హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) హైదరాబాద్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిసర్చ్ హబ్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు, ఆర్థిక అక్షరాస్యత, విధాన రూపకల్పనలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర, సులభతర వ్యాపారంతో కూడిన సుపరిపాలన తదితర అంశాలపై ఈ కేంద్రం లోతైన అధ్యయనాలను నిర్వహిస్తుందని ఐసీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పరిశోధన కార్యక్రమాల ద్వారా వెల్లడైన అంశాలను ప్రభుత్వంతో పంచుకుంటామని వివరించింది. కాగా, సెంటర్ డైరెక్టర్, డీన్‌గా నుపుర్ పవన్ బంగ్‌ను ఐసీఏఐ నియమించింది. జైపూర్‌లోనూ ఐసీఏఐకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. కోల్‌కతలో ఇటువంటి కేంద్రాన్ని 2025 జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా మరో ఎనిమిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను నెలకొల్పాలని ఐసీఏఐ యోచిస్తోంది. దాదాపు 9.85 లక్షల మంది విద్యార్థులు, 4 లక్షల మంది సభ్యులతో ఐసీఏఐ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ అకౌంటెన్సీ సంస్థ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment