market updates
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
బలహీనమైన ప్రపంచ సూచనల మధ్య బెంచ్‌మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 101.13 పాయింట్లు లేదా 0.13 శాతం క్షీణించి 80,582.97 వద్ద, నిఫ్టీ 36.85 పాయింట్లు లేదా 0.15 శాతం క్షీణించి 24,299.15 వద్ద ఉన్నాయి.సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 18 నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్ నేతృత్వంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్ & టూబ్రో, మారుతీ సుజుకి ఇండియా, అదానీ పోర్ట్స్& సెజ్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌టెక్, ఐటీసీ, టైటాన్ కంపెనీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 50లో టెక్ మహీంద్రా నేతృత్వంలోని 22 లాభాలతో ట్రేడవుతున్నాయి. వీటిలో నెస్లే ఇండియా, అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉన్నాయి. ఇక పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బీపీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ట్రెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ లూజర్స్.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐపీవో బాటలో 3 కంపెనీలు
ప్రస్తుత కేలండర్ ఏడాది(2024)లో ప్రైమరీ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. గత వారం 4 కంపెనీలు ఐపీవోలు చేపట్టగా.. ఈ వారం మరో 4 కంపెనీల ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. ఈ బాటలో తాజాగా లక్ష్మీ డెంటల్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరో 2 కంపెనీలు లిస్టింగ్‌కు అనుమతించమంటూ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. మరోపక్క ఎన్లాన్ హెల్త్‌కేర్ అక్టోబర్‌లో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌ను సెబీ తాజాగా వెనక్కి పంపింది. వివరాలు చూద్దాం..ఆనంద్ రాఠీ ఆనంద్ రాఠీ గ్రూప్ బ్రోకరేజీ కంపెనీ.. ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 745 కోట్లు సమీకరించే ప్రణాళికలు వేసింది. వీటిలో రూ. 550 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్‌సహా సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. బ్రోకింగ్, మార్జిన్ ట్రేడింగ్, ఫైనాన్షియల్ ప్రొడక్టుల పంపిణీ తదితర విస్తారిత ఫైనాన్షియల్ సర్వీసులను ఆనంద్ రాఠీ బ్రాండుతో కంపెనీ ఆఫర్ చేస్తోంది. సంస్థాగత ఇన్వెస్టర్లతోపాటు రిటైల్, హెచ్ఎన్ఐలకు సేవలు సమకూర్చుతోంది. గతేడాది(2023–24) ఆదాయం 46 శాతం జంప్‌చేసి రూ. 682 కోట్లను తాకింది. నికర లాభం మరింత అధికంగా దాదాపు రెట్టింపై రూ. 77 కోట్లను దాటింది. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ. 442 కోట్ల ఆదాయం, రూ. 64 కోట్ల నికర లాభం అందుకుంది.జీకే ఎనర్జీసౌర విద్యుత్ ఆధారిత వ్యవసాయ వాటర్ పంప్ సిస్టమ్స్ కంపెనీ.. జీకే ఎనర్జీ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 84 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 422 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్‌కు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా సౌర విద్యుత్ వ్యవసాయ వాటర్ పంప్ సిస్టమ్స్‌కు సంబంధించి ఈపీసీ సేవలు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పీఎం–కేయూఎస్యూఎం పథకంలో భాగంగా సర్వీసులు సమకూర్చుతోంది. జల్‌జీవన్ మిషన్కింద నీటి నిల్వ, పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది. 2024 అక్టోబర్‌కల్లా రూ. 759 కోట్ల ఆర్డర్‌బుక్‌ను సాధించింది. గతేడాది(2023–24) ఆదాయం 44 శాతం ఎగసి రూ. 411 కోట్లను తాకింది. నికర లాభం మరింత అధికంగా రూ. 10 కోట్ల నుంచి రూ. 36 కోట్లకు జంప్‌చేసింది. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ. 422 కోట్ల ఆదాయం, రూ. 51 కోట్ల నికర లాభం అందుకుంది.లక్ష్మీ డెంటల్ రెడీసెప్టెంబర్లో ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన లక్ష్మీ డెంటల్ తాజాగా అనుమతి పొందింది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.28 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ బిజ్డెంట్ డివైసెస్‌లో పెట్టుబడులకు, కొత్త మెషీనరీ కొనుగోలుకి, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఎండ్టుఎండ్ సమీకృత డెంటల్ ప్రొడక్టుల కంపెనీ ఇది. ఎలైనర్ సొల్యూషన్స్, పీడియాట్రిక్ డెంటల్ తదితర పలు ఉత్పత్తులను రూపొందిస్తోంది. -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం మిశ్రమంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 384.55 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 81,748.57 వద్ద, నిఫ్టీ 100.05 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో 24,668.25 వద్ద నిలిచాయి.డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టైటాన్ కంపెనీ, అదానీ పోర్ట్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), హిందాల్కో ఇండస్ట్రీస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.మిశ్రమ ప్రపంచ సూచనల మధ్య భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. సెషన్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 63.95 పాయింట్లు లేదా 0.08 శాతం క్షీణించి 82,069 వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు లేదా 0.01 శాతం పెరిగి 24,770 వద్ద చలిస్తున్నాయి.ఈ వారంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్ నిర్ణయం కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నందున భారతదేశంలోని స్టాక్ మార్కెట్లు జాగ్రత్తగా కొనసాగే అవకాశం ఉంది. దేశీయంగా టోకు ధరల ద్రవ్యోల్బణం, వాణిజ్యం తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. అంతర్జాతీయంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ పనితీరు, ఆ దేశ కేంద్ర బ్యాంకు పరపతి విధాన సమీక్ష కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐపీవో బాటలో రెండు కంపెనీలు
వినియోగించిన ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లను పునరుద్ధరించే జీఎన్జీ ఎలక్ట్రానిక్స్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 825 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 97 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 320 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 260 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. కంపెనీ ఎలక్ట్రానిక్స్ బజార్ బ్రాండుతో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, సర్వర్లు, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తదితరాల పునర్వినియోగానికి వీలైన వేల్యూ చైన్‌ను నిర్వహిస్తోంది. విక్రయాలు, అమ్మకాల తదుపరి సర్వీసులు, వారంటీ సేవలు అందిస్తోంది. కొత్త ప్రొడక్టులతో పోలిస్తే 35–50 శాతం తక్కువ ధరలకే అందిస్తోంది. భారత్‌సహా యూఎస్, యూరప్, ఆఫ్రికా తదితర ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించింది.ఎలిగంజ్ ఇంటీరియర్స్ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు ఎన్ఎస్ఈ ఎమర్జ్ వద్ద ఎలిగంజ్ ఇంటీరియర్స్ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 60.05 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఐపీఓ అనంతరం షేర్లను ఎన్ఎస్ఈ ఎమర్జ్ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో నమోదు చేస్తామని పేర్కొంది.సమీకరించిన నిధుల్లో రూ.25 కోట్లు రుణాలను చెల్లించేందుకు, రూ.30 కోట్లు మూలధన వ్యయానికి, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తామని వివరించింది. ఈ ఇష్యూకు వివ్రో ఫైనాన్సియల్ సర్వీసెస్ బుక్ రన్నింగ్ మేనేజర్‌గా, బిగ్‌షేర్ సర్వీసెస్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాయి. ఎలిగంజ్ ఇంటీరియర్స్ దేశవ్యాప్తంగా కార్పొరేట్, వాణిజ్య సంస్థలకు ఇంటీరియర్ ఫిట్ అవుట్ సేవలు అందిస్తోంది. -
Stock Market: స్వల్ఫ నష్టాల్లో..
Stock Market Updates: స్వల్ప నష్టాల్లో మంగళవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొనసాగుతున్నాయి. ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపు లాభాల్లో పయనించినప్పటికీ.. తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 62 పాయింట్లు నష్టపోయి 60,073.48 వద్ద.. నిఫ్టీ 14.05 పాయింట్ల నష్టంతో 17,931 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో మెజారిటీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్ ఆటో, ఐటీసీ, భారతీఎయిర్‌టెల్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, టైటన్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, మారుతీ షేర్లు రాణిస్తున్న వాటిలో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.43 వద్ద ట్రేడవుతోంది. చదవండి: స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న ఐఆర్సీటీసీ -
స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
న్యూఢిల్లీ: గురువారం దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ, ఫార్మా షేర్లు మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఈ రోజు సెన్సెక్స్ 53,044.01 పాయింట్ల వద్ద పైకి ఎగిసింది. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి కంటే ఈ రోజు మార్కెట్ ప్రారంభ సమయానికి 33 పాయింట్లు పెరిగి నిఫ్టీ 15,886.75 పాయింట్లను నమోదు చేసింది. మార్కెట్లు ప్రారంభం కాగానే ఐటీ షేర్లు జోరందుకున్నాయి. 1.90పాయిట్లతో ఎల్ అండ్ టీ, 1.59శాతంతో హెచ్‌సీఎల్,1.67శాతంతో టెక్ మహీంద్రా,1.12శాతంతో విప్రో,రిలయన్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఫార్మాలో డాక్టర్ రెడ్డీస్ లాభాలతో కొనసాగుతుండగా బ్లూచిప్ స్టాక్స్ సైతం వాటితో పోటీ పడుతున్నాయి. టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా,బజాజ్ ఫైనాన్షియల్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. -
700 పాయింట్ల ఊగిసలాట
- బ్యాంక్ షేర్ల జోరు - 141 పాయింట్ల లాభంతో 29,362కు సెన్సెక్స్ - 57 పాయింట్ల లాభంతో 8,902కు నిఫ్టీ - మార్కెట్ అప్డేట్ ఎంతగానే ఊరించిన నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రథమ బడ్జెట్ స్టాక్ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులను సృష్టించింది. బడ్జెట్ సందర్భంగా శనివారం స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో ప్రత్యేకమైన ట్రేడింగ్ నిర్వహించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 678పాయింట్లు, నిఫ్టీ 190 పాయింట్ల రేంజ్లో కదలాడాయి. నిఫ్టీ8,900 పైన ముగిసింది. కార్పొరేట్ పన్ను తగ్గింపు, గార్ వాయిదా వంటి అంశాల కారణంగా సూచీలు చివరకు లాభాల్లోనే ముగిశాయి. నాలుగేళ్లలో బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్ పెరగడం ఇదే మొదటిసారి. బ్యాంక్, ఆరోగ్య సంరక్షణ, వాహన రంగ షేర్లు జోరుగా ఉండగా, ఎఫ్ఎంసీజీ, కన్సూమర్ డ్యూరబుల్, విద్యుత్ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. భారీ సంస్కరణలేమీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు నిరుత్సాహానికి గురయ్యారు. సెన్సెక్స్ ప్లస్ 340, మైనస్ 338 పాయింట్ల రేంజ్లో, నిఫ్టీ ప్లస్ 96, మైనస్ 94 రేంజ్లో కదలాడాయి. నాలుగేళ్లలో కార్పొరేట్ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నామని, అలాగే జనరల్ యాంటీ-అవాయడెన్స్ ఆక్ట్(గార్)ను రెండేళ్లు వాయిదా వంటి ప్రతిపాదనలతో కొనుగోళ్లు జోరుగా పెరిగాయి. వృద్ధి అంచనాలు, ద్రవ్య క్రమశిక్షణ చర్యలు ఉండడం వంటి అంశాలూ సెంటిమెంట్‌కు మరింత ఊతాన్నిచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 29,411 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 29,560-28,882 పాయింట్ల గరిష్ట-కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది.చివరకు 141 పాయింట్ల లాభంతో 29,362 పాయింట్ల వద్ద ముగిసింది. 8,941-8,751 పాయింట్ల గరిష్ట-కనిష్ట స్థాయిల మధ్య కదలాడిన నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 8,902 పాయింట్ల వద్ద ముగిసింది. యాక్సిస్ బ్యాంక్ 8 శాతం అప్ : సమగ్రమైన దివాళా నిబంధనలను రూపొందిస్తామన్న ప్రతిపాదన కారణంగా బ్యాంక్ షేర్లు బాగా పెరిగాయి. యాక్సిస్ బ్యాంక్ 8.1 శాతం పెరిగింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. సిగరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో ఐటీసీ 8.2 శాతం క్షీణించింది. 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు లాభపడ్డాయి. 8 షేర్లు నష్టపోయాయి. 1,498 షేర్లు నష్టాల్లో, 1,230 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.21,350 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.3,68,210 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.614 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.741 కోట్ల విలువైన నికర అమ్మకాలు జరిపారు.