతో తొక్కిసలాట జరిగింది.. ఇప్పటి వరకు వున్న సమాచారం ప్రకారం 25 మంది చనిపోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు, వృద్ధులే ఎక్కువ మంది వున్నారు. తొక్కిసలాటతో అక్కడ భయానక వాతావరణ ఏర్పడింది.. ప్రాణాలు దక్కించుకునేందుకు భక్తులు అక్కడ వున్న వాహనాలు, దేవాలయం గోపురాలు, గోడలపైకి ఎక్కారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
గంటగంటకూ పెరుగుతున్న మృతులు...
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘట్ వద్ద మృతుల సంఖ్య గంటగంటకూ పెరిగిపోతోంది. తొలుత ఒక్కరు, ఆపై ముగ్గురు.. ఆరుగురు.. అంటూ ఇలా మృతుల సంఖ్య ఏకంగా 27కు చేరుకుంది. అనధికారికంగా ఈ సంఖ్య 32కు చేరిందని సమాచారం. భారీగా భక్తులు తరలిరావడం, వారు తొందరపడి గోడదూకడాలు వంటి పనులు చేయడంతో ఒక్కసారిగా తొక్కిసలాటు మొదలైంది. దీంతో భక్తుల మరణాలు గంటగంటకూ పెరిగిపోతున్నాయి. ఇదిలాఉండగా ఏపీ ప్రభుత్వం పటిష్ట భద్రత చర్యలు చేపట్టలేదంటూ యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవతున్నప్పటికీ, మరోవైపు వీఐపీలకు సాఫీగా పుష్కర స్నానం, పూజా కార్యక్రమాలు నిర్వహణ చేస్తుండటం గమనార్హం. టోల్ ఫ్రీ నెంబర్లు పనిచేయడం లేదని అంబులెన్స్ లు అందుబాటులో లేవని అరకొర ఏర్పాట్లపై భక్తులు మండిపడుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిచడంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు.