సోమవారం ఉదయం మిశ్రమంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 384.55 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 81,748.57 వద్ద, నిఫ్టీ 100.05 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో 24,668.25 వద్ద నిలిచాయి.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టైటాన్ కంపెనీ, అదానీ పోర్ట్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), హిందాల్కో ఇండస్ట్రీస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.
మిశ్రమ ప్రపంచ సూచనల మధ్య భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. సెషన్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 63.95 పాయింట్లు లేదా 0.08 శాతం క్షీణించి 82,069 వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు లేదా 0.01 శాతం పెరిగి 24,770 వద్ద చలిస్తున్నాయి.
ఈ వారంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్ నిర్ణయం కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నందున భారతదేశంలోని స్టాక్ మార్కెట్లు జాగ్రత్తగా కొనసాగే అవకాశం ఉంది. దేశీయంగా టోకు ధరల ద్రవ్యోల్బణం, వాణిజ్యం తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. అంతర్జాతీయంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ పనితీరు, ఆ దేశ కేంద్ర బ్యాంకు పరపతి విధాన సమీక్ష కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment