దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్‌ఈ (BSE) సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ ( NSE) నిఫ్టీ50 వారాంతపు ట్రేడింగ్ సెషన్‌ను లోయర్ నోట్‌తో ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 329.92 పాయింట్లు లేదా 0.43 శాతం క్షీణించి 76,190.46 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ ఇండెక్స్ 76,985.95 - 76,091.75 రేంజ్‌లో ట్రేడయింది.
సెన్సెక్స్‌ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ 50 కూడా 113.15 పాయింట్లు లేదా 0.49 శాతం తగ్గి 23,092.20 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,347.30 వద్ద నమోదు చేయగా, కనిష్ట స్థాయి 23,050 వద్ద కనిపించింది.
నిఫ్టీ50లోని 50 స్టాక్‌లలో 31 స్టాక్‌లు నష్టాలతో ముగిశాయి. ట్రెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బీపీసీఎల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా 4.90 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. ఇదిలా ఉండగా హిందుస్థాన్ యూనిలీవర్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ 2.52 శాతం వరకు లాభాలతో గ్రీన్‌లో ముగిసిన 19 స్టాక్‌లలో ఉన్నాయి.
స్మాల్-క్యాప్ షేర్లు విస్తృత మార్కెట్లలో అత్యంత ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 2.35 శాతం దిగువన, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.55 శాతం దిగువన ముగిసింది. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.
దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్(ఎర్నింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్‌బర్గ్ ఇటీవల అంచనా వేసింది. రానున్న బడ్జెట్లో ప్రభుత్వం మూలధన పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment