అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం (ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్) చైనాను వీడుతోంది. అక్కడి కీలక పరిశోధనా విభాగాన్ని మూసివేస్తోంది. దీంతో 1,000 మందికి పైగా ఉద్యోగులు జాబ్స్ కోల్పోతున్నారు.
ఆర్థిక మాంద్యం, పెరిగిన నియంత్రణ పరిశీలన కారణంగా చైనాను వీడుతున్న కంపెనీల జాబితాలో ఐబీఎం చేరింది. చైనాలో కంపెనీ రీసెర్చ్ & డెవలప్‌మెంట్, టెస్టింగ్ విభాగాలకు సంబంధించిన రెండు వ్యాపార కార్యకలాపాలను మూసివేస్తోందని ఓ నివేదిక పేర్కొంది. బీజింగ్‌లో స్థానిక వ్యాపార సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో విదేశీ పెట్టుబడులు మందగించాయి. ఈ నేపథ్యంలో మోర్గాన్ స్టాన్లీ వంటి సంస్థలు తమ కార్యకలాపాలను ఇతర దేశాలకు మార్చాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
ఐబీఎం తన చైనీస్ ఆర్&డీ కార్యకలాపాలను వేరే చోటకు తరలించాలని యోచిస్తోందని తెలిసిన ఉద్యోగిని ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఇందు కోసం భారత్‌లోని బెంగళూరు లాంటి చోట్ల ఇంజనీర్లు, రీసెర్చర్లను ఈ యూఎస్ కంపెనీ నియమించుకుంటోందని ఈ విషయం గురించి వివరించిన ఉద్యోగులను ఉటంకిస్తూ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment