దేశీయ స్టాక్ మార్కెట్‌లు (Stock Market) గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. కొన్ని ప్రారంభ ఒడిదుడుకుల తర్వాత, బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు సానుకూల ధోరణిని ప్రదర్శించాయి. ఆటో, ఐటీ, సిమెంట్‌తోపాటు కొన్ని హెల్త్‌కేర్ షేర్లపై ఆసక్తిని పెంచాయి.
బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ సూచీ అయిన సెన్సెక్స్ (Sensex) ప్రారంభ డీల్స్‌లో 76,202 కనిష్ట స్థాయిని తాకింది. ఆపై స్థిరంగా కనిష్ట స్థాయి నుండి 543 పాయింట్లు పెరిగి 76,743 గరిష్ట స్థాయికి ర్యాలీ చేసింది. చివరకు 115 పాయింట్ల లాభంతో 76,520 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 (Nifty) వరుసగా 23,271, 23,091 వద్ద గరిష్ట, కనిష్ట స్థాయిలను తాకింది. 50 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 23,205 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30లో అల్ట్రాటెక్ సిమెంట్ దాదాపు 7 శాతం ఎగబాకి రూ. 11,400 స్థాయిలకు చేరుకుంది. ఇక జోమాటో 2.5 శాతం లాభపడగా, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, టాటా స్టీల్, టైటాన్ ప్రధాన లాభపడిన షేర్లలో ఉన్నాయి.
మరోవైపు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ 1 శాతంపైగా క్షీణించాయి.
విస్తృత మార్కెట్‌లో, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.8 శాతం జంప్ చేయగా, స్మాల్‌క్యాప్ 0.7 శాతం పెరిగింది. మిడ్‌క్యాప్ ఐటీ వంటి కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వంటివి ఒక్కొక్కటి 10 శాతానికి పైగా పెరిగాయి. రంగాల వారీగా ఆటో, ఐటీ, హెల్త్‌కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు 1 - 2 శాతం శ్రేణిలో లాభపడ్డాయి. కాగా బ్యాంకింగ్ సంబంధిత సూచీలు తగ్గుముఖం పట్టాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment