బలహీనమైన ప్రపంచ సూచనల మధ్య బెంచ్‌మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 101.13 పాయింట్లు లేదా 0.13 శాతం క్షీణించి 80,582.97 వద్ద, నిఫ్టీ 36.85 పాయింట్లు లేదా 0.15 శాతం క్షీణించి 24,299.15 వద్ద ఉన్నాయి.
సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 18 నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్ నేతృత్వంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్ & టూబ్రో, మారుతీ సుజుకి ఇండియా, అదానీ పోర్ట్స్& సెజ్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌టెక్, ఐటీసీ, టైటాన్ కంపెనీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
నిఫ్టీ 50లో టెక్ మహీంద్రా నేతృత్వంలోని 22 లాభాలతో ట్రేడవుతున్నాయి. వీటిలో నెస్లే ఇండియా, అపోలో హాస్పిటల్ ఎంటర్‌ప్రైజెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి. ఇక పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బీపీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ట్రెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ లూజర్స్.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment