ఫోన్ల తయారీ హబ్గా ఉత్తరప్రదేశ్
దేశంలో తయారవుతున్న మొబైళ్లలో సగం ఇక్కడి నుంచే
న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఉత్తరప్రదేశ్ (యూపీ) అవతరించింది. భారత్‌లో తయారవుతున్న మొత్తం మొబైల్ హ్యాండ్‌సెట్లలో యూపీ వాటా సగం వరకు ఉంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్‌స తాజా గణాంకాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నారుు. దీని ప్రకారం.. 2015 సెప్టెంబర్ నుంచి దేశంలో 38 కొత్త మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటయ్యారుు. వీటి సామర్థ్యం నెలకు రెండు కోట్ల యూనిట్ల పైమాటే.
ఈ రెండు కోట్ల యూనిట్లలో యూపీ వాటానే కోటిగా ఉంది. ఇక యూపీ తర్వాతి స్థానంలో 25 లక్షల యూనిట్ల వాటాతో హరియాణ నిలిచింది. అలాగే దేశవ్యాప్తంగా ఏర్పాటైన 38 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో 13 వరకు యూపీలోనే ఉన్నారుు. ఢిల్లీలో ఆరు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు యూనిట్ల స్థాపన జరిగింది. హరియాణ, ఉత్తరఖండ్‌లలో మూడు చొప్పున, మహరాష్ట్ర, తెలంగాణలలో రెండు చొప్పున ఏర్పాటయ్యారుు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, దామన్‌లలో ఒకటి చొప్పున ఉన్నారుు.
యూనిట్లు 38 కాదు.. 39: ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ (ఐసీఏ) మాత్రం దేశంలో ఈ ఏడాది జూలై నాటికి 39 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయని చెబుతోంది. దీని ప్రకారం.. యూపీలో 15 యూనిట్లు ఏర్పాటయ్యారుు. ఇక ఏపీలో ఐదు ఉన్నారుు. హరియాణలో మూడు యూనిట్లు ఉన్నారుు. ఉత్తరఖండ్, ఢిల్లీలలో నాలుగు చొప్పున, తెలంగాణ, మహరాష్ట్రలలో రెండు చొప్పున యూనిట్లు ఏర్పాటయ్యారుు. ఇక తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, దామన్‌లలో ఒకటి చొప్పున యూనిట్లు ఉన్నారుు.