న్యూఢిల్లీ: దేశీయంగా రసాయనాలకు డిమాండ్ పెరుగుతోంది. రాబోయే రెండు దశాబ్దాల్లో అంతర్జాతీయంగా రసాయనాల వినియోగంలో అయిదో వంతు వాటా భారత్‌దే ఉండనుంది. 2040 నాటికి ఇది 1,000 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 82,00,000 కోట్లు) చేరనుంది. ’తదుపరి రసాయనాల తయారీ హబ్‌గా భారత్’ పేరిట రూపొందించిన నివేదికలో కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే ఈ విషయాలు వెల్లడించింది.
గత దశాబ్దకాలంగా ఇటు రసాయనాల వినియోగంలోనూ, అటు షేర్‌హోల్డర్ల కు సంపద సృష్టిలోనూ భారత కెమికల్స్ రంగం అంతర్జాతీయ పరిశ్రమను మించి రాణించిందని పేర్కొంది. ప్రస్తుతం ఇటు వినియోగం అటు తయారీ.. రెండింటిలోనూ అంతర్జాతీయంగా ఆధి పత్య పాత్ర పోషించే స్థాయిలో భారత్ ఉందని మెకిన్సే వివరించింది. 2021–27 మధ్య కాలంలో పరిశ్రమ 11–12 శాతం, 2027–40 మధ్య 7–10 శాతం మేర వృద్ధి చెందవచ్చని పేర్కొంది. 2040 నాటికి అంతర్జాతీయంగా తన మార్కెట్ వాటాను మూడు రెట్లు పెంచుకోవచ్చని వివరించింది.
‘వచ్చే రెండు దశాబ్దాల్లో అదనంగా పెరిగే రసాయనాల వినియోగంలో భారత్ వాటా 20 శాతం పైగా ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. దేశీయంగా డిమాండ్ 2021లో 170–180 బిలియన్ డాలర్లుగా ఉండగా .. 2040 నాటికి 850–1,000 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది‘ అని మెకిన్సే వివరించింది.
అన్నింటా వినియోగం..
రసాయనాలు ప్రస్తుతం రోజువారీ ఉత్పత్తుల్లో భా గంగా మారిపోయాయి. డిటర్జెంట్లు, దుస్తులు మొ దలుకుని సుగంధ పరిమణాలు, క్రిమి సంహారకా లు, పెయింట్ల వరకు వివిధ రంగాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. అంతర్జాతీయంగా పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుండటం భారత్‌కు లాభించగలదని మెకిన్సే పేర్కొంది. ఆ యా ఉత్పత్తుల్లో వినియోగించే అనేక రసాయనా లను తయారు చేసే టాప్ దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉండటం ఇందుకు కారణమని వివరించింది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు మారిపోతుండటం, పలు దేశాలు ప్రస్తుతమున్న కీలక తయారీ మార్కెట్లకు ప్రత్యామ్నాయాలను అన్వేíÙస్తుండటం వంటి పరిణామాల నేపథ్యంలో భారత్ కీలక గమ్యస్థానంగా మారేందుకు అవకాశం ఉందని పేర్కొంది.
సవాళ్లున్నప్పటికీ ..
దేశీ కంపెనీలు క్రాకర్ సామరŠాధ్యల లేమి, కీలక ఖనిజాల కొరత తదితర సమస్యలు ఎదుర్కొంటున్నాయని మెకిన్సే తెలిపింది. అలాగే పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో సుశిక్షితులైన నిపుణుల కొరత, సమయానికి పర్యావరణ అనుమతులు, స్థలపరమైన కేటాయింపులు జరగకపోతుండటం వంటి సవాళ్లు కూడా ఉంటున్నాయని పేర్కొంది. అయినప్పటికీ తక్కువ మూలధనం, చౌకగా కారి్మకుల లభ్యత తదితర అంశాల కారణంగా పలు రసాయనిక విభాగాల్లో భారత్ ఇప్పటికీ చవకైన మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది. మరోవైపు, భారత్ రసాయనాల తయారీలో కీలకంగా మారుతున్నప్పటికీ తనకు అవసరమైన కెమికల్స్ కోసం మాత్రం దిగుమతులపై ఆధారపడాల్సి ఉంటోంది.
రసాయనాల పరిశ్రమలో అసేంద్రీయ, పెట్రోకెమికల్స్, స్పెషాలిటీ అంటూ మూడు ప్రధాన విభాగాలు ఉన్నాయి. వీటిలో స్పెషాలిటీ కెమికల్స్ మాత్రమే నికరంగా ఎగుమతి చేయగలుగుతోంది. కీలకమైన ముడివనరులు, ఖనిజాలు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా అసేంద్రీయ, పెట్‌కెమ్ విభాగాలు దిగుమతులపైనే ఆధారపడటం కొనసాగవచ్చని మెకిన్సే వివరించింది. భారత్‌లో రసాయనాల వినియోగానికి స్పెషాలిటీ కెమికల్స్ విభాగం ఊతమివ్వగలదని పేర్కొంది. 2040 నాటికి భారత నికర ఎగుమతుల్లో ఈ విభాగం వాటా 10 రెట్లు పెరిగి 20 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోగలదని తెలిపింది. ప్రస్తుతం ఇది 2 బిలియన్ డాలర్లు.
Comments
Please login to add a commentAdd a comment