ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం ఇంట్రా-డే డీల్స్‌లో రోలర్-కోస్టర్ రైడ్‌ను తలపించాయి. స్థిరంగా ప్రారంభమైన బెంచ్‌మార్క్ సూచీలు క్రమంగా లాభాలను తగస్తూ నష్టాల్లోకి జారిపోయాయి. తర్వాత ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో లాభాల కారణంగా తిరిగి బలంగా పుంజుకున్నాయి.
బీఎస్‌ఈ (BSE) సెన్సెక్స్ 76,114 వద్ద ప్రారంభమైన తర్వాత, లాభాలను తగ్గించి 75,817 వద్ద కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి 76,461 వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. 567 పాయింట్ల లాభంతో 76,405 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఇంట్రా-డేలో వరుసగా రెండో రోజు 23,000 మార్క్ దిగువకు పడిపోయింది. సూచీ 22,981 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే చివరకు 131 పాయింట్ల లాభంతో 23,155 వద్ద ముగిసింది.
ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మధ్యాహ్న డీల్స్‌తో పుంజుకుంది .ఇతర సెన్సెక్స్ 30 షేర్లలో ఇన్ఫోసిస్క, టీసీఎస్ ఒక్కొక్కటి 3 శాతం పెరిగాయి. టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డిఎఫ్‌సి టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, కోటక్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జొమాటో 1-2 శాతం మధ్య ఎగిశాయి. మరోవైపు టాటా మోటార్స్ 2 శాతానికి పైగా పడిపోయింది. నష్టాలను చవిచూసిన ఇతర ముఖ్యమైన స్టాక్స్‌లో పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ ఉన్నాయి.
విస్తృత మార్కెట్‌లో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.2 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ 1.6 శాతం పడిపోయింది. రెండు సూచీలు రోజు ద్వితీయార్ధంలో నష్టాల్లో కొంత భాగాన్ని తిరిగి పొందాయి. సెక్టోరియల్ ఇండెక్స్‌లలో - బీఎస్ఈ రియాల్టీ ఇండెక్స్ 10 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ కూడా దాదాపు 2 శాతం క్షీణించింది. మిగతా వాటిలో బుధవారం ఐటీ ఇండెక్స్ 2 శాతానికి పైగా ర్యాలీ చేసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment