బెంగళూరులోఐబీఎం గ్లోబల్ హబ్ ప్రారంభం | Apple, IBM to Open First Global App Development Hub in India | Sakshi
Sakshi News home page

బెంగళూరులోఐబీఎం గ్లోబల్ హబ్ ప్రారంభం

Published Fri, Aug 5 2016 1:36 AM | Last Updated on Mon, Aug 20 2018 2:58 PM

బెంగళూరులోఐబీఎం గ్లోబల్ హబ్ ప్రారంభం - Sakshi

బెంగళూరులోఐబీఎం గ్లోబల్ హబ్ ప్రారంభం

 బెంగళూరు: యాపిల్ గ్యారేజ్ కోసం ఐబీఎం కంపెనీ బెంగళూరులో ప్రపంచ స్థాయి అభివృద్ధి కేంద్రం (హబ్) ఏర్పాటు చేసింది. మొబైల్ ఫస్ట్ పేరుతో గురువారం ప్రారంభమైన ఈ కేంద్రంలో ఐఓఎస్ యాప్స్ రూపకల్పన జరగనుంది. డిజైన్ దగ్గర నుంచి అభివృద్ధి, టెస్టింగ్, డెలివరీ, నిర్వహణ వరకు అన్ని రకాల సేవలను అందించే తొలి కేంద్రం ఇదే కావడం విశేషం. క్లయింట్లు తమ డిజిటల్ మొబిలిటీ ప్రాజెక్టులను వేగవంతంగా ఇక్కడ పూర్తి చేసుకోవడానికి వీలవుతుందని ఐబీఎం యాపిల్ పార్ట్‌నర్‌షిప్ జనరల్ మేనేజర్ మహమ్మద్ నాగ్‌షినే తెలిపారు. ఈ కేంద్రం ఐఓఎస్ యాప్స్‌కు ప్రపంచ స్థాయి అభివృద్ధి కేంద్రంగా పనిచేస్తుందని... ప్రస్తుత డిజైన్ కేంద్రాలైన అట్లాంటా, చికాగో, క్యుపర్టినో, టొరొంటో కేంద్రాలతో కలసి పనిచేస్తుందని చెప్పారు.

 యాప్స్ అభివృద్ధిలో భారత ఇంజనీర్ల కీలక పాత్ర
యాప్స్ అభివృద్ధి కోసం ఐబీఎం 2014లో యాపిల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భారత్‌లోని ఉద్యోగుల పాత్ర కీలకమని నాగ్‌షినే తెలిపారు. ఇప్పటి వరకు 100 యాప్స్‌ను అభివృద్ధి చేయగా, అందులో సగంపైన యాప్స్ అభివృద్ధిలో ఇక్కడి టీమ్ పాత్ర కీలకమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement