వరుస లాభాలు.. సెన్సెక్స్‌ హ్యాట్రిక్‌ | Stock Market Close Highlights Jan 30 Sensex up 3rd day Nifty at | Sakshi
Sakshi News home page

వరుస లాభాలు.. సెన్సెక్స్‌ హ్యాట్రిక్‌

Published Thu, Jan 30 2025 3:53 PM | Last Updated on Thu, Jan 30 2025 4:05 PM

Stock Market Close Highlights Jan 30 Sensex up 3rd day Nifty at

దేశీయ స్టాక్‌మార్కెట్లు (Stock Market ) గురువారం లాభాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా మూడో సెషన్‌లోనూ పైకి కదిలాయి. బీఎస్‌ఈ  సెన్సెక్స్ (Sensex) 226.85 పాయింట్లు లేదా 0.30 శాతం పెరిగి 76,759.81 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ ఈరోజు గరిష్టంగా 76,898.63 వద్ద ట్రేడవగా, కనిష్ట స్థాయి 76,401.13 వద్ద నమోదైంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (Nifty) 86.40 పాయింట్లు లేదా 0.37 శాతం పెరిగి 23,249.50 వద్ద ముగిసింది. గురువారం ఈ ఇండెక్స్ 23,311.15 నుంచి 23,139.20 రేంజ్‌లో ట్రేడ్ అయింది.

భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సిప్లా, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్‌టెల్ నేతృత్వంలోని టాప్‌ గెయినర్‌ స్టాక్‌లు 4.87 శాతం వరకు లాభాలను అందుకున్నాయి. నిఫ్టీ50లోని 35 సానుకూలంగా ముగిశాయి. మరోవైపు టాటా మోటార్స్, ఐటీసీ హోటల్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ 6.98 శాతం వరకు నష్టాలతో టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. ఈ ఇండెక్స్‌లోని 17 స్టాక్‌లు నష్టాలను చవిచూశాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.12 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ స్వల్పంగా 0.01 శాతం తగ్గింది.

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బుధవారం రాత్రి వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించింది. ఈ ధఫా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ తెలిపారు. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్‌ శనివారం రోజున వెలువడుతుండడంతో ఆరోజు మార్కెట్‌లు పూర్తి స్థాయిలో పని చేస్తాయని సెబీ తెలిపింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement