
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:43 సమయానికి నిఫ్టీ(Nifty) 81 పాయింట్లు నష్టపోయి 23,511కు చేరింది. సెన్సెక్స్(Sensex) 279 పాయింట్లు దిగజారి 77,342 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 104.3 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.29 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.34 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.33 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.53 శాతం దిగజారింది.
ఇదీ చదవండి: 29–31 తేదీల్లో ఐటీ ఆఫీస్‌లు ఓపెన్
ట్రంప్ సుంకాలపై ఏప్రిల్ 2న మరింత స్పష్టత రాబోతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సుంకాల ప్రభావం ఆటో, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలపై ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా టారిఫ్‌ల వార్తలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. దీనికి తోడు ముడిచమురు ధరలు పెరగడం, అమెరికా డాలర్ బలపడటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఇటీవల నికర కొనుగోలుదారులుగా మారడం కొంత కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇది ఇటీవల మార్కెట్ రికవరీకి తోడ్పడింది.



(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)