hub
-
హ్యుందాయ్ తయారీ కేంద్రంగా భారత్
పొరుగు దేశాలతో పాటు ఆఫ్రికా తదితర వర్ధమాన మార్కెట్లకు ఎగుమతులు చేసేందుకు భారత్‌ను తయారీ హబ్‌గా మార్చుకోనున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ (Hyundai) మోటర్ ఇండియా ఎండీ అన్సూ కిమ్ తెలిపారు. దేశీయంగా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వివరించారు.ఆఫ్రికా, మెక్సికో, లాటిన్ అమెరికా మార్కెట్లన్నింటిలోనూ అమ్మకాలు పెరుగుతున్నాయని వివరించారు. రిస్కులను తగ్గించుకునేందుకు ఇతర మార్కెట్లపై కూడా దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక లాంటి పొరుగు దేశాలకు కూడా ఎగుమతులు పెంచుకోనున్నట్లు పేర్కొన్నారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో హ్యుందాయ్ వాహన ఎగుమతులు 43,650 యూనిట్ల నుంచి 40,386 యూనిట్లకు తగ్గాయి. 2024 క్యాలెండర్ సంవత్సరంలో హ్యుందాయ్ మొత్తం 1,58,686 యూనిట్లను ఎగుమతి చేసింది. గతేడాది సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ అతి పెద్ద ఎగుమతి మార్కెట్లుగా నిలిచాయి.పేద విద్యార్థులకు సాయంహ్యుందాయ్ మోటార్ ఇండియా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అండగా నిలుస్తోంది. హ్యుందాయ్ హోప్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ పేరిట స్కాలర్షిప్లను ఇస్తోంది. తాజాగా ఆ కంపెనీ మొత్తం రూ.3.38 కోట్ల స్కాలర్షిప్ను అందించింది. దేశంలని 23 రాష్ట్రాల నుండి దరఖాస్తులు వచ్చాయి. 783 మంది ప్రతిభావంత విద్యార్థులు ఈ స్కాలర్షిప్లు అందుకున్నారు. వీరిలో 440 మంది విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్ష, క్టాట్‌కి సిద్ధమవుతున్నారు. 343 మంది విద్యార్థులు ఐఐటీల నుండి వచ్చారు. హ్యుందాయ్ ఈ కార్యక్రమాన్ని 2024 ఆగస్టులో ప్రారంభించింది. -
దేశంలో తొలి ఈ–కామర్స్ ఎగుమతుల హబ్.. త్వరలో కార్యకలాపాలు
దేశీయంగా తొలి ఈ–కామర్స్ ఎగుమతుల హబ్ ( E-Commerce Export Hub) ఈ ఏడాది మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేసేందుకు అయిదు సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు వివరించారు.ఢిల్లీలో లాజిస్టిక్స్ అగ్రిగేటర్ షిప్‌రాకెట్, ఎయిర్ కార్గో హ్యాండ్లింగ్ సంస్థ కార్గో సర్వీస్ సెంటర్; బెంగళూరులో డీహెచ్ఎల్, లెక్స్షిప్; ముంబైలో గ్లోగ్లోకల్ ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ హబ్‌ల నిర్వహణ విధి విధానాలను రూపొందించడంపై వాణిజ్య, ఆదాయ విభాగాలు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) కలిసి పని చేస్తున్నాయని సారంగి చెప్పారు.గేట్‌వే పోర్టుల్లో కస్టమ్స్ పరిశీలన నుంచి మినహాయింపులు, రిటర్నుల కోసం సులభతరమైన రీఇంపోర్ట్ పాలసీ మొదలైన ఫీచర్లు ఈ హబ్‌లలో ఉంటాయి. ఈ–కామర్స్ ఎగుమతులను పెంచుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో వీటి ఏర్పాటు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం భారత్ ఈ–కామర్స్ ఎగుమతులు 5 బిలియన్ డాలర్లుగా ఉండగా 2030 నాటికి వీటిని 100 బిలియన్ డాలర్లకు పెంచుకునే సామర్థ్యాలు ఉన్నాయనే అంచనాలు నెలకొన్నాయి. ట్రేడ్ కనెక్ట్ ఈ-ప్లాట్‌ఫామ్ రెండవ దశను ప్రారంభించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కృషి చేస్తోందని సారంగి ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన మొదటి దశ ఎగుమతులు, దిగుమతులపై అవసరమైన సమాచారాన్ని అందించింది. రెండవ దశతో వాణిజ్య వివాదాలకు పరిష్కారం, వాణిజ్య విశ్లేషణలు, విదేశీ మిషన్ల నుండి ఇంటెలిజెన్స్ నివేదికలు, వాణిజ్య ఫైనాన్స్, బీమా ఎంపికలు వంటి అదనపు సేవలు అందుబాటులోకి రానున్నాయి.ఏప్రిల్ 1 నుంచి డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ మరోవైపు డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ (DIA) పథకం ప్రారంభానికి సంబంధించిన ప్రణాళికలను కూడా డీజీఎఫ్టీ వెల్లడించింది. ఇది ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. ఈ స్కీమ్ నిర్దిష్ట పరిమితి వరకు కట్, పాలిష్ చేసిన వజ్రాలను సుంకం-రహిత దిగుమతికి అనుమతిస్తుంది. వజ్రాల ప్రాసెసింగ్, విలువ జోడింపునకు భారత్‌ను కేంద్రంగా మార్చడమే దీని లక్ష్యం. డైమండ్ ఇంప్రెస్ట్ లైసెన్స్ అర్హతగల ఎగుమతిదారులు గత మూడు సంవత్సరాల నుండి వారి సగటు టర్నోవర్‌లో 5 శాతం వరకు 10 శాతం విలువ జోడింపు అవసరంతో వజ్రాలను దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది. -
హైదరాబాద్‌లో ఐసీఏఐ రిసర్చ్ హబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) హైదరాబాద్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిసర్చ్ హబ్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు, ఆర్థిక అక్షరాస్యత, విధాన రూపకల్పనలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర, సులభతర వ్యాపారంతో కూడిన సుపరిపాలన తదితర అంశాలపై ఈ కేంద్రం లోతైన అధ్యయనాలను నిర్వహిస్తుందని ఐసీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ పరిశోధన కార్యక్రమాల ద్వారా వెల్లడైన అంశాలను ప్రభుత్వంతో పంచుకుంటామని వివరించింది. కాగా, సెంటర్ డైరెక్టర్, డీన్‌గా నుపుర్ పవన్ బంగ్ను ఐసీఏఐ నియమించింది. జైపూర్‌లోనూ ఐసీఏఐకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. కోల్‌కతలో ఇటువంటి కేంద్రాన్ని 2025 జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా మరో ఎనిమిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను నెలకొల్పాలని ఐసీఏఐ యోచిస్తోంది. దాదాపు 9.85 లక్షల మంది విద్యార్థులు, 4 లక్షల మంది సభ్యులతో ఐసీఏఐ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ అకౌంటెన్సీ సంస్థ కావడం విశేషం. -
హైదరాబాద్ టాలెంట్ హబ్!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని కీలక నగరాల్లో హైదరా బాద్ డైనమిక్ టాలెంట్ హబ్‌గా నిలిచింది. హైదరా బాద్‌తో పాటు నవీ ముంబై, పుణే కూడా మంచి నైపుణ్యం, విభిన్న ప్రతిభకు కేంద్రాలుగా అభివృద్ధి చెందాయని ప్రముఖ కేపీఎంజీ సంస్థ తమ టాలెంట్ ఫీజబులిటీ నివేదికలో వెల్లడించింది. క్లిష్టమైన నైపుణ్యాలు, విభిన్న ప్రతిభను కోరుకునే రిక్రూటర్ల డిమాండ్లను తీర్చే విధంగా ఈ హబ్‌లు ఎదిగాయని తెలిపింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలు వివిధ పరిశ్రమలకు అవసరమైన ప్రతిభను ఆకర్షిస్తున్నాయని పేర్కొంది. జీవన నాణ్యత, ప్రయాణ సమయం, భద్రత, కనెక్టివిటీ, ఆరోగ్య సంరక్షణ, మెరుగైన గాలి నాణ్యత అంశాల్లో ఈ మూడు నగరాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయని వివరించింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో జీవన వ్యయ సూచికలు తక్కువగా ఉన్నాయని.. బెంగళూరు, గుర్గావ్, పుణే నగరాలు స్థానికంగా అధిక కొనుగోలు శక్తిని అందిస్తున్నాయని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో దేశంలోని 10 రంగాలకు చెందిన 40కిపైగా కంపెనీలు, హెచ్ఆర్ ప్రతినిధులు, నియామక బృందాలతో కలసి ఈ అధ్యయనం చేసినట్టు తెలిపింది.సులభతర వ్యాపారానికి వీలు..నవీ ముంబై, హైదరాబాద్, చెన్నై నగరాల్లో వాణిజ్య లీజు ధరలు అందుబాటులో ఉన్నాయని.. ఇది సులభతర వ్యాపారానికి వీలు కల్పిస్తుందని కేపీఎంజీ నివేదిక పేర్కొంది. దీనితో ఈ నగరాల్లో కార్యకలాపాలపై సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపింది. అయితే పన్ను రాయితీలు, సరళీకృత విధానాలు, ఇతర అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రతిభ, ప్రభుత్వ మద్దతు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జీవన నాణ్యత, వ్యయాలు వంటి అంశాలు సంస్థల ఏర్పాటుకు, అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడానికి కీలకమని పేర్కొంది. -
Pakistan: లోయలో పడిన బస్సు.. 17 మంది మృత్యువాత
కరాచీ: పాకిస్తాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. 38 మంది గాయపడ్డారు. సింధ్, బలోచిస్తోన్ ప్రావిన్స్‌ల సరిహద్దుల్లోని హుబ్ పట్టణ సమీపంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సింధ్ ప్రావిన్స్‌లోని తట్టా పట్టణానికి చెందిన కొందరు బలోచిస్తాన్‌లోని హుబ్ పట్టణంలోని షా నూరానీ దర్గాకు బుధవారం మధ్యాహ్నం బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు రాత్రి 8 గంటల సమయంలో అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. క్షతగాత్రులను అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరాచీ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కోనసీమలో డ్రోన్ హబ్ ప్రారంభం
సాక్షి,అమలాపురం: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ హాబ్ను కలెక్టర్ శుక్లా మంగళవారం ప్రారంభించారు. అమలాపురం స్టేడియంలో 21 ఫ్లయింగ్ డ్రోన్లను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ..రూ.2 కోట్లతో దేవగుప్తం పీఏసీఎస్ 21 డ్రోన్లను కొనుగోలు చేసిందన్నారు. ఒక్కొక్క డ్రోన్ 6–8 నిమిషాల్లో ఒక ఎకరానికి స్ప్రేయింగ్ ప్రక్రియను పూర్తి చేస్తుందని తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్‌గా కొనుగోలు చేసిన ఈ డ్రోన్స్‌ను అద్దె ప్రాతిపదికన రైతులకు అందుబాటులో తెస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు స్పేయర్ ఎకరాకు రూ.వెయ్యి ఖర్చుతో పిచికారీ చేస్తున్నారని, డ్రోన్ టెక్నాలజీతో ఎకరాకు రూ.300 అవుతుందన్నారు. రైతులు బృందంగా ఏర్పడితే రూ.10 లక్షలు విలువైన వ్యవసాయ డ్రోన్‌ను కొనుగోలు చేయవచ్చన్నారు. దేవగుప్తం పీఏసీఎస్ చైర్మన్, రాష్ట్ర అగ్రి మిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబి) మాట్లాడుతూ ప్రతి మండలంలో ఒక డ్రోన్ ఉండేలా ప్రభుత్వం ఆలోచన చేసిందన్నారు. వైఎస్సార్ హార్టీకల్చర్ వర్సిటీ సభ్యుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినా««ద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్లోబల్ మెడికల్ హబ్‌గా హైదరాబాద్
హఫీజ్‌పేట్(హైదరాబాద్): హైదరాబాద్ మహానగరం ‘గ్లోబల్ మెడికల్ హబ్’గా రూపొందిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నగరం ఇప్పటికే ఫార్మాహబ్‌గా, వ్యాక్సిన్ హబ్, ఐటీ హబ్‌గా గుర్తింపు సాధించిందని ఆయన గుర్తు చేశారు. గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్కు ఎదురుగా అరీట్ ఆస్పత్రిని మంత్రి హరీశ్‌రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో హైదరాబాద్‌లో మెడికల్ టూరిజం బాగా అభివృద్ధి చెందుతోందన్నారు. దీంతో ట్యాక్సీ డైవర్లకే కాకుండా డాక్టర్లు, టెక్నీషియన్లు, వైద్య సిబ్బందికి పనులు పెరగడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వైద్య చికిత్స కోసం నగరానికి వస్తున్నారన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు పేద, మధ్యతరగతి వారికి తక్కువ ధరకే వైద్యం అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా వారు చర్యలు చేపట్టాలని కోరారు. హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయస్థాయి అరీట్ ఆస్పత్రి అందుదాటులోకి రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. అరీట్ ఆస్పత్రుల చైర్మన్ విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆస్పత్రి సేవలు పొందడంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడం, విశ్వసనీయ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. మేనేజింగ్ డైరెక్ట వాసుగుత్తా మాట్లాడుతూ అరీట్ ఆస్పత్రిలో ఆరోగ్య సంరక్షణకు మించిన సంరక్షణ ఉంటుందన్నారు. అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో తీసుకొచ్చామని చెప్పారు ఈ కార్యక్రమం అరీట్ ఆస్పత్రుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్‌రాజు, డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ వేముల తదితరులు పాల్గొన్నారు. -
స్కిల్ హబ్స్ ద్వారా నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
-
ఆరోగ్య వనరుల అడ్డాగా భారత్ - ప్రపంచ అవసరాలను కూడా..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ, 2023 భారత్‌ను సమగ్ర ఆరోగ్య సంరక్షణ వనరుల కేంద్రంగా మారుస్తుందని పరిశ్రమ భావిస్తోంది. భారత్ అవసరాలు తీర్చడమే కాకుండా ప్రపంచానికి కావాల్సిన వనరులను అందించే స్థాయికి ఎదుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం మన దేశ వైద్య అవసరాలకు కావాల్సిన పరికరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దేశీయంగా వీటి తయారిని ప్రోత్సహించేందుకు, ప్రస్తుతం 11 బిలియన్ డాలర్లుగా ఉన్న పరిశ్రమను 50 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లే లక్ష్యంతో బుధవారం కేంద్ర ప్రభుత్వం ఈ రంగానికి ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చింది. సమగ్ర విధానం.. అసోచామ్ ప్రెసిడెంట్ అజయ్ సింగ్ దీనిపై స్పందిస్తూ.. వివిధ రకాల లైసెన్స్‌ల జారీకి సింగిల్ విండో, స్థిరమైన ధరల నిబంధనలు, తయారీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ పరంగా పురోగతి సాధించడం నూతన విధాన లక్ష్యాలుగా ఉన్నట్టు చెప్పారు. భారత్ ఇప్పటికే ప్రపంచానికి ఫార్మసీ కేంద్రంగా ఉండగా, వైద్య ఉపకరణాల విషయంలోనూ సమ ప్రాధాన్యం అవసరమని అభిప్రాయపడ్డారు. ‘‘నూతన పాలసీని విస్తృతమైన సంప్రదింపుల తర్వాత తీసుకొచ్చారు. మన దేశ అవసరాల కోసమే కాకుండా ప్రపంచ అవసరాలు తీర్చే విధంగా భారత్‌ను మార్చాలనే లక్ష్యం ఇందులో ఉంది’’అని అజయ్ సింగ్ పేర్కొన్నారు. ఆర్‌అండ్‌డీకి ప్రోత్సాహం ‘‘పరిశోధన అభివృద్ధిపై (ఆర్అండ్డీ)పై దృష్టి పెట్టడం ప్రోత్సాహనీయం. ప్రపంచ వైద్య ఉపకరణాల మార్కెట్లో భారత్ కేవలం 1.5 శాతం వాటా కలిగి ఉండగా, మెడికల్ టెక్నాలజీ ఆర్అండ్డీలో 8 శాతం వాటా మన దేశం సొంతం’’అని మెడికల్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ పవన్ చౌదరీ పేర్కొన్నారు. ఆరోగ్య రంగ నిపుణులకు నైపుణ్యాలు, అదనపు నైపుణ్యాలపై శిక్షణ ద్వారా రోగుల సంరక్షణ అవసరాలు తీర్చడంతోపాటు, మానవ వనరుల ఎగుమతులకు తోడ్పడుతుందన్నారు. మారుతున్న రోగుల అవసరాలకు అనుగుణంగా వైద్య ఉపకరణాల రంగంలో వృద్ధిని వేగవంతం చేయడాన్ని ప్రభుత్వ నూతన విధానం లక్ష్యంగా చేసుకున్నట్టు పీహెచ్‌డీసీసీఐ మెడికల్ డివైజ్ కమిటీ సహ చైర్మన్ భార్గవ్ కొటాడియా పేర్కొన్నారు. -
విద్యార్థులకు వరంగా మరీనా స్కిల్ హబ్ సెంటర్లు
-
విద్యార్థులకు వరంగా మరీనా స్కిల్ హబ్ సెంటర్లు
-
ఆవిష్కరణలకు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: యువతరం ఆలోచనలను ప్రోత్సహిస్తూ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం నూతన పారిశ్రామిక విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. పారిశ్రామికవేత్తలుగా రాణించే నైపుణ్యం కలిగిన యువతను గుర్తించి చేయూతనిచ్చేలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్, సెలెక్ట్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ లాంటి వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు. ముఖ్యంగా ఐటీ, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా విశాఖ కేంద్రంగా ఐ–స్పేస్ పేరుతో మల్టీ డొమైన్ ఇన్నొవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు. ఒక ఆలోచనను పూర్తిస్థాయి వ్యాపార ఆవిష్కరణగా మార్చడానికి అవసరమైన ఆర్ అండ్ డీ, కటింగ్ ఎడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రోడక్ట్ వాలిడేషన్, ఉత్పత్తి పరిశీలన లాంటి వ్యవస్థలన్నీ ఒకచోట ఉండేలా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. తొలిదశలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐ స్పేస్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఇంక్యుబేటర్స్, కో వర్కింగ్ స్పేస్, ఏంజెల్/వెంచర్ క్యాపిటలిస్ట్‌లను అందుబాటులో ఉంచడంతోపాటు చేయూతనిచ్చే విధంగా మెంటార్స్, టెక్నోప్రెన్యూర్స్ ఉంటారు. వీటితోపాటు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్, పేటెంట్ రిజిస్ట్రేషన్స్, లీగల్ సర్వీసెస్, ఫండ్ సోర్సింగ్, ప్యాకేజింగ్ లాంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. కార్పస్ ఫండ్ స్టార్టప్‌లకు అవసరమైన సీడ్ క్యాపిటల్ సాయం అందించేందుకు ప్రభుత్వం కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయనుంది. నూతన ఆవిష్కరణల కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ (ఆర్ అండ్ డీ) ఏర్పాటును ప్రోత్సహించనుంది. ఆర్అండ్డీ సెంటర్ల కోసం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు. ఆర్ అండ్ డీ ల్యాబ్, టెస్టింగ్ ల్యాబ్స్ వ్యయంలో 50 శాతం వరకు, గరిష్టంగా రూ.3 కోట్ల వరకు రీయింబర్స్ చేస్తారు. -
గేమింగ్ హబ్‌గా భారత్..
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ పరిశమ్ర దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఒక ట్రిలియన్ డిజిటల్ ఆర్థిక వ్యవ స్థకు గణనీయమైన వాటాను సమకూర్చే సామర్థ్యం ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమకు ఉందని ప్రైమస్ పార్ట్నర్స్ సంస్థ ‘భారత్‌లో ఆన్లైన్ గేమింగ్: పన్నుల సందిగ్ధత’ పేరుతో విడుదల చేసిన నివేదిక తెలియజేసింది. ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ అనేది ఆర్థిక అవకాశాలకు ద్వారాలను తెరవడమే కాకుండా, పలు సామాజిక అంశాలకు పరిష్కారం చూపిస్తుందని ఇది అభిప్రాయపడింది. 2023–24 బడ్జెట్ లో ఆన్లైన్ గేమింగ్ రంగానికి సంబంధించి చేసిన ప్రకటనలు సానుకూలంగా ఉన్నాయని, ఆన్లైన్ గేమింగ్‌లో వచ్చే లాభాల నుంచి నష్టాలను సర్దుబాటు చేసుకునే డిమాండ్‌ను పరిష్కరించినట్టు పేర్కొంది. ఆన్లైన్ గేమింగ్ లాభాలపై టీడీఎస్ అమలుకు యంత్రాంగాన్ని బడ్జెట్లో పేర్కొనడాన్ని ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ‘‘సెక్షన్ 194బీ కింద చేసిన సవరణలు ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమకు 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. సెక్షన్ 194బీఏ కింద ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమకు ప్రత్యేక నిబంధనను 2023 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా ప్రతిపాదించారు. కానీ, ఇది లోపంగా కనిపిస్తోంది. రెండూ కూడా ఒకే తేదీ నుంచి అమల్లోకి వస్తే సరైన విధంగా ఉంటుంది. రెండూ 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాలి. లేదంటే ప్రత్యామ్నాయంగా ప్రస్తుత పన్ను విధానాన్నే ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు అమలయ్యేలా చూస్తే వ్యత్యాసాలు తొలగిపోతాయి’’అని సూచించింది. స్థూల ఆదాయం మెరుగైనది.. పరిశ్రమకు సంబంధించి సుస్థిరత అవసరమని, అదే పనిగా పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల పరిశ్రమకు అధిక వ్యయాలకు దారితీస్తుందని ఈ నివేదిక పేర్కొంది. అవనసర వ్యయాలతో చిన్న, మధ్య స్థాయి గేమింగ్ కంపెనీలు నిలదొక్కుకోవడం కష్టమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. పరిశ్రమకు సంబంధించి జీఎస్టీ అనేది స్థూల ఆన్లైన్ గేమింగ్ ఆదాయంపై అమలు చేయడం వల్ల పరిశ్ర మ వృద్ధికి సాయపడుతుందని సూచించింది. అలా కాకుండా మొత్తం ముఖ విలువపై అమలు చేయ డం ఈ రంగానికి ఆచరణ సాధ్యం కాదని పేర్కొంది. ఏటా 27 శాతం వృద్ధి ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. ఏటా కాంపౌండెడ్‌గా 27 శాతం చొప్పున, వచ్చే ఐదేళ్లపాటు వృద్ధి చెందుతుందని, దేశ జీడీపీకి పెద్ద మొత్తంలో వాటా సమకూర్చే, పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సామర్థ్యాలు ఈ రంగానికి ఉన్నట్టు పేర్కొంది. 2030 నాటికి లక్ష ఉద్యోగాలను కల్పించగలదని పేర్కొంది. ఇందుకోసం బాధ్యాతాయుత, పారదర్శకమైన, భద్రత వాతావరణం ఉండాలని అభిప్రాయపడింది. -
రసాయనాల తయారీ హబ్‌గా భారత్
న్యూఢిల్లీ: దేశీయంగా రసాయనాలకు డిమాండ్ పెరుగుతోంది. రాబోయే రెండు దశాబ్దాల్లో అంతర్జాతీయంగా రసాయనాల వినియోగంలో అయిదో వంతు వాటా భారత్‌దే ఉండనుంది. 2040 నాటికి ఇది 1,000 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 82,00,000 కోట్లు) చేరనుంది. ’తదుపరి రసాయనాల తయారీ హబ్‌గా భారత్’ పేరిట రూపొందించిన నివేదికలో కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే ఈ విషయాలు వెల్లడించింది. గత దశాబ్దకాలంగా ఇటు రసాయనాల వినియోగంలోనూ, అటు షేర్‌హోల్డర్ల కు సంపద సృష్టిలోనూ భారత కెమికల్స్ రంగం అంతర్జాతీయ పరిశ్రమను మించి రాణించిందని పేర్కొంది. ప్రస్తుతం ఇటు వినియోగం అటు తయారీ.. రెండింటిలోనూ అంతర్జాతీయంగా ఆధి పత్య పాత్ర పోషించే స్థాయిలో భారత్ ఉందని మెకిన్సే వివరించింది. 2021–27 మధ్య కాలంలో పరిశ్రమ 11–12 శాతం, 2027–40 మధ్య 7–10 శాతం మేర వృద్ధి చెందవచ్చని పేర్కొంది. 2040 నాటికి అంతర్జాతీయంగా తన మార్కెట్ వాటాను మూడు రెట్లు పెంచుకోవచ్చని వివరించింది. ‘వచ్చే రెండు దశాబ్దాల్లో అదనంగా పెరిగే రసాయనాల వినియోగంలో భారత్ వాటా 20 శాతం పైగా ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. దేశీయంగా డిమాండ్ 2021లో 170–180 బిలియన్ డాలర్లుగా ఉండగా .. 2040 నాటికి 850–1,000 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది‘ అని మెకిన్సే వివరించింది. అన్నింటా వినియోగం.. రసాయనాలు ప్రస్తుతం రోజువారీ ఉత్పత్తుల్లో భా గంగా మారిపోయాయి. డిటర్జెంట్లు, దుస్తులు మొ దలుకుని సుగంధ పరిమణాలు, క్రిమి సంహారకా లు, పెయింట్ల వరకు వివిధ రంగాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. అంతర్జాతీయంగా పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుండటం భారత్‌కు లాభించగలదని మెకిన్సే పేర్కొంది. ఆ యా ఉత్పత్తుల్లో వినియోగించే అనేక రసాయనా లను తయారు చేసే టాప్ దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉండటం ఇందుకు కారణమని వివరించింది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు మారిపోతుండటం, పలు దేశాలు ప్రస్తుతమున్న కీలక తయారీ మార్కెట్లకు ప్రత్యామ్నాయాలను అన్వేíÙస్తుండటం వంటి పరిణామాల నేపథ్యంలో భారత్ కీలక గమ్యస్థానంగా మారేందుకు అవకాశం ఉందని పేర్కొంది. సవాళ్లున్నప్పటికీ .. దేశీ కంపెనీలు క్రాకర్ సామరŠాధ్యల లేమి, కీలక ఖనిజాల కొరత తదితర సమస్యలు ఎదుర్కొంటున్నాయని మెకిన్సే తెలిపింది. అలాగే పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో సుశిక్షితులైన నిపుణుల కొరత, సమయానికి పర్యావరణ అనుమతులు, స్థలపరమైన కేటాయింపులు జరగకపోతుండటం వంటి సవాళ్లు కూడా ఉంటున్నాయని పేర్కొంది. అయినప్పటికీ తక్కువ మూలధనం, చౌకగా కారి్మకుల లభ్యత తదితర అంశాల కారణంగా పలు రసాయనిక విభాగాల్లో భారత్ ఇప్పటికీ చవకైన మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది. మరోవైపు, భారత్ రసాయనాల తయారీలో కీలకంగా మారుతున్నప్పటికీ తనకు అవసరమైన కెమికల్స్ కోసం మాత్రం దిగుమతులపై ఆధారపడాల్సి ఉంటోంది. రసాయనాల పరిశ్రమలో అసేంద్రీయ, పెట్రోకెమికల్స్, స్పెషాలిటీ అంటూ మూడు ప్రధాన విభాగాలు ఉన్నాయి. వీటిలో స్పెషాలిటీ కెమికల్స్ మాత్రమే నికరంగా ఎగుమతి చేయగలుగుతోంది. కీలకమైన ముడివనరులు, ఖనిజాలు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా అసేంద్రీయ, పెట్‌కెమ్ విభాగాలు దిగుమతులపైనే ఆధారపడటం కొనసాగవచ్చని మెకిన్సే వివరించింది. భారత్‌లో రసాయనాల వినియోగానికి స్పెషాలిటీ కెమికల్స్ విభాగం ఊతమివ్వగలదని పేర్కొంది. 2040 నాటికి భారత నికర ఎగుమతుల్లో ఈ విభాగం వాటా 10 రెట్లు పెరిగి 20 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోగలదని తెలిపింది. ప్రస్తుతం ఇది 2 బిలియన్ డాలర్లు. -
AP: ‘మరో రెండు నెలల్లో పరిపాలన రాజధానిగా విశాఖ’
సాక్షి, విశాఖపట్నం: ఏపీకి కాబోయే పరిపాలన రాజధాని విశాఖపట్నం గురించి ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు నెలల్లో విశాఖ ఏపీకి పరిపాలన రాజధాని కాబోతోందని, ఏదేమైనా ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఉద్ఘాటించారు. విశాఖలో శనివారం రెండో రోజు ఇన్ఫినిటి వైజాగ్ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ‘‘దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ తొమ్మిదవ స్థానంలో ఉంది. త్వరలో అదాని డేటా సెంటర్‌ను ప్రారంభిస్తాం. విశాఖను ఐటీ హబ్ చేయడమే మా లక్ష్యం’’ అని ఆయన ప్రకటించారు. ఈ సదస్సులో మంత్రి అమర్నాథ్తో పాటు పలువురు ఐటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
షిప్ రిపేర్ హబ్‌గా విశాఖ.. అదానీ పోర్ట్స్ నుంచి అమెరికా షిప్స్ వరకూ..
సాక్షి, విశాఖపట్నం : ప్రపంచ దేశాలకు చెందిన సంస్థలు హిందూస్థాన్ షిప్‌యార్డుతో జతకడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం షిప్‌రిపేర్ హబ్‌గా అడుగులు వేస్తోంది. అదానీ పోర్టుల నుంచి అమెరికాకు చెందిన నౌకల వరకూ.. రక్షణ దళాల నుంచి.. ఆయిల్ కార్పొరేషన్ల వరకూ.. అన్ని సంస్థలూ హెచ్ఎస్ఎల్ వైపే చూస్తున్నాయి. నిర్లక్ష్యంగా పనులు చేస్తారన్న అపప్రద నుంచి నిర్ణీత సమయానికంటే ముందుగానే మరమ్మతులు పూర్తి చేస్తారన్న స్థాయికి ఎదిగిన షిప్‌యార్డు.. ఈ ఏడాది రూ.1000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా దూసుకెళ్తోంది. తాజాగా రూ.620 కోట్లతో సింధుఘోష్ సబ్‌మెరైన్ పనులను దక్కించుకున్న హెచ్‌ఎస్‌ఎల్‌కు మరో 3 నౌకల పనులను అప్పగించేందుకు షిప్పింగ్ కార్పొరేషన్ కూడా ఆసక్తి చూపిస్తోంది. ఎలాంటి నౌకలు, సబ్మెరైన్ల మరమ్మతులైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తూ ఆయా సంస్థలకు అప్పగిస్తున్న హిందూస్థాన్ షిప్‌యార్డు దేశంలోనే అతి పెద్ద ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ 200 నౌకలు తయారు చేసిన షిప్‌యార్డు తాజాగా 2000 షిప్స్ మరమ్మతుల పనులను కూడా పూర్తి చేసింది. ఈ ఏడాది ఏకంగా రూ.20 వేల కోట్ల పనులకు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేయనుంది. ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్(ఎఫ్ఎస్ఎస్)ని భారత నౌకాదళం, కోస్ట్‌గార్డు కోసం తయారు చేసేందుకు డిసెంబర్లో రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి సన్నద్ధమవుతోంది. సాంకేతిక సంస్కరణలు చేసుకుంటూ.. నౌకా నిర్మాణం, మరమ్మతుల విషయంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. అందుకే దేశ విదేశీ సంస్థలు షిప్‌యార్డుకు పనులు అప్పగించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ), డ్రెడ్జింగ్ కార్పొరేషన్(డీసీఐ), ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఐ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజినీరింగ్ అండ్ ట్రైనింగ్ (సిఫ్నెట్)తో పాటు అమెరికాకు చెందిన మెక్ డెర్మాట్, సింగపూర్‌కు చెందిన అబాన్ ఆఫ్‌షోర్, అదానీ పోర్టులు, సెజ్‌లు.. ఇలా ప్రతి సంస్థా హెచ్‌ఎస్‌ఎల్‌కు పనులు అప్పగించేందుకు సుముఖత చూపుతుండటం విశేషం. పదేళ్ల తర్వాత ఓఎన్జీసీ సింధుకీర్తి సబ్‌మెరైన్ మరమ్మతుల సమయంలో షిప్యార్డుపై పడిన నిర్లక్ష్యపు మరక దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. అదే సమయంలో ఓ నౌకను మరమ్మతు కోసం ఇచ్చిన ఓఎన్జీసీ.. ఆ తర్వాత హెచ్ఎస్ఎల్ వైపు చూడలేదు. దాదాపు పదేళ్ల తర్వాత షిప్‌యార్డుకు పనులు అప్పగించేందుకు ఓఎన్జీసీ రావడం విశేషం. ఓఎన్జీసీకి చెందిన డ్రిల్ షిప్, షిప్పింగ్ కార్పొరేషన్‌కు చెందిన సాగర్ భూషణ్ పనులు చేపడుతోంది. దీంతో పాటుగా ఓఎన్జీసీ ప్లాట్‌ఫామ్ మరమ్మతుల బాధ్యతను షిప్‌యార్డుకు అప్పగించింది. అదేవిధంగా మరో మూడు షిప్పింగ్ కార్పొరేషన్ నౌకల పనులు కూడా షిప్‌యార్డుకు దక్కనున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్లు ఖరారు కానున్నాయి. ఇలా గత మూడేళ్ల వ్యవధిలో 31 భారీ నౌకల మరమ్మతులను పూర్తి చేసింది. తాజాగా రూ.620 కోట్లతో సింధుఘోష్ సబ్‌మెరైన్ పనులను కూడా హెచ్ఎస్ఎల్ దక్కించుకుంది. 25 ఎకరాల్లో విస్తరణ పనులు షిప్‌యార్డుకు సమీపంలో ఉన్న 25 ఎకరాల్లో విస్తరణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి పరిశ్రమల శాఖ నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఇప్పటికే క్షేత్రస్థాయి పనులను కూడా మొదలు పెట్టింది. ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ తయారీకి అవసరమయ్యేలా 300 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో స్లిప్వేని 2024 ఆగస్టు నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో నిర్మాణ పనులు ప్రారంభించింది. ఒకేసారి 3 నుంచి 4 నౌకలు తయారు చేసేలా మరో స్లిప్‌వే నిర్మాణానికి అడుగులు వేస్తోంది. రూ.1000 కోట్ల టర్నోవర్ లక్ష్యం దేశంలోని 14 షిప్‌యార్డులతో పోల్చి చూస్తే హెచ్ఎస్ఎల్ నాలుగో స్థానంలో ఉంది. రానున్న రెండేళ్లలో కోల్‌కతా షిప్‌యార్డ్‌ను అధిగమించి మూడుకి చేరుకోవాలనే టార్గెట్‌ను నిర్దేశించుకున్నాం. రాబోయే నాలుగేళ్లలో నంబర్ వన్‌గా నిలిచేందుకు అవసరమైన ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ఎందుకంటే షిప్ బిల్డింగ్‌లో అనేక పురోగతి సాధించాం. షిప్‌యార్డు చరిత్రలో తొలిసారిగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.755 కోట్లు టర్నోవర్ సాధించాం. ఈ ఏడాది రూ.1000 కోట్లు మార్కు చేరుకుంటాం. హైవాల్యూస్‌తో చేపట్టనున్న నేవీ నౌకల నిర్మాణాలతో హెచ్ఎస్ఎల్ వార్షిక టర్నోవర్ కూడా గణనీయంగా పెరగనుంది. ఇదే ఊపుతో స్వదేశీ పరిజ్ఞానాన్ని దేశీయ పరిశ్రమలను మరింతగా ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నాం. మరోవైపు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్‌ను తయారు చేసేందుకు సన్నద్ధమవుతున్నాం. మూడేళ్లుగా దీనిపై కసరత్తు చేస్తున్నాం. రక్షణ మంత్రిత్వ శాఖ దీనిపై ఇటీవలే చర్చించింది. త్వరలోనే అనుమతులు వస్తాయని భావిస్తున్నాం. ఇది వస్తే విశాఖపట్నం బూమ్ ఒక్కసారిగా పెరుగుతుంది. – కమాండర్ హేమంత్ ఖత్రీ, హిందూస్థాన్ షిప్‌యార్డ్ సీఎండీ -
ఐటీ హబ్‌గా విశాఖలో అపారమైన అవకాశాలు
సాక్షి, విశాఖపట్నం: ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు హబ్‌గా అభివృద్ధి చెందేందుకు విశాఖపట్నంలో అపారమైన అవకాశాలున్నాయని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) డైరెక్టర్ జనరల్ అరవింద్‌కుమార్ చెప్పారు. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండస్ట్రీ 4.0– అవకాశాలు, సవాళ్లు’ సదస్సులో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం విశాఖ వచ్చారు. చదవండి: ‘టెక్’ల కేంద్రంగా విశాఖ ఎస్టీపీఐ డైరెక్టర్ సి.వి.డి.రామ్‌ప్రసాద్‌తో కలిసి ఆయన సాక్షితో మాట్లాడారు. ఐటీ పరిశ్రమలన్నీ తమ తదుపరి డెస్టినేషన్‌గా ద్వితీయశ్రేణి నగరాల్ని ఎంపిక చేసుకుంటున్నాయని, ఇందులో మొదటి వరుసలో విశాఖపట్నం ఉందని చెప్పారు. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి డేటా సెంటర్ హబ్‌గా భారత్ అవతరించబోతోందన్నారు. అరవింద్‌కుమార్ ఇంకా ఏమన్నారంటే.. ఏపీ ఐటీ పాలసీ అద్భుతం ఐటీ సర్వీస్ సెక్టార్ పరిశ్రమల ఏర్పాటుకు వైజాగ్ వంటి నగరాలే మొదటి ప్రాధాన్యం. విశాఖపట్నం ఒక డైనమిక్ సిటీ. కాస్త ప్రోత్సాహకాలు అందిస్తే.. ఐటీ రంగం మొత్తం విశాఖ వంటి నగరాల వైపు పరుగులు తీస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐటీ పాలసీ కూడా అద్భుతంగా ఉంది. మరిన్ని అవకాశాల కోసం పరిశ్రమలు ఎదురు చూస్తున్నాయి. చైనా, జపాన్ వంటి దేశాల పోటీని తట్టుకోవాలంటే వైజాగ్ వంటి టైర్–2 నగరాలని ఎంపిక చేసుకోవాల్సిందే. బీపీవోల ఓటు వైజాగ్‌కే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో) కంపెనీలు కూడా ద్వితీయశ్రేణి నగరాల బాట పడుతున్నాయి. వీటి ఓటు కూడా వైజాగ్‌కే ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీపీవో సీట్స్‌లో ఏపీ వాటా 27 శాతం కాగా.. విశాఖపట్నం వాటా 20 శాతం ఉండటం గమనార్హం. ఇది ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్ల సాధ్యమైంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో ఎస్టీపీఐ సేవలు మరింత విస్తృతం చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న కార్యాలయం కాకుండా మరో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నాం. 2026 నాటికి 80 బిలియన్ల మార్కెట్ ఎస్టీపీఐ లక్ష్యం ప్రస్తుతం ఎస్టీపీఐ సేవలను విస్తృతం చేశాం. వై2కే సమస్యని అధిగమించి అడుగులు వేయడం వల్లే.. ఎస్టీపీఐపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం ఏర్పడింది. అందుకే సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఎగుమతుల మార్కెట్లో 1992లో రూ.17 కోట్లు మాత్రమే ఉన్న మా వాటా.. ప్రస్తుతం రూ.5.69 లక్షల కోట్లకు చేరుకుంది. 2026 నాటికి 80 బిలియన్ డాలర్లకు చేరుకోవడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అదేవిధంగా సాఫ్ట్వేర్ సేవల మార్కెట్లోను రూ.227 కోట్ల వాటాను ఆర్జించాం. సీవోఈలకు అమ్మలాంటి కల్పతరు ఇప్పటికే ఎస్టీపీఐ 20 సెంటర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీవోఈ)లని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. విశాఖపట్నంలోను సేవలందిస్తున్నాం. పరిశోధనలు, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు అన్ని విధాలా అడుగులు వేస్తున్నాం. ఇందుకోసం కల్పతరు ప్రారంభించాం. ఏపీ ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామిగా ఉండటం హర్షదాయకం. సాఫ్ట్వేర్ ఉత్పత్తుల క్లస్టర్‌గా ఇది ఉపయుక్తమవుతుంది. ఇప్పటివరకు కల్పతరు ఇండస్ట్రీ 4.0 కోసం 250 దరఖాస్తులు వచ్చాయి. డేటా సెంటర్ హబ్‌గా భారత్ ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో డేటా సెంటర్ హబ్‌గా భారత్ అవతరించే అవకాశం ఉంది. ఇందుకు ఎస్టీపీఐ నుంచి సంపూర్ణ మద్దతు అందిస్తున్నాం. డేటా సెంటర్లకు సంబంధించిన విధానాన్ని రూపొందించే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ పాలసీని అమలుచేసే ఏజెన్సీగా ఎస్టీపీఐ వ్యవహరిస్తుంది. ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, బ్లాక్‌చెయిన్ వంటి సాంకేతిక రంగాలపై దృష్టిసారిస్తున్నాం. -
ఎగుమతుల హబ్‌గా ఏపీ..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: విదేశీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని.. సముద్రతీర ప్రాంతంతో ఏపీ ఎక్స్పోర్ట్ హబ్‌గా నిలిచిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మెరైన్, రైస్, ఫ్రూట్స్ వంటి ఎగుమతుల్లో ద్విగుణీకృతమైన ప్రగతిని ఏపీ సాధిస్తోందని.. విదేశీ వాణిజ్యానికి అన్ని అవకాశాలు ఇక్కడ మెండుగా ఉన్నాయని ఆమె కొనియాడారు. కాకినాడ జేఎన్టీయూలో ఏర్పాటుచేసిన ప్రతిష్టాత్మకమైన ఐఐఎఫ్‌టీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్) మూడో క్యాంపస్‌ను శుక్రవారం కేంద్ర ఆర్థిక, వాణిజ్యశాఖా మంత్రులు నిర్మలా సీతా రామన్, పీయూష్ గోయల్ ప్రారంభించారు. చదవండి: పంజాబ్‌కు ఆదర్శంగా ఏపీ ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఈ క్యాంపస్ ఏర్పాటుతో ట్రేడ్ హబ్‌గా కాకినాడ దేశ ఆర్థికవ్యవస్థలో మరింత కీలకపాత్ర పోషించనుంద న్నారు. విశాలమైన సముద్రతీరం ఉన్న ఏపీలో మెరైన్ ఉత్పత్తుల ప్రాముఖ్యతను అర్థంచేసుకుని, ఇక్కడి ఎగుమతిదారులు ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకున్నారన్నారు. అదే ఈ రోజు విదేశీ వాణిజ్యంలో రాష్ట్రాన్ని ముందువరసలో నిలిపిం దని ఆమె ప్రశంసించారు. రాష్ట్రంలో ఒక్కో జిల్లా ఒక్కో విశిష్ట ఉత్పత్తికి కేంద్రంగా ఉందన్నారు. ఐఐఎఫ్‌టీ విద్యార్థులు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా దేశ, విదేశాల్లో జరుగుతున్న వాణిజ్యాన్ని ఆకళింపు చేసుకుని వాటిపై పూర్తి పట్టు సాధించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విభజన అనంతరం రాష్ట్ర సత్వరాభివృద్ధే లక్ష్యంగా ప్రధానమంత్రి చొరవతో ఎయిమ్స్, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐటీ, ఐఐఎఫ్‌టీ, ఐఐటీ తదితర పది ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు అయ్యాయని సీతారామన్ వెల్లడించారు. రాజకీయ సుస్థిరతతోనే ఆర్థిక శక్తిగా భారత్ మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. భారతీయ వాణిజ్యానికి భవిష్యత్తులో మరింతగా అంతర్జాతీయ గుర్తింపు రావాలంటే నిపుణులైన మానవ వనరులు అవసరమన్నారు. దేశంలో రాజకీయ సుస్థిరత, సమష్టి కృషి ఫలితంగానే ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందన్నారు. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ఐఐఎఫ్‌టీ ఏర్పాటుతో కాకినాడ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. దేశీయ ఎగుమతుల్లో 5.8% (దాదాపు 16.8 బిలియన్ యూఎస్ డాలర్లు) ఏపీ నుంచి జరుగుతున్నాయన్నారు. గతంలో 20వ స్థానంలో ఉన్న ఈ ఎగుమతులు 2021 నాటికి 9వ స్థానానికి చేరుకున్నాయన్నారు. భారత్ ఆక్వాహబ్‌గా ఏపీ గుర్తింపు సాధించిందన్నారు. రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు వంగా గీత, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మార్గాని భరత్, జీవీఎల్ నరసింహారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఐఐఎఫ్‌టీ వీసీ ప్రొ. మనోజ్‌పంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రానిక్స్ తయారీ విభాగంలో రిలయన్స్, వందల కోట్లలో పెట్టుబడులు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తాజాగా ఎలక్ట్రానిక్స్ తయారీపై దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా సాన్మినా కార్పొరేషన్‌తో భాగస్వామ్య సంస్థ(జేవీ) ఏర్పాటుకు తెరతీసింది. అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఎస్బీవీఎల్) ద్వారా జేవీలో 50.1 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 3,300 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో రూ. 1,670 కోట్ల పెట్టుబడులు వెచ్చించనుంది. యూఎస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాన్మినా కార్పొరేషన్‌కు దేశీయంగా చెన్నైలోగల యూనిట్లో ఆర్ఎస్బీవీఎల్ తాజా నిధులను ఇన్వెస్ట్ చేయనుంది. సాన్మినా కార్పొరేషన్ 49.9 శాతం వాటాను కలిగి ఉంటుంది. వెరసి జేవీగా మారనున్న సాన్మినా దేశీ యూనిట్లో ఆర్ఎస్బీవీఎల్ మెజారిటీ వాటాను పొందుతుంది. ఈ పెట్టుబడులను కంపెనీ వృద్ధి అవకాశాలకు వినియోగించనుంది. కాగా.. గతంలో ప్రకటించిన విధంగా భాగస్వామ్య లావాదేవీని పూర్తి చేసినట్లు రెండు కంపెనీలూ తాజాగా ప్రకటించాయి. తాజాగా ఏర్పాటు చేసిన జేవీని సాన్మినా యాజమాన్యమే నిర్వహించనుంది. నాలుగు దశాబ్దాలుగా అడ్వాన్స్డ్ తయారీ విధానాల్లో సాన్మినా అనుభవం, దేశీ వ్యాపార వ్యవస్థలో ఆర్‌ఐఎల్‌కున్న నైపుణ్యం, నాయకత్వ పటిమ జేవీకి లబ్ధిని చేకూర్చనున్నట్లు వివరించాయి. ఆర్ఎస్బీవీఎల్ ఇలా మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2021–22) ఆర్ఎస్బీవీఎల్ రూ. 1,478 కోట్ల ఆదాయం సాధించింది. దాదాపు రూ. 180 కోట్ల నికర లాభం ఆర్జించింది. రూ. 10,858 కోట్లవరకూ పెట్టుబడులు వెచ్చించింది. తాజా జేవీ ప్రపంచస్థాయి తయారీ కేంద్రంగా ఆవిర్భవించనున్నట్లు రెండు సంస్థలు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. కమ్యూనికేషన్ నెట్వర్కింగ్, మెడికల్ అండ్ హెల్త్‌కేర్ సిస్టమ్స్, డిఫెన్స్ తదితర రంగాలకు అవసరమైన అత్యున్నత సాంకేతిక మౌలికసదుపాయాల హార్డ్‌వేర్‌ను రూపొందించనుంది. చెన్నైలోని 100 ఎకరాల క్యాంపస్‌లో తయారీ కార్యకలాపాలు చేపట్టనున్నట్లు తెలియజేశాయి. -
హైదరాబాదీలకు గుడ్ న్యూస్; అందుబాటులోకి ఉచిత వైద్య పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో టీ డయాగ్నస్టిక్స్ మినీ హబ్‌ల పేరిట రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నెలకొల్పుతున్న వైద్య పరీక్షల కేంద్రాలు నగరంలో మరో 10 ఏర్పాటయ్యాయి. ఇప్పటికే సేవలందిస్తున్న 8 మినీ హబ్‌లు కొన్ని ప్రాంతాలకే అందుబాటులో ఉండడం వల్ల మరో 10 కొత్తగా నెలకొల్పారు. ఇప్పటికే 319 బస్తీ దవాఖానాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో, ఏరియా ఆస్పత్రుల్లో, జిల్లా ఆస్పత్రుల వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి సేవలు అందిస్తుండగా కొత్తగా ఏర్పాటైన వాటిని 151 పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, ఉపకేంద్రాలు, బస్తీ దవాఖానాల పరిధిలో రోగులు వినియోగించుకోనున్నారు. ఎక్కడికక్కడే.. వైద్య పరీక్షల అవసరాల కోసం కొందరు ప్రైవేట్ ల్యాబ్‌ల మీదా మరికొందరు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రి వంటి పెద్దాస్పత్రుల మీద ఆధారపడే పరిస్థితిని నివారించడానికి ఇవి అందుబాటులోకి తెచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన రోగులను అవసరాన్ని బట్టి వైద్య పరీక్షల కోసం ఈ మినీ హబ్‌లకు సిఫారసు చేస్తారు. ఇక్కడ అల్ట్రాసోనోగ్రఫీ, రేడియోలజీ, రక్తపోటు అనాలసిస్, ఎక్స్‌రే, ఎమ్ఆర్ఐ, సీటీ స్కాన్లు, ఈసీజీ, రేడియాలజీ తదితర సౌకర్యాలు ఉచితంగా వినియోగించుకోవచ్చు. (క్లిక్: 3 నెలల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి) కొత్త మినీ హబ్స్ అమీర్‌పేట్, శేరిలింగంపల్లి, అల్వాల్, కుషాయిగూడ, పటాన్ చెరు, మలక్‌పేట్, హయత్‌నగర్, రాజేంద్ర నగర్, గోల్కొండ, నార్సింగి ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. వీటిలో నార్సింగ్‌లో మినీహబ్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు లాంఛనంగా బుధవారం ప్రారంభించగా, మిగిలిన వాటిని వేర్వేరు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. (క్లిక్: వాహనదారులపై భారీగా పెరిగిన జీవిత కాలం పన్ను) -
స్కిల్ హబ్, కాలేజీల ప్రారంభానికి ఏర్పాట్లు
సాక్షి, మురళీనగర్ (విశాఖ ఉత్తర): విశాఖపట్నం, అరకు, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి పార్లమెంటు నియోజవర్గాల పరిధిలో స్కిల్ కాలేజీలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్కిల్ హబ్‌ల ప్రారంభానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలోని సమావేశ మందిరంలో ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు చెందిన 150 మంది ప్రిన్సిపాళ్లతో ఆయన సమావేశమయ్యారు. స్కిల్ యూనివర్సిటీ స్థాపనలో భాగంగా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక స్కిల్ కాలేజీ, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. స్కిల్ హబ్‌లు, కాలేజీలు ఆ నియోజకవర్గంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీ లేదా, ఐటీఐ, లేదా డిగ్రీ కాలేజీల్లో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఈ కాలేజీల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు వెంటనే ఆయా పరిశ్రమల్లో ఉద్యోగాలు రావాలన్నారు. అందుకు అనుగుణంగా కోర్సుల ప్రారంభానికి ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. యువతీయువకులకు ఉద్యోగావకాశాలు రాష్ట్రంలోని యువతీయువకులందరూ ఉపాధి అవకాశాలు పొందే విధంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు భాస్కర్ చెప్పారు. ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లోని పాలిటెక్నిక్, ఐటీఐ, కాలేజీల ప్రిన్సిపాల్స్, టీపీవోలు, నోడల్ ఆఫీసర్లు, కోఆర్డినేటర్లతో ఆయన విడివిడిగా శనివారం సమావేశమయ్యారు. ముందుగా ఆయన పలు ప్రరిశ్రమలకు చెందిన వివిధ హోదాల్లోని 30 మంది ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారితో ఆయన విస్తృతంగా చర్చించారు. ఆయా పరిశ్రమల అవసరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండస్ట్రీకి పనికొచ్చే నైపుణ్యాభివృద్ధి కోర్సుల ఏర్పాటు విషయమై ఆయన చర్చించారు. ప్రతి కోర్సు పరిశ్రమతో అనుబంధంగా ఉంటుంది. స్కిల్ డెవలప్మెంటు కోర్సు నేర్చుకున్న ప్రతి విద్యార్థికి ఆ పరశ్రమలే ఉద్యోగాల్లోకి తీసుకునే విధంగా ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పారు. జూలై 1వ తేదీ నాటికి స్కిల్ హబ్‌లు, స్కిల్ కాలేజీలు ప్రారంభమవుతాయని డాక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. పలువురు పరిశ్రమల ప్రతినిధులు తమ అభిప్రాయాలను చెప్పారు. తమ పరిశ్రమల్లో ఉన్న శిక్షణ కేంద్రానికి శిక్షణనిచ్చే ఫ్యాకల్టీ కావాలని, మరికొందరు తమకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే తామే శిక్షణనిస్తామన్నారు. కొందరు ప్రతినిధులు మాట్లాడుతూ స్కిల్ కాలేజీల్లో అవసరమైన ల్యాబ్‌లు పెట్టి తాము శిక్షణనిస్తామని ఇందుకు అవసరమైన స్థలం ఇవ్వాలని కోరారు. దీనిపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని భాస్కర్ అన్నారు. కార్యక్రమంలో ఎపీఎస్ఎస్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీవీ రామకోటిరెడ్డి, కార్పొరేట్ కనెక్ట్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.సత్యప్రభ ప్రసంగించారు. కంచరపాలెం పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ జీవీవీ సత్యనారాయణమూర్తి, భీమిలి, నర్శీపట్నం, అనకాపల్లి ఆముదాలవలస, పెందుర్తి పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాల్స్ మురళీకృష్ణ, జీవీ రామచంద్రరావు, కె.వెంకటేశ్వరరావు, పి.శ్రీనివాస్, డాక్టర్ ఎన్.చంద్రశేఖర్, ఏపీఎస్ఎస్డీసీ వైజాగ్ నోడల్ ఆఫీసర్ సాయికుమార్ పాల్గొన్నారు. (చదవండి: సరుకు రవాణాలో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు) -
పారిశ్రామిక ప్రకాశం !
కరువు జిల్లా ప్రకాశం.. పారిశ్రామిక ప్రగతి వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. వ్యవసాయం, పశుపోషణ తప్ప పారిశ్రామిక జాడ లేని జిల్లా నుంచి ఉపాధి కోసం ఏటా వేలాది మంది వలస బాట పడుతుంటారు. వలస జీవితాలకు చెక్ పెట్టేందుకు ఏపీఐఐసీ ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కుల ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రూ.వేల కోట్ల అంచనాలతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు 9 ఇండస్ట్రియల్ పార్కులు, 2 ఎంస్ఎంఈ పార్కులు నెలకొల్పనున్నారు. దీంతో వేలాది మంది ఉపాధికి భరోసా లభించనుంది. ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వేలాది కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీంతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. వెనుకబడిన జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ నిరంతరం ముఖ్యమంత్రితో మాట్లాడుతూ కృషి చేస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఏపీఐఐసీ ద్వారా 9 ఇండస్ట్రియల్ పార్కులు, 2 ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. 9 ఇండస్ట్రియల్ పార్కులు 1753.11 ఎకరాలు, బీపీ సెజ్‌లకు 262.87 ఎకరాలు, 2 ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)కు 99.27 ఎకరాల అంచనాలతో పనులు ప్రారంభించారు. వీటిలో వివిధ కేటగిరీలకు సంబంధించి 1097 యూనిట్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటిలో గ్రానైట్ కటింగ్, పాలిషింగ్, టింబర్ డిపోలు, సా మిల్, ఆటోమొబైల్, సిమెంట్ బ్రిక్స్, రైస్ మిల్లులు, డాల్ మిల్స్, బిల్డింగ్ ప్రోడక్టŠస్తో పాటు మరికొన్ని యూనిట్లు ఉన్నాయి. ఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు రూ.2962.38 కోట్ల అంచనాలతో 34,989 మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. నిరుద్యోగులుగా ఉన్న యువతకు వివిధ వృత్తులకు సంబంధించి నైపుణ్య శిక్షణ కల్పించి ఉపాధి చూపేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. రామాయపట్నం చుట్టూ.. రామాయపట్నం పోర్టుతో పాటు రామాయపట్నం ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ మేరకు ఏపీఐఐసీ ద్వారా హబ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తం 4 నుంచి 5 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాటిలో ఇప్పటికే 2346.36 ఎకరాలు పట్టా భూమి, 554.92 ఎకరాల అసైన్డ్ భూమి, 879.19 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించి రూ.657.59 కోట్లతో భూ సేకరణ ప్రారంభించారు. దొనకొండలో.. జిల్లాలోని దొనకొండ ప్రాంతంలోని 21 గ్రామాల్లో 25,062.84 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దానిలో ఇప్పటికే 2395.98 ఎకరాలు గుర్తించి సేకరిస్తున్నారు. దీనిలో భాగంగా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు దొనకొండ ప్రాంతంలో 43.79 ఎకరాలను అభివృద్ధి చేశారు. దొనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్ కోసం కందుకూరు సబ్ కలెక్టర్ రూ.394.48 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్)ను 6366.66 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ఏపీఐఐసీ అంచనాలు రూపొందించింది. దానిలో ఇప్పటికే ఆరు గ్రామాలకు సంబంధించి 1839.09 ఎకరాలకు కలెక్టర్ అడ్వాన్స్ పొజిషన్ ఏపీఐఐసీకి అందచేశారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు మాలకొండపురంలో 1137.63 ఎకరాలకు 856.67 ఎకరాలు అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చేందుకు కలెక్టర్ వద్దకు దస్త్రం చేరింది. జిల్లాలో ఇప్పటికే ఉన్న పలు పారిశ్రామిక వాడల్లో 574 ప్లాట్లలో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. వాటిలో గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్, ఒంగోలు బీపీ సెజ్, గిద్దలూరు, మార్కాపురం, సింగరాయకొండ ఇండస్ట్రియల్ పార్కులు, నాగరాజుపల్లి ఫుడ్‌పార్కు, ఎంఎస్ఎంఈ మాలకొండాపురం, రాగమక్కపల్లి, చీరాల ఆటోనగర్ ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు పాలు ప్రాంతాల్లో భూములను గుర్తించారు. వాటిలో కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలోని చినలాటరపి గ్రామంలో 53.33 ఎకరాలు, కొండపి నియోజకవర్గంలో చినకండ్లగుంటలో 33.41, పెదకండ్లగుంటలో 29.90 ఎకరాలు, కొత్తపట్నం మండలంలో 50 ఎకరాలు, మార్టూరు మండలంలో 74.18 ఎకరాల భూములను ఎంఎస్ఎంఈ పార్కుల కోసం అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. నిరుద్యోగానికి చెక్ వెనుకబడిన జిల్లా అభివృద్ధే ఏకైక అజెండాగా పనిచేస్తున్నాం. జిల్లాలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను వీలైనంత ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని కృషి చేస్తున్నాం. పరిశ్రమలు ఏర్పడితే జిల్లాలో నిరుద్యోగంలో ఉన్న యువతకు ఉపాధి చూపవచ్చు. అంతేకాకుండా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. పరిశ్రమల ఏర్పాటుతో వలసలను అరికట్టవచ్చు. జిల్లా మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌ల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నాం. పరిశ్రమలు ఒక ప్రాంతంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ మేరకు ఆచరణలో ప్రారంభించి ముందుకెళ్తున్నాం. ఔత్సాహికులైన యువత సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావాలి. -– కలెక్టర్ ప్రవీణ్ కుమార్ -
సునీల్ మిట్టల్ ప్రయత్నాలు.. ఏకతాటిపైకి టెల్కోలు
న్యూఢిల్లీ: టెలికం రంగంలో కేంద్రం భారీ సంస్కరణలు ప్రకటించిన నేపథ్యంలో భారత డిజిటల్ లక్ష్యాలను సాకారం చేసేందుకు టెల్కోలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు భారతి ఎయిర్టెల్ చీఫ్ సునీల్ మిట్టల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వొడాఫోన్ గ్రూప్ సీఈవో నిక్ రీడ్‌తో మాట్లాడినట్లు గురువారం ఆయన తెలిపారు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీతో కూడా మాట్లాడనున్నట్లు మిట్టల్ వెల్లడించారు. టెల్కోలు కుమ్మక్కయ్యే అవకాశాలను గట్టిగా తోసిపుచ్చారు. పరిశ్రమ పరిస్థితులు, మార్కెట్ పంపిణీ వ్యవస్థ వంటి అంశాలపైనే తాము చర్చిస్తామని, టారిఫ్‌ల గురించి ప్రస్తావన ఉండదని మిట్టల్ చెప్పారు. కాగా, టెలికం టారిఫ్‌లు మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఒక వర్చువల్ సమావేశంలో మిట్టల్ తెలిపారు. -
ఇన్నోవేషన్ ఎవరి సోత్తూ కాదు: మంత్రి కేటీఆర్
-
ఇన్నోవేషన్ ఎవరి సోత్తూ కాదు: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇన్నోవేషన్ ఎవరి సోత్తూ కాదని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో మంత్రి కేటీఆర్ ఇన్నోవేటివ్ హబ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇన్నోవేషన్ ఎవరి సోత్తూ కాదని, ఎవరు ఏ కొత్త పరికరం కనిపెట్టినా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఆయిల్‌పామ్ విషయంలో తెలంగాణ రాష్ట్రం.. దేశానికే ఆదర్శంగా నిలవాలని అన్నారు. టీ-ఫైబర్‌ను హైస్పీడ్ ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. శాస్త్రవేత్తలు రైతులతో నేరుగా సంభాషించే అవకాశం కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి: Schools Reopen In Telangana: సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు: బడి బండి భద్రమేనా? -
రాబోయే రోజుల్లో కాశీని మెడికల్ హబ్‌గా మారుస్తాం: మోదీ
-
ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఎనర్జీ స్టోరేజీ రంగానికి హబ్‌గా తెలంగాణ రాష్ట్రం రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కె.తారకరామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలసి శుక్రవారం డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజీ పాలసీ–2020–2030ని ఆవిష్కరించి మాట్లాడారు. ‘దేశంలోనే 1000 ఎకరాల్లో అతిపెద్ద ఎల్రక్టానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మహేశ్వరంలోని రావిర్యాల్ ఈ–సిటీలో మాత్రమే ఉంది. జహీరాబాద్ నిమ్జ్‌ను ఆటోమొబైల్ క్లస్టర్‌గా ప్రమోట్ చేస్తాం. దీంతో మరో 1000 ఎకరాలు అందుబాటులోకి వస్తాయి. చందన్వెల్లి సీతారాంపూర్‌లో ఒకటి, షాబాద్‌లో మరో ఎలక్ట్రిక్ వాహనాల క్లస్టర్‌ను తీసుకొస్తున్నాం. షాబాద్ క్లస్టర్లో తయారీ ప్లాంట్లు పెట్టడానికి ఇప్పటికే ఎలక్ట్రా, మైత్రా కంపెనీలు ముందుకొచ్చాయి మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో ఎలక్ట్రిక్ వాహనాల మరో క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తాం. కొత్తగా మరో వారం రోజుల్లో ప్రకటించనున్న మొబిలిటీ(రవాణా) క్లస్టర్‌కు ప్రముఖ వాహన తయారీదారులు రానున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో ఉత్సాహం ఉన్న పెట్టుబడిదారులు తెలంగాణను హబ్‌గా మార్చుకోవడానికి ఈ సదుపాయాలు ఉపయోగపడుతాయి’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈసీఐఎల్, హెచ్ఐఎల్, భెల్ వంటి ఎల్రక్టానిక్ రంగ పరిశ్రమలతో పాటు జెడా ఆటోమోటివ్, ఒప్పో, వివో, ఇన్టెల్, మైక్రాన్ వంటి పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉండటం ఎలక్ట్రిక్ వాహన రంగ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. కేవలం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కాకుండా ఎనర్జీ స్టోరేజీ(బ్యాటరీల తయారీ) రంగాన్ని సైతం ప్రోత్సహించడానికి సమగ్రమైన పాలసీని తీసుకొచ్చామని వెల్లడించారు. విద్యుత్ వాహనాలు/బ్యాటరీల తయారీ, వినియోగం, చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఈ పాలసీ కింద ప్రకటించిన రాయితీ, ప్రోత్సాహకాలు మరింత మందికి పొడిగించేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పాలసీని సవరిస్తామని వివరించారు. ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల తయారీ.. జహీరాబాద్‌లోని మహీంద్రా కంపెనీలో జపాన్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రారంభించనున్నామని ఆ సంస్థ సీఈఓ, ఎండీ పవన్ గోయంకా ఈ కార్యక్రమంలో ప్రకటన చేయగా, మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా ప్రపంచ, దేశ ఆర్థిక వ్యవస్థ బాగా లేకున్నా రాష్ట్రం ఐదేళ్లుగా సుస్థిరంగా 14.2 శాతం జీఎస్డీపీని సాధిస్తూ వస్తోందన్నారు. ఈఓడీబీలో మూడో ర్యాంకుతో ఈసారి కొంత కిందకుపోయినా, మళ్లీ పుంజుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. టీఎస్–ఐపాస్ ద్వారా ఇప్పటికే రాష్ట్రానికి 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందని, జాతీయ ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు 8 శాతం ఉండగా, రాష్ట్ర వృద్ధిరేటు 18శాతం ఉందన్నారు. రైల్వేస్టేషన్లు, బస్ డిపోలు, పెట్రోల్ బంకు లు, బస్టాండ్లు, ఎయిర్‌పోర్టుల వద్ద విద్యుత్ వాహనాలకు చార్జింగ్ సదుపాయం కలి్పస్తున్నామన్నారు. రాష్ట్రంలో త్వరలో 178 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,401 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రర్ అయ్యాయని, వీటిలో 4,292 ద్విచక్రవాహనాలు, 491 మోటార్ క్యాబ్స్, 194 ఈ–రిక్షా, 40 ఆర్టీసీ బస్సులున్నాయని మంత్రి అజయ్‌కుమార్ తెలిపారు. ఈ–ఆటో రిక్షాలను ప్రోత్సహించేందుకు త్వరలో ఆటో రిక్షాలపై ఉన్న ఆంక్షలు తొలగిస్తూ జీవో 135, 14కు సవరణలు తీసుకొస్తామని స్పష్టంచేశారు. ఫాస్ట్ చార్జింగ్ నెట్వర్క్.. టీఎస్ రెడ్కో, హైదరాబాద్ మెట్రో రైల్, పవర్‌గ్రిడ్, పెట్రోలియం కంపెనీలతో పాటు ఫోటం వంటి ప్రైవేట్ ప్రొవైడర్ల ఆధ్వర్యంలో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. రెసిడెన్షియల్ టౌన్ షిప్, మాల్స్ తప్పనిసరిగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ నిబంధనలు తెచి్చందన్నారు. ఆర్టీసీ తొలుత 40 ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్ల భాగస్వామ్యంతో ప్రారంభించిందని, మెయింటెనెన్స్ పూర్తిగా తగ్గి సంస్థకు లాభాలొస్తున్నాయని పేర్కొన్నారు. త్వరలో మరో 325 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ తీసుకొస్తుందని వెల్లడించారు. పలు కంపెనీలతో ఎంఓయూలు ఈ సందర్భంగా పలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. రూ.300 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రా సంస్థ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను 3–5 ఏళ్లలో రాష్ట్రంలో నెలకొల్పనుంది. దీని ద్వారా 3,500 ఉపాధికి ఉపాధి లభించనుంది. రూ.200 కోట్ల పెట్టుబడితో మైత్ర కంపెనీ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను 3–5 ఏళ్లలో స్థాపించి 2,250 మందికి ఉపాధి కల్పించనుంది. ఈటీఓ మోటార్స్ రూ.150 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ త్రీవీలర్స్ తయారీ పరిశ్రమను 3–5 ఏళ్లలో స్థాపించి 1,500 మందికి ఉపాధి కలి్పంచనుంది. మైత్ర ఎనర్జీ రూ.2 వేల కోట్లను, ఒలెక్ట్రా రూ.300 కోట్లను, ఈటీఓ మోటార్స్ రూ.150 కోట్లను, గాయం మోటార్స్ రూ.250 కోట్లను, ప్యూర్ ఎనర్జీ రూ.500 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ పెట్టుబడుల ద్వారా 14,750 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఏఆర్ఏఐ కంపెనీతో మరో ఎంఓయూ కుదుర్చుకున్నా వివరాలు వెల్లడించలేదు. మరో రెండు కంపెనీలు ఆసక్తి వ్యక్తీకరణ లేఖ అందజేశాయి. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సలహాదారుడు అన్నా రాయ్, మహీంద్రా గ్రూపు ఎండీ, సీఈఓ పవన్ గోయంకా, ఎస్ బ్యాంక్ చైర్మన్ సునీల్ మెహతా తదితరులు మాట్లాడారు. -
నకిలీ నోట్ల దందా..
నకిలీ నోట్ల చలామణి మళ్లీ మొదలైంది. గతంలో ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా జరిగిన నోట్ల చలామణి ప్రస్తుతం మళ్లీ పుంజుకున్నట్లు తెలుస్తోంది. నోటును నిశితంగా పరిశీలిస్తే ఏది నకిలీ.. ఏది అసలు నోటు అనేది తేల్చుకోలేని పరిస్థితి. కొన్ని బ్యాంకులకు చెందిన ఏటీఎంల నుంచి కూడా రూ.వంద, రూ.500 నోట్లు నకిలీవి వస్తున్నట్లు పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి నకిలీ నోట్లను ఈ ప్రాంతానికి తరలించి.. కొందరు బుకీలను ఏర్పాటు చేసుకుని వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. నోట్ల కట్టల్లో వీటిని జొప్పించి వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నకిలీ నోట్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఏ నోట విన్నా నకిలీ నోట్లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. నాలుగైదేళ్ల క్రితం ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా వత్సవాయి మండలానికి చెందిన ఓ వ్యక్తి భద్రాచలం ప్రాంతానికి చెందిన మహిళ కలిసి సుమారు రూ.2కోట్ల వరకు నకిలీ నోట్ల వ్యాపారం చేస్తుండగా.. పోలీసులు పట్టుకుని వారిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే పోలీసులకు నకిలీ నోట్ల వ్యాపారం ఉమ్మడి జిల్లాలో భారీగా నడుస్తుందనే విషయం కూడా తెలిసింది. ముఖ్యంగా సత్తుపల్లి, పక్కనే ఉన్న ఏపీ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, కొత్తగూడెం, భద్రాచలానికి చెందిన పలువురు ముఠాగా ఏర్పడి.. నకిలీ నోట్ల దందా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. అప్పట్లో పోలీసుల హడావుడి ఎక్కువగా ఉండడంతో కొద్దిమేరకు వారి వ్యాపారం తగ్గించినా.. ఇటీవలి కాలంలో మళ్లీ పుంజుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సత్తుపల్లి, భద్రాచలం ప్రాంతాల్లో పలు పోలీస్స్టేషన్లలో సైతం నకిలీ నోట్ల చలామణిపై కేసులు నమోదయ్యాయి. 60–40 పర్సంటేజీ.. నకిలీ నోట్ల వ్యాపారంలో ముఖ్యంగా 60–40 పర్సంటేజీ విధానంలో వ్యాపారం సాగుతున్నట్లు తెలిసింది. ఉదా.. నకిలీ నోట్ల వ్యాపారం చేసే వ్యక్తికి రూ.40వేలు ఇస్తే.. వారికి నకిలీ నోట్లు సరఫరా చేసే వ్యక్తి తిరిగి రూ.లక్ష నకిలీ నోట్లు ఇస్తాడు. ఈ మేరకు వారు ఆ నోట్లను అసలైన నోట్ల మధ్యలో పెట్టి చలామణి చేస్తారు. దీనికి సంబంధించి కొందరు బుకీలను సైతం ఏర్పాటు చేసుకుని.. నోట్లను ఎవరికీ అనుమానం రాకుండా దర్జాగా చలామణి చేస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ నుంచి సరఫరా.. కోల్‌కతా సరిహద్దు బంగ్లాదేశ్ వద్ద గల సిలిగురి ప్రాంతం నుంచి నకిలీ నోట్లు దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి నకిలీ నోట్లను సరఫరా చేసుకోవడం కోసం కొందరు ముఠాగా ఏర్పడి.. సిలిగురి వెళ్లి అక్కడి నుంచి రైళ్లు, బస్సులు, అవసరమైతే లారీల్లో కూడా సూట్‌కేసులలో దుస్తుల కింద అమర్చి నకిలీ నోట్లను తీసుకొస్తున్నట్లు సమాచారం. నోట్లలో ఎక్కువగా రూ.100, రూ.500 నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏటీఎంలలోకి ఎలా వస్తున్నాయి? ఇటీవలి కాలంలో నేరుగా నకిలీ నోట్లు ఏటీఎంలలో కూడా వస్తుండడంతో ఖాతాదారులు బెంబేలెత్తుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఏటీఎంలలో నకిలీ నోట్లు రావడానికి బ్యాంకు సిబ్బందికి.. నకిలీ నోట్ల ముఠాకు సంబంధం ఉండడం.. లేదా ఏటీఎంలలో డబ్బులు పెట్టే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ వారితో సంబంధాలు ఉండి ఉండవచ్చనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పోలీసుల నిఘా తగ్గడంతో మళ్లీ ఉమ్మడి జిల్లాలో నకిలీ నోట్ల వ్యాపారం ఊపందుకుంది. వాస్తవానికి నకిలీ నోట్ల వ్యవహారానికి సంబంధించి సీఐడీ అధికారులు కేసులను దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అయితే వారెక్కడా అందుబాటులో లేకపోవడంతో స్థానిక పోలీసులు కేసులను దర్యాప్తు చేస్తుంటారు. వెంటనే పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి నకిలీ నోట్ల చలామణికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు, బ్యాంకు ఖాతాదారులు కోరుతున్నారు. దుకాణంలో తేలింది.. సతీష్(పేరు మార్చాం) నగరంలోని ఏటీఎంలోకి వెళ్లి రూ.వెయ్యి డ్రా చేశాడు. రూ.500 నోటుతోపాటు రూ.100 నోట్లు ఐదు వచ్చాయి. వాటిలో నుంచి వంద నోట్లు మూడు తీసి సరుకులు కొనుగోలు చేశాడు. సతీష్ ఇచ్చిన నోట్లలో ఒక నోటును షాపు యజమాని మళ్లీ సరుకు కొనుగోలు చేసిన వ్యక్తికే ఇచ్చాడు. ఇదేమిటంటే.. అది నకిలీ నోటు అని తేల్చి చెప్పాడు. దీంతో బిత్తరపోయిన సతీష్.. ఇప్పుడే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేశానని షాపు యజమానితో వాదనకు దిగాడు. దీంతో షాపు యజమాని అసలు నోటు, నకిలీ నోటుకు తేడా చూపించడంతో సతీష్ నోరెళ్లబెట్టాడు. అయితే ఏటీఎంకు సంబంధించిన బ్యాంకుకు సతీష్ వెళ్లి విచారణ చేయగా.. మాకు సంబంధం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేయండి అంటూ బ్యాంకు సిబ్బంది సలహా ఇచ్చారు. చేసేది లేక సతీష్ ఇంటిదారి పట్టాడు. నకిలీ’ని అరికట్టాలి.. నకిలీ నోట్ల చలామణిని అరికట్టేందుకు పోలీసు లు, బ్యాంకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో నకిలీ నోట్లు ఎక్కువగా వస్తున్నాయి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ఈ నోట్లను చలామణి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – శ్రీనివాసరావు, ప్రైవేట్ లెక్చరర్ ‘100’కు సమాచారం ఇవ్వాలి.. ఖాతాదారులకు ఏటీఎం ద్వారా నకిలీ నోట్లు వస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. అక్కడ పట్టించుకోకపోతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. డ్రా చేసిన రశీదును దగ్గర పెట్టుకోవాలి. నకిలీ నోట్లు నంబర్‌ను స్కాన్ చేసినప్పుడు తెలిసిపోతుంది. నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు తెలిస్తే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. – వెంకట్రావు, ఖమ్మం ఏసీపీ -
జినోమ్ వ్యాలీలో బీ–హబ్
సాక్షి, హైదరాబాద్: బయో టెక్నాలజీ, బయో ఫార్మా రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, తయారీ రంగాల్లో ప్రవేశించే పరిశ్రమలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో బీ–హబ్‌ను ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. రూ.60 కోట్ల వ్యయంతో ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్య పద్ధతి (పీపీపీ)లో హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. బయో ఫార్మా రంగ పరిశోధనలకు ఊతమిచ్చేలా ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం దేశంలోనే తొలిసారని.. హబ్ ఏర్పాటుతో సుమారు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశోధనశాలలు, పరిశోధనల కోసం ఇంక్యుబేటర్, ఉత్పత్తి సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. బీ–హబ్ ఏర్పాటుపై మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీ–హబ్‌తో బయో ఫార్మా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు. స్వదేశీ కంపెనీలకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు. ప్రపంచంలో బయో ఫార్మా రంగంలో ముందున్న కొరియా, చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాల స్థాయిలో పరిశోధన, తయారీ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బయో ఫార్మా రంగంలో పరిశోధనలు చేస్తున్న ఔత్సాహికులు తమ పరిశోధన ఫలితాలను ఉత్పత్తి దశకు తీసుకెళ్లడంలో ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లకు బీ–హబ్ పరిష్కారం చూపనుందని మంత్రి వివరించారు. హైదరాబాద్ స్థానం సుస్థిరం ఫార్మా పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన బిజినెస్ ప్లానింగ్, జీవ కణాలపై పరిశోధనలు, ప్రాసెస్ డెవలప్మెంట్, రిస్క్ అసెస్మెంట్ లాంటి అనేక అంశాల్లో బీ–హబ్ ఎంతో ఉపయోగపడుతుందని కేటీఆర్ చెప్పారు. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో విస్తరణ ప్రణాళికలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్న నగరంలోని ఔషధ పరిశ్రమలకు ఈ హబ్ ఊతమిస్తుందని పేర్కొన్నారు. ఫార్మా కంపెనీల ప్రీ క్లినికల్ అధ్యయనాల కోసం బయో ఫార్మా స్కేల్ అప్ ప్రయోగశాలతోపాటు సెల్ లైన్ డెవ లప్మెంట్, క్లోన్ సెలక్షన్, అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ డెవలప్మెంట్, స్మాల్ స్కేల్ ప్రొడక్షన్ వంటి అనేక సదుపాయాలు హబ్‌లో అందుబాటులోకి వస్తాయని అన్నారు. దీంతో భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ స్థానం మరింత సుస్థిరం అవుతుందని చెప్పారు. దేశంతోపాటు ఆసియా ఖండంలోనే ఫార్మా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న జినోమ్ వ్యాలీలో ఇప్పటికే 200పైగా కంపెనీల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. పదేళ్లలో 4 లక్షల ఉద్యోగాలు లక్ష్యం జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఔషధ, బయో టెక్నాలజీ కంపెనీలకు అనుసంధానంగా ఏర్పాటు చేయబోయే బీ–హబ్‌తో ఆయా కంపెనీలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పరిశోధనలు నిర్వహించి ఉత్పత్తులు తయారు చేసేందుకు, మార్కెట్ చేసేందుకు, సమయాన్ని తగ్గించేందుకు వీలు కలుగుతుందని మంత్రి వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ వ్యాక్సిన్ హబ్ ఆఫ్ ఇండియాగా ఉందని, రానున్న పదేళ్లలో 4 లక్షల ఉద్యోగాలను కల్పించడంతో పాటు సుమారు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే జినోమ్ వ్యాలీ 2.0, హైదరాబాద్ ఫార్మా సిటీ, మెడికల్ డివైసెస్ పార్ట్, లైఫ్ సైన్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చేపట్టనున్న బీ–హాబ్ తమ లక్ష్యాలు అందుకోవడంలో విజయవంతం అవుతుందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో 50 మోటో హబ్స్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రిటైల్ స్టోర్ల విస్తరణపై మోటోరోలా ఇండియా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘మోటో హబ్’ పేరిట ఒకేసారి 12 పట్టణాల్లో 50 స్టోర్లను ప్రారంభించింది. ఇటీవలే విడుదల చేసిన మోటో ఎక్స్4, మోటో జే2 ఫోర్స్‌తో పాటు మోటో ఈ4ప్లస్, మోటీజీ5 ఎస్‌ప్లస్ సహా అన్ని రకాల మోడల్స్ ఈ ఔట్లెట్లలో అందుబాటులో ఉంటాయని మోటోరోలా మొబిలిటీ ఇండియా రీజనల్ సేల్స్ హెడ్ బీవీ మల్లిఖార్జున రావు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి 100 నగరాల్లో 1,000 స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వీటితోపాటు బిగ్‌సీ, లాట్ మొబైల్స్‌తో కూడా మోటోరోలా ఒప్పందం కుదుర్చుకుంది. -
టూరిజం హాబ్‌గా గోదావరి జిల్లాలు
నన్నయ వీసీ ఆచార్య ముత్యాలునాయుడు రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఉభయ గోదావరి జిల్లాలను టూరిజం హాబ్‌గా తయారు చేసేందుకు అనేక అవకాశాలు, సదుపాయాలు ఉన్నాయని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. ఈ జిల్లాలు అతిథి మర్యాదలకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్నాయి కనుకనే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు అనేకమంది పర్యాటకులు వస్తుంటారన్నారు. ఏపీ టూరిజం సహకారంతో నన్నయ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో క్యాబ్ డ్రైవర్లకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ పర్యాటకరంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలను, సదుపాయాలను, వనరులను తెలియజేశారు. ఒక ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే క్యాబ్ డ్రైవర్ల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. క్యాబ్ డ్రైవర్లు తమ ప్రవర్తనతో పర్యాటకులను ఆకుట్టుకోవాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన యూనివర్సిటీ అకడమిక్ డీన్ ఆచార్య ఎస్.టేకి మాట్లాడుతూ ఒకసారి వచ్చిన ప్రయాణికుడు మళ్లీ వచ్చేందుకు ఆసక్తిని చూపించేలా మీ నడవడిక, ప్రవర్తన ఉండాలన్నారు. క్యాబ్ డ్రైవర్ల ప్రవర్తన నియమావళి, టూరిజం పద్ధతులు, ప్రాథమిక చికిత్స విధానం, కమ్యూనికేషన్, ట్రాఫిక్ రూల్స్ అనే ఐదు అంశాలపై ఈ శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం వారికి కిట్‌తోపాటు రూ.500 పారితోషికం, స్టిక్కర్లు అందజేశారు. ప్రోగ్రామ్ అధికారి శశాంక్, మేనేజ్మెంట్ అధ్యాపకులు కె.సాయిబాబా, ఐ.ఎస్.ఎస్.రాజు, రాజేంద్రప్రసాద్, పద్మవళ్లి, డాక్టర్ ఎం.రమేష్, జి.అలీస్‌జాయ్, ఎ.శ్రీనివాస్, జె.రవిశంకర్ పాల్గొన్నారు. -
టూరిజం హబ్‌కు గేట్ వేగా ఎస్.యానాం
తీరంలో కలెక్టర్ పర్యటన ఉప్పలగుప్తం : ఎస్ యానాం సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే క్రమంలో తీర ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ శనివారం పరిశీలించి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ద్వారా పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. చిర్రయానాం నుంచి ఓడలరేవు వరకూ ఉన్న సముద్ర తీరాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో రూ.రెండు వేల కోట్లతో చిర్రయానాంలో టూరిజం హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ప్రధాన రహదారులకు దగ్గరగా ఉన్న ఎస్.యానాం తీరాన్ని టూరిజం హబ్‌కు గేట్వేగా చెయ్యాలన్న ఎమ్మెల్యే ప్రతిపాదనపై కలెక్టర్ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. తీరాన్ని ఆనుకుని ఉన్న వైట్ శాండ్ బీచ్ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుందని, రిసార్టుల ఏర్పాటు, పర్ర ప్రాంతంలో బోట్ షికారుతో ఎస్ యానాం తీరాన్ని టూరిజంలో అభివృద్ధి చెయ్యాలని గత ఏడాది ఉప ముఖ్యమంత్రి రాజప్పతో శంకుస్థ్ధాపన కూడా చేశారని ఎమ్మెల్యే కలెక్టర్ అరుణ్‌కుమార్‌కు వివరించారు. అమలాపురం నుంచి ఉన్న హైవే దారికి ఎస్.యానాం దగ్గరవుతుందని, పర్యాటకులకు ఈ మార్గం అనుకూలంగాను, దగ్గరగా ఉంటుందన్నారు. బీచ్ వరకూ సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుందని, తీరంలో రక్షణ గట్టు అభివృద్ధికి రూ.10లక్షలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే గ్రామంలో సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలిం చారు. పంచాయతీరాజ్ ఈఈ బి.సత్యనారాయణరాజు, డీఈజే మురళీకృష్ణలతో ఆయన మాట్లాడారు. ఇ¯ŒSచార్జి సర్పంచ్ పినిశెట్టి నరసింహరావు, ఎంపీటీసీ సభ్యుడు పలచోళ్ల వీరరాఘవుల నాయుడు, నీటిసంఘ చైర్మ¯ŒS దంగేటి చిట్టిబాబు, గ్రామ పెద్దలు ఉన్నారు. ఉపాధికి గండి పడుతుంది ఉప్పలగుప్తం : సముద్రపు పర్ర ప్రాంతం అన్యాకాంతం కావడంతో చేపల వేటకు గండిపడి ఉపాధికి గండి పడుతున్నదని కలెక్టర్ అరుణ్‌కుమార్‌కు మత్స్యకార సొసైటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మత్స్యకార నాయకుడు, ఎస్.యానాం మాజీ సర్పంచ్ లంకే భీమరాజు, సొసైటీ సభ్యులు పి.పోతురాజు, ఎం.భైరవ స్వామిలు వినతి పత్రం ఇచ్చి ఇక్కడ పరిస్థితులను వివరించారు. -
ఫోన్ల తయారీ హబ్‌గా ఉత్తరప్రదేశ్
దేశంలో తయారవుతున్న మొబైళ్లలో సగం ఇక్కడి నుంచే న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఉత్తరప్రదేశ్ (యూపీ) అవతరించింది. భారత్‌లో తయారవుతున్న మొత్తం మొబైల్ హ్యాండ్సెట్లలో యూపీ వాటా సగం వరకు ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్స తాజా గణాంకాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నారుు. దీని ప్రకారం.. 2015 సెప్టెంబర్ నుంచి దేశంలో 38 కొత్త మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటయ్యారుు. వీటి సామర్థ్యం నెలకు రెండు కోట్ల యూనిట్ల పైమాటే. ఈ రెండు కోట్ల యూనిట్లలో యూపీ వాటానే కోటిగా ఉంది. ఇక యూపీ తర్వాతి స్థానంలో 25 లక్షల యూనిట్ల వాటాతో హరియాణ నిలిచింది. అలాగే దేశవ్యాప్తంగా ఏర్పాటైన 38 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో 13 వరకు యూపీలోనే ఉన్నారుు. ఢిల్లీలో ఆరు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు యూనిట్ల స్థాపన జరిగింది. హరియాణ, ఉత్తరఖండ్‌లలో మూడు చొప్పున, మహరాష్ట్ర, తెలంగాణలలో రెండు చొప్పున ఏర్పాటయ్యారుు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, దామన్‌లలో ఒకటి చొప్పున ఉన్నారుు. యూనిట్లు 38 కాదు.. 39: ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ (ఐసీఏ) మాత్రం దేశంలో ఈ ఏడాది జూలై నాటికి 39 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయని చెబుతోంది. దీని ప్రకారం.. యూపీలో 15 యూనిట్లు ఏర్పాటయ్యారుు. ఇక ఏపీలో ఐదు ఉన్నారుు. హరియాణలో మూడు యూనిట్లు ఉన్నారుు. ఉత్తరఖండ్, ఢిల్లీలలో నాలుగు చొప్పున, తెలంగాణ, మహరాష్ట్రలలో రెండు చొప్పున యూనిట్లు ఏర్పాటయ్యారుు. ఇక తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, దామన్‌లలో ఒకటి చొప్పున యూనిట్లు ఉన్నారుు. -
టెక్నాలజీ స్టార్టప్‌లో భారత్‌కు 3వ స్థానం
-
రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా మారుస్తాం
మంత్రి గంటా శ్రీనివాసరావు ఇబ్రహీంపట్నం: రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్య, విజ్ఞాన సమాజం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఉన్నత, ప్రాథమిక, సాంకేతిక శాఖలను మానవ వనరుల శాఖలో విలీనం చేశామన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సుమిత దావ్రా మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో ఉత్తీర్ణతా శాతం 45 నుంచి 66 శాతానికి పెరగడం శుభసూచికమన్నారు. సాంకేతిక, కళాశాలల విద్యా కమిషనర్ బి.ఉదయలక్ష్మీ మాట్లాడుతూ అంబేడ్కర్ ఒవర్సిస్ విద్యానిధి పథకం కింద రెండేళ్లల్లో రూ.8.65 కోట్లు ఖర్చుపెట్టి 117 మంది పేద విద్యార్థులు చదువుకునేలా చేశామని చెప్పారు. ఎమ్మెల్సీ రామకృష్ణ, ఉన్నత విద్యామండలి అధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి, కృష్ణా యూనివర్సిటీ ఉప కులపతి రామకృష్ణారావు, ఎన్టీరంగా యూనివర్శిటీ వైస్ చాన్సలర్ రాజేంద్రకుమార్, విద్యాశాఖ కమిషనర్ ఎ.సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
బెంగళూరులోఐబీఎం గ్లోబల్ హబ్ ప్రారంభం
బెంగళూరు: యాపిల్ గ్యారేజ్ కోసం ఐబీఎం కంపెనీ బెంగళూరులో ప్రపంచ స్థాయి అభివృద్ధి కేంద్రం (హబ్) ఏర్పాటు చేసింది. మొబైల్ ఫస్ట్ పేరుతో గురువారం ప్రారంభమైన ఈ కేంద్రంలో ఐఓఎస్ యాప్స్ రూపకల్పన జరగనుంది. డిజైన్ దగ్గర నుంచి అభివృద్ధి, టెస్టింగ్, డెలివరీ, నిర్వహణ వరకు అన్ని రకాల సేవలను అందించే తొలి కేంద్రం ఇదే కావడం విశేషం. క్లయింట్లు తమ డిజిటల్ మొబిలిటీ ప్రాజెక్టులను వేగవంతంగా ఇక్కడ పూర్తి చేసుకోవడానికి వీలవుతుందని ఐబీఎం యాపిల్ పార్ట్నర్షిప్ జనరల్ మేనేజర్ మహమ్మద్ నాగ్‌షినే తెలిపారు. ఈ కేంద్రం ఐఓఎస్ యాప్స్‌కు ప్రపంచ స్థాయి అభివృద్ధి కేంద్రంగా పనిచేస్తుందని... ప్రస్తుత డిజైన్ కేంద్రాలైన అట్లాంటా, చికాగో, క్యుపర్టినో, టొరొంటో కేంద్రాలతో కలసి పనిచేస్తుందని చెప్పారు. యాప్స్ అభివృద్ధిలో భారత ఇంజనీర్ల కీలక పాత్ర యాప్స్ అభివృద్ధి కోసం ఐబీఎం 2014లో యాపిల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భారత్‌లోని ఉద్యోగుల పాత్ర కీలకమని నాగ్‌షినే తెలిపారు. ఇప్పటి వరకు 100 యాప్స్‌ను అభివృద్ధి చేయగా, అందులో సగంపైన యాప్స్ అభివృద్ధిలో ఇక్కడి టీమ్ పాత్ర కీలకమని చెప్పారు. -
హైదరాబాద్‌లో సెల్‌ఫోన్ తయారీ హబ్
హైదరాబాద్: రాష్ట్రంలో మొబైల్ ఫోన్ల తయారీ హబ్‌ను నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వాటికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో పాటు సదుపాయాలను కూడా కల్పించాలని సూచించారు. హైదరాబాద్‌లో మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు మంగళవారం సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. మొబైల్ హార్డ్‌వేర్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తామని ఈ సందర్భంగా సీఎం వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దేశంలోనే మొదటి మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీల మధ్య సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ మహేంద్ర, కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ హసీజా, ఫాక్స్‌కాన్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు యోయో, జోహ్ఫౌల్టర్, సెల్కాన్ ఎండీ వై.గురు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మరళి, వాటర్‌వరల్డ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి టోని తదితరులు సీఎంను కలిశారు. అంతకు ముందు వారంతా మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటుకు అనువైన స్థల ం కోసం రంగారెడ్డి జిల్లా పరిధిలోని మామిడిపల్లి, మహేశ్వరం, రావిర్యాల్ ప్రాంతాల్లో భూములను పరిశీలించారు. ఈ హబ్ ద్వారా సుమారు రెండు లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. -
‘స్మార్ట్’గా మారుస్తా
⇒ చిత్తూరు, తిరుపతిని స్మార్‌టసిటీలు చేస్తా ⇒ పండ్ల తోటల హబ్‌గా జిల్లా ⇒ ఆన్లైన్లో రైతు ఉత్పత్తుల విక్రయాలు ⇒ రెండు రోజుల్లోనే చెరకు బకాయిల చెల్లింపులు ⇒ చిత్తూరు సభలో చంద్రబాబు హామీలు సాక్షి, చిత్తూరు: చిత్తూరు, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. జిల్లాను పండ్లతోటల హబ్‌గా చేస్తానని, డెయిరీకి ప్రోత్సాహం అందిస్తానని కూడా చెప్పారు. రెండు రోజుల్లో చెరకు రైతుల బకాయిలను చెల్లిస్తామని ప్రకటించారు. గురువారం చిత్తూరులో జరిగిన రైతు సాధికారత సభలో చంద్రబాబు మాట్లాడుతూ జన్మనిచ్చిన చిత్తూరును మరవనన్నారు. కరువు జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదన్నారు. హంద్రీ-నీవా పూర్తిచేసి జిల్లా ప్రజలకు తాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పేదిలేదన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పారు. 80 నుంచి 90 శాతం మంది అర్హులకు పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు. రాబోయే కాలంలో ప్రతి కుటుంబంలో సభ్యులందరికీ ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీల పరిధిలో రూ.20 కోట్లు చెరకు బకాయిలను రెండు రోజుల్లో చెల్లించనున్నట్లు చెప్పారు. పండ్లతోటల రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించారు. 50 శాతం సబ్సిడీతో రైతులకు మైక్రోన్యూట్రిన్స్ సప్లై చేస్తామన్నారు. వర్మీ కల్చర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాములు, కాలువలను ఆధునీకరించాలని నిర్ణయించామని చెప్పారు. జిల్లాలో 1,75లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఉందని, ఈ ఏడాది మరో 20 వేల ఎకరాల్లో డ్రిప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దా దాపు 40వేల ఎకరాల్లో స్ప్రింక్లర్లతో వ్యవసాయం అభివృద్ధి చేయనున్నట్లు బాబు చెప్పారు. జిల్లాను పండ్లతోటల హబ్‌గా చేస్తామని, మామిడి ఎగుమతులు పెరి గేలా చూస్తామని తెలిపారు. రైతుల ఉత్పత్తులు ఆన్లైన్లో జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రూ. 16వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా ఇచ్చిన మాటమేరకు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతామన్నారు. 40.38లక్షల మందికి రుణమాఫీ చేసినట్లు తెలిపారు. 22.79 వేల కుటుంబాలకు రుణవిముక్తి పత్రాలు ఇస్తున్నామన్నారు. పొరపాట్లు జరిగి ఉంటే రెండో దశలో పూర్తిచేస్తామన్నారు. చిత్తూరు జిల్లా లో 3.5లక్షల మంది రైతులకు రుణవిముక్తి కలిగిందన్నారు. అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ శివప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణీ, ఎమ్మెల్యే డీఏ.సత్యప్రభ, కార్పొరేషన్ మేయర్ కఠారి అనురాధ, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, జేసీ భరత్‌గుప్త, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, తుడా కార్యదర్శి మాధవీలత, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.